Posts

Showing posts from May, 2023

నమస్తే తెలంగాణ news paper 01 JUNE 2023

Image

కరుణా సాగర మొరవినలేవా నావ్యథ కనుగొనిరావా

Image
కరుణా సాగర మొరవినలేవా నావ్యథ కనుగొనిరావా ఓడు బ్రతుకురా తోడైరారా తీరము ననుచేరనీరా 1.ఆమనితలచే కోయిలపిలిచే నాహృది నిన్నేవలచే మదినిండా నినుకొలిచే ఆమనిపొంగెను కోయిలపాడెను క్రుంగెను నామదికుమిలి 2.నింగినేల రెండుగవున్నా నేలనువిడువదు నింగి కడుపున దాచును ఒంగి నీవు నేను ఒకటిగ వున్నా యెడబాటే బ్రతుకంతా 3.నిలవదు దేహము ఆగదు ప్రాణము కాలము సాచును కరము మరణము తీర్చును రుణము రగిలిన మదితో పగిలిన యెదతో మనగలనా నిను మరచీ

ఎందుకునీ దయరాదు క్రిష్ణా పూజలెన్నోచేసి దారులెన్నోకాచి వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా

Image
ఎందుకునీ దయరాదు క్రిష్ణా పూజలెన్నోచేసి దారులెన్నోకాచి వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా పంకమున పుట్టిన పద్మముతగదని హృదయ కొలనులో వూహించితినినుగని ప్రేమజలములో పెరిగినభక్తి సుమము సమర్పించితిని క్రిష్ణా ... కఠినమైన కొమ్మకు కాచిన ఫలము పూజకు కాదని మానుకొంటి నీవేకర్తగసాగిన నాకర్మ ఫలమేమేలనుకొంటి క్రిష్ణా వేద్యుడవు ఆరాధ్యుడవైనా నైవేద్యము ఏదో తెలియక నీమెళకువలో మెలిగినమనమును విందుగముందుంచితిని క్రిష్ణా కప్పురము వెలిగించి కాంతినితీసిన సాగే కాంతి సరిగాదనియెంచి రాగరసములో తడిసినభక్తి వత్తిని వెలిగించితిని

నమస్తే తెలంగాణ news paper 31 MAY 2023

Image

భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి?

Image
  భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి? భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా? ఇది క్రిందటి టపాలో పద్మగారి ప్రశ్న.  ఇందు గలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదికి జూచిన అందందే కలడు..... సర్వాంతర్యామి...  ఎక్కడని వెతకగలం? అంతర్యామి... పట్టుకునే శక్తి మనకు ఉందా? భగవంతుణ్ణి మనం పట్టుకోలేం కానీ, భగవంతుడు ఉన్నాడన్నది సత్యం. మనల్ని పట్టుకు నడిపిస్తున్నడన్నది సత్యం. ఆయన మనల్ని పట్టుకునే వున్నాడు, మనల్ని పట్టుకున్న ఆయన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. ఆ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికే శోధన, సాధన... అని వాట్సప్ లో తనకి బదులిచ్చాను. వెన్వెంటనే తన నుండి ప్రశ్నల పరంపర. ఒక చేతితో సంసారమును, మరో చేతితో భగవంతున్ని పట్టుకోవాలన్న రామకృష్ణ పరమహంస మాటలపై మీ అభిప్రాయం? మనం పట్టుకోలేమనుకుంటే ఆయన ఎందుకు పట్టుకోమని చెప్పినట్లు?  త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య కబీర్ తదితరులు భక్తితో పరమాత్మను పట్టుకొని పరమపదించి ముక్తి పొందలేదా?  ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శోధన సాధన ఎలా చేయాలి?  అర్థమైంది తన మనోస్థితి. ఆ ప్రశ్నలకు నాలో కదలాడే భావ...