Monday, November 6, 2023
జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా మూడు దినాల ముచ్చటయేనా రేపోమాపో చీకటియేనా#swami_sundara_chaitanyananda
జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా
మూడు దినాల ముచ్చటయేనా రేపోమాపో చీకటియేనా
* ఆశలన్నీఅలలేనా ఆనందాలన్నీ కలలేనా
కళకళలాడుచు కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా
* మనసులు కదిపి మమతలు చూపి మంటలురేపే గతియేనా
మంచిని కుదిపి వంచన చేసి బూదిగ మిగిలే తిధియేనా
*పొరపాటులు యెడబాటులు యెదబాధలు విధియేనా
అశ్రులు నిండిన అనుభవ ధనమే మనిషికి మిగిలిన నిధియేనా
* అభిమానాలతో అవమానాలతో శతమానంభవతి
అలజడి నిండిన ఆవేదనలతో శోకమయం జగతి
నీకేదైనా నీవేమైనా వీడదు ధర్మం నిరతి
నిండే యెండే జగతి చెఱువులో తీరనిగతికేరీతి
జ్ఞానము పంచే చైతన్యగీతి
ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి https://archive.org/details/@sudarshan_reddy330?query=%23swami_sundara_chaitanyananda&sort=-publicdate
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
No comments:
Post a Comment