Monday, October 1, 2018

తల్లిదండ్రులను మరువవద్దు


తల్లిదండ్రులను మరువవద్దు అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు..... వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో .... నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారు వారు.... రాయివై వారి హృదయాలను వ్రక్కలు చెయ్యవద్దు..... కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు....... నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు ... ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు...... ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు..... నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమాన మౌతాయా?..... అంతా వ్యర్థమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు.... సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువవద్దు....... ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు..... నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు... ... అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు..... నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు..... ఆ మార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు .... డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు. తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు....... వారి పాదాల గొప్పదనం జీవితాంతం మరువవద్దు.... తల్లిదండ్రులను, శాస్త్రములను, గురుజనులను గౌరవించువాడు చిరకాలము ఆదరణీయుడు కాగలడు...

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular