

గురు దత్త భగవాన్ నమో నమహ
-- జ్ఞానం పరబ్రహ్మ స్వరూపం ---
మానవుడు స్వతహాగ జ్ఞాని. దైనందిన జీవితానుభవాన ఎన్నెన్నో సత్యాలను తెలుసుకుంటు నిత్య విజ్ఞాన పర్వత శిఖరము వలె పురోగమించి నిత్యాభివ్రుద్ధి పీఠాసనుడైనాడు.అయిన మానవుని జ్ఞానాన్వేశ మాత్రము ఆగలేదు. ఈ విశ్వము అనంతము ఎంత తెలిసిన ఇంక ఎంతో తెలుసు కోవాలనే కోరిక మాత్రము చావలేదు. తనుతెలుసుకుంటు తనకు తెలిసినది ఇతరులకు తెలుపుతు తన జ్ఞాన యాత్ర సాగిస్తూనే ఉన్నాడు.అది ఎటువంటిది అయిన సరే తనకు తెలిసినది ఇతరులకు తెలుపుటలో ఎంతో ఆనందమున్నది . ఆ ఆనందాన్ని మనము కూడ పొందాలనే అతి చిన్న ఆశతో ఈ బ్లాగు రూపొందించడం జరుగుతున్నది. కనుక మహాశయులార మన కంప్యూటర్ బ్లాగు నందు అందరు నిర్మాతలే. మనకు సంబందించి ఏవేని Computer సమస్యల అడగవచ్చు తెలిసిన మహాత్ములు వాటికి తగిన సలహాలు సూచనలందీయ వచ్చు.కనుక విజ్ఞాన వంతులు తమ సహాయ సహకారాలందించ మనవి .ఈ బ్లాగు లో సమస్యలు అడగ దలచుకుంటే మీరు bagamma_narsagoud@rediffmail.com అనే email ID మేయిల్ పంపండి దానిని మన బ్లాగులొని up load చేసి పెడతాను సహాయ స్వాభావచిత్తులైన మన స్నేహితులు దానికి తగిని పరిష్కారం తెలుపుతారు. అందివచ్చిన అవకాశం అందుకుందాం మన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుందాం
No comments:
Post a Comment