Gita Jayanti 11 Dec 2024: గీతా జయంతి

 Gita Jayanti 2024: గీతా జయంతి ఎప్పుడు..?.. దీని విశిష్టత.. ఆ రోజున ఏంచేయాలో తెలుసా..?



Gita Jayanti tradition: మాసాలన్నింటిలోను మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదని స్వయంగా నారాయణుడే చెప్పాడంట. ఇదే మాసంలో గీతా జయంతిని కూడా నిర్వహిస్తారు.
Gita jayanti celebrations: హిందు మతంలో గీతా జయంతిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సారి డిసెంబరు 11న గీతాజయంతి వచ్చింది. గీతా జయంతి రోజునే మోక్షద  ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి కూడా జరుపుకుంటాం. ఈ రోజున విష్ణువును చాలా మంది ఆరాధిస్తుంటారు. నారాయణుడి గుడికివెళ్లి ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహిస్తారు.

యుద్దభూమిలో అర్జునుడు  తన వాళ్లను, రక్త సంబంధకులను చూసి యుద్దం చేయలేనని, తన గురువు, సోదరుల మీద బాణాలు వేయలేనని చెప్పి ఆయుధాలను వదిలేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపంచూపించి.. అర్జునుడికి కర్తవ్య బోధన చేస్తాడు.


గీతలోని సారం పాటిస్తే.. మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చని చెబుతుంటారు. మనిషి తన జీవితంలో ఎలా నడ్చుకొవాలోనని ఆ పరమాత్ముడే స్వయంగా గీతలో చెప్పారు. అందుకే గీతా జయంతికి అంతటి ప్రాధాన్యత ఉందని చెబుతుంటారు.



సాధారణంగా మనకు ఉన్న ప్రతి తెలుగు నెలల్లో ప్రతి ఒక దానికి ఏదో ఒక ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది. అయితే.. కొన్ని నెలలు మాత్రం అత్యంత పవిత్రమైనదిగా చెప్తుంటారు. వాటిలొ ముఖ్యంగా భాద్రపద మాసం,  శ్రావణం, కార్తీక మాసం, మార్గశిర మాసంలను అత్యంత పవిత్రమైన మాసాలుగా చెప్తుంటారు. ముఖ్యంగా మార్గశిర మాసంను మాసాలన్నింటిలోను అత్యంత పుణ్యమైన మాసంగా చెప్తుంటారంట. 


అందుకే మాసానాం మార్గశిర్షోహం అంటారు. అంటే.. అన్ని నెలలకు కూడా ఈ మాసం శిరస్సు తల వంటిదని అర్థం.  ఈ నెలలోనే కురకేత్ర యుద్దం స్టార్ట్ అయ్యిందంట.  మార్గశిర మాసంలో శుక్ల పక్ష ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి.. అర్జునుడికి గీతా ఉపదేశం చేస్తాడంట. అందుకే.. మార్గశిర మాసం పాడ్యమి నుంచి పౌర్ణమి రోజు వరకు ఎంతో పవిత్రంగా గీతాజయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. 


మనదేశంలో ముఖ్యంగా హర్యానాలో ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.హర్యా.. హరీ , ఆనా.. అంటే.. ఏకంగా అక్కడ నారాయణుడు వచ్చారంట. అందుకే అక్కడ మార్గశిరంలో విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో దశావతారాల్లో ఏ అవతారాన్ని ఆరాధించిన, భక్తితో కొలిచిన కూడామన కోరికలు నెరవేరుతాయని చెప్తుంటారు.

గీతాజయంతి రోజున ఏంచేయాలి..?


గీతాజయంతి రోజున సూర్యోదయమే నిద్రనుంచి లేవాలి. ఆ తర్వాత శుచిగా స్నానం చేసి విష్ణు ఆలయాలలో దీపారాధన చేయాలి. అంతే కాకుండా.. నారాయణుడు అలంకార ప్రియుడు కాబట్టి ఆయన మందిరంను, విగ్రహాలను రకరకాల పూలతో అలంకరణ చేయాలి. భగవద్గీత పుస్తక పారాయణ చేయాలి. 

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి