Thursday, June 27, 2024
“గీత - భగవన్నామం”
“గీత - భగవన్నామం”
భగవంతుని కీర్తించడానికి సర్వ జనులకు అధికారుముంది. ఇందులో వర్ణాశ్రమ భేద భావాలకు తావుండదు.యోగులు కూడా గొంతెత్తి భగవంతుడ్ని కీర్తించడం మనం చూస్తూనే యున్నాము.
కీర్తనం వల్ల శరీరం హరి రూపమువుతుంది . భగవత్ ప్రేమ చంధస్సులాగా నాట్య మాడిస్తుంది.
శ్రీహరి కీర్తనంలో భగవంతుడు, భక్తుడు, భగవన్నామమూ కలసి త్రివేణీ సంగమవుతుంది.
భగవత్ప్రేమ, భక్తుడు ఏ చోట శ్రీహరి గుణగానం చేస్తాడో,ఆచోట భగవంతుడు వినడానికి నిలుచుంటాడు. భగవత్ దర్శనం వల్ల సంసారదుఃఖం దూరమవుతుంది.
భగవత్ సంకీర్తన లోకంలో నాలుగువైపుల ఆనందపు పుహరీ గోడలు నిర్మిస్తుంది. లోకాన్ని సుఖసంతోషాలతో నింపుతుంది.
కీర్తనం వల్ల విశ్వమంతా ధవళితమై వైకుంఠం పృథ్వీతలం మీదికి దిగి వస్తుంది.
భగవంతుడ్ని కీర్తించేటప్పుడు హృదయ కవాటాలను పూర్తిగా తెరిచి లజ్జ బిడియం లేకుండా నోరారా స్తుతించాలి భావంలో భగవంతుడు లేనప్పుడు సాధన వల్ల ఎలాంటి ప్రయోజనమూ వుండదు.
శ్రీహరి కథయే మనుష్యుడికి సుఖ సమాధి కావాలి.
అమృత బీజం, ఆత్మ తత్త్వసారం, గుహ్యాతి గుహ్యమైన రహస్య శ్రీకృష్ణ నామం
పై విధంగా పెద్దలు భగవన్నామ సంకీర్తన మహిమను గురించి తమ అనుభవాలను వెల్లడించారు.
ధృడ నిశ్చయం గల భక్తులు నిరంతరం నన్ను కీర్తిస్తారని శ్రీ కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు (9-14)
సతతం కీర్తయంతో మాం యతంతస్యదృఢవ్రతాః
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||
అర్జునా! నా పట్ల అత్యంత ప్రేతితో నన్ను కీర్తించడం,
నాకు ప్రీతికరమైన, కార్యాలకు ప్రయత్నించడం, నాకు నమస్కరించడం అనేవి లేకుండా ఒక్క క్షణం కూడా నా భక్తులు గడపజాలరు. నా గుణ విశేశాలను, నా నామాలను తలచి సర్వాంగాలు పులకింప
గద్గద స్వరంతో కృష్ణా కృష్ణా అని కీర్తిస్తూ నా దాస్యంలో నిమగ్నులై నన్ను ఉపాసిస్తుంటారు.
ఎక్కడ తలపునకు వస్తే అక్కడ నిలబడి నాకు
నమస్కరిస్తుంటారు. అనగా ఇది బురదనేల, ఇది రోత
ప్రదేశము అని భగవన్నామం కీర్తించకుండా వుండరు.
ఆపదల వల్లగాను, ఆకస్మికంగా వచ్చిపడిన సంపదల
వల్లగాని మతి చలించి మరొక దారి తొక్కకుండుటయని అర్థం.
కంలోని ధృడ వ్రతమంటే హఠాత్తుగా కలిగిన
“సతతం-కీర్తయంతః" ఈ రెండు పదాలు కలసి ఒక
అపూర్వమగు అర్ధాన్ని స్ఫురింపజేస్తున్నాయి.
“తతం- వీణాధికం వాద్యం" తతమనగా తంత్రులను
మీటుతూ వాయించు వీణ. అది ఒక వాద్య విశేశం.
"తతేన సహితం సతతం" ఇదే అపూర్వమైన అర్ధవిశేశం
అనగా వీణను మీటుతూ పాడుతున్నవారు. భగవంతుడు
సామగాన లోలు డవి ప్రసిద్ధి.
'కృష్ణ' పదం వసుదేవుని పుత్రుడు అని మాత్రమే కాదు.
సమస్త అవ తారాల లోను కృష్ణపదం ప్రయోగింపబడింది.
దీనిని బట్టి కృష్ణుడు అవతారియే కాని అవతారం కాదని
గ్రహించవచ్చు. మత్స్యకూర్మాది అవతారాలను జరిపించిన
వాడు శ్రీ కృష్ణుడు.
‘ సతతం' అనడంలో కర్మయోగంలో లాగా దేశకాల పాత్ర
భేదం లేదని తెలపడానికే అని సారార్ధ వర్షిణి టీకలో
విశ్వ నాథ చక్రవర్తి విశదపరిచాడు.
నదేశ నియమస్తత్ర నకాల నియమస్తథా
నోచ్ఛిష్ఠాదౌ నిషేధోస్తి శ్రీహరే నిమ్నిలుబ్ధకే ||
శ్రీహరి నామాన్ని ప్రేమించే వారికి దేశకాలాలకు సంబంధించిన ఏ విధమైన నందే నిషేధమూ లేదు.
సర్వావస్థలలోను భగవన్నామాన్ని కీర్తించవచ్చు.
శ్రీధర స్వామి ఈ శ్లోకాన్ని వాఖ్యానిస్తూ
" సర్వదా స్తోత్ర మంతారిఖిః కీర్తయంతః
అని ఉటంకించాడు. మంత్రంలో గలది
ఆ నామమే మంత్రరాజమవుతుంది అని.
శ్రీ బలదేవ విద్యా భూశణాలు ఈ శ్లోకా టీక వ్రాస్తూ
దేశ కాలాదుల పరిశుద్దిని విచారించకుండా సర్వదా
భగవంతుని గుణక్రియలను అనుసరించి గోవింద
గోవర్ధనధారి ఆది వివిధ అమృతమయ
మధుర మంగళప్రద నామాలను ఉచ్ఛైస్వరంతో
ఉచ్ఛరించడమే భగవంతుని ఉపాసించడమవుతుంది.
కలేర్దోషనిదే రాజన్ ఆస్తిహ్యేకో మహా గుణః
కీర్తనా దేవ కృష్ణస్య ముక్తసంగః 'పరం వ్రజేత్
శ్రీ మద్ భాగవతం -12-3-51.
ఈ కలి యుగం దోషభూయిష్టమైనది. ఇందులో
ఒకే ఒక మహా గుణమున్నది. అది ఏమంటే : శ్రీ కృష్ణ
నామ సంకీర్తనంతో జీవుడు సమస్త సంగాలను పరిత్యజించి
భగత్ ప్రాప్తిని పొందుతాడు. ఈ భాగవత శ్లోకాన్ని పురస్క రించుకొని శ్రీ చైతన్య మహాసభువు ఇలా ఉపదే శించారు.
నయనం గళదశృధారా
వదనం గద్గగరుద్ధయా గిరా
పులకై ర్ని చితం వపుః కదా
తవ నామ గ్రహణో భవిష్యతి||
" హే! కృష్ణా నీ నామాన్ని ఉచ్చరించిన వెంటనే కళ్ళల్లో
ఆనందాశ్రువులు ధారలు కట్టడం, వాక్కులు గాద్గదికం
కావడం, శరీరమంతా గగుర్పొడవడం ఇవి కలిగే
సుసమయం ఎప్పుడు సంప్రాప్తిస్తుందో అప్పుడు భక్తులు
పరమానందంలో ఓలలాడతారు. అంతకంటే జీవికి ఏమికావాలి?
ఓం తత్సల్..
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
No comments:
Post a Comment