మేలుకో తెలంగాణోడా! #సల్వాజి మాధవరావు - 90525 63147

 



మేలుకో తెలంగాణోడా!

ఓ తెలంగాణోడా...

ఇప్పటికైనా మేలుకో!

నువ్వు నమ్మిన నీ పల్లెనీ పంటనీ పోరాటం

ఇవన్నీ మళ్లీ పాత పాత బానిసత్వపు

నీడల్లోకి లాగుతున్నారు.

నీకు స్వంత రాజ్యం వచ్చింది.

కానీనీ కష్టానికి సరైన న్యాయం దక్కుతుందా

నీ మట్టిలో నీళ్లు పోశామంటున్నారు

కానీ నీ చిగురు ఎందుకు వాడిపోయింది?

నిన్న నీ నీళ్లకు హక్కు ఉంది

ఇవాళ నీ వంతు నీళ్ల కోసం మళ్లీ నువ్వే

ఎద్దు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

నీ పొలం నీదే కానీ పంట తీగల్ని

ఎక్కడ కత్తిరించాలో చెబుతున్నారు వాళ్ళే

నీ విత్తనానికి నువ్వు మూలధనంవె

కానీ పంట నాజూకుదనానికి

మూల్యం చెప్తారు మరొకరే.

ఎన్ని రైతుబంధు మాటలు వినినా

నీ చేతిలో మట్టి లేదు - రుణం ఉంది

నీ కష్టంలో పంట లేదు - కత్తి ఉంది

ఆ కత్తిని మళ్లీ మనల్ని మనమే

పొడుచుకునేలా చేస్తుంది

మన ఉద్యమమే లాభపడదూ

తెలంగాణోడా!

మేలుకో తెలంగాణోడా

ఇది నీ గళంనీ గడ్డనీ గొప్పతనం!!

ఓ తెలంగాణోడా...

నీ నిద్ర ఇంకా ముగియలేదా?

నీ చెమట తడికి పుట్టిన తెలంగాణా నేడు

మళ్లీ చెర గడిలోకి జారిపోతోంది .

నువ్వు పోరాడిన స్వయం పాలన

ఇప్పుడు మరోసారి పరాయివారి చేతుల్లో

నరకంలా మారింది.

నిన్న నీ గొంతు ఉద్యమమైంది ,

నేడు అదే గొంతు మౌనం పట్టింది ,

ఇప్పుడా చేతుల్లో ఉన్నది కేవలం

ఓ రుణపు పట్టా .

నువ్వు నమ్మిన మాటలు మోసం చేశాయి.

రైతుబంధు అంటూ ఇచ్చిన హామీలు,

నీ చేతిలో మట్టి కాదు - అప్పుల కాగితాలని

పెట్టాయినీ భూమి నీదే,

కానీనీ భవిష్యత్తు ఎవరో తేల్చేస్తున్నారు.

ఓ యువకుడా...

నీ కలలు ఖాళీ మాటలే అవుతాయి గాని

నీ అడుగులు ఉద్యమ జాడలై మారిపోవాలి.

ఓ నాయకుడా.. నీ పదవి గొప్ప కాదు,

నీ ప్రజల బాధే నీ బాధగా మారాలి.

ఈ తెలంగాణ నీది!

నీ చెమట తడిచిన గడ్డను

నీ కన్నీటి నీటితో తడిపే గుగురుతో రక్షి

ఓ తెలంగాణోడా...!

అడుగు వేసే ప్రతిచోట....

పొలిమేరలు మళ్లీ నినాదాలతో దద్దరిల

పల్లెలు మళ్లీ చైతున్యంతో దద్దరిల్లాలి

ప్రజల గళమే ఉద్యమానికి మార్గదర్శి కా

ఉద్యమం అంటే కేవలం ధర్నా కాదు

ప్రతి చైతన్యమైన మనిషి మన ప్రాంతానికి

వెన్నుదన్నుగా మారినప్పుడే-

అది నిజమైన ఉద్యమం

రేపటి ఉదయం కోసం ఉద్యమం మళ్లీ

అవసరమే.ఓ తెలంగాణోడా...

ఇప్పటికైనా నిద్రలేవు?

నువ్వు పుట్టించిన ఈ రాష్ట్రం..

ఇప్పుడీ పాలకుల చేతిలో మళ్లీ చెరగంటలు మోగుతోంది !

నీ పోరాటం పండించిన గడ్డ మీద

మళ్లీ పరాయివాళ్ళే పాలకులయ్యారు..

రైతన్నా..నీ మట్టిలో విత్తనం వేస్తే

పంట పుట్టాలి కానీఇప్పుడు రుణాల తాడులు

మాత్రమే మొలుస్తున్నాయి

నీ చెమటను కొనుగోలు చేసే వ్యవస్థ లేదు.

నీ ధైర్యాన్ని చీల్చే పాలకులు మాత్రం

గుట్టలుగా ఉన్నారు! యువతా...

నీ శబ్దం ఎక్కడ?. నీ సోషల్ మీడియా పోస్ట్

ఓ రెవల్యూషన్ కాదు.

నీ పాదం ప్రగతికి పడాలి బాట

నీ గళం మరలా ఉద్యమానికి గర్జించాలి.

ఇంకా ఒక్కసారి అడుగులే నినాదాలవాలి.

పల్లె ప్రతీ మూలలో ఉద్యమం మెరుపులు రావాలి.

ప్రతీ పొలంలో తిరిగి పోరాటపు

పదాలు మొలకెత్తాలి!

ఇదే సమయంలోఇదే పిలుపు:

'ఓ తెలంగాణోడా - మళ్లీ ఉద్యమించు'

'బానిసత్వం భవిష్యత్తుకే బెడద

ఉద్యమమే మన ఓటుకు గౌరవం

మన భూమికిమన నీళ్లకుమన హక్కులకై

మనం మళ్లీ మేలుకోవాల్సిందే!

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

సల్వాజి మాధవరావు - 90525 63147

Comments

Popular posts from this blog

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి