Monday, July 7, 2014

బ్రహ్మ సూత్రాలు (యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)

బ్రహ్మ సూత్రాలు_స్వామి సుందర చైతన్య 
mp3 audio folder download link:

https://www.mediafire.com/folder/js1yz9hb2xx4q/brahma_sutramulu

బ్రహ్మ సూత్రాలు (యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)
అథాతో బ్రహ్మ జిజ్ఞాసా!
సాధన చతుష్టయ సంపత్తి సాధించిన పిదప అనగా బ్రహ్మ జిజ్ఞాసకు అర్హత పొందిన తర్వాత మాత్రమే బ్రహ్మ గురించిన తలంపు ప్రారంభము మరియు సుగమము కాగలదు. బ్రహ్మ ఎవరు? ఆయన స్వరూపమెట్టిది? వేదాంతములో ఎలా వర్ణించబడింది? ఇవన్నియును ఈ గ్రంథంలో సమీక్షింపబడతాయి.
జన్మాద్యస్య యతః!
ఈ జడ చేతనాత్మకమైన ప్రపంచంలో సాధారణముగా చూచుట, వినుట మరియు అనుభవములోకి రావటం అను అంశాలు మహాద్భుతమైనవి. ఏ ఒక్క అంశం పైనైనను వైజ్ఞానికులు ఆలోచించినా ఆశ్చర్య చకితులు కాక తప్పదు. ఈ విశ్వము యొక్క జననము ఎవరితో అవుతుందో అనగా సర్వశక్తివంతుడైన ఆ పరాత్పరుడు, పరమేశ్వరుడు తన అలౌకికమైన శక్తితో ఈ సంపూర్ణ జగత్తును సష్టించుచున్నాడు. ఈ జగత్తును ధరించటం,పోషించటం, క్రమపద్ధతిలో నడపటం మరియు ప్రళయ కాలములో తనలో లీనం చేసుకోవటం ఆ పరమాత్మకే చెల్లింది, అతడే బ్రహ్మం.
శాస్తయోనిత్వాత్!:- వేదములో మరియు తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మంను సత్యముగా, జ్ఞానముగా మరియు అనంతమైనదనే లక్షణములు పేర్కొనబడినాయి. అదే రకముగా అతనిని జగత్తు యొక్క కారకుడిగా చెప్పబడింది. కావున పరబ్రహ్మయైన పరమేశ్వరున్ని సష్టి, స్థితి, లయకారుడిగా చెప్పుకోవటం ఉచితంగా ఉంటుంది.
తత్తు సమన్వయాత్!
శాస్త్ర ప్రమాణ పూర్వకముగా తెలియునదేమంటే ఈ విచిత్ర జగత్తు యొక్క కారకుడు పరబ్రహ్మయైన పరమేశ్వరుడైయున్నాడు. సర్వవ్యాప్తుడైన సర్వాంతర్యామి లేని చోటు లేదు. శ్రీమద్‌భగవద్గీతలో భగవానుడు స్వయముగా ఇలా అన్నాడు-చరా చరములలో, జడ చేతనములలో ప్రాణులు కాని భూత సముదాయము కాని నేను లేకుండా లేవు. ఈ సంపూర్ణ జగత్తు నాచే వ్యాపింపబడియుంది. ఉపనిషత్తులలో కూడా ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు. ఈ సమస్త జగత్తులో వ్యాపించియున్నాడు అను విషయము పదేపదే అనేకచోట్ల వచ్చింది.
ఈక్షతేర్నాశబ్దమ్!
ఈక్ష అను ధాతువు క్రియారూపముగా ఉపయోగించబడింది. ఛాందోగ్యోపనిషత్తులో ఆ చైతన్యమూర్తి ఇలా సంకల్పము చేసెను. నేను పెద్దగా అవాలి, విరాట్ రూపాన్ని ధరించాలి. అనేక రూపములలో ఉత్పన్నము కావాలి. మరొకచోట ఇలా అనెను-నిశ్చయముగా నేను లోకాలను సష్టించాలి. జడమైన ప్రకతి చూడలేదు, సంకల్పము చేయలేదు. చైతన్యమున్న తావులోనే అది సంభవమవుతుంది. అందుకని జడ ప్రకతి జగత్తును నిర్మించునని చెప్పలేము.
బ్రహ్మ సూత్రాలు-1
గౌణశ్చేన్నాత్మ శబ్దాత్!
ఐతరేయోపనిషత్తులో పేర్కొనబడిన ఈ సూత్రములో ఈక్షణము కర్తగా ఆత్మను పేర్కొనటం జరిగింది.కాని గౌణముగా(అప్రధానముగా)కూడా దాని సంబంధం ప్రకతితో లేదు. ప్రకతి జగత్తుకు కారణమని చెప్పుట వేదముల ప్రకారం అనుకూలమైన విషయము కాదు.
తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్!
బ్రహ్మం తనను తాను జడ చేతనాత్మకమైన జగత్తు రూపములో ప్రకటించుకున్నాడు. జీవాత్మ పరమాత్మ యందు ప్రతిష్ఠతమైన యెడల మోక్షము పొందును. ప్రకతి యందు స్థితుడైన వానికి మోక్షము లభింపదు. ఆత్మ అను శబ్దము ప్రకతి వాచకము కాదు, అందుకని ప్రకతి జగత్తునకు కారణముకాదు.
హేయత్వా వచ్చనాచ్చ!
ఒకవేళ ఆత్మ అను శబ్దము అప్రధానముగానైనను ప్రకతి వాచకము అనుకున్న యెడల దానిని త్యాగము చేయుటకు చెప్పబడుచున్నది. ఎవరినైతే జగత్తును కారణభూతులని చెప్పుకున్నామో ఆ బ్రహ్మం యందే నిష్ఠగా యుండవలెనని ఉపదేశించడమైనది. పరబ్రహ్మయైన పరమాత్మనే ఆత్మశబ్దము వాచకమై యున్నాడు.
స్వాప్యయాత్!
జగత్తునకు కారణమైన సత్ గురించి తెలియచేయబడినది. అందులోనే జీవాత్మ లీనమైనట్లు చెప్పబడింది. ఇచ్చట సత్ పేరుతో చెప్పబడిన జగత్కారణము జడతత్త్యము కాదు.
గతి సామాన్యాత్!
నిశ్చయముగా సర్వత్రా ప్రసిద్ధుడైన సర్వాంతర్యామిచే ఈ ఆకాశము ఉత్పన్నమైంది. పరమాత్మ చేతనే సర్వము ఉత్పన్నమైంది. పరమాత్మ చేతనే ప్రాణం ఉత్పన్నమైంది. అంతేకాకుండా మనస్సు (అంతఃకరణము),సమస్త ఇంద్రియములు, ఆకాశము,వాయువు, తేజస్సు, జలము, సమస్త ప్రాణులను భరించు పథ్వి ఉత్పన్నమైనవి. ఈ రకముగా ఉపనిషత్తులన్నియు సమానరూపంలో చైతన్య స్వరూపుడైన పరమాత్మనే ఈ జగత్తుకు కారణమని తెలియచేయుచున్నవి. అందుకని ఈ ప్రపంచము రూపుదిద్దుకొనుటకు జడ ప్రకతి కారణము కాదు.
శ్రుతత్వాచ్ఛ!
సమస్తవిశ్వమునకు స్రష్టయైన పరమాత్మునిచే నమస్త సముద్రములు, పర్వతములు ఉత్ప న్నమైనవి.ఉపనిషత్తులలో అడుగడుగునా పరబ్రహ్మ సర్వశక్తివంతుడని, సర్వాంతర్యామియ ని, సర్వజ్ఞుడని, పరమేశ్వరుడని, సర్వ జగత్తుకు కారకుడని శ్రుతి ప్రమాణముగా చెప్పబడిం ది.
బ్రహ్మ సూత్రాలు-2
ఆనందమయోభ్యాసాత్
ఏదైనా విషయమును నొక్కి చెప్పటానికి పదే పదే వల్లె వేసిన యెడల దానిని అభ్యాసమందుము. తైత్తరీయోపనిషత్తులో, బహదారణ్యకోపనిషత్తులో ఆనందమయమను శబ్దము బ్రహ్మం అను అర్థములో అనేకమార్లు ఉపయోగించిబడినది. ఆనందమయమే రస స్వరూపమైయుంటుంది. జీవాత్మ రసస్వరూపుడైన పరమాత్మను పొంది ఆనంద స్వరూపుడైన పరమాత్మ లేకపోయిన యెడల ఎవరు కూడా జీవించి ప్రాణాలతో ఉండేవారు కాదు. వాస్తవానికి పరమాత్మ మాత్రమే అందరికి ఆనందమును ప్రదానము చేయువాడై యున్నాడు.
వికార శబ్దాన్నేతి చెన్న ప్రాచుర్యాత్!
పాణిని సూత్రముననుసరించి తత్‌ప్రకత్‌వచనె మయట్! ఇందులో మయట్ అను ప్రత్యయము వచ్చింది అలాగే ఆనందమయములో కూడా ప్రత్యయము వచ్చింది. ఇది వికారమైన శబ్దము కాదు. మీదు మిక్కిలి బ్రహ్మం ఆనందషునుడనే అర్థం వచ్చింది. ప్రాచుర్యమయమైన పరబ్రహ్మ పరమేశ్వరుడు ఆనందఘన స్వరూపుడు కావున ఆనందమయుడని చెప్పడం ఎంతో సముచితమైనది.
తద్ధేతువ్యపదేశాచ్ఛ!
ఎవరైతే అందరికి ఆనంద ప్రదానం చేస్తారో వారు ఆనంద ఘనులనబడుతారు. ఎందుకంటే ఆఖండమైన ఆనంద భాండాగారము ఉన్నవారే అందరికి ఆనందమును ప్రదానము చేయగలరు. కావున ఇచ్చట మయట్ అను ప్రత్యయము వికారమునకు కాకుండా ప్రాచుర్య బోధకమని తెలిసికోవలెను.
మాంత్రవర్ణిక్ మేవ చ గియతే!
ఆ బ్రహ్మం విశుద్ధమైన ఆకాశ స్వరూప పరమధామములో స్థితుడై అందరి హదయరూప గుహలలో దాగొని ఉన్నాడు. అతడిని తెలిసికున్నవారు అతడి వలెనే అనేక భోగములు అనుభవించెదరు. ఈ మంత్రం ద్వారా వర్ణింపబడిన బ్రహ్మం మంత్ర వర్ణితుడనబడతాడు. పరబ్రహ్మ అందరి అంతరాత్మ అనబడెను.
నేతరోనుపపత్తేః!
తైత్తరీయోపనిషత్తుతో చెప్పిన ప్రకారము ఆనందమయుడైన పరమాత్మ ఇలా తలంచెను- నేను అనేకమై జన్మనెత్తవలెను. దానికి అనుగుణంగా సంకల్పించి తపము చేసి సమస్త జగత్తును సష్టించెను. జీవాత్మ ఈ పనులు చేయలేదు. ఇవి జీవాత్మకు ఉపయుక్తమైన పనులు కావు. జీవుడు అల్పజ్ఞుడు, పరిమితమైన శక్తి కలిగినవాడు కావున జగత్తును సష్టించ కలిగినంత సామర్థ్యము లేనివాడు. కావున ఆనందమయమను శబ్దము జీవాత్మకు వాచకముగా యుండలేదు.
బ్రహ్మ సూత్రాలు-3
భేదవ్యపదేశాచ్చ!
జీవాత్మ రసస్వరూప పరమాత్మను పొంది ఆనందయుక్తమై పోవటం జరుగుతుంది. ఈ రకముగా ఇచ్చట పరమాత్మ ఆనంద దాతగా, జీవాత్మ ఆనంద యుక్తడుగా చెప్పబడింది. అందువలన రెండింటికి వ్యత్యాసము వెల్లడవుతుంది. ఈ రకముగా కూడా ఆనందమయమను శబ్దము జీవాత్మ వాచకము కాదు.
కామాచ్చ నానుమానాపేక్షా!
ఉపనిషత్తుల్లో ఈ ప్రసంగం వచ్చింది. ఈ సూత్రము ద్వారా ఆనందమయములో సష్టికి సంబంధించిన కోరిక వెల్లడించడమైనది. కాని ఈ కోరిక జడ ప్రకతికి అసంభవమైయున్నది. కావున ఆనందమయ శబ్దములో జడ ప్రకతిని గ్రహించలేము.
అంతస్తద్ధర్మోపదేశాత్!
బహదారణ్యకోపనిషత్తులో విజ్ఞానమయ పురుషుని గురించి బ్రహ్మమనియే చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తులో సూర్యమండలవర్తి పురుషున్ని పాపముల నుంచి విముక్తుడైన వాడని చెప్పబడింది. ఈ సూక్తి పరబ్రహ్మ పరమేశ్వరునికి మాత్రమే సంభవము కాగలదు. అందుకని పరబ్రహ్మ పరమేశ్వరున్ని మాత్రమే విజ్ఞానమయుడని, సూర్యమండలాంతర్వర్తి హిరణ్మయ పురుషుడని వ్యవహరిస్తున్నాము.
భేదవ్యపదేశాచ్చాన్యః!
సూర్యునిలో ఉండే సూర్యున్ని అంతర్వర్తీ సూర్యుడని అంటాము. అది సూర్యునికి తెలియ దు. సూర్యాంతర్వర్తీ పురుషుడు సూర్యుని అధిష్ఠాతా దేవత కంటే భిన్నుడైయున్నాడు. అందుకని హిరణ్మయ పురుషుడు సూర్యుని అధిష్ఠాతా దేవత కంటె భిన్నుడై పరబ్రహ్మ పరమాత్ముడనబడుచున్నాడు.
ఆకాశస్తల్లింగాత్!
నిస్సందేహముగా ఈ పంచభూతములు, సమస్త ప్రాణులు ఆకాశము నుండియే ఉత్పన్నమైనవి తిరిగి ఆకాశములోనే విలీనము కాగలవు. అందుకని ఆకాశమే వీటన్నిటికన్నా శ్రేష్ఠమైన ది పెద్దది. ఆదియే వీటన్నింటికీ ఆధారమై యున్నది. ఇచ్చట పేర్కొనబడినది పంచమహాభూతములలో పేర్కొనబడిన ఆకాశము కాదు. ఇది కేవలము పంచభూతములలో ఒకటిగా మాత్రమే ఉన్నది.
పైన పేర్కొనబడిన ఆకాశము పరబ్రహ్మ పరమాత్మ మాత్రమే అని చెప్పబడుతుంది. ఆదియే సర్వశ్రేష్ఠమైన,అన్నింటికన్నా పెద్దదై, సర్వాధారమైయున్నది.వీటన్నింటి వలన తెలియునది ఏమనగా ఆకాశము పేరుతో పరమేశ్వరుడు జగత్తునకు కారణమని ఋజువగుచున్నది
బ్రహ్మ సూత్రాలు-4
అత ఏవ (వ్) ప్రాణః!
నిశ్చయంగా సర్వ భూతములు ప్రాణములోనే విలీనమగుచున్నవి, ప్రాణము నుండియే ఉత్పన్నమగుచున్నవి, కాని ప్రాణ వాయువు నుండి కాదు. సమస్త ప్రాణుల ఉత్పత్తి, స్థితి, లయ కారణములు ప్రాణవాయువు నుండి కాదు. ఇచ్చట ప్రాణము అను పేరు బ్రహ్మంకు మాత్రమే వర్తించును.
జ్యోతిశ్చరణాభిధానాత్!
స్వర్గలోకము పైన పరమజ్యోతి ప్రకాశించుచున్నది. సమస్త విశ్వము పష్ఠముపైన అనగా దీనికన్నా మరొక ఉత్తమమైన లోకము లేదు. అదియే సర్వోత్తమమైన పరమ ధామములో ప్రకాశించుచున్నది. అది నిస్సందేహముగా ఆ మహా పురుషుని ఆంతరిక్ష జ్యోతియైయున్నది. అయినను జ్యోతి శబ్దము దేనిని సూచించుచున్నది. అనే ప్రశ్నకు- జ్ఞానమునా? జీవాత్మనా? లేక బ్రహ్మంనా? అనే సందేహములు వచ్చుచున్నవి. కాని ఈ ప్రసంగములో వచ్చిన జ్యోతి అను శబ్దము బ్రహ్మంనే సూచించుచున్నది. మాండుక్యోపనిషత్తులో వచ్చిన తేజస్సు అను శబ్దము జ్యోతినే సూచిస్తూ బ్రహ్మంను తెలుపుచున్నది.
ఛాందోభిధానాన్నేతి చెన్న తథా చేతోర్పణ్
నిగదాత్ తథా హి దర్శనమ్!
అన్నియును గాయత్రిమయమని, గాయత్రి ఛందస్సు నాలుగు పాదములు, జడ, చేతనాత్మకమైన సంపూర్ణ జగత్తు గాయత్రియని చెప్పుట కుదరదు. మనం తీసికునే అర్థమేమంటే, అందరికి పరమకారణరూపుడైన సర్వాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరునిలో చిత్తము నిలుపుటనే అచ్చట గాయత్రి అను పేరువాడబడినది. ఇతర తావుల్లో కూడా ఉద్గీథయని ప్రణవమని బ్రహ్మం వర్ణన చేయబడింది. ఒక విషయము అర్థము అగుటకు ఇతరేతరములతో సమన్వయము ఉచితముగానే యుంటుంది.
భూతాది పాదవ్యప దేశోపపత్తేశ్చైవమ్!
ఛాందోగ్యోపనిషత్తులో పేర్కొనబడిన ప్రకారము గాయత్రిని నాలుగు పాదములతో, భూతము, పథివి, శరీరం, హదయరూపంతో అని చెప్పబడినది. దాని మహిమను వర్ణిస్తూ పురుష నామముతో ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ పరమాత్మతోపాటు సమస్త ప్రాణి సముదాయమును ఒక్క పాదముగనే పరిగణింపబడింది. పిదప అమతస్వరూప మూడు పాదములు పరమధామములో స్థితమైయున్నవని తెలుస్తోంది. గాయత్రీ పేరును గాయత్రీ ఛందస్సుతో కాకుండా పరబ్రహ్మ పరమాత్మతో చెప్పవలెను.
బ్రహ్మ సూత్రాలు-5

Posted On:5/31/2014 12:49:15 PM


ఉపదేశ భేదాన్నేతి చెన్నో భయస్మిన్నప్య విరోధాత్!
దీనిముందు మంత్రంలో మూడు పాదాలు దివ్యలోకములో ఉన్నాయని, దివ్యలోకము బ్రహ్మం యొక్క మూడు పాదముల ఆధారమని చెప్పబడింది. అంతేకాకుండా జ్యోతి పేరుతో వర్ణింపబడిన బ్రహ్మంను దివ్యలోకము కంటే ఉన్నతస్థితిలో చెప్పబడింది. ఈ రకముగా ఇచ్చట భిన్నమైన అంశాలు వస్తున్నాయి. ఈ విషయాలను వర్ణించిన తీరులో,శైలిలో కాస్త విరోధము వచ్చినను వాస్తవముగా అలాంటి వ్యత్యాసము లేదు. రెండుచోట్ల కూడా బ్రహ్మంను పరమ ధామముతో స్థితమైయున్నట్లు చెప్పబడింది.

ప్రాణస్తధాను గమాత్!-పూర్వాపర ప్రసంగమును పరిశీలించినప్పుడు ప్రాణము అను శబ్దము బ్రహ్మంకు మాత్రమే వాడబడినదని తెలియుచున్నది. కౌషీతకీ ఉపనిషత్తులో ఇంద్రుడు తనను తాను ప్రాణమునని చెప్పుకున్నాడు. వాస్తవానికి ఇంద్రుడు ప్రభావశాలియైన దేవత, అజరుడు మరియు అమరుడు కావున ఇంద్రున్ని ప్రాణదేవత అని ఎందుకు అనకూడదు అనే సందేహం వస్తుంది. బ్రహ్మ జ్ఞానమును మించిన ఉపదేశము లేదు. ప్రాణమును ప్రజ్ఞాన స్వరూపమన్నాము. దీనిని బ్రహ్మంకు ప్రత్యామ్నాయముగా పేర్కొంటాము. దీనినే ఆనంద స్వరూపమని, అజరము మరియు అమరము అని అన్నాము. కావున ప్రాణము అను శబ్దము బ్రహ్మంకు మాత్రమే వర్తించును.
న వక్తురాత్మోపదేశాదితి చేదధ్యాత్మ సంబంధ భూమాహ్యస్మిన్!

ఇంద్రుడు స్పష్టముగా తనను తాను ప్రాణముగా పేర్కొనియున్నాడు. కాని ఇచ్చట ఆధి దైవిక వర్ణన లేదు, ఉపాస్యరూత తత్త్వము లేదు. కావున ఇంద్రుడు ప్రాణము కాదు. ప్రాణము అను శబ్దము కేవలం బ్రహ్మంకు మాత్రమే వర్తించును.

శాస్త్ర దష్ట్యా తూపదేశో వామదేవవత్!-దేవతలలో మరియు మానవులలో ఎవరు బ్రహ్మంను తెలిసికుంటారో వారు బ్రహ్మరూపులు కాగలరు. ఋషులలో కూడా వామదేవుడు ఆత్మరూపముతో బ్రహ్మంను చూసి నేను మనువును అయ్యాను, నేను సూర్యున్ని అయ్యాను అని అన్నాడు. దీనివలన సిద్ధించునది ఏమనగా శాస్త్ర దష్టితో ఆలోచించినప్పుడు ఇంద్రుడు కూడా నేను జ్ఞాన స్వరూప ప్రాణాన్ని మరియు నేనే పరబ్రహ్మ పరమాత్మను అని అన్నాడు. కావున ప్రాణము అను శబ్దము బ్రహ్మమైయున్నది.

జీవ ముఖ్య ప్రాణ లింగాన్నేతి చెన్నోపాసాత్రై విధ్యాదాశ్రిత త్వాదిహతద్యోగాత్!
కౌషీతకీ ఉపనిషత్తులో చెప్పిన ప్రకారము శరీరధారణ చేయుటలో ప్రాణము యొక్క పాత్ర ప్రధానమైనది. ఈ రెండింటి ఆశ్రయము బ్రహ్మమైయున్నది. ఇచ్చట బ్రహ్మం లోకాధిపతియని లోకపాలుడని స్పష్టముగా వర్ణన చేయబడియున్నది. ఇంద్రుడు కేవలం జీవాత్మ మాత్రమే కాని బ్రహ్మం ప్రసిద్ధమైన ప్రాణం అని తెలియుచున్నది.
(యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)
బ్రహ్మ సూత్రాలు-6
సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్!
ఛాందోగ్యోపనిషత్తుతలోని మూడవ అధ్యాయములో ఇది స్పష్టముగా గోచరించింది. ఈ సంపూర్ణ చరాచర ప్రపంచము నిశ్చయముగా బ్రహ్మమయమైయున్నది. ఇది బ్రహ్మంలో నుంచియే సష్టించబడింది.
స్థితమైయున్నప్పుడు వ్యవహారము నడుస్తుంది. చివరకు అందులోనే లీనమవుతుంది. సాధకుడు రాగద్వేషాలను వదలిపెట్టి శాంత చిత్తముతో ఉపాసన చేయవలెను. సంకల్పమయుడైన మానవుడు నిశ్చయాత్మక భావనతో యుండవలెను. ఇచ్చట ఉన్నటులనే పరలోకములో కూడా ఉండవలసి వస్తుంది. కావున దఢ చిత్తములో యుండాలి. ఈ మంత్రములో పరబ్రహ్మంను మాత్రమే ఉపాసించాలని యున్నది. ఎందుకంటే సష్టి, స్థితి, లయకారుడు బ్రహ్మం అని తెలిసికొమ్ము సమస్త వేదాంత వాక్యములలో జగత్తు ప్రసిద్ధ మహా కారణరూపుడు బ్రహ్మం. ఈ ప్రకరణములో చెప్పబడిన ఉపాస్య దేవుడు పరబ్రహ్మ పరమాత్మయై యున్నాడు. వేరెవరూ కాదు అని తెలిసికొనుము.
వివక్షితగుణోప పత్తేశ్చ!
ఆ ఉపాస్యదేవుడు మనోమయుడు, ప్రాణరూపుడు, ప్రకాశ స్వరూపుడు, సత్య సంకల్పుడు, ఆకాశము వలె వ్యాపకుడు, సంపూర్ణ జగత్తు కర్త, పూర్ణకాముడు, సర్వగంధుడు, సర్వరసుడు, ఈ సమస్త జగత్తును అన్ని దిక్కుల నుంచి ఆక్రమించినవాడు, వాణీరహితుడు సంభ్రమశూన్యుడై యున్నాడు. కావున ఉపాస్యదేవుడు పరబ్రహ్మ పరమేశ్వరుడై యున్నాడు.
బ్రహ్మ సూత్రాలు-7
స్మతేశ్చ!
శ్రీమద్ భగవద్గీతలో కూడా ఉపాస్యదేవునికి, ఉపాసకునికి మధ్య గల భేదము స్పష్టము చేయబడినది.నా లోనే నీ మనస్సును లగ్నము చేయుము, నా లోనే నీ బుద్ధిని కూడా స్థిరపరుచుము, ఆ పిదప నీవు నాలోనే నివసించెదవు, అనగా నన్ను ప్రాప్తించుకొందువు, ఇందులో అణుమాత్రము సందేహం లేదు అంతేకాకుండా ఎవరైతే అంత్యకాలమందు నన్ను స్మరిస్తూ శరీర త్యాగము చేయుదురో వారు నా స్వరూపమునే ప్రాప్తించుకొందురు. ఇందులో ఏ మాత్ర ము సంశయము లేదు ఈ ప్రసంగ వర్ణనతో పరబ్రహ్మ పరమాత్ముడే ఉపాస్యదేవుడని జీవాత్మ కాదని తెలియుచున్నది.
అర్భకౌక స్తవాత్తద్ వ్యపదేవాచ్చ నేతి చెన్న నిచాయ్యత్వా
దేవం వ్యోమవచ్చ!
ఛాందోగ్యోపనిషత్తులోని మూడవ; పద్నాలుగవ మంత్రములలో ఉపాస్యదేవుడు హదయములో ఉంటాడని చెప్పబడింది. ఆకార ప్రకారములలో కూడా ధ్యానము వలె జొన్నల వలె చిన్నగా ఉంటాడని చెప్పబడింది. ఇది సందేహాస్పదమైన విషయం. అలాంటప్పుడు అది పరబ్రహ్మం కాదని తెలియుచున్నది. ఎందుకంటే పరబ్రహ్మ పరమాత్ముడు అందరికంటె పెద్దవాడై, సర్వ వ్యాపకుడై సర్వశక్తివంతుడని చెప్పబడింది. అలాంటప్పుడు పరబ్రహ్మయైన పరమాత్ముడు హదయస్థగతుడు కాదు.పరబ్రహ్మ పరమాత్మ స్వరూపము ఆకాశము వలె సూక్ష్మము వ్యాపకమైయున్నది. బ్రహ్మం సర్వత్రా ఆవరించి యున్నది. ప్రతిపాణి హదయములోను, బయట కూడాను ఉన్నదిబహ్మం చిన్నదిగా, హదయస్థమై ఉన్నదని చెప్పటం అంటే సూక్ష్మమైనదని ఇంద్రియముల చేత గ్రాహ్యము కానిదని అర్థము తీసికోవలసి యున్నది. అదే మంత్రములో బ్రహ్మం పథివి కంటె, అంతరిక్షము కంటె ద్యులోకము కంటె, ఇతర సమస్త లోకములకంటె బహత్తరమైనదని చెప్పబడింది. అంతటి సూక్ష్మమై యుండి కూడా సమస్త లోకముల లోపట, బయట ఆవరించియున్నది. కావున ఉపాసనీయుడు పరబ్రహ్మ పరమాత్మనే కాని వేరెవ్వరూ కాదు.
సంభోగప్రాప్తిరితి చెన్న వైశేష్యాత్!
సందేహాస్పదమైన విషయమేమనగా పరమాత్మ ఆకాశము వలె సర్వవ్యాపకుడై సమస్త ప్రాణుల హదయాలలో నెలకొని యుంటాడు. కావున వారి సుఖదుఃఖములను కూడా భోగించు ఆవకాశము స్వాభావికముగా ఉంటుందనే అనుమానము వస్తుంది. కాని పరమాత్మ కర్తనే కాని భోక్తకాదు. అందరి హదయాలలో వసిస్తూ కూడా వారి గుణదోషములతో అసంగతుడై యున్నాడు. జీవాత్మ తన అజ్ఞానవశమున కర్త, భోకయైయున్నాడు. పరమాత్మ ఎల్లవేళలా నిర్వికారుడై యున్నాడు. అందుకని జీవుల సుఖ దుఃఖములతో సంబంధము పరమాత్మ యెడల అసంభవమని తెలుస్తోంది.

బ్రహ్మ సూత్రాలు-8
అత్తా చరాచర గ్రహణాత్!
బ్రాహ్మణులను, క్షత్రియులను అనగా సమస్త స్థావర జంగమాదులను భోజనము చేసే అనగా తనలో లీనము చేసుకునే పరమాత్మను ఎవరు తెలిసికొనగలరు. శ్రుతిలో చెప్పబడిన భోక్త, కర్మ ఫల రూప సుఖ దుఃఖములను అనుభవించువాడు కాదు. సంహార కాలములో చరాచర ప్రపంచమును తనలో లీనము చేసుకునేవాడు కావున భోక్త అంటాము.
ప్రకరణాచ్చ! పూర్వాపర ప్రసంగమును అనుసరించి పరమాత్మను తెలిసికొనుటకు పరమాత్ముని కపవలననే సాధ్యమగును. కావున పరబ్రహ్మ పరమేశ్వరుడే భోక్తయని తెలియుచున్నది.
గహాం ప్రవిష్టావాత్మనౌ హి తద్దర్శనాత్!
శుభ కర్మల ఫలస్వరూపముగా మానవుడి శరీరములో పరబ్రహ్మ ఉత్తమ నివాస స్థానముహదయకాశమై యున్నది. బుద్ధిరూప గుహలో దాగొని సత్యమును పానము చేయువారు ఇద్దరున్నారు. వారిద్దరు నీడవలె ధూపము వలె పరస్పర విరుద్ధ స్వభావములు కలిగియున్నారు. ఇచ్చట తెలుపబడిన ఇద్దరు భోక్తలు జీవాత్మ, పరమాత్మయై యున్నారు. వారిద్దరిని ఉద్దేశించి నీడ రూపములో ధూపము రూపములో వర్ణింపబడినాయి. పరమాత్మ సర్వజ్ఞుడై, పూర్ణజ్ఞాన స్వరూపుడై స్వయం ప్రకాశకుడై యున్నాడు. అందుకే పరమాత్మను ధూపముతో పోలుస్తూ వర్ణింపబడింది. జీవాత్మ అల్పజ్ఞుడై యున్నాడు. ఉన్న కాస్త వెలుతురు ధూపము అంశయని గుర్తించవలెను, అందుకే జీవాత్మను నీడగా పేర్కొన్నాము. పరబ్రహ్మ పరమేశ్వరుడు సమస్త దేవతల రూపాలలో యజ్ఞఫలాన్ని, తపోఫలాన్ని గ్రహిస్తున్నాడు. కావున పరమాత్మ భోక్త అవుతూ కూడా అభోక్తగా పరిగణింపబడుచున్నాడు.
విశేషణాచ్ఛ!
రథము దష్టాంతమునిస్తూ జీవాత్మను రథికునిగా పరబ్రహ్మ పరమేశ్వరున్ని పరమధామముగా పేర్కొనబడింది. వారిద్దరికి విడివిడిగా విశేషణములతో చెప్పినప్పటికిన్ని రుజువయ్యేదేమంటే హదయ గుహలో ప్రవేశించినవి జీవాత్మ పరమాత్మయై యున్నవి.
స్థానాదివ్యపదేశాచ్చ!
శ్రుతులలో బ్రహ్మం గురించి అర్థం చేయించటానికి ఆయా చోట్ల ఆయా నామములతో , ఆయా రూపములలో వర్ణించటమైనది. కావున ఇచ్చట బ్రహ్మంను నేత్రములలో అగుపించే వాడుగా చెప్పటం సమంజసముగానే యున్నది. బ్రహ్మం సర్వకాల సర్వావస్థల యందు నిర్లిప్తముగానే యుండును. కన్నులలో అగుపించే పురుషుడు కూడా కన్నుల దోషముల నుంచి నిర్లిప్తముగానే యుండును. ఒకవేళ కన్నుల్లో కనుక నేయి, నీరు లాంటి పదార్థములు పడినను అవి కన్నుల కొలనులలోనే ఉండిపోతాయి. కాని ద్రష్టయైన పురుషున్ని స్పర్శించలేవు.
బ్రహ్మ సూత్రాలు-10

Posted On:6/4/2014 12:47:35 AM


సుఖ విశిష్టాభిధానా దేవ చ! ఈ నేత్రములో అగుపించే పురుషుడే అమతమై, అభయమై, బ్రహ్మమైయున్నాడు. ఇందులో నిర్భయత్వము, అమతము సుఖమునకు సూచనగా యున్నవి. అగ్నులు ఉపదేశించినప్పుడు క ఖ లు వరుసగా సుఖమని, ఆకాశమని అర్థమని అర్థమవుతుంది. వాస్తవాని కి బ్రహ్మం ఆకాశమువలె అత్యంత సూక్షుడై, సర్వ వ్యాపకుడై, ఆనంద స్వరూపుడైనాడు.
శ్రుతోపనిషత్కగత్యభిధానాచ్చ!
నేత్రాంతర్వర్తీ పురుషున్ని తెలిసికున్నవారు దేవయాన మార్గములో ప్రయాణం చేసి బ్రహ్మంను పొందుదురు. వారు తిరిగి ఈ ప్రపంచంలోకి రారు. దీనివలన ఋజువయ్యేది ఏమంటే కన్నుల్లో అగుపించే పురుషుడే బ్రహ్మం అని తెలియుచున్నది.

అనవస్థితే రసంభవాచ్చ నేతరః!
నేత్రేందియములో ప్రతిబింబము ఎల్లవేళలా అగుపించదు. ఏ వ్యక్తియైనను ఎదురుగా ఉన్నప్పుడే ప్రతిబింబము అగుపించును. ఆ వ్యక్తి ప్రక్కకు తప్పుకున్న యెడల ప్రతిబింబము తొలగిపోవును. జీవాత్మ కూడా మనస్సుతో , ఏక సమయంలో అనేక విషయములను గ్రహింపదు. సుషుప్తిలో ఏ విషయము కూడా గ్రహింపదు. అందుచే నేత్రాంతర్వర్తి బ్రహ్మమనియే గ్రహింపవలెను.
అంతర్వామ్యధి దైవాదిషు తద్ధర్మవ్యపదేశాత్!

ఈ ప్రసంగములో బహదారణ్యకోపనిషత్తులో వచ్చింది. ఉద్ధాలక ఋషి యాజ్ఞవల్క్యమునిని మొదట సూత్రాత్మ విషయముగా ప్రశ్నించెను,ఆ పిదప అంతర్యామి సంబంధ ప్రశ్నలడిగెను. ఏ అంతర్యామియైతే ఈ లోకములో, పరలోకములో యున్న సమస్త భూతప్రాణుల లోపట యుండి నియంత్రణ చేస్తాడో ఆ అంతర్యామియని అర్థము. యాజ్ఞవల్క్యుడు వాయువును సూత్రాత్మగా చెప్పెను. ఆ తర్వాత అంతర్యామి గురించి విస్తారపూర్వక వర్ణన చేస్తూ జడ చేతనాత్మక సమస్త భూతములకు, సంపూర్ణ జీవులకు నియంతగా వ్యవహరిస్తుంది. ఈ అంతర్యామి, అమతస్వరూప ఆత్మను చూడటానికి రాదు. కాని స్వయంగా అందరిని చూసునదైయున్నది. వినుటకు రాదు కాని స్వయముగా అన్నియును వినునదైయున్నది. మననము చేయుటకు రాదు కాని స్వయముగా అందరిని మననము చేయగలదు. దానికి ఎవరిని కూడా తెలిసికోవాలనే జిజ్ఞాస లేదు. కాని అందరిని విశేష రూపముగా చక్కగా తెలిసికుంటుంది. ఈ రకముగా నీ ఆత్మ అంతర్యామి అమతమైయున్నది. జీవాత్మ అంతర్యామి బ్రహ్మం కాక వేరొండు కాదు.

న చ స్మార్తమతద్ధర్మాభిలాపాత్!
సాంఖ్యులు జడ ప్రకతి ధర్మాల గురించి చేసిన వర్ణన అంతర్యామి గురించి కాదు. చేతన పరబ్రహ్మ ధర్మాల గురించి విస్తారపూర్ణమైన వర్ణన చేయబడింది. ఈరకముగా అంతర్యామి ప్రకతి కానేరదు.

(యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)

బ్రహ్మ సూత్రాలు-11
శారీరశ్చో భయేపి హి భేదేనైననుధీయతే!
మాధ్యాందిన, కాణ్వశాఖకు చెందిన విద్వాంసులు అంతర్యామిని పథివి వలెనే జీవాత్మ లోపట నుంచి నియంత్రించునదని విశ్వసిస్తారు. అచ్చట జీవాత్మ నియంత్రించబడునదని, అంతర్యామి నియంతయని చెప్పబడింది. ఈరకముగా జీవాత్మ, పరమాత్మ వర్ణన విడివిడిగా అవటం మూలాన అంతర్యామియను శబ్దము పరబ్రహ్మ పరమాత్మయని తెలియుచున్నది. కాని జీవాత్మకాదు.
అదశ్యయత్వాదిగుణ్‌కో ధర్మోక్తే!
ముండకోపనిషత్తులో శౌనక మహర్షి అంగిరా ఋషి దగ్గరకు వెళ్లి ఇలా అడిగెను- ఓ దేవా! ఎవరిని తెలిసికోవటం వలన అన్నియును తెలిసికున్న వారమగుదుము? అంగిరా ఋషి ఇలా ఉపదేశించెను- యోగ్యమైనవి రెండు విద్యలున్నవి ఒకటి అపరా రెండవది పరా యని అనబడును. అపరా విద్య వొంట పట్టటానికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము చదవాలి. కాని పరా ద్వారా మాత్రమే అక్షర బ్రహ్మంను తెలిసికోగలుగుతాము. ఆ అక్షరమును అర్థం చేయించటానికి దాని గుణ ధర్మములను ఇలా వివరించెను. ఇంద్రియముల ద్వారా అగుపించనివాడు, పట్టుకోవడానికి చిక్కనివాడు, గోత్రము లేనివాడు, వర్ణము లేనివాడు, కన్నులు, చెవులు, కాళ్లు చేతులు లేనివాడు, శాశ్వతుడు, వ్యాపకుడు, సర్వత్రా పరిపూర్ణుడు, అత్యంత సూక్షుడు, అవినాశయై యున్నాడు. అతనిని ధీర పురుషుడు అని అంటాము.
అలాగే సమస్త భూతములకు పరమకారణమైయున్నాడు. కావున అదశ్యత అనే గుణములు కలవాడని, అతడే పరబ్రహ్మ పరమాత్మ యని, జీవాత్మ, ప్రకతి కాదని తెలియుచున్నది.
విశేషణ భేదవ్యపదేశాభ్యాం చ నేతకౌ!
ఎవరినైతే అదశ్యత మొదలగు గుణముల యుక్తుడని, అన్ని భూతములకు కారణమని చెప్పబడ్డాడో అతనికి సర్వజ్ఞుడనే విశేషణము ఇవ్వబడింది. చూసే వారి లోపట హదయస్థ గుహలో దాగొని ఉన్నాడు.
రూపోపన్యాసాచ్ఛ!
పరబ్రహ్మ పరమేశ్వరుని, సర్వలోకాన్యుని, విరాట్ స్వరూపిని వర్ణన ఇలా ఉంది. అగ్ని పరమేశ్వరుని మస్తకమై యున్నది. సూర్యచంద్రులు అతని నేత్రములైయున్నవి. అన్ని దిశలు అతని చేవులై యున్నవి. ప్రకటించబడిన వేదములు అతని వాణియైయున్నవి. వాయువు ఇతని ప్రాణమై, సంపూర్ణ విశ్వము హదయమై యున్నది. అతని పాదముల చేత పథివి ఉత్పన్నమైనది. సమస్త ప్రాణుల అంతరాత్మయైయున్నాడు. ఈ రకముగా పరమాత్మ విరాట్ స్వరూపమును వర్ణించి అందరి అంతరాత్మగా చెప్పబడింది.








బ్రహ్మ సూత్రాలు-12

Posted On:6/6/2014 1:29:58 AM

వైశ్వానరః సాధారణ శబ్ద విశేషాత్!
ఛాందోగ్యోపనిషత్తులోని ప్రసంగము మేరకు గహస్థులైన అయిదుగురు ఋషులు, మహా వేదవేత్తలైన ప్రాచీనశాల , సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్న, జన, బుడిలుడు అనువారు ఉద్దాలకునితో కలిసి వైశ్వానరాత్మ గురించి తెలిసికోవడానికి రాజైన అశ్వపతి వద్దకు వెళ్లిరి. అశ్వపతి రాజు తాను ఉపదేశము చేసే కంటే ముందు వారి అభిప్రాయములను కనుక్కొనెను. ఆ పిదప తాను ఇలా వర్ణించెను- ఈ విశ్వము, ఆత్మయైన వైశ్వానరుని మస్తకము ద్యులోకముగా, సూర్యుడు నేత్రములుగా, వాయువు ప్రాణముగా, ఆకాశము శరీర మధ్యభాగముగా, జలము బస్తి స్థానముగా, పథివి రెండు పాదములుగా, యజ్ఞస్థలము (వేదిక) వక్షస్థలముగా, దర్ఫలు వెంట్రుకలుగా, గార్హపత్యాగ్ని హదయముగా, అన్వాహారపచనాగ్ని మనస్సుగా , ఆహవనీయాగ్ని ముఖముగా యున్నవి. ఈ వర్ణన ద్వారా తెలిసిదేమంటే విశ్వము , ఆత్మ రూపుమయైన విరాట్ పురుషున్నే వైశ్వానర నామముతో పిలుస్తున్నాము.

స్మర్యమాణమును మానం స్యాదితి!
స్మతి మూల ఆధారముతోనే వైశ్వానరుని స్వరూప వర్ణన చేయబడింది. కావున ఇచ్చట పరబ్రహ్మ విరాట్ స్వరూపమే వైశ్వానరుడని అర్థమగుచున్నది. మాండూక్యోపనిషత్తులో బ్రహ్మం నాలుగు పాదాలను వర్ణన చేస్తూ ఆ బ్రహ్మం మొదటి పాదముగా వైశ్వానరుడే పేర్కొనబడినాడు.
శబ్దాదిభ్యోంతః ప్రతిష్ఠానాచ్చ నేతి చెన్న తథా దష్ట్యుపదేనా
దసంభవాత్పురుషమపి చైనమధీయతే!
శతపథ బ్రాహ్మణములో చెప్పిన ప్రకారము ఈ వైశ్వానర ఆగ్ని పురుషుని ఆకారములో పురుషుని లోపట ప్రతిష్ఠంపబడియున్నది భగద్గీతలో కూడా ఇలా చెప్పబడింది. నేనే వైశ్వానర రూపములో ప్రాణుల శరీరములో స్థితమై యుండి ఆహారమును జీర్ణము చేసెదను
ఈ బ్రహ్మాండము వైశ్వానరుని శరీరముగా చెప్పబడినది. తల నుంచి మొదలుకొని పాదముల వరకు ఉన్న అవయవములను సమస్త లోకములుగా కల్పన చేయబడింది. ఇది జఠరాగ్ని కొరకు అసంభవమని తోచుచున్నది. శతపథ బ్రాహ్మణములో, భగద్గీతలో వైశ్వానరున్ని పురుషాకారములో యున్న పురుషుడనబడింది. ఈ అంశము జఠరాగ్నికి ఉపయుక్తమైనది కాదు. ఈ కారణముల వలన వైశ్వానరుడు పరబ్రహ్మ పరమేశ్వరుడేయైయున్నాడు.
అతేవ్ న దేవతా భూతం చ!
ఈ ప్రకరణములో ద్యులోకము, సూర్యలోకములు, ఆకాశము, వాయువు మున్నగు భూత సముదాయములను తమ ఆత్మగా భావించి ఉపాసించవలెననే ప్రసంగం వచ్చింది. ఆయా లోకముల అభిమాన దేవతలకును, ఆయా భూతములకును వైశ్వానర శబ్దము తీసికోవటం లేదు. ఎందుకనగా సమస్త బ్రహ్మాండము వైశ్వానర శరీరముగా చెప్పబడినది. కావున పరబ్రహ్మ పరమేశ్వరుడే వైశ్వానరుడనబడుచున్నాడు.
(యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)
బ్రహ్మ సూత్రాలు-13
సాక్షాదప్య విరోధం జైమినిః!
ఆచార్యుడైన జైమిని కథనము ప్రకారము వైశ్వానర శబ్దము సాక్షాత్తు విశ్వరూప పరమాత్మునికే వాచకముగా సమ్మతించటంలో విరోధమేమియును లేదు.
అభివ్యక్తేరిత్యాశ్మరథ్య!
ఆశ్మరథ్య ఆచార్యుని కథనము ప్రకారము భక్త జనులను అనుగ్రహించుట కొరకు, దర్శనము చేయుట కొరకు సర్వాంతర్యామి ఆయా సమయములలో ,ఆయా రూపములలో ప్రకటిత మగుచూయుండును. భక్తులకు దర్శన భాగ్యము, స్పర్శ ప్రేమాలాపములు మున్నగు వాటి ద్వారా సౌఖ్యమును అందచేస్తూ, వారిని ఉద్ధరిస్తూ సమయాన్ని బట్టి సర్వాంతర్యామి మానవ శరీరములో కూడా అవతరిస్తూ యుండును.
ఈ విషయము కేనోపనిషత్తులోను, భగద్గీతలోను చెప్పబడింది. దేశకాలమాన పరిస్థితులను బట్టి సర్వాంతర్యామి సంబంధమును కలిగియుండును. సర్వాంతర్యామి ఏరకముగా నిర్గుణుడై నిరాకారుడనబడుచున్నాడో అదే రకముగా సగుణుడై సాకారుడనబడుచున్నాడు. ఈ విషయము మాండూక్యోపనిషత్తులో సర్వాంతర్యామి నాలుగు పాదములు వర్ణింపబడి విషయము తేటతెల్లమగుచున్నది.
అనుస్మతేర్చాదరిః!
పరబ్రహ్మ పరమేశ్వరుడు దేశకాలాతీతుడు. నిరంతరము భజనచేయుట, ధ్యానము చేయుట, స్మరణ చేయుట అనునవి దేశవిశేషమును బట్టి సర్వసమర్థుడైన విరాట్ స్వరూపమునకు విరోధము కాదు. అతని భక్తులు ఏ ఏరూపములలో ఉపాసించినను ఆయా రూపములలో యున్న సర్వాంతర్యామి వారిని కరుణించును.
సంపత్తేరితి జైమినిస్తథా హి దర్శయతి!
ఆచార్యుడైన జైమిని కథనము ప్రకారము పరబ్రహ్మ పరమేశ్వరుడు అనంతాశ్వైర్య సంపన్నుడు, నిర్వికారుడు, నిరాకారుడు, దేశకాలాతీతుడు.
ఆమనంతి చైనమస్మిన్!
ఈ వైదిక సిద్ధాంతము ప్రకారము సర్వ వ్యాపకుడైన , సర్వశక్తిమంతుడైన, అందరిలో స్థితమైయున్న, సర్వ సమర్థుడైన పరబ్రహ్మ మహేశ్వరున్ని జ్ఞానజనులు కనుక్కుంటారు. సర్వ వ్యాపకుడైన సర్వాంతర్యామి అన్ని దేశాలలో సర్వకాల సర్వావస్థల యందు విద్యమానమైయున్నాడు
బ్రహ్మ సూత్రాలు-14

Posted On:6/10/2014 1:08:59 AM

ద్యుభ్యాసద్యాయతనం స్వశబ్దాత్!
ఈ మంత్రములో అత్యున్నతమైన స్వర్గం, దిగువన పథివి మున్నగు వాటికి ఆధారభూతమైనవాడు పరబ్రహ్మ పరమేశ్వరుడేయని తెలియుచున్నది. జీవాత్మ కాని ప్రకతి కాని కాదని తెలియుచున్నది.

ముక్తోపసప్యవ్యపదేశాత్!
ఏ రకముగా ప్రవహిస్తున్న నదులు తమ పేర్లను, రూపాలను వదిలిపెట్టి సముద్రములో లీనమగునో అదేరకంగా మహాత్ములైన జ్ఞానులు తమ పేర్లను, రూపాలను వదిలిపెట్టి ఉత్తమ దివ్య పురుషుడైన పరమాత్మను చేరుకొందురు. పరమ పురుషుడైన పరమాత్మను చేరుకొనుటకు ముక్త (జ్ఞాన) పురుషులు యోగ్యులని తెలియవచ్చుచున్నది.

ప్రాణభచ్ఛ! ః ప్రాణధారీ జీవాత్మ కూడా ద్యులోకము మున్నగు వాటికి ఆధారము కానేరదు.

భేద వ్యపదేశాత్!
జ్ఞాతవ్యమైన ఆత్మ హదయ గుహయందు యున్నది అని చెప్పుట చేత జీవాత్మ కంటే పరమాత్మ వేరని అర్థమగుచున్నది. అందుచే ద్యులోకాదులకు ఆధారము పరమాత్మయని తెలియుచున్నది.

ప్రకరణాత్!
ఈ ప్రకరణమునకు ముందు వెనుకల యున్న మంత్రముల ప్రకారము పరమాత్మను సర్వాధారుడని, సమస్తమునకు కారకుడని, సర్వజ్ఞుడని,సర్వశక్తిమంతుడని చెప్పి జీవాత్మకు కూడా ప్రాప్తవ్యుడని చెప్పబడింది. దీనివలన జీవాత్మ, పరమాత్మ భిన్నమని తెలియచున్నది. అందువలన సమస్తమునకు ఆధారభూతుడు పరబ్రహ్మ మాత్రమేయని తెలిసికోవలెను.

స్థిత్యదనాభ్యాం చ!
ముండకోపనిషత్తులో, శ్వేతాశ్వతరోపనిషత్తులో పేర్కొన్న ప్రకారము పరస్పరము సఖ్య భావముతో యున్న రెండు పక్షులు (జీవాత్మ- పరమాత్మ) ఒకే వక్షమును ఆశ్రయించుకొని యుండేవి. అందులో నుంచి ఒక పక్షి (ఆత్మ) సుఖదుఃఖముల సమ్మిశ్రిత ఫలితాన్ని అనుభవి స్తూ ఉంటుంది. కాని రెండవ పక్షి (పరమాత్మ) ఏమీ తినకుండా కేవలం చూస్తూ ఉంటుంది. ఈ వర్ణనలో కర్మఫల భోక్తగా జీవాత్మను, సాక్షీరూప స్థితిలో ఉండే పరమాత్మను గురించి చెప్పబడింది. ఈ రకముగా ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసము స్పష్టమవుతోంది. ద్యులోకము, పథివి మున్నగు సమస్త జడ చేతనాత్మక జగత్తు ఆధారము పరబ్రహ్మ పరమేశ్వరుడని నిరూపితమగుచున్నది.
(యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి

బ్రహ్మ సూత్రాలు-15

Posted On:6/11/2014 12:45:14 AM

భూమా సంప్రసాచాదధ్యుపదేశాత్!
ఇందులో పేర్కొనబడిన భూమాయే బ్రహ్మం యై యున్నది. ఒకటి కంటె ఒకటి పెద్దదనే విషయము స్పష్టం చేస్తూ ఈ సమస్త జగత్తు ప్రాణమును ఆశ్రయించియున్నదని చెప్పారు. ప్రాణమే ప్రాణము నుండి గమనము చేయుచున్నది, ప్రాణమే ప్రాణము నిచ్చును, ప్రాణమే తండ్రియైయున్నది, ప్రాణమే తల్లియైయున్నది. ప్రాణము సోదరుడై, సోదరియై, ఆచార్యుడై, బ్రాహ్మణుడై అలరారుచున్నది. దీనివలన నిరూపితమగునదేమనగా ఇచ్చట ప్రాణము ఆధారముగా జీవాత్మ యొక్క వర్ణన జరిగింది. ఈ విషయము వినిన నారదుడు అన్నింటికన్నా పెద్దది జీవాత్మయని భ్రమపడి మౌనముగా ఉన్న తరుణంలో విషయాన్ని గ్రహించిన సనత్కుమారుడు వాస్తవము చెప్పతొడగెను. బ్రహ్మం అంశాన్ని కదిపి నారదునితో సత్యతత్త్వమును రేకెత్తించి, జిజ్ఞాసను కలుగచేసి సాధన రూపాలైన విజ్ఞానము, మననము, శ్రద్ధ, నిష్ఠ మరియు క్రియలను గురించి చెప్పెను. చివరగా భూమా గురించి అనగా పరబ్రహ్మ పరమాత్మ గురించి అవగాహన చేయించెను.

ధర్మోపపత్తేశ్చ!:-భూమా గురించి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన ప్రకారము అది ఎవరిని చూడలేదు, వినలేదు, తెలిసుకోలేదు అదియే భూమాయైయున్నది. అన్యులను చూడ కలిగినది, విన కలిగినది, తెలిసికో కలిగినది అల్పమైయున్నది. భూమా అమతమైయున్నది, అల్పమునాశనమగునదైయున్నది. ఇది వినిన నారదుడు భూమా ఎందులో ప్రతిష్ఠితమైయున్నదని అడిగెను? దానికి సనత్కుమారుడు ఇలా సమాధానమిచ్చెను-మహిమలో ప్రతిష్ఠితమైయున్నదని అడిగెను? దానికి సనత్కుమారుడు ఇలా సమాధానమిచ్చెను-మహిమలో ప్రతిష్టితమైయున్నదని చెప్పి ఇంకను ఇలా వివరించెను-ధనములో, సంపత్తిలో, ఇంటిలో యున్న మహిమలో భూమా ప్రతిష్ఠింపబడలేదు. భూమా అనునది దిగువన, పైన, ముందు, వెనకాల, కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన ఎల్లెడలా పరివ్యాప్తించియున్నది. ఈ అన్ని ధర్మాల కలయిక పరబ్రహ్మ పరమాత్మకే చెందియున్నది.

అక్షరమంబరాంతధతేః!
అక్షర శబ్దము పరబ్రహ్మ పరమాత్మను సూచించుచున్నది. ఆకాశపర్యంతము సంపూర్ణ జగత్తును ధరించువాడని చెప్పబడినది. గార్గి యాజ్ఞవల్క్యుని ఇలా అడిగెను-ద్యులోకము కంటె పైన, పథ్వి కంటె దిగువన ఈ రెండింటి మధ్యన ఏ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలుయున్నవో, ఆ కాలాలు ఎందులో కలిసి ఉన్నాయి? యాజ్ఞవల్క్యుడు ఇలా ప్రత్యుత్తరమిచ్చెను- ఓ గార్గీ! ఇవన్నీయు ఆకాశములో కలిసి ఉన్నాయి. ఇంకను తన సమాధానము ఇలా పొడిగించెను- ఓ గార్గీ! ఆ తత్త్వమును బ్రహ్మవేత్తలు అక్షరమందురు. అది స్థూలముగా ఉండదు, సూక్ష్మముగా ఉండదు, చిన్నగా ఉండదు, పెద్దగా ఉండదు, ఎరుపుగా ఉండదు, పీలగా ఉండదు. ఈ రకముగా ఈ అక్షరము ఆకాశ పర్యంతము అన్నింటిని ధారణ చేయునని చెప్పెను. అందుకే అక్షరము పేరుతో ఆ పరబ్రహ్మ పరమాత్మను వర్ణించటము జరిగింది కాని వేరెవరిని కాదు.

బ్రహ్మసూత్రాలు-16

Posted On:6/12/2014 1:35:38 AM

సా చ ప్రకాసనాత్!
ఈ అక్షర ప్రశాసనములో సూర్యచంద్రులను ధరించడమే కాకుండా ద్యులోకమును, పథివిని, నిమిషములు, ముహూర్తములు, దివారాత్రములు మున్నగు పేర్లతో పిలువబడు కాలము ను కూడా ధరించి స్థితమైయున్నది. పర్వతముల నుంచి వెలువడిన నదులన్నియు ప్రవహించు మార్గములపై కూడా అక్షరము ప్రభావము ఎంతేని కలదు. కావున అక్షరసత్తమే బ్రహ్మం అని అర్థమగుచున్నది.
అన్యభావవ్యావత్తేశ్చ!
అక్షరమును మనం చూడలేము కాని అదిఅందరిని చూడగలదు, దానిని వినలేము కాని అది అందరిని వినగలదు. మననము చేయుట వలన ప్రత్యక్షమగునది కాదు కాని స్వయముగా మననము చేయగలదు, మనము దానిని తెలిసికోలేము కాని అది మనలను తెలిసికోగలదు. దీని వలన ఋజువగుచునదేమనగా అక్షర నామము పరబ్రహ్మ ప్రతిపాదితమని తెలియుచున్నది.
ఈక్షతి కర్మవ్యపదేశాత్ సః!
మూడు మాత్రలు గల ఓం అక్షరము పరమ పురుషున్ని నిరంతరము ధ్యానించుట వలన తేజోమయ సూర్యలోకమునకు వెళ్ళగలరు. ఏరకముగా సర్పము తన కుబుసము విడిచి అత్యంత సౌకర్యముగా వెళ్లిపోవునో అదే రకముగా మానవుడు పాపముల నుంచి విముక్తుడగు ను. ఆ పిదప సామవేదము శత్రుల ద్వారా పైనున్న బ్రహ్మలోకమునకు తీసికెళ్లబడును. ఈ మంత్రములో చెప్పబడిన మూడు మాత్రలతో సంపన్నమైన ఓంకారము ధ్యేయము తెలుపబడింది, అది పూర్ణ బ్రహ్మ పరమాత్మయని తెలిసికొనుము.
దహర ఉత్తరేభ్యః!
మానవ శరీరములో కమల పుష్ప ఆకారములో ఒక ఇల్లు ఉన్నది. దానినే హదయమందు ము, అందులో సూక్ష్మ ఆకాశము ఉన్నది. అదియే దహకారశమనబడుతుంది. దహర్ అను శబ్దము పరబ్రహ్మ పరమేశ్వరున్ని సూచిస్తుంది. ఎందుకనగా అందులో బ్రహ్మాండమంత్రయు నిహితమైయున్నది. ఇంకను ఇలా చెప్పబడింది. ఈ ఆత్మ పాపరహితమై, జరా మరణములు లేక, శోకశూన్యమై, ఆకలిదప్పులు లేక సత్యసంకల్పమైయున్నది. ఇంకను ఈ ఆత్మ అమతమై, అభయమై, బ్రహ్మమైయున్నది. దీనినే సత్యమందుము. అందువలన దహర్ అనునది బ్రహ్మమునకు సంకేతమై యున్నది.
ధతేశ్చ మహిమ్నో స్యాస్మిన్నుపలబ్దేః!
ఇది ఆత్మయైయున్నది.అన్ని లోకములను ధరించుటకు సేతువైయున్నది. దహర్ అను శబ్ద ము మహిమాన్వితుడైన పరమేశ్వరునికి సంకేతమై యున్నది.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)


బ్రహ్మసూత్రాలు-17
Posted On:6/12/2014 11:42:02 PM


గతి శబ్దాభ్యాం తథా దష్టం లింగం చ!
ఈ జీవ సముదాయము ప్రతిదినము సుషుప్త కాలములో బ్రహ్మ లోకమునకు వెళ్లెదరు. కాని వారు అసత్యముతో ఆవతమై ఈ విషయాన్ని తెలిసికోలేరు. ప్రతిదినము బ్రహ్మలోకమునకు వెళ్లుచున్నారని చెప్పుటలో అది గతిని తెలుపుతుంది. అందువలన దహర్ అనునది బ్రహ్మమునకు సంకేతమైయున్నది.
ప్రసిద్ధేశ్చ! శ్రుతులలో దహరాకాశము అను పేరు దొర్లినది. ఆకాశము అను శబ్దము పరమాత్మ అర్థములో ప్రసిద్ధమైయున్నది. తైత్తరీయోపనిషత్తులో పేర్కొన్న ప్రకారము ఈ ఆనంద స్వరూప ఆకాశము లేకపోయిన యెడల ఎవరు కూడా జీవించి యుండేవారు కాదు. అందుకని కూడా దహర్ అను శబ్దము పరబ్రహ్మ పరమాత్మకు సంకేతమైయున్నది.

ఇతర పరామర్శాత్ స ఇతి చెన్నాసంభవాత్!
ఈ ఆత్మ పుణ్యపాపరహితమై , జరామరణ శూన్యమై, శోకహీనమై, ఆకలిదప్పులు లేక సత్య సంకల్పమైయున్నది. దేహమునకు వార్థక్యము వచ్చిన దానికి రాదు. దేహము నాశనమైనను దానికి మరణము లేదు. ఈ ప్రకారము జీవాత్మను లక్ష్యముగా చేయు సంకేతములు లభించినను జీవాత్మ దహర నామమని చెప్పుట సరికాదు. సత్యసంకల్పాది లక్షణములు జీవాత్మయందు సంభవము కాదు. కావున దహర శబ్దము పరబ్రహ్మ వర్ణనయని తెలియుచున్నది.
ఉత్తరాచ్ఛేదావిర్భూత స్వరూపస్తు!
ఒక్కో తావులో ఆత్మను అమతమని, అభయమని బ్రహ్మం అని ఆచార్యులు చెప్పియున్నారు. అంతమాత్రాన పరబ్రహ్మను ఉపయోగించిన పదాలు రాయటం వలన ఆత్మనే దహర మందుమని నిర్ధారణ చేయలేము. అవి కేవలము విశేషణములు మాత్రమేయై యున్నవి.

అన్యార్థశ్చ పరామర్శ!
పూర్వ మంత్రములో చెప్పబడిన విశేషణములు జీవాత్మ ఆ గుణములను సంతరించుకోవాలనే ఉద్దేశముతో భావప్రకటన కొరకు వర్ణింపబడినవి. పరబ్రహ్మ జ్ఞానము కలుగుట వలన అనేక దివ్యగుణములు జీవాత్మలో వచ్చిచేరుతాయి. ఈ విషయము భగవద్గీతలో చెప్పబడింది. ఆయినను దహర్ అను శబ్దము బ్రహ్మవాచకమై యున్నది.
అల్పశ్రుతేరితి చెత్తదుక్తమ్!
శ్రుతులలో దహరాకాశమును (హదయాకాశమును ) అత్యంత చిన్నదిగా చెప్పబడింది. అందువలన అది జీవాత్మయని అణువని భ్రమపడటం సమంజసమైన విషయము కాదు. ఇది పూర్వ మంత్రములో తేటతెల్లము చెప్పబడినది.
కారణత్వేన చాకాశాదిషు యథాద్యపదిష్టోక్తేః!
వేదములో పేర్కొన్న ప్రకారము జగత్తు సష్టికి అనేక కారణముల వర్ణన ఉన్నప్పటికిన్ని చివరకు పరబ్రహ్మనే ప్రధానకారణమని చెప్పుటలో సందేహం లేదు. జగత్తు సష్టికి ఆకాశమే కారణమని చెప్పినప్పటికిన్ని ఆకాశము కూడా బ్రహ్మంకు లోబడి ఉన్నదని తెలిసికోవలెను.
సమాకర్షాత్!
తైత్తరీయోపనిషత్తు ప్రకారము మొదట జగత్తు అసత్‌గానే యుండెను. అందులో నుండియే సత్ ఉత్పన్నమాయెను. ఇచ్చట అసత్ అనగా అప్రకటిత బ్రహ్మం, సత్ అనగా ప్రకటిత బ్రహ్మం. బహదారణ్య కోపనిషత్తులో , ఛాందోగ్యోపనిషత్తులో అసత్ అనగా అవ్వాకతమను శబ్దము వాడబడింది. అయినను దాని పర్యాయ పదము అప్రకటితమని గమనించవలెను.
జగద్వాచిత్వాత్!
కౌషతకీ బ్రాహ్మణోపనిషత్తులో అజాతశత్రువుకు బాలాకికి మధ్యన సంవాదము జరిగెను. సూర్యునిలో ఉన్న పురుషున్ని ఉపాసిస్తాను అని ప్రారంభించి బాలాకి చివరకు, ఎడమ కంటిలో ఉన్న పురుషున్ని కూడా ఉపాసిస్తాను అని మొత్తము షోడశ పురుషులను ఉపాసిస్తానని చెప్పెను. అజాత శత్రువు ఆ మాటలనన్నింటిని ఖండించి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తానని చెప్పెను. ఈ పదహారు కళల పురుషుల కర్త బ్రహ్మమని చెప్పెను. కర్మలు, కార్యములు అను శబ్దములు జడ చేతనాత్మక సంపూర్ణ జగత్తుకు వాచకములై యున్నవి. కావున పరబ్రహ్మ పరమేశ్వరుడే అన్నింటికి కారణమై యున్నాడు.
జీవ ముఖ్య ప్రాణలింగాన్నేతి చెత్తద్ వ్యాఖ్యాతమ్!
జీవుడే జగత్తు కర్త, జ్ఞేయుడు, బ్రహ్మం కాదు అని అనిన యెడల అది వాస్తవము కాదు. బ్రహ్మం అన్ని ధర్మాలకు ఆశ్రమయై యున్నాడు. ఒకవేళ జీవుడు కూడా జ్ఞేయతత్తము కలవాడు అనుకున్న పక్షములో త్రివిధ ఉపాసనల ప్రసంగము ఆవిర్భవిస్తుంది. కావున అది ఉచితమైనది కాదు.
అన్యార్థం తు జైమినిః ప్రశ్నవ్యాఖ్యానాభ్యామపి చైవమేకే!
ఆచార్యుడైన జైమిని పూర్వమంత్రంలో పేర్కొన్న అంశాన్ని చక్కదిద్దారు. జీవాత్మను జగత్తుకు కారణమని చెప్పటంలో లౌక్యము దాగొని ఉంది. జీవుడు సుషుప్తావస్థలో బ్రహ్మంలోనే లీనమై ఉంటాడు. అలాగే ఉత్తత్తి జరిగినప్పుడు జాగ్రదావ్యస్థలోకి వస్తాడు. దీనికి కారణము బ్రహ్మమే అనునది నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని కాణ్వశాఖ వారు కూడా సమర్థించారు.

బ్రహ్మసూత్రాలు-18

Posted On:6/14/2014 12:45:48 AM

అనుకతేస్తస్య చ!

మానవ హదయము యొక్క కొలత అంగుష్ఠమాత్రమని చెప్పుకోబడింది. అందులో జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ప్రవేశించాడని శ్రుతులలో చెప్పబడింది. శుభకర్మల ఫల రూపముగా మానవ శరీరములో పరబ్రహ్మ యొక్క నివాస స్థాన రూప హదయాకాశము యొక్క అంతర్గతము నందు బుద్ధిరూప గుహలో దాగొనియున్న సత్యమును ఆస్వాదించు వారిద్దరు జీవాత్మ మరియు పరమాత్మయై యున్నారు. ఈ భావమును తీసికొని వేదములలో అనేకచోట్ల పరమాత్ముని యొక్క స్వరూపము సూకా్ష్మతి సూక్ష్మమైనదిగా, అత్యంత పెద్దదైన దానికంటే పెద్దదిగా చెప్పబడింది.
అపిచస్మర్యతే!

పరబ్రహ్మ పరమేశ్వరుడు అందరి హదయాలలో ఉన్నాడు మరియు సూకా్ష్మతి సూక్ష్మమైయున్నాడని ఆయాచోట్ల భగవద్గీతలో పేర్కొనబడింది. అందుకని దహర్ అను శబ్దము పరబ్రహ్మ పరమేశ్వరుని యొక్క వర్ణనయై యున్నది. అది జీవాత్మది కాదు.
శబ్దాదేవ ప్రమితః!

అంగుష్ఠమాత్ర పరిమాణము గల పురుషుడు పరమాత్మయేయైయున్నాడు. ఈ అంగుష్ఠ పరిమాణము గల పరమ పురుషుడు శరీర మధ్య భాగములో అనగా హదయములో స్థితమైయున్నాడు. ధూమరహితుడై జ్యోతి వలె ప్రకాశించు ఆ పరమ పురుషుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను శాసించువాడైయున్నాడు. అంగుష్ఠమాత్ర పరిమాణము గల పురుషుడు పరబ్రహ్మ పరమాత్మయేయైయున్నాడు. నేడు కలడు, రేపు ఉండగలడు మరియు సనాతనుడని పిలువబడుచున్నాడు.
హద్యపేక్షయా తు మనుష్యాధికారత్వాత్!

ఉపనిషత్తులలో వర్ణించిన ప్రకారము బ్రహ్మ విద్య ద్వారానే బ్రహ్మంను తెలిసుకునే అధికారము మానవులకు మాత్రమే ఉన్నది. పశుపక్ష్యాదులు పరబ్రహ్మ పరమాత్మను తెలుసుకోలేరు.
తదుపర్యపి బాదరాయణః సంభవాన్!

పశుపక్ష్యాదులు ఎలాగూ వేదాలను చదువలేవు. కావున ఆ ప్రసక్తి అనవసరము. దేవతలు మానవుల కంటే ఉన్నతులు. ఏ మానవులైతే ధర్మనిరతి కలిగి, శ్రేష్ఠమైన జ్ఞానమును సముపార్జించెదరో వారు దేవయోనులను ప్రాప్తించుకొందరు. కావున వారు పూర్వజన్మలో అభ్యసించిన బ్రహ్మవిద్య వారిలో ఎలాగూ ఉంటుంది. అందుకని సాధన ద్వారా వారికి బ్రహ్మజ్ఞానము అలవడే అవకాశముంది. ఈ విషయము భగవానుడైన బాదరాయణుడు ఇలా చెప్పెను. మానవుల కంటే ఉన్నతమైన దేవతలకు కూడా బ్రహ్మజ్ఞానము ప్రాప్తించుకునే అధికారం కలదు.
(యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)

బ్రహ్మసూత్రాలు-19

Posted On:6/17/2014 1:14:44 AM

విరోధః కర్మణీతి చెన్నానేక ప్రతిపత్తేద్దర్శనాత్!
మానవుల వలె దేవతలు కూడా శరీరధారులైన పక్షములో ఏదో ఒక దేశమునకు పరిమితమై యుండేవారు. కాని యజ్ఞములలోని హవిస్సును ఏదో ఒక రూపంలో వచ్చి తీసుకునే శక్తి కలిగియున్నారు. బహదారణ్యక ఉపనిషత్తులోని ఈ సంవాదమును గమనించండి.
శాకల్యుడు: దేవతలు ఎంత మంది?
యాజ్ఞవల్క్యుడు: మూడు, మూడువందలు, మూడు మరియు మూడువేలు.
శాకల్యుడు: ఎంతమంది దేవతలు?
యాజ్ఞవల్క్యుడు: ముప్పదిమూడు.
శాకల్యుడు మళ్ళీ మళ్ళీ అడుగగా యాజ్ఞవల్క్యుడు ఇలా చెప్పెను. మహిమ చేత ఒక్కరే అనేకులుగా మారుతారు. వాస్తవానికి ముప్పది మూడు మంది దేవతలు కలరు. యోగులలో కూడా ఇది సంభవమవుతుంది. ఇందులో విరోధము లేదు.

శబ్ద ఇతి చెన్నాతః ప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యామ్!
ఒకవేళ దేవతలు శరీరధారులైన పక్షములో వారికి జనన మరణాదులు ఉంటాయని ఒప్పుకోలసి వస్తుంది. అలాంటిప్పుడు వారు నిత్యులు కాదని తెలుస్తోంది. వైదిక శబ్దాలతోపాటు పేర్లు, రూపాలు నిత్యము సంబంధం కలిగి యుండలేరు
ఈ సందేహము చేయనవసరములేదు. ఎందుకంటే కల్పాదిలో దేవతల ఉత్పత్తి వర్ణన వచ్చింది. అచ్చట ఏమి చెప్పబడింది. అంటే ఏ రూపము, సంపద ఉన్న దేవతకు ఏ పేరు ఉండగలదు. ఈ రకముగా వేదోక్త శబ్దముతో మాత్రమే వారి పేర్లు, రూపాలు, సంపదలు మొదలగునవి. కల్పన చేయబడినవి, అనగా కల్పాదిలో ఎంతమంది దేవతలుండిరి. ఏ ఏ పేర్లతో ఉం డిరి, ఏఏ సంపదలతో ఉండిరో, వర్తమాన కల్పములో కూడా అంతే మంది దేవతలు, అలాంటి పేర్లు, రూపాలు, సంపదలయుక్తముగా ఉత్పన్నము చేయబడతారు. దీనివలన తెలిసిదేమంటే కల్పాంతములో దేవతలు మారినప్పటికిన్ని పేర్లు, రూపాలు పూర్వ కల్పము మేరకే అనుసరించబడును. శ్రుతులలో, స్మతులలో ఈ విషయము ఇలా చెప్పబడింది. ప్రజాపతి మొదట భూః అని ఉచ్ఛరించి భూమిని సష్టించెను. ఈ తరువాత మనస్సులోనే భువః అని ఉచ్ఛరించి అంతరిక్షమునకు సష్టించెను.

సమాననామ రూపత్వాచ్చావతావప్య విరోధో దర్శనాత్ స్మతేశ్చ!
వేదములో చెప్పిన ప్రకారము జగత్ స్రష్టయైన పరమేశ్వరుడు సూర్యచంద్రాదులు మొదలగు వాటిని సష్టించెను. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకారము పరమేశ్వరుడు నిశ్చయముగా సష్టి కాలములో ప్రప్రథమంగా బ్రహ్మను సష్టించి వేదోపదేశము చేసెను. దేవతల పేర్లు, రూపము లు వేద వచనానుసారము రచింపబడుతాయి. కావున వారు పదే పదే ఆ వత్తి చెందనను వేద ము నిత్యత, ప్రామాణికతలో ఎలాంటి విరోధము రాదు.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)

బ్రహ్మసూత్రాలు-20
Posted On:6/18/2014 1:37:39 AM

మధ్వాద్విష్వ సంభవాదనధికారం జైమినిః!
ఆచార్యుడైన జైమిని ప్రకారం సూర్యుడు దేవతల మధువైయున్నాడు. మానవులు మాత్ర ము సాధన ద్వారా పొందవలసియుంటుంది. దేవలోకములోని భోగములు పొందుటకు మానవులు యజ్ఞ యాగాదులు చేయవలసి యుండును కాని దేవతలకు స్వతః సిద్ధముగా లభించును. ఈ రకముగా మధు విద్య కాని, యజ్ఞాది కర్మలపై కాని, బ్రహ్మ విద్యయందు కాని దేవతలకు అధికారము లేదని జైమిని అభిప్రాయమైయున్నది.
జ్యోతిషి భావాచ్చ!

దేవతలు సర్వకాల సర్వావస్థల యందు జ్యోతిర్మయమైన దేవలోకములో ఉంటారు. అన్నిరకముల భోగములు, సంపద వారి స్వంతం కాబట్టి వారు ప్రత్యేకంగా ఆయా కర్మలు చేయవలసిన అవసరం లేదు.
భావం తు బాదరాయణో స్తిహి!

ఆచార్యుడైన బాదరాయణుడు తన సిద్ధాంతమును దఢతాపూర్వకముగా తు (కాని) అను అ వ్యయ పదము ద్వారా తెలుపుతూ సమర్థించుకుంటూ ఇలా అనెను- జైమిని సిద్ధాంతము వేదములలో ఎచ్చటనూ కానరాదు.కావున ఆది ప్రామాణికమైనది కాదు. నిశ్చయముగా యజ్ఞా ది కర్మలలోను, బ్రహ్మ విద్యను అర్జించటంలోను దేవతలకు అధికారము కలదు. వేదములో దేవతలకు ఆధికారము కలదనే అంశం లభిస్తుంది.ప్రజాపతిర్ కామయత్ ప్రజాయేయేతి స ఏతదగ్ని హోత్రం మిథున్ మవశ్యత్ తదుదితే సూర్యోజుహోత్!ఇంకను దేవా వైసత్రమాసత్! అనగా ప్రజాపతి జన్మించెదను అని అనుకొనినాడు. అగ్నిహోత్ర మథనమును చూసి సూర్యోదయము వేళ ఆయన హవనము చేసినాడు. దీనివలన దేవతలు యజ్ఞము ననుష్టించినట్లు తెలియుచున్నది.వారికి కర్మాధికారమున్నట్లు సూచితమైనది. దేవతలలో ఎవరు బ్రహ్మంను తెలిసికున్నారో వారే బ్రహ్మం అయినారు.
ఒకమారు ఇంద్రుడు, విరోచనుడు బ్రహ్మం సేవలో యుండి చాలా సంవత్సరముల వరకు బ్రహ్మచర్య పాలన చేసిన పిదప బ్రహ్మవిద్యను పొందిరి. ఈ ప్రమాణములతో సిద్ధించునదేమనగా దేవతలు కర్మ చేయుటకు బ్రహ్మవిద్యను పొందుటకు అధికారము కలిగి యున్నారు.
క్షత్రియత్వావగతేశ్చోత్తరత్ర చైత్రరథేన లింగాత్!


జనశ్రుత రాజు అధికముగా దానము చేయువాడనియు అతిథి అభ్యాగతులను సత్కారము చేయువాడనియు చివరకు తన కూతురును రైక్యునకిచ్చి పెళ్లి చేసెననే విషయాన్నియు జనశ్రుత రాజు క్షత్రియుడని నిరూపించుచున్నవి. ఒకసారి శౌనకునికి , చైత్రరథునికి జనశ్రుత రాజుతో ఏర్పాటు చేసిన పంక్తి భోజనము ద్వారా జనశ్రుతుడు క్షత్రియుడని తెలియుచున్నది. శూద్రజాతికి వేదవిద్యయందు అధికారము లేదనే ధ్వని వచ్చుచున్నది.

బ్రహ్మసూత్రాలు-21
Posted On:6/19/2014 1:44:15 AM
శుగస్య తదనాదర శ్రవణాత్తదాద్రవణాత్ సూచ్యతే హి!
రైక్వ ముని రాజైనటువంటి జన శ్రుతున్ని శూద్రుడని సంబోధించెను. వాస్తవానికి జనశ్రుతుడు శూద్రుడు కాదు. రైక్వుని అభిప్రాయము మేరకు శోకముతో వ్యాకులత చెందిన వారిని శూద్రులని అందురు.
రాజైన జనశ్రుతుడు శ్రద్ధపూర్వకముగా చాలా ధనము దానము చేసెడివాడు. అతిథుల కొరకు భోజనము సిద్ధముగా ఉంచెడివాడు. వారి కొరకు అనేక విశ్రామాలయాలు నిర్మాణము చేసియుండెను. ఒక దినము రాజు రాజభవనముపై రాత్రిపూట కూర్చొనియుండెను. ఆ సమయంలో ఒక హంసల గుంపు ఆకసమున ఎగురుతూ వెళ్లుచుండెను. అందులో నుంచి ఒక హంస మరొక హంసను ఎలుగెత్తి పిలిచి ఇలా అనెను- అదిగో సావధానముగా యుండుము, జనశ్రుతి రాజు మహిమాన్వితమైన తేజస్సు ఆకాశములో వ్యాప్తించియున్నది. పొరపాటున దానిని తాకిన యెడల భస్మమై పోగలము జాగ్రత్త అనెను. ఈ విషయము వినిన తోటి హంస పక పక నవ్వి ఇలా అనెను- ఎవరి గురించి ఎవరి మహత్మ్యము గురించి నీవింతగా మాటలాడుచున్నావు, ఈ రాజు బండితోలె రైక్వునంతటి వాడనుకొంటివా ఏమి?
ఈ రైక్వుడెవరో నాకు తెలియదు అని మొదటి హంస అనగానే రెండవ హంస ఇలా చెప్పెను. ఈ ప్రజలు చేసే శుభకార్యాల ఫలితము రైక్వునికి చెందుతుంది. ఏ తత్తమైతే రైక్వునికి తెలియునో అది ఇంకెవరు తెలిసికున్నను వారు కూడా మహిమాన్వితులు కాగలరు.
ఈ రకముగా హంసల ద్వారా తన అల్పత్వాన్ని తెలిసికొని రాజు మనస్సులో శోకమా వహించెను. ఆ పిదప తన సైనికుల ద్వారా రైక్వుడెక్కడున్నాడో తెలిసికొని విద్యాగ్రహణము చేయుటకు రైక్వుని చెంతకు వెళ్లెను. రైక్వముని సర్వజ్ఞుడు కావటం చేత రాజు మానసిక స్థితిని గమనించెను. రాజులో అంతర్గతంగా దాగొనియున్న ఈర్ష్యాభావమును పారదోలి శ్రద్ధాసక్తులను కలిగించుటకు తన సర్వజ్ఞతను సూచిస్తూ రాజును సావధానముగా శుద్రా అని పిలిచె ను. జనశ్రుత రాజు క్షత్రియుడని తెలిసి కూడా శూద్రుడని అనెను. ఎందుకనగా శోకము అవరించిన రాజు పరిగెత్తుకుంటూ వచ్చెను. దీనివలన వేదవిద్యలో శూద్రునికి అధికారము ఉన్నద ని రుజువు కాదు.
తద్‌భావ నిర్థారణే చ ప్రవత్తేః!
సత్యకామ జాబాలుడు గౌతముని దగ్గరకు వెళ్లి సేవ చేయుటకు అనుమతి అడిగెను. నీ గోత్రమేమిటని గౌతముడు అడుగగా సత్యకామ జాబాలుడు తెలియదనెను. ఇంకను ఇలా వివరించెను- ఈ విషయము నేను నా తల్లిని అడుగగా తెలియదని చెప్పి, నాపేరు జాబాలా, నీ పేరు సత్యకాముడు ఆ రకముగా నీవు సత్యకామ జాబాలుడు వైతివి. ఇదంతయును వినిన గౌతముడు బ్రాహ్మణుడు తప్ప ఇంకెవరును సత్యమును చెప్పరని గ్రహించి శిష్యునిగా స్వీకరించెను.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)
బ్రహ్మ సూత్రాలు- 22
Posted On:6/20/2014 12:08:30 AM
శ్రవణాధ్యయనార్థ ప్రతిషేధాత్ స్మతేశ్చ!
శ్రుతులలో వేదాధ్యయనము, అర్థజ్ఞానము, శ్రవణము మున్నగునవి శూద్రులకు నిషేధమని చెప్పబడినది. ఇతిహాసములో విదురుడు మున్నగు శూద్రులు సత్పురుషులై జ్ఞానము ప్రాప్తించుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. దీనివలన తెలియునదేమంటే ఇతిహాసము, పురాణాలు చదువుట, వినుట అనునవి నాలుగు వర్ణముల వారికి సమానమైన అధికారము కలదు. ఇతిహాస పురాణాల ద్వారా పరమాత్మ తత్తము జ్ఞానము ప్రాప్తించుకోవచ్చును. ఆ రకముగా భక్తి జ్ఞానముల ఫల ప్రాప్తి లభించును. భగవద్గీతలో పేర్కొనిన ప్రకారము భగవానుని భక్తి ద్వారా కొలుచుట ద్వారా మానవులెల్లరు పరమగతిని పొందు అధికారము కలిగియున్నారు.
కంపనాత్!
అంగుష్ఠమాత్ర పురుష రూప పరమాత్మ ప్రభావ వర్ణన జరిగింది. పరమాత్మ నుంచి ఉద్భవించిన ఈ సంపూర్ణ జగత్తు ఆ ప్రాణ స్వరూపుడైన బ్రహ్మంలోనే వ్యవహరించుచుందురు. వజ్ర సమాన మహత్తు కలిగి, భయానక శక్తిమంతుడైన పరమేశ్వరున్ని ఎవరు తెలిసికుంటారో వారు అమరులగుదురు. భయానక శక్తిమంతుడని ఎందుకన్నామంటే ఈ భయము చేతనే అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. సూర్యుడు వెలుగునిస్తున్నాడు. ఇంద్రుడు, వాయువు మత్యుదేవత తమ తమ పనులలో నిర్విరామముగా కషి చేయుచున్నారు. ఈ వర్ణన ద్వారా తెలియునదేమనగా అంగుష్ఠ మాత్ర పురుషుడు బ్రహ్మంయై యున్నాడు.
జ్యోతిర్దర్శనాత్!
దహరాకాశము (హదయాకాశము) గురించి వెనుకటి ప్రకరణములో చెప్పుకొనియున్నాము. జీవాత్మ శరీరం నుంచి వెడలి పరమజ్యోతిలో కలిసి తన స్వరూపమును సంపన్నము చేసికొనును. ఇందులో పేర్కొనబడిన జ్యోతి పరబ్రహ్మ పరమాత్మకు మాత్రమే వాచకమైయున్నది. ఎందుకనగా శ్రుతులలో పలుచోట్ల బ్రహ్మం అర్థములో ఈ శబ్ద ప్రయోగము జరిగింది.
ఆకాశోర్థాంతరత్వా దివ్యపదేశాత్!
ఆకాశమును పేరుతో ప్రసిద్ధమైన తత్తము పేరు, రూపము ఎందులో నిబిడీకతమై యుండునో అదియే బ్రహ్మం, అమతము, ఆత్మయైయున్నది. ఇచ్చట ఆకాశము అనగా భూతాకాశము కాదు. భూతాకాశ యుక్త సమస్త జడ చేతన జగత్తును తనలో ధారణ చేసికునే పరబ్రహ్మ పరమాత్మను ఆకాశము అను పేరుతో వ్యవహరిస్తున్నాము.




సుషుప్త్యుత్రాంత్యో భేదేన్! పురుషుడు నిదురించినప్పుడు సుషుప్తావస్థలో సత్‌లో సంపన్నమవుతాడు. జీవాత్మను పురుషుడని పరమాత్మను సత్ అని భేదపూర్వకముగా వివరింపబడింది. అలాగే సంప్రసాద మను పేరుతో జీవాత్మను, పరమజ్యోతి పేరుతో పరమాత్మను భేదపూర్వకముగా నిరూపించనైనది. 
బ్రహ్మసూత్రాలు-23
Posted On:6/21/2014 1:21:08 AM
అనుమానిక మష్యేకేషామితి చెన్న శరీరరూపక విన్యస్త
గహీతేర్దర్శయతి చ!
అవ్యక్తమను పదము అనుమాన కల్పితమై లేక సాంఖ్య ప్రతిపాదిత ప్రకతి వాచకమై యున్నదనే విషయము సరియైనదికాదు. ఎందుకనగా ఆత్మ, శరీరము,బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, విషయ వాసనలు మొదలగు వాటిని రథములోను, రథితోను, సారథి మున్నగు వాటితోను కల్పన చేయబడింది. అందులో రథము స్థానములో శరీరము చెప్పబడింది. ఇచ్చట అవ్యక్త మనునది దానికే వాడబడింది.
కఠోపనిషత్తులో పేర్కొన్న దాని ప్రకారము ఆత్మను రథికులుగా, శరీరమును రథముగా, బుద్ధిని సారథిగా, మనస్సును కళ్లెముగా, ఇంద్రియములను అశ్వములుగా , విషయ వాసనలను అశ్వముల గ్రాసముగా చెప్పబడింది. ఈ ఉపకరణముల ద్వారా పరమపద స్వరూప పరమాత్మను ప్రాప్తించుకొనుటకు ఉపయోగకరములని తెలుపబడింది. ఇంద్రియముల కన్నను విషమ వాసనలు బలవత్తరమైనవని తెలుపబడింది. ఏరకముగా గడ్డి గాదము ఇతర తిను పదార్థములను చూసి అశ్వములు హఠాత్తుగా అటువైపు మరలునో అదేరకముగా ఇంద్రియములు కూడా విషయ వాసనలు వైపు మరలును.
విషయవాసనల కంటె గొప్పది మనస్సు స్థితి, ఎందుకంటే సారథి కళ్లెము బిగియపట్టిన యెడల అశ్వములు గడ్డి గాదము వైపు మరల లేవు. పిదప మనస్సు కంటె బుద్ధి స్థాయి గొప్పది. బుద్దియే సారథియై యున్నాడు. ఇచ్చట కళ్లెము కంటె సారథిని పరిగణనలోకి తీసికోవటం ఉచితంగా ఉంటుంది. ఎందుకంటే కళ్లెము సారథి అధీనంలో ఉంటుంది. బుద్ధికంటె గొప్పది ఆత్మ. ఇది రథి అని చెప్పబడిన జీవాత్మయైయున్నది. మహాన్ ఆత్మకంటె గొప్పది అవ్యక్తమని చెప్పబడింది. అది భగవంతుడి శక్తిరూప ప్రకతియైయున్నది. దాని అంశయే కారణ శరీరము. దానినే ఈ ప్రసంగములో రథము అని పేర్కొన్నాము. ఈ కారణ శరీరము భగవంతుని యొక్క ప్రకతి అంశ కావున దానిని అవ్యక్తమని అనటం జరిగింది.
సూక్ష్మం తు తదర్హత్వాత్! పరమాత్ముని శక్తిరూప ప్రకతి సూక్ష్మమైనది. దానిని చూడలేము. వర్ణించలేము. దాని యొక్క అంశనే కారణ శరీరము, కావున దానిని అవ్యక్తమనటం ఉచితముగనే యున్నది. పరమధామ యాత్రలో రథము యొక్క స్థానములో సూక్ష్మ శరీరమని భావించవలెను. ఎందుకంటె స్థూలమైనది ఇక్కడే ఉండిపోతుంది.




తదధీనత్వాదర్థవత్!
సాంఖ్య మతావలంబకులు ప్రకతిని స్వతంత్రమైనదని జగత్తుకు కారణమని విశ్వసిస్తారు. కాని వేదముల యొక్క అభిప్రాయము అది కాదు. వేదములలో పేర్కొన్న దాని ప్రకారము ప్రకతి అనునది పరబ్రహ్మ పరమేశ్వరుని ఆధీనములో యున్న ఒకశక్తి అని చెప్పబడింది. శక్తి అనునది శక్తివంతము నుంచి వేరుకాదు. కాబట్టి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. పరమా త్ముని ఆధీనములో ఉన్న శక్తి కావున దానికి సార్థకత కలిగినది.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)
బ్రహ్మసూత్రాలు-24
Posted On:6/24/2014 12:09:56 AM
తదధీనత్వాదర్థవత్!
సాంఖ్య మతావలంబకులు ప్రకతిని స్వతంత్రమైనదని జగత్తుకు కారణమని విశ్వసిస్తారు. కాని వేదముల అభిప్రాయము అది కాదు. వేదములో పేర్కొన్న దాని ప్రకారము ప్రకతి అనునది పరబ్రహ్మ పరమేశ్వరుని ఆధీనములో యున్న ఒక శక్తి అని చెప్పబడింది. శక్తి అనునది శక్తివంతము నుంచి వేరుకాదు. కాబట్టి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. పరమాత్ముని ఆధీనములో ఉన్న శక్తి కావున దానికి స్థారకత కలిగినది.
జ్ఞేయత్వావచనాచ్చ!
సాంఖ్య మతావలంబకులు ప్రకతిని జ్ఞేయ (దైవము) అని విశ్వసిస్తారు. గుణమయియైన ప్రకతిని తెలిసికుంటే మోక్షము అభిస్తుందని చెప్తారు.వారి అభిప్రాయము మేరకు ప్రకతి కూడా జ్ఞేయమనే అర్థము వచ్చుచున్నది. కాని వేదములో ప్రకతి జ్ఞేయమని లేక ఉపాస్య దేవతయని ఎచ్చటను చెప్పలేదు. అచ్చట కేవలము పరబ్రహ్మ పరమేశ్వరుడు మాత్రమే తెలిసికో తగిన వారని ఉపాసనీయుడని చెప్పబడింది.
వదతీతి చెన్న ప్రాజ్ఞో హి ప్రకరణాత్!
శబ్ద, స్పర్శ, రూప,రస గ్రంథము లేనివాడు, అవినాశి, నిత్యుడు, అనాది, అనంతుడు , మహ త్తుకంటే గొప్పవాడు, నిశ్చలుడైన వాని గురించి తెలిసికొని మానవుడు మత్యుముఖం నుంచి విడుదల కాగలడు.
జ్ఞేయ తత్తము లక్షణము ఏవి చెప్పబడ్డావో అవన్నియును సాంఖ్య ప్రధానునిలో కూడా ఉన్నవని చెప్పుచున్నారు. కాని ఈ కథనము సరియైనది కాదు. శ్రుతులలో పరమాత్మ మాత్రమే తెలిసికోటానికి యోగ్యుడని చెప్పబడింది.
త్రయాణామేవ చైవయుపన్యాపః ప్రశ్నశ్చ!
కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజును మూడు ప్రశ్నలకు జవాబిమ్మని, ఉపదేశించుమని కోరెను.అది వరుసగా ఆగ్ని గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించియై యున్న వి. కాని ప్రధానుని విషయముగా ప్రశ్నలేదు. సమాధానములేదు.


మహద్వచ్ఛ!
బుద్ధికంటే ఆత్మ గొప్పదనే అంశం వచ్చింది కాని సాంఖ్య మతములో బుద్ధియే మహతత్తమని వచ్చింది. వేదములో మహత్ అను శబ్దము జీవాత్మయై వాచకమైయున్నది. ఈ రకముగా వేదములో అనేక చోట్ల మహత్ అను శబ్ద ప్రయోగము సాంఖ్యమతాలంబకులకు విపరీతముగా వాడబడింది. అదే రకముగా అవ్యక్త మను శబ్దము సాంఖ్య మతావలంబకులకు భిన్నముగా భావించుట అనుచితమైననది కాదు. మీదు మిక్కిలి ఉచితమై యున్నది.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)

బ్రహ్మసూత్రాలు-25
Posted On:6/25/2014 1:52:23 AM

చమస్‌వద విశేషాత్!
అజా అని వర్ణించటంలో అర్థమేమైనప్పటికిన్ని వాస్తవములో అది పరబ్రహ్మ శక్తియైయున్నది. అది బ్రహ్మం కంటె భిన్నమైనది కాదు. వేదములో అజా అను పేరుతో ప్రకతి వర్ణన జరిగింది. చమస్ అను శబ్దము రూఢిగా సోమపానము నిమిత్తమై పాత్ర విశేషవాచకమైనది. బహదారణ్యకోపనిషత్తులో శిరము అనే అర్థములో తీసికోబడింది. అలాగే సాంఖ్యుల కథన ము ప్రకారము అజా అనగా కేవలము స్వతంత్ర ప్రకతి యను భావము కాదు.
జ్యోతిరూప క్రమా తు తథా హ్యధీయత్ ఏకే!
ఛాందోగ్యోపనిషత్తులో పరమేశ్వరుడు ఆలోచించెను- నేను బహు ముఖాలుగా విస్తరిల్లవలెను మొదట తేజస్సును రచించెను. తేజస్సు నుంచి జలము, జలము నుంచి అన్నము ఉత్పత్తి చేయబడెను. అగ్నిలో ఉన్నటువంటి ఎరుపురంగు తేజస్సుకు సంబంధించినది. తెలుపు రంగు జలమునకు సంబంధించినది. నలుపు రంగు అన్నమునకు (పథివికి) సంబంధించినదిగా తెలుస్తోంది. అజా అనగా ప్రధానమనే భావము వచ్చినప్పటికిన్ని సాంఖ్య శాస్త్ర ప్రధానుడను అర్థము కాదు.
కల్పనోపదేశాచ్చ మధ్వాదివద విరోధః
రూపకాలంకార కల్పన చేస్తూ మధువు కానప్పటికిన్ని సూర్యున్ని మధువు అనటం జరిగింది. వాణి ధేనువు కాకున్నను ధేనువు అనటం జరిగింది. ద్యులోకమును అగ్ని అనటం జరిగింది. ఇచ్చట కూడా రూపకాలంకార కల్పన చేస్తూ భగవంతుని యొక్క శక్తియైన ప్రకతికి అజా అని పేరు పెట్టి దానికి ఎరుపు, తెలుపు, నలుపు అను రంగులు చెప్పబడినాయి, అయినను ఇందులో విరోధించేదేమియు లేదు. జిజ్ఞాసువులకు సుళువుగా అర్థము చేయించుటకు రూపకాలంకార కల్పనతో వర్ణించి చెప్పటం ఉచితమేయైయున్నది.
న సంఖ్యోప సంగ్రహాదపి నానాభావవాదతిరేకాచ్ఛ!
ఈ మంత్రములో సంఖ్య వాచకమైన అయిదు. అయిదు అని రావటము వలన ఇరువది అయిదు తత్తముల కల్పన చేయుట సముచితమైన విషయము కాదు. ఒకవేళ ఇరువది అయిదు తత్తములను పరిగణనలోకి తీసుకున్నను, ఇందులో వర్ణింపబడిన ఆకాశమును, ఆత్మను తీసికున్న యెడల ఇరువది ఏడు తత్తములగుచున్నవి. కావున సాంఖ్య మతావలంబకుల అంచనా కంటె మించిపోతున్నాయి.
జ్యోతిషైకేషామ సత్యన్నే! మాధ్యందినీ శాఖవారు ఈ మంత్రంలో బ్రహ్మంను ప్రాణము యొక్క ప్రాణమని అంటూ అన్నము యొక్క అన్నమని కూడా అన్నారు. కాని కాణ్యశాఖ వారు అన్నము అనే అంశమును పేర్కొనలేదు. మంత్రములో పేర్కొనబడిన జ్యోతిని బ్రహ్మముగా చెప్తూ జ్యోతి యొక్క జ్యోతి అని అన్నారు.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)


బ్రహ్మసూత్రాలు-26
Posted On:6/26/2014 12:32:09 AM

కారణత్వేన చాకాశాదిషు యథాద్యపదిష్టోక్తేః!
వేదములో పేర్కొన్న ప్రకారము జగత్తు సష్టికి అనేక కారణముల వర్ణన ఉన్నప్పటికిన్ని చివరకు పరబ్రహ్మనే ప్రధానకారణమని చెప్పుటలో సందేహం లేదు. జగత్తు సష్టికి ఆకాశమే కారణమని చెప్పినప్పటికిన్ని ఆకాశము కూడా బ్రహ్మంకు లోబడి ఉన్నదని తెలిసికోవలెను.
సమాకర్షాత్!
తైత్తరీయోపనిషత్తు ప్రకారము మొదట జగత్తు అసత్గానే యుండెను. అందులో నుండియే సత్ ఉత్పన్నమాయెను. ఇచ్చట అసత్ అనగా అప్రకటిత బ్రహ్మం, సత్ అనగా ప్రకటిత బ్రహ్మం. బహదారణ్య కోపనిషత్తులో , ఛాందోగ్యోపనిషత్తులో అసత్ అనగా అవ్వాకతమను శబ్దము వాడబడింది. అయినను దాని పర్యాయ పదము అప్రకటితమని గమనించవలెను.
జగద్వాచిత్వాత్!
కౌషతకీ బ్రాహ్మణోపనిషత్తులో అజాతశత్రువుకు బాలాకికి మధ్యన సంవాదము జరిగెను. సూర్యునిలో ఉన్న పురుషున్ని ఉపాసిస్తాను అని ప్రారంభించి బాలాకి చివరకు, ఎడమ కంటిలో ఉన్న పురుషున్ని కూడా ఉపాసిస్తాను అని మొత్తము షోడశ పురుషులను ఉపాసిస్తానని చెప్పెను. అజాత శత్రువు మాటలనన్నింటిని ఖండించి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తానని చెప్పెను. పదహారు కళల పురుషుల కర్త బ్రహ్మమని చెప్పెను. కర్మలు, కార్యములు అను శబ్దములు జడ చేతనాత్మక సంపూర్ణ జగత్తుకు వాచకములై యున్నవి. కావున పరబ్రహ్మ పరమేశ్వరుడే అన్నింటికి కారణమై యున్నాడు.
జీవ ముఖ్య ప్రాణలింగాన్నేతి చెత్తద్ వ్యాఖ్యాతమ్!
జీవుడే జగత్తు కర్త, జ్ఞేయుడు, బ్రహ్మం కాదు అని అనిన యెడల అది వాస్తవము కాదు. బ్రహ్మం అన్ని ధర్మాలకు ఆశ్రమయై యున్నాడు. ఒకవేళ జీవుడు కూడా జ్ఞేయతత్తము కలవాడు అనుకున్న పక్షములో త్రివిధ ఉపాసనల ప్రసంగము ఆవిర్భవిస్తుంది. కావున అది ఉచితమైనది కాదు.

అన్యార్థం తు జైమినిః ప్రశ్నవ్యాఖ్యానాభ్యామపి చైవమేకే!
ఆచార్యుడైన జైమిని పూర్వమంత్రంలో పేర్కొన్న అంశాన్ని చక్కదిద్దారు. జీవాత్మను జగత్తుకు కారణమని చెప్పటంలో లౌక్యము దాగొని ఉంది. జీవుడు సుషుప్తావస్థలో బ్రహ్మంలోనే లీనమై ఉంటాడు. అలాగే ఉత్తత్తి జరిగినప్పుడు జాగ్రదావ్యస్థలోకి వస్తాడు. దీనికి కారణము బ్రహ్మమే అనునది నిర్ధారణ జరిగింది. విషయాన్ని కాణ్వశాఖ వారు కూడా సమర్థించారు.
బ్రహ్మసూత్రాలు-27
Posted On:6/27/2014 1:24:21 AM
ప్రతిజ్ఞా సిద్ధేర్లింగ మిత్యాశ్మరథ్యః!
ఆశ్మరథ్యుడను ఆచార్యుని కథనము ప్రకారము అజాత శత్రువు బాలాకి మునికి బ్రహ్మం స్వరూపము చెప్పెదననెను. జీవాత్మ ముఖ్య ప్రాణముల లక్షణములు తెలుపుతూ జగత్తుకు కారణభూతుడు పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పెను.

ఉత్క్రమిష్యత్ ఏవం భావాదిత్వౌడులోమిః
నిదురపోయే మనిషి తన సుషుప్తావస్థలో సమస్త ప్రాణముల జీవాత్మను పరమాత్మునిలో లీనము చేయుట అని తెలియచేయుట జరిగింది. అదే రకముగా శరీరమును వదిలి బ్రహ్మలోకమునకు వెళ్లు బ్రహ్మజ్ఞాని గతి వర్ణన ముండకోపనిషత్తులో ఈరకంగా చెప్పబడింది- బ్రహ్మజ్ఞాని మహాపురుషుడు దేహము చాలించినప్పుడు, తన కళలు, సంపూర్ణ దేవతలు తమ తమ కారణభూత దేవతలలో కలిసి పోవుదురు. ఏ రకముగా నామ, రూపములు గల ప్రవహించు నదులన్నియు సముద్రములో కలిగియునో అదే రకముగా ఉత్తమ విద్య పురుషుడు పరమాత్మను ప్రాప్తించుకొనును, ఇదంతయును ఔడులోమి ఆచార్యుని కథనమై యున్నది.

అవస్థితేరితి కాశకత్సన్నః!
కాశకత్సన్న ఆచార్యుని కథనము కూడా ఇలా ఉంది. ప్రళయ కాలములో సంపూర్ణ జగత్తు స్థితి పరమాత్మలోనే అగుపిస్తుంది.

ప్రకతిశ్చ ప్రతిజ్ఞాదష్టాంతానుపరోధాత్!
శ్వేతకేతును అతని తండ్రి అరుణి ఇలా అడిగెను- నీవు జిజ్ఞాస కొలది నీ గురువును తత్తోపదేశము కోసం అడిగితివా? వినకుండానే వినినట్లవటం, మననం చేయకుండానే మననం చేసినట్లు అవటం, తెలిసికోకుండానే తెలిసినట్లవటం అని తండ్రి చెప్తుండగానే శ్వేతకేతు ఇలా ప్రశ్నించెను- ఆ ఉపదేశమేమిటి? తండ్రియైన అరుణి ఇలా ఒక దష్టాంతము చెప్పె ను. మట్టి పెడ్డ తత్తమును తెలిసికోవటం వలన, మట్టితో రూపొందిన వస్తువులన్నియు మట్టి తో తయారైనవని చెప్పగలము. ఆ పిదప బంగారము, ఇనుము, దష్టాంతములు చెప్పెను. మొదట తండ్రి వేసిన ప్రశ్నలన్నియు ప్రతిజ్ఞా వాక్యములందుము.

అర్థము చేయించిన వాక్యాలను దష్టాంతములందుము. ఒకవేళ బ్రహ్మచే భిన్నమైన ప్రధానుని ఉపాదాన కారణముగా సమ్మతించిన యెడల అతని ఒక్క అంశను మాత్రము తెలిసికున్న వారమగుదుము. బ్రహ్మజ్ఞానము మాత్ర ము కాదు. మనస్సు లేకుండా ఇంద్రియములు లేకుండా అందరి కార్యములు సమర్థవంతముగా పరమాత్ముడు నిర్వహించగలడు. భగవద్గీతలో కూడా సాంఖ్య సిద్ధాంతమును ఒప్పుకోలేదు. పరబ్రహ్మ పరమేశ్వరుడు మాత్రమే జగత్తు ఉపాదాన, నిమిత్త కారణమైయున్నాడు.

బ్రహ్మసూత్రాలు-28
Posted On:6/28/2014 1:10:13 AM

అభిధ్యోపదేశాచ్చ!

శ్రుతులలోని సష్టి రచన ప్రకరణలలో అనేక చోట్ల పరమాత్మ సంకల్పించి నేను ఒక్కడినే కాని బహుముఖాలుగా ప్రకటితము కావాలి ఆ రకముగా వివిధ రూపాలలో సష్టి రచన చేసెను. నిశ్చయముగా ఇదంతయును బ్రహ్మమయమైయున్నది. బ్రహ్మం నుంచి ఉత్పన్నమవటం, అందులోనే స్థితమై యుండుట, చివరకు అందులోనే లీనమవటం జరుగుతుంది.




సాక్షాచ్చోభయా మ్నానాత్!

శ్వేతాశ్వతరోపనిషత్తులో కొద్దిమంది ఋషులు ఒక సమయంలో ఆలోచించ తొడగిరి- ఈ జగత్తుకు కారకుడెవరు? ఎవరి ద్వారా మనము ఉత్పన్నమైతిమి? దేనివలన జీవిస్తున్నాము? మా స్థితి ఏమిటి? మన అధిష్ఠాత ఎవరు? మనల్ని నియమ పూర్వకముగా సుఖదుఃఖములలో నియుక్తులను చేసేదెవరు? వారు ఇలా ఆలోచించతొడగిరి- కాలమా, స్వభావమా, కర్మనా, తెలివా, పంచముహాభూతములు, సముదాయమా అని పరిపరి విధాల ఆలోచించి, వీటిలో ఏదియును కాదు, ఎందుకనగా ఇవన్నియును చైతన్యము ఆధీనములో యున్నవి. స్వతంత్రమైనవి కావు. చివరకు వారు ధ్యానయోగములోకి వెళ్లి పరమదేవుడైన పరమేశ్వరుని స్వరూపభూతశక్తిని కారణరూపములో దర్శించిరి. పరమేశ్వరుడు మాత్రమే ఒకే ఒక్కడు పూర్వోక్త కాలము నుంచి మొదలుకొని ఆత్మ వరకు సమస్త కారణములపై శాసనము చేస్తాడు.




ఆత్మకతేః!

ప్రకటితము కాకపూర్వము ఈ జగత్తు అవ్యక్తరూపములో యుండెను. ఆ పిదప ప్రకటిత మాయెను.ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు స్వయంగా తనను తాను జగత్తు రూపములో ప్రకటిం చెను. అందుకే బ్రహ్మయే జగత్తుకు ఉపాదానకారణమైనాడు.




పరిణామాత్!

జగత్తును సష్టించిన పరమాత్ముడు స్వయంగా జీవునితో పాటు అందులో ప్రవేశించెను. పిదప తాను స్వయముగా సత్ అనగా మూర్తము, త్యత్ అనగా అమూర్తముగా రూపొందెను. చూపెట్టుటకు సౌకర్యముగా ఉండునది, అసౌకర్యముగా యుండునది, ఆశ్రయమిచ్చునది, ఆశ్రయమివ్వనిది, చైతన్యము గలది, జడమైనది, సత్యము, మిథ్య ఇవన్నియును సత్య స్వరూపుడై న పరమాత్ముడే అయినాడు.




ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతాః!


సాంఖ్యులు, పరమాణు కారణవాదులు, నైయాయికులు మొదలగువారు చెప్పిన సిద్ధాంతములన్నియు నిరాకరింపబడినవి. బ్రహ్మం మాత్రమే ఈ జగత్తు ఉపాదాన, నిమిత్త కారణమైయున్నాడు.(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)


బ్రహ్మసూత్రాలు-29
Posted On:7/1/2014 12:07:45 AM

స్మత్యనవకాశదోష ప్రసంగ ఇతి చెన్నాన్య
స్మత్యనవకాశ దోష ప్రసంగాత్
ఒకవేళ చెప్పాలనుకుంటే ప్రధానుని జగత్తుకు కారణమని ఒప్పుకోకుండా బ్రహ్మం నే ఒప్పుకున్న పక్షములో సర్వజ్ఞుడైన కపిలఋషి ద్వారా రూపొందింపబడిన సాంఖ్య స్మతిని గణనలోకి తీసికొని ప్రసంగము ఉత్పన్నము కాగలదు. కావున ప్రధానుడు జగత్తుకు కారణభూతుడని చెప్పుకోనవలెను కాని ఇలా అనటం సరియైనది కాదు. ఎందుకంటే ఒకవేళ సాంఖ్యశాస్త్రము సరియైనదని ఒప్పుకున్న పక్షములో, ఇతర మహర్షుల ద్వారా రూపొందింపబడిన స్మతులను ప్రామాణికముగా తీసికొని దోషము వచ్చును. వేదానుకూలముగా రూపొందింపబడిన స్మతులను మాత్రమే పరిగణనలోకి తీసికోవలెను. శ్రీమద్ భగవద్గీతలోను, విష్ణు పురాణములోను, మనుస్మతిలోను సమస్త జగత్తు ఉత్పత్తి పరమాత్మ ద్వారానే జరిగిందని చెప్పబడింది. శుత్రులకు, స్మతులకు మధ్యన విరోధమేమియు లేదని తెలియుచున్నది.

ఇతరేషాం చానుపలబ్ధేః!
మనుపు మున్నగు స్మతికారులు ఎవరైతే ఉన్నారో వారి గ్రంథాలలో సాంఖ్యుల ప్రసక్తిలేదు. కావున సాంఖ్యశాస్త్రమును ప్రామాణికముగా తీసికోకపోవటమే ఉచితమైయున్నది.
ఏతేన యోగః ప్రత్యుక్షః!
పతంజలి యోగశాస్త్రము మేరకు జడ ప్రకతి జగత్తునకు కారణమని తెలియవస్తోంది. ఈ విషయములో యోగశాస్త్రము, సాంఖ్యశాస్త్రము ఒక్కటియేయైనను ఇతర అంశములలో భిన్నమైయున్నది. ఏది ఏమైనను సాంఖ్యశాస్త్రమును నిరాకరించినప్పుడు పతంజలి యోగమును కూడా నిర్దంద్వముగా నిరాకరించవచ్చును.
న విలక్షణత్వాదస్య తథాత్వం చ శబ్దాత్!

శ్రుతులలో పరబ్రహ్మ పరమాత్మను శాశ్వుతుడని (సత్యము) జ్ఞాన స్వరూపుడని మరియు అనంతుడు మొదలగు లక్షణములు కలిగియున్నాడని చెప్పుకున్నాము, జగత్తును జ్ఞానరహితమైనదని, జడమని చెప్పుకున్నాము. (పురాణములలో పర్వతములు, నదులు, సముద్రములు మున్నగునవి చైతన్యము కలవని చెప్పుకున్నాము.
అభిమాని వ్యపదేశస్తు విశేషానుగతిభ్యామ్!


తేజస్సు, జలము, అన్నము (భూమి) మొదలగు వాటి జడతత్తములో కూడా చైతన్య వ్యవహారమున్నది.ఆ తత్తముల అభిమాన దేవతలను లక్ష్యము చేసికొనియున్నవి. వాణిగా రూపొంది ముఖమున ప్రవేశించింది అగ్ని, వాయువు ప్రాణముగా రూపొంది నాసికలో ప్రవేశించెను
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)



బ్రహ్మసూత్రాలు-31
Posted On:7/5/2014 1:35:35 AM
ఏతేన శిష్టా పరిగ్రహా అపి వ్యాఖ్యాతాః!
సాంఖ్య మతావలంబకుల సిద్ధాంతములన్నియు నిరాకరించి వైదిక సిద్ధాంత ప్రతిపాదన చేయబడింది. ఇతర మతావలంబకుల సిద్ధాంతములు కూడా వేదానుకూలముగా లేకపోవుట చేత సమ్మతయోగ్యమైనవి కావు. ఎందుకంటే ఆ సిద్ధాంతములు కూడా సాంఖ్య మతావలంబకులను అనుకరింపబడి ఉన్నాయి.
భోక్త్రాపత్తే రవిభాగశ్చేత్ స్వాల్లోకవత్!
ఒకవేళ బ్రహ్మం జగత్తు కారణమని ఒప్పుకొన్నప్పుడు బ్రహ్మం స్వయంగా జీవుని రూపములో సుఖదుఃఖముల భోక్తగా ఋజువగును, అలాంటప్పుడు జీవున్ని ఈశ్వరున్ని విభజించలేము. అలాగే జడవర్గములో భోక్త వస్తువైన జడవర్గము మధ్య విభజన కుదరదు. ఇది వాస్తవమైన విషయము కాదు, ఎందుకనగా లోకములో ఒక కారణము చేత ఉత్పన్నమైన వస్తువులలో విభాగములను ప్రత్యక్షముగా చూచుచున్నాము.
అలాగే బ్రహ్మంకు జీవాత్మకు, జీవునికి జడవర్గమునకు మధ్య విభాగముండుటలో నందియము లేదు. తండ్రి వంశాంకురము గర్భములో ఉన్నప్పుడు గర్భజనిత బాధ శిశువుకే చెందును. అందులో తండ్రి భాగస్వామ్యముండదు, అంతేకాకుండా వారి మధ్య విభాగమును ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అదే రకముగా బ్రహ్మం భోక్త కానేరదు. అంతేకాకుండా పరమాత్మ, జీవాత్మ మధ్యన పరస్పరము విభాగముందనుటలో ఇబ్బంది ఏమియును లేదు.
తదనన్యత్వమారంభణ శబ్దాదిభ్యః!
మట్టి పెడ్డ తత్తము తెలిసికున్న యెడల యావత్ మట్టి తత్తము తెలిసినట్లేయగును. మట్టితో తయారు చేసిన ఆకత్తులు, పేర్లు వ్యవహారము కొరకే పెట్టిబడినాయి. వాక్కు ద్వారా కథనము చేస్తామే కానీ కార్యరూపములో అది మట్టియేయై యున్నది. ఇదే రకముగా వర్తమాన జగత్తు కూడా బ్రహ్మరూపమైయున్నది. బంగారు హారములు, కంకణములు, కుండలములు అదిగా గల అభరణములు బంగారములో లీనమయ్యాక కూడా శక్తి రూపంలో ఉంటుంది. శక్తిమంతములో అభేదముండుటచే అనన్యతలో ఏ దోషముండదు.
భగవద్గీతలో భగవానుడు స్వయముగా ఇలా అన్నాడు- ఈ ఎనిమిది భేదములు గల జడ ప్రకతి నా యొక్కఅపరా ప్రకత్తి రూపము శక్తియైయున్నది. జీవరూప చేతన సముదాయము నాయొక్క పరా ప్రకతియై యున్నది. ఇంకను ఇలా అనెను- ఈ రెండు కూడా సమస్త ప్రాణుల కారణమైయున్నవి. నేను ఈ సంపూర్ణ జగత్తు ఉత్పత్తి, ప్రళయరూపమునకు కారణమై యున్నాను ఈ వ్యాఖ్యానము ద్వారా భగవానుడు ప్రకతులతో తన అనన్యతను సిద్దింప చేశాడు.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)

బ్రహ్మసూత్రాలు-32

Posted On:7/8/2014 1:08:40 AM

భావే చోపలేబ్ధేః!
నొక్కి చెప్పేదేమంటే కార్యము కారణములో శక్తిరూపముగా సర్వకాల సర్వావస్థలయందు విద్యమానమై యుండును. ఏ వస్తువైతే ఉండదో ఉదాహరణకు కుందేటి కొమ్ములు, ఆకాశ పుష్పము లాంటివి ఉపలబ్ధి కూడా కావు.
సత్తాచ్చావరస్య!
ఛాందోగ్యోపనిషత్తులో, బహదారణ్యకోపనిషత్తులో పేర్కొన్న దాని ప్రకారం ఈ జగత్తు ప్రత్యక్షము కాక పూర్వము నుండియే సత్యమై యుండెను. ఈ వర్ణనతో తెలియునదేమనగా ఈ జగత్తు స్థూలరూపముతో ప్రత్యక్షమవటమునకు ముందు కారణములో శక్తిరూపముతో విద్యమానమై యుండి సష్టికాలములో ప్రత్యక్షమగును.

అసద్వయపదేశాన్నేతి చెన్న ధర్మాంతరేణ వాక్యశేషాత్!
తైత్తరీయోపనిషత్తులో ఇలా పేర్కొనబడింది- ఇదంతయును మొదట అసత్‌గా ఉండెను. పిదప సత్‌గా ఆవిర్భవించెను. ఈ జగత్తు ప్రత్యక్షముగా అగుపించుటకు ముందు లేదనే అంశం సరికాదు. ప్రత్యక్షమవటముకు ముందు అప్రత్యక్షరూపములో విద్యమానమై యుండుటను ధర్మాంతరమందుము. దీనినే అసత్ అను పేరు పిలుస్తారు. తాత్పర్యమేమనగా ఉత్పత్తికి పూర్వము ఈ జగత్తు అసత్, అప్రకటితముగా యుండెను. దానితో సత్ యొక్క ఉత్పత్తి జరిగెను. అనగా అప్రకటిత జగత్తు తన అప్రకటిత ధర్మమును త్యాగము చేసి ప్రకటరూప ధర్మము ను ధరించెను.

యుక్తేః శబ్దాంతరాచ్చ!ః ఏ వస్తువైతే వాస్తవముగా ఉండదో దాని ఉత్పత్తి కూడా జరుగదు. అకాశ పుష్పమును, కుందేటి కొమ్ములను ఇంతవరకు ఎవరూ చూడలేదు. అందుకే ఈ జగత్తు ఉత్పన్నమునకు ముందు నుండేసత్ యై యుండెను.
ప్రటవచ్చ! బట్టలు శక్తి రూపములో దూది యందు అప్రకటితముగా యుండెను. అది వెంటనే అగుపించదు, నేత ద్వారా నేయబడి బట్టగా రూపొంది అగుపించటం మొదలెడుతుంది. అలాగే బ్రహ్మం మొదటి నుండి స్థితమైయున్నాడు. ఉత్పన్నమయ్యాక కూడా అభిన్నుడు కాడు.

యథా చ ప్రాణాది
మత్యువు ఆసన్నమైనప్పడు ప్రాణము, ఇంద్రియములు మున్నగునవి జీవాత్మతోపాటు శరీరము నుండి బయటకు ఎచ్చటికో వెడలిపోవును. కానీ వాటి స్వరూపమును మనం చూడలేము. అయినను దానిశక్తి తప్పక యుండును. అలాగే ప్రళయ కాలములో ఈ జగత్తు యొక్క అదశ్య అవస్థ మనకు అగుపించదు. అయినను దాని కారణరూప శక్తి తప్పక యుండునని అర్థము చేసికోవలెను.

బ్రహ్మసూత్రాలు-33 
అధికం తు భేదనిర్దేశాత్!

Posted On:7/9/2014 1:36:17 AM

జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థల బేధములను వివరిస్తూ ఈ జీవుడు సుషుప్తావస్థలో ఏ మాత్రము కూడా బయటి లోపటి జ్ఞానము లేకుండా శూన్యుడై పరబ్రహ్మ పరమాత్మలో సంయుక్తుడవుతాడు. ఈ వర్ణనతో జీవునికి , బ్రహ్మంకు ఉన్న వ్యత్యాసము స్పష్టమవుతోంది. వేదములో కూడా జీవాత్మ, పరమాత్మ భేదమును స్పష్టం చేస్తూ పరమాత్ముడు కర్తగా, ధర్తగా సంహర్తగా యుండి జీవునికి స్వామిగా యున్నాడు.

ఆశ్మాదివచ్చ తదునుపపత్తిః!

పరమేశ్వరుడు చైతన్యవంతుడై, జ్ఞానస్వరూపుడై, ఆనందమయుడై అందరికి సష్టించువాడైయున్నాడు. కావున తన అపరా ప్రకతి యొక్క విస్తారరూప శిలలు, ఇనుము, బంగారము మున్నగు నిర్ణీవ జడ పదార్థములకు భిన్నుడై యున్నాడు. అదేరకముగా తన పరా ప్రకతి విస్తారభూత జీవ సముదాయము నుండి భిన్నుడైయున్నాడు. ఎందుకంటే జీవుడు అల్పజ్ఞుడై సుఖదుఃఖముల యొక్క భోక్తయైయున్నాడు. పరమాత్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వాధారుడు, సర్వనియంత, సుఖదుఃఖములకు అతీతుడైయున్నాడు. కారణము, కార్యము అనన్యతను లెక్కింపులోకి తీసికొని మాత్రమే జీవులు పరమేశ్వరుని నుండి అభిన్నమని చెప్పటం జరిగింది. బ్రహ్మం తనకు తాను అహితం చేసికుంటాడనే దోషము అంటదు. పరమాత్మ హితమునకు, అహితమునకు అందని వాడైయున్నాడు. అందరి మేలు పరమాత్ముని ద్వారానే జరుగుతుంది.
ఉపసంహార దర్శనాన్నేతి చెన్న క్షీరవద్ధి!

లోకములో కడవలు, వస్త్రములు మొదలగునవి రూపొందించుటకు నైపుణ్యము గల కళాకారుని అవసరము, మట్టి దూది, రాట్నము మొదలగు సాధనముల అవసరము ఎంతేని కలదు. సాధన సంపత్తి లేకుండా పనులు నిర్వహింపబడవు. కాని బ్రహ్మంను ఏకమాత్ర అద్వితీయుడని, నిరాకారుడని, నిష్క్రియుడని అంటున్నాము. అతని దగ్గర ఏ సాధన సంపత్తి లేవు. కావున ఈ జగత్తు సష్టి చేయలేడు అని అనుకుంటే పొరపాటవుతుంది. ఎందుకంటే పాలు దానికున్న సహజ సంపత్తి చేత పెరుగుగా రూపుదిద్దుకుంటుంది. అదేరకముగా పరమాత్మ కూడా తన స్వాభావిక శక్తిచేత జగత్తు స్వరూపాన్ని ధరిస్తాడు. ఏ రకముగా సాలీడు ఇతర సాధనముల అవసరము లేకుండా గూడును అల్లుతుందో అదేరకముగా బ్రహ్మం తన శక్తియుక్తులచే జగత్తు రచనచేయును. శ్రుతులు పరమేశ్వరుని శక్తిని ఇలా వర్ణిస్తున్నాయి. పరమాత్మకు ఏ సాధనములు అవసరం లేదు. అతని సమానముగా కాని అతనిని మించిగాని ఎవరినీ చూడలేము. అతని జ్ఞానము, బలము, క్రియారూపత్వము, స్వాభావిక పరాశక్తి మొదలగునవి అనేకము వింటుంటాము.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)
బ్రహ్మసూత్రాలు-34

Posted On:7/10/2014 1:20:22 AM

దేవాది వదపి లోకే!

ఈలోకములో దేవతలు కాని యోగులు కాని ఎలాంటి ఉపకరణముల సహాయము లేకుం డా తమ అద్భుతమైన శక్తి ద్వారా ఇతర రూపములను ధరించెదరు. ఎటువంటి సాధన సంపత్తి లేకుండా సంకల్పమాత్రము చేతనే మనోవాంఛిత పదార్థములను ప్రకటించగలరు. అదేరకముగా శక్తి సంపన్నుడైన పరమేశ్వరుడు తన సంకల్ప మాత్రము చేతనే జడచేతన సముదాయరూపమైన విచిత్ర జగత్తును రచించి లేక తానే స్వయముగా ఆరూపములో రూపుదిద్దుకున్నను అందులో ఆశ్చర్యము ఇసుమంతయు లేదు. సాలీడు కూడా తన స్వశక్తినే, ఇతర సాధనముల అవసరం లేకుండా గూడు కట్టుకోగా లేనిది, సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు ఈ జగత్తు యొక్క అభిన్న నిమిత్తోపాదన కారణమని ఒప్పుకోవటంలో ఆపత్తి ఏమీలేదు.
కత్స్న ప్రసక్తిర్నారవయత్వ శబ్ద కోపో వా!,

ఈ అంశాన్ని విశ్లేషించి చూసినప్పుడు బ్రహ్మంను జగత్తు యొక్క కారణమని సమ్మతించిన యెడల ఇందులో రెండు దోషములు అగుపిస్తాయి. ఆవయవ రహితుడైన బ్రహ్మం తన సంపూర్ణ రూపములో జగత్తు ఆకారములో ప్రతిష్టింపబడిన యెడల జగత్తుకు భిన్నముగా బ్రహ్మం యొక్క ఉనికి ఉండదు గదా! ఒకవేళ బ్రహ్మం అవయవ యుక్తుడని భావించిన యెడ ల శరీరము యొక్క ఒక్క అంశము జగత్తుగా ఆవిర్భవించి వికతుడై పోవును గదా! కాని బ్రహ్మం అవయవ యుక్తుడు కాదు. శ్రుతిలో పేర్కొన్నదాని ప్రకారము బ్రహ్మం నిష్కలుడు, నిష్క్రియుడు, శాంతుడు, నిరవద్యుడు, నిరంజనుడు అని అంటోంది. అంతేకాకుండా దివ్యుడు , అమూర్తుడు మొదలగు విశేషణములతో విభూషితుడైయున్నాడు.
ఏది ఏమైనప్పటికిన్ని బ్రహ్మంను అవయవ రహితుడని, అవయవ యుక్తుడని ఎటులన్నను, శ్రుతి శబ్దములను పరిగణనలోకి తీసికున్నప్పుడు స్పష్టముగా రెండు దోషములు అగుపిస్తూ విరోధము వచ్చుచున్నది.

శ్రుతేస్తు శబ్దమూలళ్వాత్!

పూర్వ మంత్రములో చెప్పుకున్న దోషములు సిద్ధాంతపరంగా నిలువదు. ఎందుకంటే శ్రుతి ఏ రకముగా జగత్తు యొక్క ఉత్పత్తిని చెప్పిందో అదేరకముగా బ్రహ్మం యొక్క నిర్వకారరూప స్థితిని కూడా ప్రతిపాదించింది. శ్వేతాశ్వతరోపనిషత్తులో మరియు ముండకోపనిషత్తులో చెప్పిన ప్రకారము బ్రహ్మం జగత్తుకు కారణమవుతూ కూడా నిర్వికార రూపములో నిత్యము స్థితుడై యుండును. ఆ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరునికి ఏ విషయము కూడా అసంభవము కాదు. దీనికి వేదములే సర్వోత్తమమైన ప్రమాణములు. ఈ సమస్త బ్రహ్మాండం బ్రహ్మం యొక్క ఒక్క పాదమైయున్నది. అమత స్వరూపములైన మిగతా మూడు పాదములు పరమ ధామములో స్థితమైయున్నవి. ఈ రకముగా ఆ రెండు దోషములు వీగిపోవుచున్నవి.

Brahma sutralu 35
ఆత్మని చైవం విచిత్రాశ్చ హి!

Posted On:7/10/2014 11:12:59 PM

ఎప్పుడైతే మహర్షి విశ్వామిత్రుడు, చ్యవనుడు, భరద్వాజుడు, వసిష్టుడు మరియు ధేనువు అయిన నందిని మొదలగునవి అద్భుతమైన సష్టి రచన సామర్థ్యము కలిగియున్నప్పుడు పరబ్రహ్మకు సష్టి రచనా సామర్థ్యము యుండుటలో ఆశ్చర్యమేమియును లేదు.

స్వపక్షదోశాచ్ఛ!

సాంఖ్య మతావలంబకుల ప్రకారము ప్రధానుని జగత్తుకు కారణమని సమ్మతించిన పక్షములో అనేక దోషములు వచ్చును. అది వేదములకు ప్రామాణికము కాదు, అవయవ రహితుడైన ప్రధానుని చేత అవయవ యుక్త సజీవ జగత్తును ఒప్పుకున్న పక్షములో విరోధము వచ్చును. అందుకని పరబ్రహ్మ పరమేశ్వరుడే జగత్తు యొక్క అభిన్ననిమిత్తోపాదన కారణమై యున్నాడు.
సర్వోపేతా చ తద్దర్శనాత్!

పరమాత్ముడు సర్వశక్తి సంపన్నుడు అని వేదములలో పలుచోట్ల వచ్చింది. అనగా బ్రహ్మం సత్య సంకల్పుడై, ఆకాశ స్వరూపుడై, సర్వ కర్ముడై, సర్వ పనులు చేయువాడై, సర్వగంధుడై, సర్వరసుడై సమస్త జగత్తును అన్నివైపుల నుండి క్రమ్ముకొని వాణీ రహితుడై యున్నాడు, కావున పరమాత్మనే జగత్తుకు కారణమని విశ్వసించక తప్పదు.
వికరణత్వాన్నేతి చెత్తదుక్తమ్!

ఈ సూత్రములో పరబ్రహ్మను సర్వశక్తివంతుడని చెప్పటం జరిగింది. శ్వేతాశ్వతరోపనిషత్తులో స్పష్టముగా ఇలా చెప్పటం జరిగింది. పరమేశ్వరునికి కాళ్లు-చేతులు మొదలగు సమస్త ఇంద్రియములు లేకున్నను అందరి పనులు నిర్విఘ్నముగా చేయగల సమర్థుడై యున్నాడు. అందుకని బ్రహ్మమే జగత్తుకు కారణమని విశ్వసించటంలో సంశయం లేదు.
న ప్రయోజనవత్తాత్!

బ్రహ్మం ఈ విచిత్ర జగత్తు యొక్క సష్టి చేయుటలో ప్రయోజనమేమియును లేదు. జీవుల కొరకు కూడా జగత్తు యొక్క రచన అవసరం లేదు. ఈ దుఃఖమయ ప్రపంచంలో జీవులకు సుఖము లభించగలదనే ఆశ లేదు. అందుకని పరబ్రహ్మ జగత్తు యొక్క శక్తి అని ఒప్పుకోవలసిన అవసరం లేదు.







Brahma sutralu 36
లోకవత్తు లీలాకైవల్యమ్!

Posted On:7/12/2014 1:49:54 AM

లోకములో పరమాత్మను ప్రాప్తించుకున్నవారు ఉన్నారు. వారికి ఈ జగత్తులో ఎలాంటి స్వార్థం మిగిలిపోలేదు. కర్మ చేయుట వలన చేయకుండుట వలన వారికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలాంటి సిద్ధ మహా పురుషుల ద్వారా, వారు ప్రయోజనము ఆశించిన పోయిన ను ప్రపంచ రహితము సహజముగా జరుగుతూనే యుండును. కావున వాణిని లీలలు అని అందుము. అదేరకముగా పరబ్రహ్మ పరమాత్మ కూడా జగత్తును రచించి, అవసరమనుకున్నప్పుడు మావన శరీర ధారణ చేసి లోకాన్ని పావనము చేయుట వలన తనకు ప్రయోజనమేమియు లేదు. అవి కేవలము లీలామాత్రమని అందుము.

శాస్త్రములో పరమేశ్వరుని యొక్క కర్మలను దివ్వమైనవని, అలౌకికమైనవని, నిర్మలమైనవ ని చెప్పటం జరిగింది. మానవ మాత్రులకు దుస్సాధ్యమైనవి పరమేశ్వరుడు లీలామాత్రంగా, అనాయాసముగా కోటి కోటి బ్రహ్మాండములను సృష్టించి సంహరించగలడు. ఎందుకంటే పరమేశ్వరుని శక్తి అనంతమైనది. ఏమాత్రం ప్రయోజనము ఆశించకుండా జగత్తు యొక్క రచన మున్నగు కార్యములు చేయుట ఉచితమై యున్నది.

వైషమ్య నైర్ఘున్యే న సాపేక్షత్వాత్తథా హి దర్శయతి!

జీవులెల్లరికి తమ తమ శుభాశుభ కర్మల అనుసారము సుఖదుఃఖములు ప్రాప్తించును. ఉత్తమమైన న్యాయాధీశుని వలె న్యాయము చేయు పరమాత్మను నిర్దయుడను దోషము అంటదు. భగవద్గీతలో పేర్కొన్న ప్రకారము పుణ్య కర్మ ఫలము సాత్తికముగా, నిర్మలముగా యుం డును.
న కర్మా విభాగాదితి చెన్నానాదిత్వాత్!

ప్రళయ కాలములో సర్వశక్తిమంతుడైన పరబ్రహ్మ పరమాత్మలో విలీనమైనను దాని సత్తువ తరగదు. జగత్తు ఉత్పత్తికి మొదట అవ్యక్త రూపములో ఆ సర్వశక్తిమంతుడైన పరమాత్మలో ఉన్నాడు. ఏ రకముగా ఉప్పు నీళ్లలో కలిసి పోయినప్పుటికిన్ని దాని రుచితో పాటు అస్తిత్వము ఉంటుందో , అదేరకముగా జీవులు, వారి కర్మలు ప్రళయకాలములో బ్రహ్మంలో అవిభక్తముగా యుండును.
ఉపపద్యతే చాప్యుపలభ్యతే చ!

జీవులు వారి కర్మలు అనాదియై యున్నవి. ఒకవేళ వీటిని అనాది అని ఒప్పుకోని పక్షములో, ప్రళయకాలములో పరమాత్మను చేరుకున్న జీవులను పునరాగమనమున్నదనే దోషము ప్రాప్తించును. జీవాత్మ నిత్యమైనది. శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరము నాశనమైనను జీవాత్మ ను నాశనము లేదు.

బ్రహ్మసూత్రాలు-37

Posted On:7/15/2014 1:22:57 AM

రచనాను పపత్త్యేశ్చ నానుమానమ్!

ప్రధాన్ లేక ప్రకృతి జగత్తుకు కారణమని చెప్పరాదు. ఎందుకంటే అవి జడ పదార్థములు. ఎచ్చట ఎవరికి ఏది అవసరమో అది ప్రకృతి ఆలోచించలేదు. వాటి అవసరాలు తీర్చలేదు. గృహము, వస్త్రములు, రకరకాల పాత్రలు, ఆయుధాలు, యంత్రములు మున్నగునవి నైపుణ్యము కలిగిన కళాకారుల ద్వారానే రూపొందించిబడుతాయి. ప్రకృతి ఇలాంటి వస్తు సముదాయమును సమకూర్చగలదనే దృష్టాంతము లేదు. ఈ పృథివి, ఆకాశము, సూర్యుడు, చంద్రు డు, గ్రహణములు, నక్షత్రములు మున్నగు వివిధ అద్భుతములతో అలరారుచున్నది. మానవులు, పశువులు, పక్షులు, వృక్షములు, గడ్డి మొదలగు వాటితో ఈ ప్రపంచము సుశోభితమై మరియు బుద్ధితో మొదలగు ఆధ్యాత్మిక తత్తములతో అలంకృతమైయున్నది. ఇలాంటి సృష్టి కేవలం మట్టి, రాళ్లు కలిగిన జడ పదార్థము (ప్రధాన్) అయిన ప్రకృతి వలన సాధ్యం కాదు.
ప్రవృత్తేశ్చ!

ప్రపంచ రచన చేయటం ప్రక్కన పెడితే కనీసం ఆప్రవృత్తి కూడా ప్రకృతికి లేదు. సత్త, రజో, తమో గుణముల నామమే ప్రధాన్ అని ప్రకృతి అని అంటాము. చైతన్యము తోడ్పాటు లేకుండా సృష్టి కార్యము ప్రారంభించుట సంభవం కాదు.
పయోంబు వచ్చేత్తత్రాపి!

తన దూడకు పాలు త్రాగించటానికి ఆవు స్థనములలోనికి పాలు వచ్చి చేరును, అలాగే అచేతనమైన నీరు నదులలో, చెరువులలో కొలనులలో యుండి జీవరాశులకు ఉపయోగపడుతుంది. అలాగని జడ ప్రకృతికి సృష్టి కార్యము చేసే శక్తి యున్నదని చెప్పలేము. జడ పదార్థమైన రథమును లాగుటకు చైతన్యము గల అశ్వము లేనిది కుదరదు. ఇచ్చట ఒక విషయము స్పష్టము చేయవలసి యుంది. అదేమనగా సమస్త జడ సముదాయము సంచాలనము చైతన్యము చేస్తోంది.
వ్యతిరేకానవస్థితేశ్చ అనపేక్షత్వాత్!

సాంఖ్య మతావలంబకుల ఆలోచన ప్రకారము జడ ప్రధాన్‌ను మాత్రమే విశ్వసిస్తూ మరెవ్వరిని పరిగణనలోకి తీసికోలేదు. ఒకవేళ జగత్తు ఉత్పత్తి చేయటం దాని స్వభావమైతే, అలాంటప్పుడు ప్రళయ కాల కార్యములో దాని ప్రవృత్తి ఏమైంది? అందుకని ప్రధాన్‌ను జగత్తుకు కారణమని చెప్పలేము.
అన్యత్రాభావాచ్చ న తృణాదివత్!

ఏ గడ్డి ఆవు ద్వారా తినబడుతుందో దాని ద్వారా పాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ గడ్డిని ఎద్దులకు, అశ్వములకు తినిపించిన యెడల పాలు రావు. దీనివలన రుజువగునదేమనగా విశిష్టమైన చైతన్య సహయోగము లేనిదే జడ ప్రకృతి జగత్తు రూపము ధరించదు.
(యం. వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాల నుంచి)

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular