Tuesday, April 18, 2023

#మధురాష్టకం#రచన_వల్లభాచార్యులు#swami_sundara_chaitanyananda

మధురాష్టకం రచన: వల్లభాచార్యులు జీవితము సుఖదుఃఖాల సమ్మేళనము. తీపిని తాత్కాలికంగా రుచి చూపే అనుభవాలు కొన్నయితే, శాశ్వతంగా చేదును ముందుంచే అనుభవాలు, అనుభూతులే జీవితంలో ఎక్కువభాగాన్ని పెనవేసుకొని యుంటాయి. ప్రతి మానవుడు మాధుర్య జీవనాన్నే వాంఛిస్తాడు. అయితే తాను వాంఛించు మాధుర్యము మాయాప్రపంచములో లభ్యంకాదు. మాధవునినుండే లభించాలి. మధురామృత మందించు మాధుర్య జీవనము ననుభవించి తరించవలెనన్నచోమధుసూదనుని శరణు జొచ్చుటకన్నా వేరే మార్గము లేదు. మాధవుడే మాధుర్యము. అతడే మాధుర్యమూర్తి. మంగళకరుడైన అట్టి మాధవుని మాధుర్యానుభూతిని ఈ “మధురాష్టకం” ద్వారా వల్లభాచార్యులు కీర్తించుచున్నారు. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం ||1|| పెదవులు తీపి, ముఖము తీపి, నేత్రములు తీపి, నవ్వులు తీపి, హృది తీపి, నడవడి తీపి, తీపికి నాథుడైన వాడంతయూ తియ్యదనమే. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం ||2|| పలుకు తీపి, ప్రవర్తన తీపి., దుస్తులు తీపి, ధోరణి తీపి, నడక తీపి, నటించుట తీపి. తీపికి నాథుడైన వాడంతయూ తియ్యదనమే. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం ||3|| మురళి తీపి, చరణధూళి తీపి, హస్తములుతీపి, పాదములు, తీపి, నృత్యము తీపి, స్నేహము తీపి, తీపికి నాథుడైన వాడంతయూ తియ్యదనమే. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే రఖిలం మధురం ||4|| గానము తీపి, పానము తీపి, భుజించుట తీపి, నిద్రించుట తీపి, రూపము తీపి, తిలకము తీపి, తీపికి నాథుడైన వాడంతయూ తియ్యదనమే. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం నమితం మధురం శమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం. ||5|| చేత తీపి, ఈత తీపి, అపహరణము తీపి, స్మరణము తీపి, ప్రకోపము తీసి, ప్రశాంతము తీపి, తీపికి నాథుడైన వాడంతయూ తియ్యదనమే. గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం ||6|| ముత్యము తీపి, హారము తీపి, యమున తీపి, అలలు తీపి, ప్రవాహము తీపి, పద్మము తీపి, తీపికి వాథుడైన వాడంతయూ తియ్యదనమే. గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం ఇష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే రఖిలం మధురం ||7|| గోపికలు తీపి, లీలలు తీపి, ప్రేమించుట తీపి, చూపు తీపి, అణకువ తీపి, తీపికి నాధుడైన వాడంతయూ తియ్యదనమే. గోపా మధురా గావో మధురా యుష్టిర్మధురా సృష్టిర్మధురా దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం ||8|| గోపాలురు తీపి, గోవులు తీపి, కర్ర తీపి, సృష్టి తీపి, పరిహాసము తీపి, పరితాపము తీపి, తీపికి నాథుని వాడంతయూ తియ్యదనమే.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular