20. భగవద్ధ్యానమే ధ్యేయం
20. భగవద్ధ్యానమే ధ్యేయం శిష్యుడు : శ్రీరామకృష్ణ గురుదేవులు ఇంకా సజీవులై ఉన్నారనే భావిస్తున్నారా స్వామీ? స్వామి : నీకేం మతిపోయిందా? లేకపోవడం ఏమిటి? ఆయన ప్రత్యక్షంగా లేకుంటే ఇల్లు వాకిలీ వదలిపెట్టి మాకీ సన్న్యాసి బ్రతుకు ఎందుకు? ఆయన ఉన్నారు. హృదయపూర్వకంగా ఆయన్ను ప్రార్థించు. ఆయనను దర్శించాలని, ఆయన గురించి తెలుసుకోవాలని వేడుకో. నీ సమస్త సందేహాలు నివృత్తిచేసి తన నిజస్వరూపాన్ని నీకు చూపుతారు. శిష్యుడు : అంటే, ఆయన ప్రత్యక్షమై మీకు దర్శనం ఇస్తారా, స్వామీ? స్వామి : ఇస్తారు. అదే ఆయన దయ, నా భాగ్యం. ఆయన దయ అంటూ ఉంటే ఎవరైనా ఆయన్ను దర్శించుకోవాలని ఉందో, ఎందరికి ఆయనంటే | ఇష్టమో భగత్సాక్షాత్కారం పొందడమంటే మాటలు కాదు. శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సామరస్యం చెంది వికాసం పొందకుంటే, ధర్మం, పారమార్థిక జీవితం అసంభవం. అందుకు వలసినది శ్రద్ధ, అఖండ శ్రద్ధ, శ్రద్ధావంతుడవైతేనే భగవద్దర్శన మహాభాగ్యం లభిస్తుంది. శ్రద్ధ జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది. శ్రద్ధ కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు తప్పదు. భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి అంతటా, అన్నిటా సంశయాలే ఎదురవుతాయి. విశ్వాసపూరితునకు నిస్సంశయంగా అన్...