Vivekananda Movie in Telugu

Dear Friends,
Pls. Check the Following link.

For More Information:
వివేకానందుడి గురించీ ఆయన బోధల గురించీ కొంత తెలిసినవారికి - ఆయన జీవితాన్ని సినిమాగా చూడాలని అనిపించడం సహజం. సహజమైన బెంగాలీ వాతావరణంలో బెంగాలీలే తీసిన ఓ గొప్ప చిత్రం ఉంది. వివేకానందుడి గురించి మన తెలుగువాళ్లు ఇప్పుడు తీస్తున్నవాటికంటే - బెంగాలీ వాతావరణం... ఆనాటి కాలం గురించి మనకంటే బాగా తెలిసిన వాళ్లు తీసిన సినిమా ఎంతో గొప్పగా ఉంటుందని - ముఖ్యంగా సహజంగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా అలాగే ఉంది కూడా.
ఆ చిత్రాన్ని ఈ మధ్య రామకృష్ణమఠం వాళ్లు తెలుగులోకి డబ్ చేసి మనకోసం అందించారు. డబ్బింగ్ పెద్ద గొప్పగా ఉండకపోయినా - విషయం బాగా అర్థమవుతుంది. దృశ్యాలు సహజంగా ఉంటాయి. వివేకానందుడి జీవితంలో చికాగో సభ ముందువరకూ ఏం జరిగిందో ఈ సినిమాలో చూడచ్చు. వివేకానందుడు కన్యాకుమారి అగ్రం మీద కూర్చుని ధ్యానం చేసేవరకే ఈ సినిమా కథ ఉంటుంది. కానీ ఆయన బాల్య జీవితం, కౌమార దశ, రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం ఇవన్నీ - అక్షరాలా జీవితచరిత్రలో ఉన్నట్టుగానే దీంట్లో తీశారు. ముఖ్యంగా నటులు అత్యంత సహజంగా ఉంటారు.
వివేకానంద జీవిత చరిత్రని సినిమాగా చూడాలని అనుకునేవాళ్లకి ఈ వీడియో ఎంతో నచ్చుతుంది. అంతే కాదు... ఆయన జీవిత చరిత్ర చదవనివాళ్లు ఈ సినిమా చూసి వివేకానందుడి గురించి ఎన్నో తెలుసుకోవచ్చు. ఆ వీడియో ఇక్కడ చూడండి. నిడివి నాలుగు గంటలుందని కంగారు పడి చూడడం మానేయకండి. మొదటి సగం... రెండు గంటల ఆరునిమిషాలు మాత్రమే తెలుగు సినిమా. దాని తరవాత బెంగాలీ ఒరిజినల్ కూడా కలిపి ఒకే ఫైల్ గా ఇచ్చారు. అందుకే నాలుగు గంటలపైన అయింది
thanks
fb.com/vivekavaani

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి