SITARAM JINDAL FOUNDATION Honours 27 Awardees for exemplary contributions to the Society
S R Jindal FOUNDATION Awardees 2011 - Dr. Ghanta Gopal Reddy
SITARAM JINDAL FOUNDATION
Honours 27 Awardees for exemplary contributions to the Society
Selected by the juries comprising very eminent persons.
S R Jindal Prize - Rs.25 lakhs each
For Rural Development & Poverty Alleviation
Dr. Ghanta Gopal Reddy
Winner ofS R Jindal Prize - 2011 for Rural Development And Poverty Alleviation
Dr. G. Gopal Reddy established Mahatama Gandhi Lift Irrigation Society in Gaddipalli village and solved the recurrent drought problem of his village. He provided leadership for this successful effort by securing the cooperation of all the farmers who contributed 10% of their land for common purpose. This scheme benefitted 7700 farmers to irrigate 6600 acres of land. He also motivated the villagers to take up other development works like establishment of a Krishi Vigyan Kendra, establishment of Sri Aurobindo Institute of Rural Development, education and health facilities, self help groups and animal husbandry facilities in the village.
'S R Jindal Prize -- 2011' for 'Rural Development and Poverty Alleviation' with a cash prize of Rs. 25 Lakhs is awarded to Dr. G. Gopal Reddy jointly with Lok Biradari, Prakalp, for his dedicated work for all round development of Gaddipalli Village of Andhra Pradesh.
I REQUEST YOU TO WATCH OUR VIDEO CLIP -
S R Jindal FOUNDATION Awardees 2011 - Dr. Ghanta Gopal Reddy
http://www.youtube.com/watch?v=NbP6KjHENY4
jindal prize URL links:
http://news.oneindia.in/2011/02/22/sitaramjindal-foundation-announces-indias-biggest-cashpri-aid0121.html
http://www.jindalprize.org/
http://www.jindalprize.org/awardees.htm
http://www.jindalprize.org/srjindalprize-25lks.htm
http://www.jindalprize.org/ghantagopal.htm
http://www.jindalprize.org/dox/Newsletter%202011.pdf
http://www.jindalprize.org/photos.php?id=6
http://www.jindalprize.org/founders-vision.htm
http://archives.eenadu.net/02-22-2012/district/inner.aspx?dsname=Nalgonda&info=nlg-panel2
http://www.youtube.com/watch?v=ErPgqJcF7LM&NR=1&feature=endscreen
http://www.youtube.com/watch?v=_SBoRY4R2bg&NR=1&feature=endscreen
http://www.youtube.com/watch?v=YuCIekS1UfA&NR=1&feature=endscreen
http://www.youtube.com/watch?v=lROn5zb9IZU&feature=related
https://archive.org/details/SRIMATHRUKRUPAGADDIPALLIABHYUDAYAMUDR.GANTAGOPALREDDY21
https://archive.org/details/SriMathruKrupa_GaddipalliAbhyudayamu_DrGantaGopalreddy
Agriculture Scientist | Ganta Gopal Reddy Dead https://youtu.be/4TrAhac5Nmg
గడ్డిపల్లి అభ్యుదయ రథసారధి
డా॥ గంటా గోపాల రెడ్డి గారు
డా॥ గోపాలరెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి రత్నమాల గారు
నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి వీరి జన్మస్థలము.
ఆ గ్రామము లోని
శ్రీ రాంరెడ్డి
- రంగనాయకమ్మ దంపతుల ముద్దుబిడ్డ శ్రీమతి రత్నమాల.
వీరి జననం 1938
సం||లో జరిగినది. వీరు గ్రాడ్యుయేషన్ చదువుచున్నపుడు,
1953 సం॥లో, డా॥ గోపాలరెడ్డి గారితో వివాహము జరిగినది. చదువు
అంతటితోనే ఆగిపోయినది.
సంసార జీవితము సుఖప్రదముగా సాగినది. ఈ దంపతులకు ఒక పుత్రుడు.
యిర్వురు కుమార్తెలు కలిగినారు. కుమారుడు అజిత్, కుమార్తెలు మీరా, లక్ష్మి.
డా॥ గోపాలరెడ్డి గారు అమెరికా నుండి ఉన్నత చదువులను పూర్తి చేసుకొని వచ్చిన
పిమ్మట,
కుమారుడైన అజితన్ను చదువునకై పాండిచ్చేరిలోని శ్రీ అరవిందాశ్రమ
విద్యాలయంలో చేర్చినారు.
అతని విద్య పూర్తి అయిన పిదప అతడు శ్రీమాత సన్నిధిలో
వుండుటకు,
ఆశ్రమములో చేరిపోయెను.
కుమార్తెలు యిర్వురు ఉన్నత విద్యనార్జించి,
గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, తమ భర్తలతో అమెరికాలో నివాసముంటున్నారు.
డా॥ గోపాలరెడ్డి గారు నిరంతరం గడ్డిపల్లి ప్రాజెక్టు పనులందు నిమగ్నులగుట
వలన,
వారి వ్యవసాయ నిర్వహణా బాధ్యతలను వారి సహధర్మచారిణి శ్రీమతి
రత్నమాల గారే. ఒక మేనేజరు,
యిద్దరు సహాయకుల సహకారముతో చూచు
చున్నారు. స్థానిక పాఠశాలలో చదివే ఒకరిద్దరు విద్యార్థులను తమ ఇంటిలోనే
వుంచుకొని చదివించుచున్నారు.
ఆ పిల్లలు అమ్మగారికి ఇంటి పనులందు
సహాయపడుదురు.
తమ పాలేర్లకు, యిరుగు పొరుగు వారికి సహాయపడుచు. వారి కష్టము
లలో పాలు పంచుకొందురు. ప్రతినిత్యం సాయం సమయములలో సమీపమందే
యున్న శ్రీ అరవింద ధ్యాన మందిరము'న ధ్యాన మొనరించెదరు. శ్రీమాతార
విందుల గ్రంథముల పఠనము నందు ఆసక్తిని కనబరచెదరు.
*************************************************************************************
శ్రీ గంటా గోపాలరెడ్డి గారి జీవిత విశేషములు
రచనా ఆవశ్యకత
ఆధునిక ప్రపంచంలోని శ్రీ అరవిందులు శ్రీమాత ఆధునిక యుగములో అవతరించిన అవతార
ద్వయం. వీరు యిర్వురు ఒకే చైతన్యము గలవారు. అపూర్వమైన విపత్కాల సమస్యలను పరిష్కరించుటకై వారు అరుదెంచినారు.
ఏమిటా
విపత్కాల పరిస్థితి ?
పాశ్చాత్య దేశీయులు, మహోన్నతమైన, సుఖ దాయకమైన,
విలాసవంతమైన,
అద్భుతమైన పట్టణ నాగరికతను నిర్మించి,
ప్రపంచాని కందించ
గల్గెరే కాని, శాంతిని ఆవిష్కరించలేక పోయారు. పాశ్చాత్య దేశాలు ఐశ్వర్య వంతమైనవే,
కాని ప్రస్తుత విషమ సమస్యలను పరిష్కరించలేక పోయినవి. జటిలమైన యిట్టి
సమస్యలను భారతీయ నాగరకత కూడా ఒడ్డున బడవేయలేదు. ప్రాక్ పశ్చిమాలు
రెండూ పరిష్కరించ వీలు కానటువంటి సంకటావస్థలోనికి నెట్టబడినాము. మనము
ఆర్ధికంగా సంపన్నులమైనాము.
ఆధునిక సౌకర్యములను ఆనందంగా అనుభవించు
చున్నాము. కాని శాంతి మాత్రము మనకు ఆకాశ కుసుమమే అయినది. దీనికి
పరిష్కారం కావాలి. శ్రీరాముడు,
శ్రీకృష్ణుని అనంతరం వచ్చిన అవతారం శ్రీ
అరవిందులది. వీరు మనకు తేటతెల్లంగా చెప్పిన సత్యం - మానవుడు మధ్యంతర
జీవి. పరిణామము యింకా కొనసాగుచునే యుంది.
ఈ పరిణామము యిదే విధంగా,
అతిమానస జీవుల ఆవిర్భావము వరకు సాగగలదు. అతి మానస జీవులనగా,
సంపూర్ణ పరిపూర్ణతను సంతరించుకొన్నవారు. వారు మాత్రమే సంతృప్తికరమైన
పరిష్కారమును చూపగల సమర్థులు.
మన ప్రాంతమున, శ్రీమాతారవిందుల దివ్యజ్యోతిని వెలిగించి, ప్రజ్వలింప
చేసినవారు,
Prof. V. మధుసూదనరెడ్డి గారు. వీరు హైద్రాబాదులోని ఉస్మానియా
విశ్వ విద్యాలయములో తత్వశాస్త్ర ఆచార్యులుగా పని చేసినవారు. వీరు శ్రీ
మాతారవిందుల అనుంగుబిడ్డ.
వారి చరణముల వద్ద తన జీవితమును సమర్పించు
కొన్న ధన్యజీవి.
అనన్య భక్తి ప్రపత్తులను కలిగిన భాగ్యశాలి; విశిష్టమైన శిష్యుడు.
శ్రీ అరవిందుల దర్శన శాస్త్రమును ఔపోసన బట్టినవాడు కావున ఆ తత్త్వమును,
మన
దేశమందే గాక ఖండాంతరములందును వ్యాప్తి చేసిన ఘనుడు. వారి మేధోపరమైన
స్థాయికి తగినట్లుగా, వినూత్నము, విలక్షణమైనట్టి శ్రీ అరవిందుల దర్శనమును విశ్వ
మందంతటా వ్యాప్తి చేయుట కొరకు,
శ్రీమాత వారికి 'Institute
of Human Study'
అను సంస్థను, మరియు "New
Race" అను పత్రికను ప్రసాదించినారు. వారి
నుండి మనము, అనేకమార్లు గంభీరము,
గతి శీలమైన రీతిలో,
శ్రీమాతారవిందుల '
తత్వమును వినుటతో మనమంతా అదృష్టవంతులమైనాము. శ్రవణానందముగాను,
అతి సరళంగాను, మన భాషలో,
మధురముగా,
ఈ దర్శనాన్ని అందించిన మరొక
మహనీయులు శ్రీ తెన్నేటి పూర్ణచంద్రరావు గారు. గత ముప్పదేండ్లుగా ఈ
మహనీయుల ఉపన్యాసములను విన్నాము. అనేకమారులు అక్కడక్కడ జరిగిన
శిబిరములందు,
మహాసభలందు పాల్గొంటూనే యున్నాము. వీటన్నిటి ఫలితముగా
శ్రీ అరవింద తత్త్వమును సైద్ధాంతికంగా మాత్రమే గ్రహించ గల్గినాము. కాని అనుభవ
పూర్వకంగా కాదు. దేనినైనా,
అనుభవ పూర్వకముగా గ్రహించనంత వరకు అవి.
సమగ్రము కానేరదు. ఒక అంశమును సంపూర్ణంగా అవగాహన చేసికొనుటకు,
సిద్ధాంత పరము, అనుభవ పూర్వకమైన యిరు పార్శ్వములు అవసరమైనవే. ప్రస్తుతము
మనము అనుభవ రాహిత్య అవగాహనతో కొట్టుమిట్టాడుతు, కొంత నిరుత్సాహమునకు
లోనయిన మాట వాస్తవము.
మన అదృష్టంకొద్ది, ఈ పరిస్థితులలో ఒక ఆశావహకిరణము వలె,
నల్లగొండ
జిల్లాలో,
భూమాత భక్తుడైన రైతుబిడ్డ తెరపైకి వచ్చి, ఉపయోగితావాదముతో,
ఆచరణాత్మక,
అనుభవ పూర్వక, క్రియాత్మక కార్యనిర్వహణకు పూనుకొనుట
ముదావహము. ప్రస్తుతము ఆయన అదే జిల్లాలోని గడ్డిపల్లిలో పని చేయుచున్నారు.
ఆయన అమెరికాలో నున్నపుడు,
శ్రీ అరవింద తత్త్వ నిష్ణాతులైన,
శ్రీ A.B. పురాణి;
మరియు Prof. మధుసూదన రెడ్డి గారల చైతన్య పూరిత,
సృజనాత్మక ప్రసంగములను
విని,
వానికి ప్రభావితులై శ్రీ అరవింద తత్త్వమునకు ఆకర్షితులైనారు. శ్రీ గోపాలరెడ్డి
గారు మొట్టమొదటిసారిగా, శ్రీ అరవిందులను గురించి వినుట, వారి సమగ్ర
దర్శనమును గురించి తెల్సుకొనుట సంభవించినది. డా॥ గోపాలరెడ్డి గారు సామాన్య
వ్యక్తేమి కాదు. ఆయన ఆధ్యాత్మిక భావ సంపూర్ణుడు. శ్రీ అరవిందుల తత్త్వ
పరిచయముతో,
వారిలోని ఆధ్యాత్మిక ధార, ఒక్కసారిగా పెల్లుబికినది. అందునా,
శ్రీ అరవిందుల దర్శనములోని 'సమగ్రత' (Integral) ఆయనను మరింత ప్రభావితున్ని
చేసినది. ఉన్నత విద్యార్జనకై అమెరికాలో నివాసముండుట వలన వారికి ఉన్నత
స్థాయిలో ప్రణాళికలను రూపొందించు భావన వంటపట్టినది.
డా॥ గోపాలరెడ్డి
గారు అమెరికా నుండి “అగ్రానమీ"లో Ph.D. పట్టాను పొంది,
విజయవంతంగా,
తిరిగి వచ్చిన వెంటనే హైద్రాబాదులో Prof. మధుసూదనరెడ్డి గారిని కలిసి, తాను
నిర్వహించవలసిన కర్తవ్యమును నిర్దేశించుకొనుటకు వారితో సమాలోచన గావించెను.
డా॥ గోపాలరెడ్డి గారి అంతరంగంలో,
అలజడి చెలరేగుచుండెను.
ఆయన సదా
భారతీయ ఆధ్యాత్మిక యొక్క భవిష్యత్తును గూర్చి ఆలోచించు చుండిరి. ఆశ్చర్యకరమైన
విషయమేమంటే,
తానొక వ్యవసాయ శాస్త్ర విద్యార్థియై యుండి, నిరంతరం భారతమాత
_ యొక్క పునరుజ్జీవము,
పరమ వైభవమైన ఆధ్యాత్మిక భారతావని ఆవిష్కరణ ఎలా
జరుగును ? ఏమి చేయాలి ? వ్యవసాయ శాస్త్రము నందు పారంగతుడను,
నా
చదువు ఈ దేశానికి ఏ విధముగా ఉపయోగపడగలదు ? అత్యంత శోభాయమానంగా
గతము నందు వర్ధిల్లిన భారత దేశము తన స్వధర్మమైన ఆధ్యాత్మికతను సాధించుట
ఎట్లు ?
ఆంధ్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి :
గోపాలరెడ్డి గారి అంతరంగములో భారతదేశమునకు సంబంధించిన
బహువిధములైన ఆలోచనలు బయటకు తొంగి చూస్తున్న ఆ సమయంలోనే,
ఆం. ప్ర.
వ్యవసాయ విశ్వవిద్యాలయములో ఆచార్య పదవి, వారిని వరించినది. (1969)
అసోసియేట్ ప్రొఫెసరుగా వారు 'Agronomy' డిపార్టుమెంటు మరియు 'Soil
Science స్నాతక, పూర్వోత్తర విద్యార్థులకు పాఠములను బోధించినారు.
అంతేగాక తన అవగాహన ననుసరించి,
కో-ఆర్డినేటర్
గా,
వ్యవసాయ కళాశాల యొక్క 'అకడమిక్ ప్లాన్'ను సంసిద్ధపరచుటలో చురుకైన చొరవను చూపి,
ఆధునికస్థితి కనుకూలముగా దానిని రూపొందించినారు.
