Posts

Showing posts from November, 2025

#chaitanya_bhagavad_gita #12th_Chapter_20_slokam#lyricsvideo #telugu_lyrical

Image
  యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే | శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే.. తీవ మే ప్రియాః ॥ 20॥ యే-తు- ధర్మామృతం- ఇదం-యథా-ఉక్తం-పర్యుపాసతే శ్రద్ధధానా:-మత్పరమాః-భక్తాః-తే-అతీవ-మే-ప్రియాః అర్జునా! ఈ ధర్మము అమృత స్వరూపము. నా భక్తులు శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగా భావించి, నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు. వ్యాఖ్య ధర్మామృతం ఇది ధర్మ్యామృతం. ఈ అధ్యాయంలో బోధించ బడింది (ఇదం యథోక్తం) ధర్మ్యామృతము ( ధర్మ్యామృతము ). అంటే, ధర్మ్యరూపము మరియు అమృత స్వరూపము అని అర్ధము. ధర్మము నుండి తొలగనిది, వేరు కానిది కనుక ధర్మ్యం ( ధర్మాత్ అనపేతం ధర్మ్యం ). ఇది అమృతత్వానికి కారణం కావడం చేత అమృత స్వరూపము ( అమృతహేతుత్వాత్ ). జనన మరణాల నుండి ఉద్ధరిస్తుంది కనుకఇది అమృత స్వరూపము. కనుకనే భక్తి అమృత స్వరూపము అన్నాడు భక్తి సూత్రాలలో నారద మహర్షి ( అమృత స్వరూపాచ ). భక్తి అమృత స్వరూపము. భగవంతుడు అమృత స్వరూపుడు. భక్తుడు కూడా అమృత రూపుడే.కనుకనే ఈ భక్తియోగం అనే అధ్యాయంలో అమృత వర్షం కురిసింది. అమృత స్వరూపమైన భక్తిని అనుష్టించినవారు అమృత స్వరూపులవుతారు. భగవంతుని పరమగతిగా భావించ...

#12th#18to19#chaitanya_bhagavad_gita #12th_Chapter_18to19_slokam#lyricsvideo #telugu_lyrical

Image
సమః శత్రా చ మిత్రే చ తథా మానాపమానయోః । శీతోష్ణ సుఖదుఃభేషు సమః సఙ్గవివర్జితః || 18 || తుల్యనిన్దాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ | అనికేతః స్థిరమతి దృక్తిమాన్ మే ప్రియో సర   || 19 || సమః-శత్రా-చ-మిత్రే-చ-తథా-మానాపమానయో: శీతోష్ణ-సంగవివర్ణిత అర్జునా! నా భక్తునికి శత్రువైనా, మిత్రుడైనా ఒక్కటే. మానావమానాల్ని, శీతోష్ణాలను, సుఖదుఃఖాలను అతడు సమానంగా భావిస్తాడు. అతడు అసంగుడు. నిందాస్తుతులు అతనికి సమానము. అతడు మౌని. లభించిన దానితో తృప్తి చెందేవాడు. తనకంటూ స్థావరము లేనివాడు. నిశ్చల హృదయుడు. అట్టి భక్తుడు నాకు ప్రియుడు. వ్యాఖ్య ఈ రెండూ ఏకాన్వయంగల కూట శ్లోకాలు. అందుచేత రెండిటిని కలిపి వ్యాఖ్యానిస్తున్నాను. భక్తుని దశ లక్షణాలను వివరించే ఈ శ్లోకద్వయం ద్వంద్వ పంచకముతో నిండి ఉంది. అవే శత్రుమిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఃఖదుఃఖాలు, నిందాస్తుతులు. పూర్వాధ్యాయాలలో వీటిని గూర్చి చర్చించుకొని ఉన్నప్పటికీ, సందర్భోచితంగా ఇక్కడ కూడా సంక్షిప్తంగా చెప్పుకుందాం. శత్రుమిత్రులు ప్రియమైన వాడు, ఉపకారం చేసేవాడు మిత్రుడు. అప్రియమైన వాడు, అపకారం చేసేవాడు శత్రువు. కనుక, సాధారణంగా మిత్రుడు చేరువై నపుడు మనస్సు...

SRIMADBHAGAVADGITA SWAMIJI 06&07&10th chapters

Image

#chaitanya_bhagavad_gita #12th_Chapter_15to17Slokas#lyricalvideo

Image