swami vidya prakashananda giri_vyragya geyamulu
https://drive.google.com/drive/folders/0B5yQ3mnWznCXNTdyNGRpWmpuSUE?usp=sharing
శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారు గానం చేసిన వైరాగ్య గేయం
శ్రీగీత
చదువు చదువుల కెల్ల సారమైన చదువు సత్తుజిత్తుల మొత్తము శ్రీగీత చక్కనైన రత్నము.... 1. ఈజన్మవట్టిది సాజన్మ గట్టిది సంసారబంధాలను శ్రీగీత త్రెంపగల్గును చూడరా శ్రీగీత...... 2. మాయ మనసున నిలిచి మంద బుద్ధిని మడచి మాతసేవను జేయరా శ్రీగీత మనసునందున నిలుపరా..... 3. భోగాలు విడిసినా రోగాల వెగచునూ యోగాలు నేర్పుచుండూ శ్రీగీత త్యాగాలు నేర్పుచుండూ..... 4. కనుబొమ్మల సందు కాంచి చూడగ గల్గు కన్నతల్లీ వంటిది శ్రీగీత కామధేనువు వంటిదీ.. 5. కాలంబు చెల్లురా కడతేరు దారికి పరమ పావన మాటరా శ్రీగీత పదము చేబట్టారాదా...... 6. అంతరాత్మ యందు ఆదిదైవము కొరకు అటలాడుచు చున్నది శ్రీగీత మాటలాడుచు నున్నది...... 7. అత్మావలోకంబు అందించు మనకెల్ల ఆదిదైవము అదియేరా శ్రీగీత ఆనందమున గూర్చురా...... 8. జ్ఞానాభివృద్దిని గలుగంగ జేయును చిక్కులన్నియు దీర్చురా శ్రీగీత చింతలన్నియు బాపురా.... 9. ప్రాపంచసుఖములన్ ప్రాకులాడకు మయ్య పరగనున్నవి సుఖములు శ్రీగీత పలుకుచున్నది వినుమురా 10. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మదిలోన మరువకుండు శ్రీగీత మన మేలుగోరుచుండు ..... ********************************
సంసార కూపమున బడి అజ్ఞాన పరివేష్టితులై నానా బాధలు పొందుచుండు జీవుల నుద్దేశించి మహనీయులు ఈ ప్రకారముగ వారికి బోధించు చుందురు
" మానవుడా మమత వీడరా "
మానవుడా మమత వీడరా మమత వీడి రామ నామ స్మరణ చేయరా 1. రామ నామ స్మరణ చేసి ఆత్మ సుఖము నొందరా ఆత్మ సుఖము కన్నమిన్న అన్య మేది లేదురా.. 2. నాది నీది యనెడి మూఢ తత్వము విడనాడరా యెంచి చూడ జగతి లోన ఏది నీది కాదురా 3. మానవ ధర్మమును వీడి దానవుడవు కాకురా మాయకు లోబడిన నీవు మానవుడవు కాదురా 4. ఆలుబిడ్డ లన్నదమ్ము లెవరు వెంట రారురా వదలలేక వచ్చినా వల్లకాడు వరకెరా 5.ఉన్న దాని తోడ నీవు తృప్తి నొంది యుండరా తృప్తి లేని మానవుడే దుఃఖ మనుభవించురా .... *********************************
వైరాగ్య గేయము
చంచలంబగు జగతి లోపల శాశ్వతమ్ బొకటేదిరా ...... కన్నుమూసి తెరచు లోపల కలిమి లేములు మారురా ... 1. మాయ సంసారంబురా యిది మనసు నిలుకడ లేదురా నాది నీది యనుచు నరుడా వాదు లాడ బోకురా 2.బంక మట్టి యిల్లురా యిది భగ్గి భుగ్గి అవునురా ఆలుపిల్లలు ఆస్తిపాస్తులు అంతయూ యేమౌనురా ౩.రాజు రౌతు యనెడి భేదము బ్రతికి యుండే వరకురా మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదాలుండురా 4.తత్వ మర్మము తెలియలేకనె తప్పు దారిని పోకురా ఆత్మ ఎప్పుడు చావులేకనె అంతటా వేలుగొందురా....
No comments:
Post a Comment