ఆనాటి 'గడ్డిపల్లి'
స్థితి
గతులు:
గడ్డిపల్లి,
నల్లగొండ జిల్లాలోని, హుజూర్ నగర్ తాలూకా యందు ఒక
చిన్న గ్రామము. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, గడ్డిపల్లి గ్రామ శివారులో నుండి
పోవుచున్నది. కాని ఏమి లాభం? గడ్డిపల్లి చుట్టుముట్టు వున్న భూములు బీళ్లుగానే
మిగిలి పోయినవి. రైతులు తమ ఇండ్ల నుండి బయటికి వచ్చి చూచినపుడు వారికి
కనబడు దృశ్యము, బీడు పడియున్న భూములు ఒకవైపు, మరొకవైపు కాలువ నిండా
పొంగి పొరలు కృష్ణమ్మ పరుగులు. ఈ రెండింటిని చూచి, రైతులు కలకల చెందుచు
"అయ్యో! మేమెంతటి నిర్భాగ్యులము"
అని వగచుట తప్ప వారికి మరేమి మిగుల
లేదు. మృగతృష్ణ ప్రాయము వలె దాహార్తిని తీర్చుకోలేని దురవస్థ వారిది. అనాదిగా
ఆధారమైన ఋతుపవనములే వారికి శరణ్యము. తమ భాగ్యములో యింతే వున్నది
గాబోలు! అన్న రైతుల వగపు, తన చిన్న నాటి నుండి, మన గోపాలరెడ్డి గారు
చూచుచున్న విషయమే. ఈ సమస్యల నుండి మనము కొంత ముందుకు వచ్చి
చూడాల్సిన అవసరమున్నది.
అదేమన,
గడ్డిపల్లి,
దాని పరిసర గ్రామముల భూములు
మెరుగైనవే,
వాని కొరత నీరు లేని తనము, అక్కడ నీరు లేదా ? ఉన్నది. కాని
ఉపయోగము లేదు. ఈ రెండింటి విషయమును ప్రక్కకు పెట్టి పరిష్కార దిశగా
ఆలోచించినపుడు,
యిక్కడ డా॥ గోపాలరెడ్డి గారు రంగప్రవేశము అవసరమైనది.
వారు వ్యవసాయ శాస్త్రములో అత్యున్నచదువులను,
అధ్యయనం చేసినవారు ఉన్నత
స్థాయిలో ప్రణాళికలను రూపొందించి,
భూ,
సంబంధ సమస్యలను పరిష్కరించుటలో
సిద్ధహస్తులు. వారు స్వదేశమునకు తిరిగివచ్చిన నాటి నుండి, తమ జన్మభూమి
వ్యవసాయ సమస్యలు, మనఃశాంతి లేకుండా చేసినవి. దీనికి సంబంధించిన భావనలు,
ఆలోచనలు వారి మనస్సునందు నిరంతరం మెదులు చుండెను;
నిరంతర సంభావనలు,
అంతరంగంలో మెదులుచుండుట వలన ఆ బీడు భూముల సాగుకు సంబంధించిన
అమూల్య ఆలోచనొకటి తళుక్కున వారి మదిలో స్ఫురించెను. అదే "లిఫ్టు ఇరిగేషన్"
- ఎత్తిపోతల నీటితో సాగుచేయు పద్ధతి. భారీ ప్రాజెక్టుకు చెందిన పంట కాలువ,
గ్రామ పొలిమేరల గుండా, జీవనది వలె నిరంతరం ప్రవహించుచున్నది. దానిని
సద్వినియోగ పరచుకొనుట కన్న, మరొక మార్గము లేదన్నది తేలిపోయినది. ఈ
విషయమును గడ్డిపల్లి దాని పరిసర గ్రామముల రైతులకు,
ప్రజలకు,
వివరముగా
దాని మంచి చెడులను వివరించినారు. దీనికి వారంతా ముక్త కంఠముతో తమ
అంగీకారమును తెలిపినారు.
డా॥ గోపాలరెడ్డి గారు దీనికి సంబంధించిన సంపూర్ణ ప్రణాళికను
రూపొందించి,
గడ్డిపల్లితో ఏడు గ్రామముల ప్రజలు దీనిని బలపరుస్తున్నట్టు వారి
ఆమోద అంగీకార పత్రములతో సహా,
ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నివించారు.
ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి,
ఉన్నాతాధికార గణములతో చర్చించి,
దాని
సాధ్యాసాధ్యతలను,
అందుకు రైతులందించు సహకారాన్నీ,
వగైరా విషయాలను
వివరించి,
ప్రభుత్వమును “లిఫ్టు ఇరిగేషన్” పద్ధతి ద్వారా నీటిపారుదల అవకాశమును
కల్పించుటకు అంగీకరింప చేయుట జరిగినది.
ఫలితముగా ఆం.ప్ర.
ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ (P.W.D.) డిపార్టుమెంటు
(ప్రాజెక్టు వింగ్) ద్వారా G.O.Ms. No. 194, తేది: 31-5-1969,
సానుకూలముగా
విడుదల అయినది. దాని ప్రకారం,
నాగార్జునసాగర్ ఎడమ కాలువ క్రింద 72.4
మైళ్ల వరకు ఇరుప్రక్కల రమారమి 50 వేల ఎకరాలకు “లిఫ్టు ఇరిగేషన్ పద్ధతి”
ద్వారా,
నీటి పారుదల అవకాశమునకు మంజూరు యిచ్చినది.
ప్రజలందరు,
తమకు
ప్రభుత్వము కల్పించిన ఈ సౌకర్యమునకు,
కృతజ్ఞతలను తెలియచేసుకొన్నారు.
శ్రీమాత
అనుగ్రహంతో డా॥ గోపాలరెడ్డి గారు సాధించిన ఘన విజయమును వేనోళ్ల పొగిడి,
వారి నాయకత్వమునకు జేజేలు పలికినారు. వారి ఆదేశానుసారము, ముందుకు
సాగుటకు కృతనిశ్చయులైనారు.
పూర్వము భగీరథుడు గంగామాతను దివి నుండి
భువికి తెచ్చినట్లు నేడు డా॥ గోపాలరెడ్డి గారు 'సాగర' జలమును గడ్డిపల్లి భూములలోకి
ప్రవహింపజేసి,
అపర భగీరధుడుగా అందరి మన్ననలను పొందినారు.
ఆనాడు మహాత్మాగాంధీ జయంతి,
(2-10-1969) నాగార్జునసాగర్
కాలువలో నుండి నీటిని ఎత్తి పోయుట కొరకు భారీ మోటార్లను, పంపుసెట్లను,
అమర్చుట,
కాలువల నిర్మాణము యిత్యాది పనులను నిర్వహించుటకు
-
"మహాత్మాగాంధీ లిఫ్టు ఇరిగేషన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్" సంస్థను స్థాపించ
వారి నాయకత్వమునకు జేజేలు పలికినారు. వారి ఆదేశానుసారము, ముందుకు
జరిగినది.
ఆధునిక వ్యవసాయమునకుపయోగపడు యంత్రములను నిర్వహించుటకు,
యువకులను తీర్చిదిద్దుటకు 'కృషి విజ్ఞాన కేంద్రము' స్థాపింప బడినది. (1984-85)
ప్రస్తుత కాలమునకు తగినట్లు గడ్డిపల్లిలో "బయోటెక్నాలజీ ప్రాజెక్టు"ను
చేపట్టుట జరిగినది.
గ్రామీణ భారత నిర్మాణమునకు కావలసిన వివిధ క్షేత్రములందు
యువతను సంసిద్ధ పరచుటకు "శ్రీ అరవింద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్"
అను సంస్థను నెలకొలిపినారు. ఇంతే గాకుండా, విద్యాలయమును, ఆరోగ్య సంరక్షణకు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును,
మరెన్నిటినో స్థాపించినారు.
గడ్డిపల్లి ప్రజల ఆధ్యాత్మిక ఆకాంక్షకు తగినట్లు, శ్రీ అరవిందపురము
(గడ్డిపల్లి)లో శ్రీ మాతారవిందుల ధ్యానమందిరమును నిర్మించినారు. ప్రజలలో
మాతృభావమును జాగృత మొనర్చినారు. ఇన్నివిధములుగా,
ఆ గ్రామ నిర్మాణమునకు
తపించిన ఆ మహామనీషి డా॥ గోపాలరెడ్డి గారు ఆ ప్రాంత ప్రజల మార్గదర్శి. వారి
భాగ్యోదయమును తీర్చిదిద్దిన వైతాళికుడు,
ఇక అసలు విషయానికి రావాలి కదా ! డా॥ గోపాలరెడ్డి గారి జీవిత
చరిత్రను వ్రాయుటకు నేనెందుకు పూనుకున్నాను ? దీనికి ప్రధాన కారణమొక్కటే.
మాకు,
'గురు భాయి” గా,
40 సంవత్సరముల నుండి, మార్గదర్శనము చేయుచున్న
డా॥ మన్మోహన రెడ్డి (దాదాజీ) గారి నుండి అందిన ప్రేరణయే ప్రధానకారణము,
అని చెప్పక తప్పదు. ఒక సంవత్సరము క్రితము,
అనగా - 2009లో వారు నాకొక
సుధీర్ఘ లేఖ వ్రాసినారు. అందులో,
నల్లగొండ జిల్లా, గడ్డిపల్లి గ్రామములో జరిగిన
ప్రగతిని గూర్చి, దానికి కారణభూతుడైన డా॥ గోపాలరెడ్డి గారు సాధించిన
మహనీయమైన గ్రామాభ్యుదయమును గూర్చి వివరించారు.
వారి త్యాగశీలతను
వర్ణించినారు. అపార కరుణా సముద్రురాలైన శ్రీమాత అనుగ్రహముతో, ఆమె
నేతృతత్వముతోనే సిద్ధించిన ఆ ప్రగతిని విస్పష్టముగా వివరించి,
దానినంతా
ఉల్లేఖించుచు,
డా॥ గోపాలరెడ్డి గారి జీవిత చరిత్రను రచించుట కాదేశించినారు.
(ఆ లేఖ పాఠమును,
ఈ వ్యాసము చివరలో చేర్చబడినది.) గడ్డిపల్లిలో కొనసాగుచున్న
ప్రాజెక్టులన్నీ,
సంకల్పించిన విధముగా, నిర్విఘ్నముగా, శ్రీమాత ఆశీస్సులు,
అనుగ్రహము వలననే సిద్ధించినవని అందరి విశ్వాసము.
ఆదిలో జరిగిన
అద్భుత మహిమలు ఆ తరము వారిని బాగా ప్రభావము చేసినవి. ఆనాటి, ఆ
మహిమలను ఈ తరము వారు కథలు కథలుగా చెప్పుకొని,
శ్రీమాత పట్ల తమ
కృతజ్ఞతలను ప్రకటించెదరు.
అదెప్పుడు జరుగ గలదు ? ఎవరి వలన విన్నను
అది ఒక అంశము మాత్రమే కాని పూర్తి వివరములు తెలియుటకు అవకాశము
లేదు. ప్రతివారు తమ తమ అనుభవములకే పరిమితము గాకుండా,
సంపూర్ణ
చరిత్రను తెల్సికొనుట శ్రేయస్కరముగా యుండగలదని విషయము లన్నీ అవగాహన
జరిగిన పిమ్మట, వారికి శ్రీమాత,
శ్రీ అరవిందులపై ప్రేమాభిమానములు పెరిగి భక్తి
భావము బలపడగలదని, మరెందరికో మార్గదర్శనము కాగలదని, ఈ ప్రయోజనము
సిద్ధించుటకు,
ఏమాత్రం తాత్సారం చేయకుండా,
గడ్డిపల్లి కథానాయకుడు, డా॥
గోపాలరెడ్డి జీవిత చరిత్ర రచనకు పూనికతో ప్రయత్నించ వలసినదిగా,
దాదాజీ
సూచించినారు. శ్రీమాత భక్తులుగా మేము సహయోగులమైనందున,
వారి సూచనను
సుగ్రీవాజ్ఞగా తలదాల్చి, తక్షణమే అంగీకరించుట జరిగినది.
సమాచార సేకరణ:
శ్రీ దాదాజీ సూచనకు బలము చేకూర్చుటకాయన్నట్లు, మావద్ద నుండి,
మా మిత్రులొకరు శ్రీ అందె వెంకట్రామారెడ్డి గారికి విచిత్రమైన కోరిక గల్గినది.
అదేమనగా వారికి మన డా॥ గోపాలరెడ్డి గారిని,
వారి కార్యక్షేత్రమును చూడాలని,
గత ఐదు సంవత్సరాలుగా మేము ఒక్కచోటనే వున్నా వారీ విషయమును ఎప్పుడూ
ప్రస్తావించలేదు. వారి గడ్డిపల్లి సందర్శనా కోరిక పట్ల నాకు అమితమైన ఆశ్చర్యం
కల్గినది. అది కూడా దాదాజీ ఉత్తరమందిన తర్వాత, వారికి గడ్డిపల్లి పోవు మార్గము,
డా॥ గోపాలరెడ్డి గారిని,
వారి కార్యదీక్షను గురించి క్లుప్తముగా తెలియపరచినాను.
తర్వాత వారికొక చిన్న సూచన చేసినాను.
వారి జీవిత చరిత్ర వ్రాయాలని యున్నది,
కావున వారి బయోడేటా అడిగి తీసుకరావలసినదిగా కోరుట జరిగినది.
వారంరోజుల
తర్వాత తిగిరి వచ్చిన వారు నాకు డా॥ గోపాలరెడ్డి గారి బయోడేటాను,
వారు
| వ్రాసిన 'Spiritual
Party of India' అను గ్రంధమును తెచ్చి యిచ్చారు.
గోపాలరెడ్డి గారు ప్రేమతో పంపించిన ఈ రెండు నా రచనకు తోడ్పడినవి. వీనికి
తోడుగా పూర్వం దాదాజీ సంపాదకత్వంలో గడ్డిపల్లి నుండే ప్రచురింపబడిన మాస
పత్రిక "శ్రీ అరవింద కర్మధార" మిక్కిలి విలువైన సమాచారము నందించినది. ఈ
విధముగా వివిధ మార్గముల ద్వారా అందిన సమాచారాన్ని ప్రోది చేసి నా రచనలో
ఈ చిత్తు ప్రతిని 2010 ఆగస్టు దర్శనానికి ఆశ్రమమును
సందర్శించినపుడు దాదాజీ దానిని క్రమబద్ద మొనరించి శీర్షికల నామక్రమమును
తెల్పినారు. వాని నన్నిటిని క్రమపద్ధతిలో చేర్చి ఈ రచనను సాగించినాను. పైన
నాకు దాదాజీ నుండి అందిన లేఖ ఈ జీవిత చరిత్ర రచనకు మూలము అని పేర్కొని
యుంటిని ఆంగ్లములోని ఆ లేఖను యదాతదముగా అనువదించి యిక్కడ చేర్చుట
పొందు పరచినాను.
జరిగినది.
డా॥ మన్మోహన రెడ్డి గారి లేఖ
ప్రియమైన,
శ్రీ అరవిందాశ్రమము
30-3-2009
సురేంద్రాచార్యులు - నమస్తే.
నీ ఆరోగ్యం విషయములో నాకు చాలా చింతగా యున్నది. శ్రీమాత
కార్యాన్ని చిత్తశుద్ధితో చేయగలిగిన వాడవు నీవు ఒక్కడవేనని నా నమ్మకము. డా॥
గోపాలరెడ్డి,
గడ్డిపల్లి గారి జీవితము,
వారొనరించిన ఘనకార్యములన్నీ, నీవు బాగుగా
ఎరుగుదువు. వారు అక్కడ అద్భుత రీతిలో,
శ్రీమాత కార్యమున నిమగ్నులై యున్నారు.
ఆ కార్యసాధనలో, వారు పదే పదే ప్రభుత్వము వారిని సంప్రదించి, అవసరమైన
నిధులను తెచ్చుచున్నారు.
వీనిని గ్రామ సీమల అభివృద్ధి కొరకు వినియోగించు
చున్నారు. గ్రామసీమల అభ్యున్నతికై వారు అహర్నిశలు శ్రమ పడుచున్నారు. ప్రస్తుత
ప్రభుత్వములు పట్టణ ప్రాంతముల అభివృద్ధికి మరిన్ని నిధులను,
గ్రామ సీమల
అభ్యున్నతికి చాలి చాలని ధనమును వెచ్చించుచున్నారు.
డా॥ గోపాలరెడ్డి గారు,
ప్రభుత్వము నుండి లభించు వనరులనన్నిటిని రాబట్టుచున్నారు.
గ్రామ నిర్మాణం
కొరకు చాలా సంస్థలను స్థాపించి నడిపించు చున్నారు. అందులో మొదటిది మరియు
ప్రధానమైనది 'మహాత్మాగాంధి లిఫ్టు ఇరిగేషన్ సొసైటీ'
(M.G.L.I.) ఇది 1969
సం॥లో స్థాపితమైనది.
లిప్టు ఇరిగేషన్ కొరకు అమర్చిన మోటార్లు పంపుసెట్లు
పాతవైపోయినవి. వాని నన్నటిని మార్చి పెద్దవాని నమర్చుటకు మన ప్రభుత్వము
177% కోట్ల రూపాయలను మంజూరు చేసినది. పాతవి పనికి రాకుండా అయినందున,
వాని స్థానములో మూడంతల ఎక్కువ సామర్థ్యంతో పని చేయువానిని బిగించి, ఈ
మధ్యనే చాలా పెద్ద పైపులను అమర్చినారు.
నేను,
15-7-09 నాడు అచటికి వెళ్లి
చూచినాను. నూతనముగా అమర్చిన పైపుల గుండా నీరు వ్యవసాయక్షేత్రాలకు
ఉరుకులిడుచున్నవి. చాలా ఆనందం కలిగినది. ఆ పైపుల నిండా ప్రవహించేది
శ్రీమాత అనుగ్రహమే నని నాకు సంతృప్తి కలిగినది.
ఆ ప్రాంతమంతా పచ్చని పైరులతో పొంగి పొరలు చున్నట్లున్నది. ఈనాడు
ఇక్కడి రైతుల ముఖము నందు ఆనందము, తృప్తి పొంగుచు తొణికిస లాడుచున్నది.
అంతటా నూతనగృహ సముదాయములు వెలిసినవి. నూతన శోభను సంతరించు
కున్నవి. గడ్డిపల్లి,
పూర్వము నేనిచటనున్న దానికన్న మిన్నగా,
రూపాంతరము
చెందినది. ఇచటి విశాలమైన రోడ్లు,
వాని కిరువైపులు రకరకాల దుకాణ
సముదాయములు వెలసినవి.
ప్రజలు తమ తమ పనులందు నిమగ్నులైయున్నారు.
కొందరు సిమెంటుతో ఇటుకలను తీర్చి దిద్దుచున్నారు.
స్త్రీ జనము వారి నియమిత
కార్యములందు నిమగ్నులు ప్రతి వారిలో ఆనందము, సంతృప్తి తొణికిస లాడుచున్నది.
ఆ వ్యవసాయ క్షేత్రము లందు 30 ట్రాక్టర్లు నిరంతరం పని చేయుచున్నవి.
"శ్రీ అరవింద కృషి విజ్ఞాన కేంద్రము” మరియొక సంస్థ; ఇది ప్రభుత్వ
సంస్థ అయినను డా॥ గోపాల రెడ్డి గారి ఆధ్వర్యంలో పని చేయుచున్నది.
“గిరిజన సంక్షేమ సంస్థ” ఆ ప్రాంతములోని 'లంబాడి' వారి యోగక్షేమముల
కొరకు స్థాపించబడినది.
“బయో టెక్నాలజీ ప్రాజెక్టు" అనునది వేరొక సంస్థ. గడ్డిపల్లి వ్యవసాయ
క్షేత్రములో దీని అవసరమును గుర్తించి Prof. G. సత్యనారాయణ గారు యేర్పరచి,
పర్యవేక్షించు చున్నారు.
ప్రస్తుతము దీని ఆధ్వర్యంలో ఒక ప్రయోగశాల పని చేయు
చున్నది. ముందు ముందు దీనిలో భాగముగా "బయో టెక్నాలజీ కళాశాల"ను
స్థాపించ వలయునని Prof.
G. సత్యనారాయణ గారు పట్టుదలతో యున్నారు.
“శ్రీ అరవింద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్" అనునది మరొక
సంస్థ. ఇది శ్రీమాత వర ప్రసాదము. దీని స్థాపనకు సంబంధించిన పత్రములను
ఆనాడే ఆమె పరిశీలించి దానిపై తన సంతకమును పెట్టి,
ఆమోదించి,
డా॥ గోపాల
రెడ్డి గారిని ఆశీర్వదించినారు. గడ్డిపల్లిలో,
గ్రామీణాభ్యుదయమునకు వెలసిన సంస్థలు,
భవిష్యత్తులో దీని ఆధ్వర్యంలోనే పని చేయును. ఈ సంస్థ పెరిగి పెద్దదై ఒకనాటికి,
'Deemed Rural University" గా రూపొందగలదు. గ్రామీణుల ఆశయాలకు,
ఆకాంక్షలకు,
సాకారమును ప్రసాదించే కల్పవృక్షము కాగలదు.
డా॥ గోపాలరెడ్డి గారి జన్మదిన ఉత్సవ కమిటి
మన కథానాయకుడు డా॥ గోపాలరెడ్డి గారు 79
సంవత్సరములు గల
యువకులు. వచ్చే ఏడాదికి 80
యేండ్లు నిండున్నవి.
ఈ జయంతిని భారీ ఎత్తున
నిర్వహించి,
వారిని ఘనముగా సన్మానించ దలచినాను. అందుకొరకు దిగువ పెద్దలతో
ఒక కమిటి కూడా యేర్పాటైనది. వారి అంగీకారమును కూడా పొందినాను. డా॥
గోపాలరెడ్డి గారి జన్మదినోత్సవ కమిటి సభ్యులు -
1. డా॥ వి. మన్మోహన రెడ్డి - శ్రీ అరవిందాశ్రమము.
2. ప్రొ॥ జి. సత్యనారాయణ హైద్రాబాద్
3. శ్రీ వి. రామమోహనరెడ్డి సూర్యాపేట.
నీ పాత్ర: నీవొక చిత్తశుద్ధి గల భక్తుడవు. డా॥ గోపాలరెడ్డి గారి అభిమానివి. ఈ
80వ జన్మదిన సందర్భముగా వారికి, వారి జీవిత చరిత్రను అందించాల్సి యున్నది.
కావున నీవు వారి జీవిత చరిత్రను రచించ వలసి యున్నది. దానికి సంబంధించిన
సమాచారమును సేకరించుటకు కృషి చేయాలి. దాని ముద్రణా వ్యయమును నేనే
భరించగలను. నీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుచు, “శ్రీమాత ఆశీస్సులు”
పంపుచున్నాను... ఈ పనికి నేను నిన్ను ఎంపిక చేసినాను. 'ఇందుకు నీవే తగిన
వాడవు.
ఇది శ్రీమాత కార్యముగా భావించాలి. ఆమే నీకీ పని అప్పగించినది.
ఆమెను మనసారా ప్రార్థించి పని ప్రారంభించు.
నీవు పూర్తిగా కోలుకున్న పిమ్మట
గడ్డిపల్లి కూడా వెళ్లాల్సి యుండును. అచటి అభిమానుల ద్వారా సమాచారాన్ని
సేకరించాలి. వరుస క్రమంలో దానిని గ్రంధస్థం చేయాలి. ఉదాత్తమైన ఈ కార్యాన్ని
చేపట్టుట అత్యంత సంతోష దాయక విషయము కాగలదు. డా॥ రెడ్డి గారు నిస్వార్థ
పరుడు;
ఉన్నత చరిత్ర గల మహామనీషి,
కావున నీవు ఈ కార్యాన్ని తలదాల్చి,
పూర్తి చేయవలయునని నేను కోరుచున్నాను.
ఇట్లు….దాదాజీ.
జీవిత చరిత్ర రచనా ప్రయోజనము:
ప్రపంచ పరిస్థితులు, అనూహ్యమైన మార్పులతో,
సంక్లిష్ట స్థితిలో కూరుక
పోయినవి. నాగరకతయొక్క విభాగములన్నిటను, అశాంతి, అస్పష్టత రాజ్యమేలు
చున్నది. భారత దేశములోని పరిస్థితులు కూడా దీనికి భిన్నము కావు. మన
భారతీయ నాయకులు అన్నింటా విదేశములను,
అందు ముఖ్యంగా పాశ్చాత్యులనే
అనుకరించు చున్నారు.
