Tuesday, May 30, 2023

ఎందుకునీ దయరాదు క్రిష్ణా పూజలెన్నోచేసి దారులెన్నోకాచి వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా

ఎందుకునీ దయరాదు క్రిష్ణా పూజలెన్నోచేసి దారులెన్నోకాచి వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా పంకమున పుట్టిన పద్మముతగదని హృదయ కొలనులో వూహించితినినుగని ప్రేమజలములో పెరిగినభక్తి సుమము సమర్పించితిని క్రిష్ణా ... కఠినమైన కొమ్మకు కాచిన ఫలము పూజకు కాదని మానుకొంటి నీవేకర్తగసాగిన నాకర్మ ఫలమేమేలనుకొంటి క్రిష్ణా వేద్యుడవు ఆరాధ్యుడవైనా నైవేద్యము ఏదో తెలియక నీమెళకువలో మెలిగినమనమును విందుగముందుంచితిని క్రిష్ణా కప్పురము వెలిగించి కాంతినితీసిన సాగే కాంతి సరిగాదనియెంచి రాగరసములో తడిసినభక్తి వత్తిని వెలిగించితిని

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular