Thursday, June 29, 2023

వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు సర్వేశ్వరరావు

 

వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు సర్వేశ్వరరావు

From వికీపీడియా


Jump to navigationJump to search

నిడదవోలు సర్వేశ్వరరావు

తండ్రి :   నిడదవోలు వేంకటరావుగారు
నిడదవోలు సర్వేశ్వరరావు
నిడదవోలు సర్వేశ్వరరావు
జననంనిడదవోలు సర్వేశ్వరరావు
1932ఫిబ్రవరి 10
ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా
మరణం1994 జనవరి 10
వృత్తిTelugu Lecturer ;గేయరచయిత,
సాహితీవేత్త
మతంహిందూ
భార్య / భర్తశ్రీమతి మహలక్ష్మి
పిల్లలువిలానీ ,లవలీ

నివాసం: హైదరాబాదు

జననం: 1932 ఫిబ్రవరి 10

మరణం: 1994 జనవరి 10

జన్మస్థలం: : ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా

పాఠశాలలో విద్యాభ్యాసం: : విజయనగరం, కాకినాడ, మద్రాసు

కళాశాల విద్యాభ్యాసం:: మద్రాసు

ఉద్యోగం: : ఎ.సి. కాలేజ్, గుంటూరు 1954-55; ప్రాచ్యలిఖిత అముద్రిత గ్రంధాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం; 1958-58; వివేక వర్ధినీ కళాశాల, హైదరాబాదు 1960-1991

వివాహం: 1968

భార్య: శ్రీమతి మహలక్ష్మి

సంతానం: ఇద్దరు అమ్మాయిలు ; విలానీ ,లవలీ

సాహిత్య వ్యాసంగం:

1. బి.పియర్సన్ డెమొక్రసీ ఇన్ వరల్డ్ పోలిటిక్స్" తెలుగు అనువాదం

2. "క్రాస్" క్రైస్తవ మత గ్రంథానికి తెలుగు అనువాదం

3. రేడియో ప్రసంగాలు

4. అముద్రిత గ్రంథ సంస్కరణలు

5. గీత రచనలు: పారిజాతమాల (అయ్యప్ప భక్తి గీతమంజరి)

అయ్యప్ప గీత రచన ప్రస్తానం:

1983లో పద్మశ్రీ డాక్టరు కె.జె. ఏసుదాసుగారు అయ్యప్పస్వామి భక్తిగీతాలు వ్రాయటానికి వారిని ట్రివేండ్రం పిలిపించారు. వ్యవధి ఎక్కువ లేనందువల్ల విమానంలో రమ్మని రెండు రోజులలో పాటలు పూర్తి చెయ్యాలని చెప్పారు. వారిచ్చిన బాణీలకు పాటలు వ్రాశా రు. అప్పటికి వారికి అయ్యప్పస్వామిని గూర్చి ఏమీ తెలీదు. అయినా పాటలు రమణీయంగా వ్రాయటం గమనించి 'అయ్యప్ప దయా, పూర్వజన్మ సుకృతం ఉండటం వల్లనే మీరిలా వ్రాయగలిగారు' అనిమెచ్చుకున్నారు. అప్పుడు దీక్షలో ఉన్నారు. మొదటిసారి వారి పాటలు Dr K J Yesudas పాడి రికార్డు చేస్తున్నప్పుడు నాలో నాకే తెలియని అయ్యప్పస్వామి మీద అచంచలమైన భక్తివిశ్వాసాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుని సతీసమేతంగా స్వామిని దర్శించుకున్నారు నేను గొప్ప గీతరచయిత కావాలని మానాన్నగారు కళాప్రపూర్ణ శ్రీ నిడదవోలు వేంకటరావుగారు నాగురించి శతకంలో ఇలా అన్నారు..

ఆ సమ రీతి తాను వెలుగొందు ఎమేసియునయ్యెతా వాసిని గాంచినాడును వాగ్గరిమంబు తెలుంగునన్ నుప న్యాసకు డౌచు గేయరచనాఢ్యుడునై తనరారె పాటలం ఆ సరి లేని రీతి ప్రజలందరు మెచ్చగ వేంకటేశ్వరా

ఇది నిజ కావటం అయ్యప్పస్వామి దయవల్లనే చిన్న నాటినుండి హిందీ ట్యూన్లకి తెలుగు పాటలు వ్రాయటం, అవి మద్రాసు 'బాలానందం'లో రేడియోలో మా చెల్లెలు జోగాబాయి పాడటం, అవి బహుజనాదరణ పొందటం కాలంలో చాలామందికి తెలుసు. ఆకాశవాణిలో హాస్యయుత ప్రసంగాలు చేశా రు. కాలేజీల్లో పనిచేస్తున్న రోజుల్లోను, ఇతరత్రా నేన విసిరిన ఛలోక్తులు ఇతరులు ఇప్పటికీ జ్ఞప్తి చేస్తూవుంటారు. వారు బాధలు మరచిపోయి ఎప్పుడూ అందరితో సరదాగా ఉండటమే దానికి కారణం. ఏదైనా ఈజీగా తీసుకోవటం, అసలు సీరియస్గా ఉండకపోవటం వారికి అలవాటు. అందరినీ ఆనందపరచడమే నా ప్రధానాశయం. వారికి మొహమాటం ఎక్కువ. వారి గురించి వారు ఎవ్వరితో ఎప్పుడూ చెప్పుకోలేదు. చాలా అంతర్ముఖులు ఈనాడు ఈ భక్తిగీతాలతో వెలుగులోకి వచ్చినారు. దీనికికూడా వారి అర్ధాంగి మహాలక్ష్మి కారణం. దేవులపల్లి కృష్ణశాస్త్రిగార్కి, పాటపాడించు సతి ఊర్వశి అయితే శ్రీమతి పాట వ్రాయించు సఖీ అయింది. అమధ్య అనారోగ్యం పాలయి వ్రాయలేని స్థితిలోవున్నపుడు శ్రీమతి ప్రోద్బలంతో నేను పాటలు చెబుతూవుంటే శ్రీమతి వ్రాసింది. వారి పాటలు బాణీలు అంతర్ విశ్వవిద్యాలయ పాటల పోటీలలో ప్రథమ బహుమతి పొందేయి. దాశరథిగారి 'మాట్లాడని మల్లెమొగ్గ'. విద్వాన్ విశ్వంగారి పెన్నేటి పాటలో 'అదే పెన్నీ అదే పెన్న "గేయాలకి వారు కూర్చిన బాణీలు ఆ కాలంలో తెలియనివారు లేరు. అవి నావీ అని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోక పోవడం వల్ల వారి వారి స్వంత బాణీలుగా చెప్పుకుంటూ ఎందరో గానం చేసి మెప్పుపొందారు. వారికి సంగీతం రాదు. గొప్ప సంగీత దర్శకుణ్ణి కావాలని చిన్ననాటి నుండి ప్రగాఢ కాంక్ష. అది భక్తి గీతరచనా వ్యాసంగంగా పరిణమించడం. శ్రీ సుదర్శనరెడ్డిగారు స్థాపించిన 'స్వరాంజలి (భక్తి సంగీత ఆర్కెష్త్రా) తరపున సర్వశ్రీ డి. సుబ్బారాయుడు, పి.వి. సుబ్బారావు, పి. బాల కామేశ్వరరావు మున్నగు మధుర గాయకులు నా పాటలు ఎన్నో చోటలపాడి శ్రోతలను ఆనందింప జేస్తున్నారు


అంకితము

భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాబాహు శాస్తే తుభ్యం నమోనమః నా అభీష్ట దైవమైన అయ్యప్ప స్వామి చరణారవిందములకు ఈ పారిజాతమాల నాతలపుల పూమాల స్వామి! నీ ఎద మెరిసే నా భక్తి గీతమాల-- నిడదవోలు సర్వేశ్వరరావు

అభినందన :

1. Padmashree Dr. K.J Yesudas: For the devotional Service of Lord Ayyappa my great writer Nidadavolu Sarweshwara Rao is so keen on starting a Valuable Makara Jyothi Trust and with that he is releasing a valuable book entitled “Parijatha Mala” May God Lord Ayyappa bless him & his family for his devotional Venture. your’s ….K J Yesudas

2. Being a devotee of Lord Ayyappa, I am happy that Sri Sarveswara Rao is bringing out a book entitled 'Parijathamala' (Devotional Songs on Lord Ayyappa). May Lord Ayyappa shower his blessings on him and his family. Madras, 11-11-93. Sd./- JAYASUDHAKAPOOR


3. చిరంజీవి సర్వానికి ఆశీస్సులు నీ 'పారిజాతమాల' చదివాను ఒడలు పులకించింది. నేత్రాలు అర్ధనిమీలితాలయ్యాయి. వీనులకు క్యాసెట్లు విందుచేశాయి. మేను పరవశించింది. శబరి గిరీశ ధ్యానాభ్యాసవశీకృతమైన నీమనసరస్సు నుండి ఉద్భివిల్లిన భక్తి భావతరంగాలే నీగేయాలు. ఇది భక్తి రసాయనం. గేయ రచనా శిల్పివి. గేస్తురాలు మహలక్ష్మి శ్రీమతీ, ధీమతి. గానం ఆమెది గీతం నీది. పరిమళము చెడదు నీకృతి నిరతము అయ్యప పదార్బనీయులకు మనోహరముగు, దివినుండి మహాధరణిని కృష్ణుడు నిలిపిన దామముకతనన్ నీకృతి హిమకరజ్యోతి. మకరజ్యోతి కరజ్యోతి స్వామియే శరణం..... 14.11.93, హైద్రాబాద్.....సుందరేశ్వర రావు.

'అయ్యప్ప గీత రచయిత, తెలుగు అనువాదం రచయిత కూడ'...

నిడదవోలు సర్వేశ్వర్ రావు గారి అన్నయ్య నిడదవోలు శివసుందరేశ్వరరావు గారు

నిడదవోలు శివసుందరేశ్వరరావు గారు వ్రాసిన గ్రంధం" శివార్పణం" లో వీరి నాన్నగారు నిడుదవోలు వేంకటరావు[1]కుటుంబం 10 వ పేజీ లో వివరాలు తెలియజేసారు నిడుదవోలు వేంకటరావు కు సంతానం 3 కొడుకులు 2 కూతుళ్లు వారు వరుసగా సుందరేశ్వర్ రావు , పార్వతీశ్వర్ రావు ,జగ్గా రావు ,సర్వేశ్వర్ రావు, సూర్యనారాయణ , జోగాబాయి ,లక్ష్మి .

సాహిత్య వ్యాసంగం:

1. బి.పియర్సన్ డెమొక్రసీ ఇన్ వరల్డ్ పోలిటిక్స్" తెలుగు అనువాదం 2. "క్రాస్" క్రైస్తవ మత గ్రంథానికి తెలుగు అనువాదం 3. రేడియో ప్రసంగాలు 4. అముద్రిత గ్రంథ సంస్కరణలు 5. గీత రచనలు: పారిజాతమాల (అయ్యప్ప భక్తి గీతమంజరి) సాహిత్య వ్యాసంగం: 1. బి.పియర్సన్ డెమొక్రసీ ఇన్ వరల్డ్ పోలిటిక్స్" తెలుగు అనువాదం 2. "క్రాస్" క్రైస్తవ మత గ్రంథానికి తెలుగు అనువాదం 3. రేడియో ప్రసంగాలు 4. అముద్రిత గ్రంథ సంస్కరణలు 5. గీత రచనలు: పారిజాతమాల (అయ్యప్ప భక్తి గీతమంజరి)

క్యాసట్లయిన గీత రచనలు

1. తరంగిణి. వాల్యూం-2. Xi8206 Stereo "అయ్యప్పస్వామి భ క్తి గీతాలు" గానం: డాక్టర్ జేసుదాసు

తరంగిణి - వాల్యూం-9 xi 892206 Stereo "అయ్యప్పస్వామి భ క్తి గీతాలు" గానం: డాక్టర్ జేసుదాసు

3. శ్రీనివాస వీడియో- ఆడియో-మద్రాసు. 4 DXL 0046 అయ్యా అయ్యా అయ్యప్పా గానం: నాగూర్ బాబు గారు (మనూ)

4. సంగీతా - 4 ECDB 7731 "శ్రీ రాఘవేంద్ర గీతామృతం" గానం: శ్రీమతి ఎస్. జానకి

5. సుప్రీం ఎంటర్ ప్రైజస్ SED 051 గానం: శ్రీమతి ఎస్. జానకి “నమో గణేశా" గానం : శ్రీమతి శోభారాజు, శ్రీ డి. సుబ్బారాయుడు

6. బాలాజీ ఆడియో వీడియో 1047. "గజపయ్యా రావయ్య". గానం: శ్రీ డి. సుబ్బారాయుడు, శ్రీ వి. అవతార లక్ష్మి,

7. బాలాజీ ఆడియో వీడియో 1048 “గణపతి సదాస్మరామి" గానం : శ్రీ పారుపల్లి రంగనాథ్, శ్రీ డి. సుబ్బారాయుడు, శ్రీమతి వి అవతార లక్ష్మి,

8. బాలాజీ ఆడియో వీడియో జాకెట్ 9 గానం: శ్రీ డి. సుబ్బారాయుడు, శ్రీమతి శశికళ, శ్రీమతి శారద, కుమారి మణిశర్మ మొ॥

9 తరంగిణి మ్యూజిక్ c. 45, tam gba tgu,249 శరణ తరంగిణి గానం: డాక్టర్ జేసుదాసు

మూలాలు

1. Parijatamaala Ayyappa Songs Book: https://archive.org/details/parijatamala-ayyappa-devotional-songs-dr-kjyesudas/page/n69/mode/2up

2. kjyesudas-vol-2 Songs Video Link: https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-vol-2-full-album-telugu-lyrics

3. kjyesudas-vol-9 Songs Video Link: https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-vol-9-full-album-telugu-lyrics

4. kjyesudas-sharanatarangini Songs Video Link: https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-full-album-telugu-lyrics

5. Ayyappa Songs Volume 2 Nidadavolu Sarveshwar Rao image link: https://archive.org/details/ayyappa-songs-volume-2-nidadavolu-sarveshwar-rao

6. Appreciation By Padmashree DR K J Yesudas_Nidadavolu_Sarveshwar_Rao: https://archive.org/details/appreciation-by-padmashree-dr-k-j-yesudas/mode/1up

7. నిడదవోలు సర్వేశ్వరరావు With Padmashree Dr K J Yesudas Photos: https://archive.org/details/with-padmashree-dr-k-j-yesudas-photos

8. Ayyppa songs full: https://archive.org/details/@sudarshan_reddy330?query=%23ayyappa

9. నిడదవోలు శివసుందరేశ్వరరావు గారు వ్రాసిన గ్రంధం" శివార్పణం": https://archive.org/details/in.ernet.dli.2015.492243/page/n9/mode/2up

  1.  https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B5%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81_%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular