Monday, April 6, 2015

Purpose of life

PURPOSE OF LIFE






Guru:        Who is that? Child! Why are you so anguished?
Student:    I am blind and groping in darkness unable to perceive the purpose of this life.G:        Do you think there is a purpose to this life?S:    Isn't there any, master! There were Rishis who learnt and taught Vedas and Upanishads, there kings and Monarchs who conquered the worlds and also the mean and the meaningless.  What happened to them all after death, Master?G:    You innocent duckling! When the whole world is mad of sensual pleasures with this body, why do you bother what happens after death? Forget about that inquisitiveness. I will teach the way to possess all the eight coveted treasures. Enjoy them.S:    No master! No! I enjoyed them all and learnt that they are ephemeral and mean. I hold no desire for them. There is one question that plagues me. Where do we come from? Where do we go? Enough if you clear this doubt.G:        When it is beyond the realm of divinity to grasp it, what to speak of mortals?S:    If seers like you deny teaching us about it, master, where have we to go? Do you condemn us to this world of strife and the circle of life and death forever? Is there no way out, master for us?G:    Why not? There is. This body is equipped to learn the temporal as well as the spiritual or eternal knowledge. This body is the raft for both for anchoring in Sansara or navigate to salvation. Infatuated with the enticing ephemeral world and confusing it to be the only and the lasting, we are rolling on the Potter's Wheel of life and death cycles. We have to realise that all that we see is transitory and there is some primal cause which is permanent that is responsible for this apparent drama. One has to self-experience it internally and that is the purpose of life. S:        How can I get that self-realisation, master?G:    There are several schools... like the school of intellect, the school of devotion etc. But it is the concerted opinion of elders that Rajayoga is the easiest to follow for salvation.S:        Rajayoga? Who is going to teach me that, master?G:        When the time comes, God himself shall come to you as Guru and shall teach you.S:    For a man groping in utter darkness, you chanced upon me like a beacon.  You are my Guru. You are my God.  Kindly teach me the secret of that Yoga and unveil the truth.G:    Then let me teach you the arcane knowledge. Pay attention to it.  Just as you can’t convert metal to gold without arresting its quintessence, you can't see the truth unless you arrest your mind. Mind is the chief hurdle that stands between us and salvation. It is the cause of our temporal bonds. If you can conquer your mind, you can conquer everything else. This is called Yoga.  When you stand in the state of Samadhi subduing the wavering mind, and the sensual desires, your mind assumes infinite power. Then there is nothing you can't do. The nature that toyed with you thus far becomes itself a toy in your hands. It surrenders to you. S:        Is this what is meant by salvation, master?G:    No, my child. This is the first step to it. And if you continue to meditate with unwavering mind, and without being fooled by that infinite power, you come out as a self luminous, blissful, eternal and self evident truth. That is what is meant by Tat Tvam Asi. You can see yourself in me. So go ahead and enjoy the fruits of Rajayoga.S:        Guru is the creator, Guru is the sustainer, and Guru is the annihilator  Guru is a veritable Supreme Being, and to that Guru, I bow my head.

ఎవరు? నాయనా! నీవు ....   
ఎందుకింత ఆవేదన పడుతున్నావు?
జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుణ్ణి,
జీవితానికి పరమార్థమంటూ ఒకటుందనుకుంటున్నావా?
లేదా స్వామీ?
వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు,
దేశ దేశాలు జయించిన చక్రవర్తులు 
సీదా సాదా అంతా 
పుట్టి పెరిగి మరణిస్తున్నారే ! 
వీరంతా  మరణించిన  తరువాత  ఏమౌతున్నారు  స్వామి?
పిచ్చివాడా! 
లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే 
మరణించిన తరువాత ఎమౌతారనే విచారం నీకెందుకు?
ఆ విచారం వదలుకో !
నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు 
వద్దు స్వామీ! అవన్నీ అనుభవించి క్షణికములని,   క్షుద్రములని తెలుసుకున్నాను.
వాటిపై నాకు వాంఛ లేదు.
నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే!
మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం? ఎక్కడికి పోతున్నాం?
ఈ సందేహం నివారించండి!
ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే, 
మానవులకు సాధ్యం అవుతుందా?
మీవంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు? స్వామీ!
మేమీ దు:ఖ భాజనమైన సంసారం లో కృశించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసిందేనా?
మానవునికి తరుణోపాయం లేదా స్వామీ?
లేకేం? నాయనా! ఉంది ...
ఈ శరీరం విద్యావిద్యలు రెంటితోనూ పుట్టింది. 
సంసార యాత్రకు మోక్ష యాత్రకు ఇదే సాధనం 
అవిద్యచే మొహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని, 
దుఃఖ భాజనములమై చావు పుట్టుకుల కుమ్మరిసారిలో తిరుగుచున్నాము. 
ఇదంతా అనిత్యమని,
ఈ నాటకానికంతా కారణమైన మహా చైతన్యం వేరే ఉందని,
అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మాను భావము పొందాలి అదే జీవిత పరమార్థం. 
ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామీ?
భక్తి మార్గం తో కొందరు జ్ఞానమార్గం తో కొందరు సాధించారు,
కాని, జీవన్ముక్తి కి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం.
 రాజ యోగమా?! 
నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ?
ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు.
కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు,
 వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు నా దైవం. 
ఆ యోగ రహస్యం నాకు బోధించి, సత్య స్వరూపం చూపించండి.

అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము. 
రసాన్ని కట్టేస్తేనే కాని స్వర్ణం కానట్టు, మనస్సుని కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. 
మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. 
మనస్సుని స్వాధీనం చేసుకుంటే, మనకు స్వాధీనం కానిదే లేదు. 
ఆ సాధనే యోగామంటారు. 
సాంగయోగాన్ని క్రమంగా సాధించి, చిత్త వృత్తులనణచి, 
సమాధి స్థిరుడవైనప్పుడు, 
నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది, 
అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు, 
నిన్నింత వరకు తన చేత  చిక్కిన్చుకుని ఆడించే ప్రకృతి, 
నీ స్వాధీనం అవుతుంది.
'మోక్షం' అంటే అదేనా! స్వామీ?
కాదు నాయన ! అది మోక్షానికి మొదటి మెట్టు.
ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక,
సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే, 
స్వయం ప్రకాశము, సచ్చిదానంద మయము, శాశ్వతము అయిన స్వస్వరూపానుభావం 
కేవల జ్ఞాన రూపంగా నీవనుభవిస్తావు.
'తత్వమసి' అంటే అదే !
అప్పుడు నువ్వు  నేను ఒక్కటే! 
రాజ యోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు !
గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర: 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

No comments: