Sunday, August 14, 2016

ధర్మ ప్రచారంలో మీ వంతు ఉడతాభక్తి సహాయం కోరడమైనది

పరమాత్మ స్వరూపమునకు నమస్కారం,

"ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం"   ధర్మ ప్రచారం లో బాగంగా  మన సనాతన గ్రంధాలను  అందరికి  ఉచితంగా చదివే  అవకాశం
 కల్పించే  కార్యక్రమంలో భాగంగా  మీ  సహాయం కోరడమైనది. అనగా  మన   ఆండ్రాయిడ్   మొబైల్ ఆప్   గురించి   మరింతమందికి
తెలియచేసే కర్తవ్యం అందరిపై ఉన్నది.  మీరు  ఇప్పటికే  ఆప్ ఉపయోగించుతూ  ఉండి ఉంటారు.  ఈ ఆప్ వలన  ఎంతో  సౌలబ్యం,
ఎక్కడికి వెళ్ళినా మనతో మన సనాతన గ్రంధాలయం వెంట తీసుకువెళ్ళే సదుపాయం గలదు. అటువంటి ఈ గ్రంధాలయం,జ్ఞాన నిధి
గురించి  మీలాంటి  సాధకులకు, జిజ్ఞాసువులకు  తెలియచేయడంవలన  వారి  జీవితంలో  మార్పు  వస్తే  మీ  జన్మ తరించును.  మీకు
తెలిసేవుంటది విద్యాదానం శ్రేష్ఠ మైనది.  

మీరు చేయవలసిన చిన్న సహాయం ఏమనగా  ఈ  మెయిల్ లో జతచేసిన  ఫోటోని  ఒక  ప్లెక్షి/Flex ని ప్రింట్  తయారుచేసి, మీ ఊరు,
పట్టణం,నగరం,గ్రామం లో గల ఏదైనా ఒక దేవాలయం,లైబ్రరీ  లోపల లేక బయట గాని కట్టించగలరు. ఇందుకు  ఆ  దేవాలయ, లైబ్రరీ 
కార్యనిర్వాహక అధికారికి ఈ సేవ, ఆప్ గురించి తెలియచేసి, అనుమతి పొంది, అందరికి కనపడేలా కట్టించగలరు. తద్వారా మీలాంటి
జిజ్ఞాసువులు దేవాలయానికి,లైబ్రరీకి  వెళ్ళినప్పుడు ఈ ప్లెక్షి చూసి ఆప్ వినియోగించుకోగలరు. ఈ సేవ ద్వారా మరికొందరికి మన సనాతన
ధర్మం గురించి తెలుసుకొనే గ్రంధాలను అందించినవారు అవుతారు. ఇక్కడ మీరు చేసేది ఉడతా భక్తి కావచ్చు, కాని మీరు చేసిన సేవ
వలన కట్టబడిన ప్లెక్షి వలన కనీసం ఓ పది మంది ఆప్ ఉపయోగించటం వలన  కలిగే పుణ్యఫలం, జ్ఞానదానం వలన మీ జన్మ, మీ తరం
తరించును. మేము ఇప్పటివరకు కొన్ని చోట్ల మా సామర్ధ్యమేరకు కట్టించాము, ఇంకా జరుగుతుంది. కాని అన్ని ఊర్లలో ఈ కార్యక్రమం
చేయటం మా శక్తికి మించిన పని. కావున మీరందరూ సాయి రామ్ సేవక బృంద సబ్యులుగా మన కార్య నిమిత్తం సహాయం కోరడమైనది.


ప్లెక్షి ప్రింట్ సైజు  వివరాలు:  8 అడుగులు వెడల్పు,  3 అడుగులు ఎత్తు
ఖర్చు: 200 నుంచి 250/- అవుతుంది.

సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు        :   www.sairealattitudemanagement.org
ఉచిత తెలుగు భక్తి వీడియోలు        :   www.telugubhakthivideos.org
నూతన సమాచారం                    :    https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgtఆండ్రాయిడ్ ఆప్                      :   https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books
3500 e-Books పెన్ డ్రైవ్           :   www.sairealattitudemanagement.org/pendrive
సంప్రదించుటకు                        :   sairealattitudemgt@gmail.com
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular