బొల్లారం - హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణంగా బియ్యంతో వండిన వంటకాలు తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తారు. కానీ వారికి త్వరలో తీపి కబురు అందనున్నదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర వీ ప్రవీణ్‌రావు గురువారం నమస్తే తెలంగాణకు చెప్పారు.
14058 రకం వంగడాన్ని అధికారికంగా ప్రకటించకున్నా రాష్ట్రంలో వేల ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారన్నారు. కేవలం నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 30వేల ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ప్రతి రైతు దీనినే సాగు చేయడం ఖాయమన్నారు. దీని సాగుకు భారీగా పెట్టుబడి అవసరం లేదని చెప్పారు. సేంద్రీయ పద్దతుల్లో సేద్యం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని ప్రవీణ్‌రావు వివరించారు. హెక్టార్‌కు ఆరు నుంచి ఏడు టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. నీటి వినియోగం కూడా తక్కువేనన్నారు. దీనిపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించామని చెప్పారు. రెండు, మూడు నెలల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చునని ప్రవీణ్‌రావు తెలిపారు.
No comments:
Post a Comment