మేలుకో తెలంగాణోడా! ఓ తెలంగాణోడా... ఇప్పటికైనా మేలుకో! నువ్వు నమ్మిన నీ పల్లె , నీ పంట , నీ పోరాటం ఇవన్నీ మళ్లీ పాత పాత బానిసత్వపు నీడల్లోకి లాగుతున్నారు. నీకు స్వంత రాజ్యం వచ్చింది. కానీ , నీ కష్టానికి సరైన న్యాయం దక్కుతుందా నీ మట్టిలో నీళ్లు పోశామంటున్నారు కానీ నీ చిగురు ఎందుకు వాడిపోయింది ? నిన్న నీ నీళ్లకు హక్కు ఉంది ఇవాళ నీ వంతు నీళ్ల కోసం మళ్లీ నువ్వే ఎద్దు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీ పొలం నీదే కానీ పంట తీగల్ని ఎక్కడ కత్తిరించాలో చెబుతున్నారు వాళ్ళే నీ విత్తనానికి నువ్వు మూలధనంవె కానీ పంట నాజూకుదనానికి మూల్యం చెప్తారు మరొకరే. ఎన్ని రైతుబంధు మాటలు వినినా నీ చేతిలో మట్టి లేదు - రుణం ఉంది నీ కష్టంలో పంట లేదు - కత్తి ఉంది ఆ కత్తిని మళ్లీ మనల్ని మనమే పొడుచుకునేలా చేస్తుంది మన ఉద్యమమే లాభపడదూ తెలంగాణోడా! మేలుకో తెలంగాణోడా ఇది నీ గళం , నీ గడ్డ , నీ గొప్పతనం!! ఓ తెలంగాణోడా... నీ నిద్ర ఇంకా ముగియలేదా ? నీ చెమట తడికి పుట్టిన తెలంగాణా నేడు మళ్లీ చెర గడిలోకి జారిపోతోంది . నువ్వు పోరాడిన స్వయం పాలన ఇప్పుడు మరోసారి పరాయివారి చేతుల్లో నరకంలా మార...