మన రాష్ట్రము
- ఆంధ్రప్రదేశ్లో - శ్రీ అరవింద ఉద్యమము నకు ఊపునిచ్చి,
నూతన చైతన్యంతో నింపుటకు సంకల్పించి,
శ్రీ అరవింద తత్త్వ బోధనలకు,
ప్రయోగాత్మకముగా ప్రదర్శించి, గ్రామీణ భారతిని సుసంపన్నం చేసిన డా॥ గోపాల
రెడ్డి గారి జీవిత చరిత్ర రచన ద్వారా,
ఆ పని చేయనెంచి,
వారినే కథానాయకునిగా
స్వీకరించుట జరిగినది.
వారు శ్రీ అరవిందుల బోధనలకు నిర్దిష్ట రూపము. వారి
ప్రతిచర్య శ్రీ అరవిందుల సందేశమును ప్రసారం చేయుచున్నది. ప్రపంచ వ్యాప్తముగా
నైతే నేమి, మన భారతదేశము నందైతేనేమి,
సర్వత్రా వ్యాపించియున్న సంక్లిష్ట స్థితి,
నన్ను కొంత కలవరానికి గురి చేసినది. అయినను,
కోల్పోయిన నా చైతన్యమును
కూడగట్టుకొని,
ఈ సున్నిత సమయంలో,
విషయములన్నీ అంధకారమయంగా
గోచరించు చున్నవేళ, నా నిర్ణయమేమన కనీసము మన రాష్ట్రములోనైనా శ్రీ అరవిందుల
దర్శనమును,
బోధనలను,
వ్యాప్తి చేయాలని వీనిని ప్రయోగాత్మకముగా దర్శింప
చేసినచో నేను తలపెట్టిన ఈ ఉద్యమవ్యాప్తి జనుల హృదయాలలో, మిక్కిలి ప్రతిభా
వంతముగా ఆలోచింప జేయగలవని,
ఈ కార్యానికి నేను ఎన్నుకున్న పదములు
రెండు. 1) డా॥ గోపాలరెడ్డి,
2) శ్రీ అరవిందుల బోధనలు. ఈ రెండు పదములు
ఒకదానికి మరొకటిగా నిలుచునవి. ఈ రెండు ఒకే ముడిలో బంధింపబడి, ఒకటి
లేకుండా మరొకటి ఉండలేని స్థితి కలిగినట్టివి.
ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని కాదన
లేను. ఈ రెండూ నాకు కావలసినవే;
ముఖ్యమైనవే. అందుకని,
వందలాదిగా
శ్రీమాత అద్భుత మహిమలు చోటు చేసికొన్న, గడ్డిపల్లి లోని డా॥ గోపాలరెడ్డి గారి
జీవిత చరిత్రను వ్రాయుటకు ఎన్నుకొనుట జరిగినది.
శ్రీ అరవిందుల బోధనలకు,
శ్రీమాత మహిమలకు, ఇది ఉపకరించాలని ఆకాంక్షించుచు,
పాఠక లోకము నా
సాహసాన్ని మన్నించి, ఆశీర్వదించాల్సినదిగా అర్థిస్తూ...
గడ్డిపల్లి అభ్యుదయము
సుజన విధేయుడు,
జలదంకి సురేంద్రాచార్యులు
వైస్ చైర్మన్ శ్రీ అరవింద సొసైటీ, ఆంధ్రప్రదేశ్ కమిటి.
బాల్యము – విద్యాభ్యాసము:
ఆంధ్రప్రదేశ్లోని నల్లగొండ జిల్లా తెలంగాణా ప్రాంతములో నున్నది.
హైద్రాబాదుకు సరిహద్దు జిల్లా యగుట వలన, రాజకీయముగాను, విద్యారంగము
లోను మిక్కిలి చైతన్యవంతమైనది. 1956 సం॥ భాషా రాష్ట్రాల అవతరణకు పూర్వము,
నిజాం రాజ్యమైన హైద్రాబాదు సంస్థానములో అంతర్భాగముగా యుండేది. ఈ
జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ చైతన్యవంతులైన విద్యార్ధి గణమును తీర్చిదిద్ది
విజ్ఞానవంతులైన పౌరులను దేశానికిచ్చినవి. ఆనాడు ఈ జిల్లా ఆర్థికముగా వెనుక
బడి యుండెను. తర్వాత కాలమున జిల్లాలో నాగార్జున సాగరము ప్రాజెక్టు
అవతరించిన మూలమున, కరువు కాటకములను దులిపివేసి,
అన్నపూర్ణగా
అవతరించినది.
ఈ జిల్లాలోని హుజూర్ నగర్ తాలూకాలోని 'గడ్డిపల్లి'
అను గ్రామమందలి
శ్రీ గంటా అనంతరెడ్డి శ్రీమతి వెంకటనర్సమ్మ దంపతులు సంపన్నకుటుంబమునకు
చెందినవారు. 1932 సం॥లో, పిబ్రవరి 14వ తేదీన వారికొక మగశిశువు కలిగెను.
తల్లిదండ్రులా బాలునికి గోపాలరెడ్డియని నామకరణము చేసి, అల్లారు ముద్దుగా
పెంచుకొనిరి. అతి చురుకైన ఆ బాలుని బాల్యచేష్టలు తల్లిదండ్రులకు ఆనందమును
కలుగచేసెడివి. దినదిన ప్రవర్ధమానముగా పెరుగుచు 5 సంవత్సరముల ప్రాయము
వాడాయెను.
విద్యాభ్యాసము:
బాలుడైన గోపాలరెడ్డికి, తల్లిదండ్రులు సంప్రదాయానుసారము అక్షరా
భ్యాసము చేయించి, స్థానిక పాఠశాలలో ప్రవేశ పెట్టినారు.
గడ్డిపల్లిలోని పాఠశాలలో
1,2 తరగదులు చదివిన పిమ్మట, గ్రామీణ వాతావరణములో చదువుట కన్న, పట్టణ
ప్రాంతములోని పాఠశాలలో చదివిన వారికి మంచి విద్య, చైతన్యపూరితమైన జ్ఞాన
మందునని భావించిన తల్లిదండ్రులు మన గోపాలరెడ్డిని హైద్రాబాద్ నగరములోని
నృపతంగ విద్యాలయములో చేర్చించినారు. అక్కడ ఆ బాలుడు 2 సం||ల కాలము
విద్యార్జన చేసి, 3,4 తరగతులను పూర్తి చేసెను. ఈ విధముగా ప్రాథమిక విద్య
విజయవంతముగాను,
చైతన్యవంతముగాను పూర్తి చేసి, అన్ని విషయములందు
ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణుడాయెను.
అప్పుడాతనిని ఉన్నత పాఠశాలలో చేర్పించుట
సమంజసమని భావించిన తల్లిదండ్రులు,
'వివేక వర్గనీ విద్యాలయము'లో 5వ తరగతిలో
ప్రవేశ పెట్టినారు.
ఆనాటి నుండి వరుసగా 6 సం॥ల కాలము, అనగా 5వ తరగతి
నుండి 10వ తరగతి వరకు చదివి బోర్డు పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై కళాశాల
విద్యార్జనకు అర్హత సంపాదించెను.
కళాశాల విద్య :
గోపాలరెడ్డి రైతు కుటుంబమునకు చెందినవాడు. వారికి భూవసతి కూడా
చాలినంత గలదు. వ్యవసాయమందు ఆసక్తి గలవాడు. అందుకే అతనిలో వ్యవసాయ
శాస్త్రమునే చదువ వలయుననెడి పిపాస పెరిగినది.
కావున అన్ని విధములుగా
ఆలోచించి,
వ్యవసాయ విశ్వవిద్యాలయములో చేరుటకు దృఢ నిశ్చయుడయ్యెను.
సంకల్పమైతే చేసెను, కాని, స్వరాష్ట్రములో వ్యవసాయ శాస్త్రము అధ్యయనము
చేయుటకు అవకాశములు అంతంత మాత్రమే యున్నందున, అన్యరాష్ట్రములందే
చదువ వలయునని నిశ్చయించుకొని,
ప్రతిష్టాత్మకమైన విద్యాలయమునకై అన్వేషించి,
ఉత్తర భారతములోని సుప్రసిద్ధ అలహాబాద్ విశ్వవిద్యాలయమందలి అగ్రికల్చరల్
ఇన్స్టిట్యూట్ లో ప్రవేశమును సంపాదించి,
1948 నుండి 1952 సం॥ వరకు
శ్రద్ధగా అధ్యయనము గావించి,
ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణతను సాధించెను.
1952 సం||లో B.Sc. (Agri) పట్టాను సాధించి విజయోత్సాహముతో స్వరాష్ట్రమునకు తిరిగి
వచ్చెను. తను సాధించిన విద్య, పొందిన అనుభవములను గురించి తలపోయుచు,
వానిని ఆచరణలో పెట్టి ఆశించిన ఫలములను సమాజమునకు అందించవలయుననెడి
ఆశయాన్ని సిద్ధింప చేసికొనుటకు హైద్రాబాద్ రాష్ట్ర ప్రభుత్వమునకు విశదపరచి,
వ్యవసాయ శాఖలో ఉద్యోగమును పొందెను.
ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు:
అవి స్వరాజ్యమవతరించిన తొలి రోజులు. హైద్రాబాద్ రాష్ట్రము నిజాం
ప్రభువుల పాలన నుండి విముక్తమై భారత యూనియన్లో అంతర్భాగమైనది. దేశభక్తి
పూరితులైన ప్రజలు పాలకులు యావద్భారత దేశమును, శీఘ్రగతిని, అభివృద్ధి
సాధించుటలో ప్రథమ పంచవర్ష ప్రణాళికా కాలము 1952
నుండి 1957 వరకు
పరచుటకు పంచవర్ష ప్రణాళికలను రచించిరి. దీనికి అనుబంధముగా దేశాభివృద్ధిని
| ప్రప్రథమ ప్రాధాన్యతను "ఆహార కొరత నివారణ"గా చేపట్టి వ్యవసాయ విస్తరణకు
పెద్దపీట వేసినారు.
వ్యవసాయ విస్తరణాధికారి:
అలహాబాద్ విశ్వవిద్యాలయము నుండి,
వ్యవసాయ శాస్త్రములో B.Sc.
విస్తరణాధికారి'
(Agricultural Extension Officer) పదవిని,
హార్టికల్చర్ డిపార్టు
పట్టా పుచ్చుకొని వచ్చిన మన గోపాలరెడ్డికి, హైద్రాబాద్ ప్రభుత్వము వారు 'వ్యవసాయ
మెంటులో 6 మాసములు నల్లగొండ జిల్లాలోనే కట్టబెట్టినారు. నూనూగు మీసాల
నూత్న యవ్వనములో నున్న వారు నూతనోత్సాహముతో, పదవీ బాధ్యతలను
చేపట్టి కార్యరంగమున దుమికి,
1952 సం॥ నుండి 1958
వరకు అత్యున్నత
ప్రమాణములతో,
అందించినవారి సేవలకు ప్రతిగా హైద్రాబాద్ ప్రభుత్వము మెరిట్
సర్టిఫికేటు'
(Merit Certificate) ను బహూకరించి, వారిపై ప్రశంసల జల్లు
కురిపించినది. అంతేగాక,
నల్లగొండ జిల్లా 'వ్యవసాయ విస్తరణాధికారి'
గా అత్యుత్తమ
సేవలను అందించి, వ్యవసాయ రంగమును,
ప్రగతిపథములో నడిపించినందుకు,
1954-55 మరియు 1955-56 సం॥లలో ప్రభుత్వము వారు గోపాలరెడ్డికి “నగదు
పురస్కారము"ను యిచ్చి సత్కరించినారు.
విశిష్టమైన వారి సేవా నిరతి :
గోపాలరెడ్డి 'వ్యవసాయ విస్తరణాధికారి'గా నల్లగొండ జిల్లాలో, వ్యవసాయ
రంగ అభివృద్ధికై ఒక వినూత్నమైన విప్లవమునే సృష్టించి నారనుటకు,
వారు చేపట్టిన
దిగువ కార్యక్రమాలే తార్కాణముగా నిలుచును.
1. ఆధునిక వ్యవసాయం, సాంకేతిక శాస్త్ర పద్ధతిలో సాగాలని,
రైతాంగమునకు శిక్షణ యిచ్చుట. 2. రైతులు వ్యవసాయ క్షేత్రాలందు,
ప్రయోగాత్మక వ్యవసాయ ప్రదర్శన నిర్వహ
3. నూతన వ్యవసాయ పద్ధతులను,
రైతుల క్షేత్రాలలో, శిక్షణా పూర్వకంగా
నిర్వహించి చూపుట.
4. వ్యవసాయ పంటల మెరుగైన దిగుబడికి అవసరమగు ఎరువులను,
మందులను,
సకాలములో సరఫరా చేయుట.
5. వ్యవసాయ వార్తలను రైతులకు చేరవేయుట.
వ్యవసాయ రంగ అభివృద్ధిని మరియు రైతాంగము యొక్క ప్రయోజనమును
దృష్టియందుంచుకొని,
పై కార్యక్రమాలను వారు చిత్తశుద్ధితో నిర్వహించుటయే గాక
వారి సిబ్బందికి కూడా, రైతుబాంధవులకు అవసరమగు సహాయ సహకారములను,
సకాలములో అందించుటకు పురమాయించుటచే,
రైతులకు పంటదిగుబడి పెరిగి
ప్రయోజనము సమకూరినది.
గోపాలరెడ్డి పనికి కూడా గుర్తింపు దక్కినది.
ప్రభుత్వ
దృష్టి నాకర్షించిన వారి కార్యసరళి రాష్ట్రమందు ఆదర్శప్రాయమై నిలచినది.
అమెరికాలో ఉన్నత విద్యనార్జించుట:
శ్రీ గోపాలరెడ్డి యందు ఉరకలెత్తిన ఉత్సాహము యింకను పై చదువులు
పూర్తి చేసి, పరిశోధనా వ్యాసంగమును కూడా చేపట్టవలయునన్న ఆకాంక్ష పెరిగినది.
అవసరానికి అందివచ్చిన అవకాశమన్నట్లు,
అమెరికా ప్రభుత్వము వారు మన రెడ్డి
గారికి,
1958లో ఉన్నత చదువులకు Full Bright Scholarship ను ప్రధాన
మొనరించుట జర్గినది.
దానితో వారు అమెరికాలోని,
మిన్నెసోటా
విశ్వవిద్యాలయములో ప్రవేశాన్ని పొంది, 1958- 1960 సం॥లో భూమికి
సంబంధించిన శాస్త్రమందు, M.Sc. (Soil Science) (పరిశోధనా సహాయకులుగా)
పట్టా పొందినారు. ఆ తర్వాత అదే క్రమంలో గోపాలరెడ్డి గారికి East
West Centre
Fellowship పై, అమెరికాలోని 'హోనోలూలు' రాష్ట్రమందలి “హా వాయిల్
విశ్వవిద్యాలయము" నందు 1960 1964 సంవత్సరముల మద్యకాలములో
వ్యవసాయ శాస్త్రమందు పరిశోధన చేయుటకు ప్రవేశము లభించినది. భూమికి
చెందిన శాస్త్రము
(Soil Science) నందు పరిశోధనా వ్యాసంగమును విజయవంతంగా
నిర్వహించి,
Ph.D. పట్టాతో సత్కరింపబడి, విజయ దర్పముతో స్వదేశానికి తిరిగి
వచ్చిరి.
భారత దేశమునకు తిరిగి వచ్చుట: (డా॥ గోపాలరెడ్డి గారి మాటలలో)
"1964 సం|| ఏప్రిల్ 4వ తేదీన అమెరికా నుండి తిరిగి వచ్చి హైద్రాబాదులో
దిగినాను. 24-4-1964న దర్శనదినము నాడు ఆశ్రమమునకు చేరుకొని శ్రీమాతను
సందర్శించి,
ఆ జగన్మాత ఆశీస్సులు పొందినాను. అంతకు ముందే నిర్ణయించిన
విధముగా మా ఏకైక కుమారుడు చిరంజీవి అజిత్రెడ్డిని ఆశ్రమ పాఠశాల
(International Centre of Education) లో 4వ తరగతిలో చేర్పించినాను. అతను
అక్కడే చదివి, అనంతరము శ్రీమాత అనుమతితో శ్రీ అరవిందాశ్రమ సభ్యుడుగా
చేరిపోయినాడు. ఇది మా అదృష్టము మరియు గర్వకారణముగా భావించుచున్నాము.
శ్రీమాత ఒడిలో వానికి ఆశ్రయము దొరికినట్లే, ఆమాత యొక్క సంపూర్ణ అనుగ్రహము
మాపై కూడా ప్రసరించినది. అప్పటి నుండి ప్రతి దర్శనమునకు మేము
కుటుంబసభ్యులము,
ఆశ్రమానికి అమ్మ అనుగ్రహ ఆశీస్సులు పొందుటకు
వెళ్లుచున్నాము.
మేము ఆశ్రమానికి వెళ్లిన ప్రతిమారు,
ఆశ్రమ వ్యవసాయ క్షేత్రము (Ashram
Lake Farm) ను సందర్శించి,
అచటి అభివృద్ధిని చూచుట పరిపాటి అయినది. ఆ
క్షేత్రము సువిశాల మైనది. 300 ఎకరములలో విస్తరించి యున్నది అందులో
కొబ్బరి తోట, హార్టీ కల్చర్ వంటలు,
అనగా ఫలములు, కూరగాయల, పాలుత్పత్తి
తదితరమలైన పంటలను శ్రీ ద్యుమన్ గారి ఆజమాయిషీలో పండించుచున్నారు.
క్షేత్రము యొక్క నిర్వహణ చాలా చక్కగా నున్నది. శ్రీ డ్యుమన్ గారు దక్షిణ ఆఫ్రికానుండి
అరుదెంచినవారు. శ్రీ అరవిందుల అంతరంగిక శిష్యులు,
శ్రీ మాత అనుంగు బిడ్డ.
చాలా మారులు నేనాక్షేత్రమును సందర్శించటతో నాకు వారు మిత్రులైనారు.
ఆ
వ్యవసాయ క్షేత్రమునకు అనుసంధానముగా అక్కడొక వ్యవసాయ వృత్తి విద్యా శిక్షణా
సంస్థ'
(Vocational Agricultural Institution) నేర్పాటు చేసిన బాగుండునని వారితో
సూచించగా,
ఆ విషయమును శ్రీమాతకు వ్రాసి వారి ఆశీస్సులను పొందవలసినదిగా
వారు నాకు సంలహా యిచ్చినారు." ఆ విధమైన సంస్థ ఆశ్రమంలో లేదు. ముందు
ముందు తానచటికి వచ్చినపుడు నిర్వహించ వచ్చునను దృష్టితో నుండిరి.
కుటుంబమంతా ఆశ్రమానికి తరలి రావాలనే సంకల్పము వారిలో బలముగానే
యుండెను. అదే విషయమును తమ భార్యతో కూడా చర్చించి,
భవిష్యత్తులో తమ
బిడ్డలకిద్దరికి సమగ్ర విద్యలభించగలదని తలచినారు.
మొదట ఆమె సంశయించినది.
కాని తర్వాత తన అంగీకారమును తెల్పినది.
శ్రీ అరవిందాశ్రమం సందర్శించిన నాటి నుండి శ్రీమాత ప్రభావము గోపాల
రెడ్డిపై నిరంతర ముండుటచే,
ఆయనలో ఆశ్రమంలో చేరిపోవాలనెడి బలమైన ఆకాంక్ష
పని చేయుచునే యున్నది. ఇదే విషయమును పేర్కొనుచు ఆయన శ్రీ మాతకు నౌక
లేఖ వ్రాసి తన ఆకాంక్షను తెలిపెను.
సమాధానముగా శ్రీమాత నుండి ఆశ్రమంలో
వుండుటకు అనుమతి లభించినది,
కాని ఒక షరతు విధించినది. అదేమనగా "నీ
జన్మస్థలముతో సంబంధమును త్రెంచుకొని ఆశ్రమంలో చేరవచ్చునని",
తన లేఖపైననే
వ్రాసి తన ఆశీస్సులనందించినది. ఆశ్రమంలో చేరుటకు అనుమతి లభించినందుకు
ఆనందము,
జన్మస్థలముతో సంబంధమును త్రెంచివేయుట అసాధ్యమగుట దుఃఖ
దాయకము. ఇప్పుడిక చేయాల్సిన కర్తవ్యము బోధపడక,
తన తాతల నుండి
సంక్రమించిన భూములను విక్రయించుటకే నిశ్చయించి ప్రయత్నమారంభించెను.
కాని ఎవరు ఇంత పెద్ద ఆస్తిని కొనుటకు ముందుకు రాలేదు. ఆ గ్రామములో
ఆయనకన్న అధిక సంన్నులు లేరు. మిగిలిన వారందరు మధ్యతరగతి,
పేద వర్గమునకు
చెందినవారే యగుట వలన, తనకు నిరాశే ఎదురైనది.
ఎన్నివిధములుగా ఆలోచించినా
బోధపడలేదు. విఫల మనోరథుడై చేయునది లేక వగచుచు కాలము గడుపుచుండెను..
ఆయనలో క్రమక్రమముగా ఆశ్రమము పోవలయునన్న ఆలోచన అడుగంటినది.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం :
గోపాలరెడ్డి గారు అమెరికా నుండి తిరిగివచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో
1964లో నూతనంగా వెలసిన వ్యవసాయం విశ్వవిద్యాలయంలో "సైంటిఫిక్ పూల్
ఆఫీసర్" (Scientific pool Officer) గా తాత్కాలిక పదవిలో చేరినాడు. అపుడాయన
CSIR ఫెలోషిప్ వున్నాడు. ఆరు నెలలకే అసోసియేట్ ప్రొఫెసర్ పదవిని Soil
Science & Agricultural Chemstry డిపార్టుమెంటులో పదవిని యిచ్చినారు.
ఆనాటి నుండి అదే విశ్వవిద్యాలయములో April 1969 వరకు పని చేసినారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపక వృత్తి - వృత్తిలో ప్రవేశము :
డా॥ గోపాలరెడ్డి గారు వ్యవసాయ శాస్త్రములో అత్యున్నత శిఖరములకు
అధిరోహించి,
అమెరికా నుండి తిరిగి వచ్చిన పిదప, అభివృద్ధి చెందిన అమెరికా
దేశములో తాను పొందిన ఉన్నత వ్యవసాయ విద్యాఫలములను,
మన దేశీయ
విద్యార్థులలో పంచుటకు సంకల్పించుకొన్నారు. హైద్రాబాదులోని వ్యవసాయ విశ్వ
విద్యాలయము,
వారిని ఆహ్వానించి అధ్యాపక పదవితో సన్మానించినది.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయములో అసోసియేట్ ప్రొఫెసర్గా
పదవీ బాధ్యతలను చేపట్టి,
వ్యవసాయ విద్యకు చెందిన అకడమిక్ ప్లాన్ను సంసిద్ధ
పరచుటకై తీవ్రమైన కృషి చేసినారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయములో నిర్వహించిన కార్యములు :
1. వ్యవసాయ విద్యలో గ్రాడ్యుయేట్ & పోస్టు గ్రాడ్యుయేట్ తరగతులకు 'అగ్రానమీ'
(Agronomy) నందు మరియు భూమికి చెందిన శాస్త్రము (Soil Science)
నందు పాఠములను బోధించినారు.
2. విశ్వవిద్యాలయములోని అకడమిక్ కోర్సులకు చెందిన పాఠ్య ప్రణాళికను,
సంసిద్ధ పరచుటలో తీవ్ర కృషి చేసినారు.
3. పరిశోధనా మెథడాలోజి రూపొందించుట,
భూమిని పునరుద్ధరించుట,
దానిని
సారవంతము చేయుట,
నీటి సంరక్షణ మున్నగు రంగాలందు మెరుగైన
ఫలితాలను రాబట్టుటకు కృషి చేసినారు.
4. గురు పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు,
సహాయకులుగా యుండి,
వారికి
పరిశోధనా రంగమున ఉత్తమ శిక్షణను అందించినారు.
5. ఆం. ప్ర. వ్యవసాయ విశ్వవిద్యాలయములోని 'అగ్రికల్చర్ ఫ్యాకల్టీ బోర్డు మెంబర్'
గాను,
మరియు వ్యవసాయ విద్యాలయము యొక్క 'అకడమిక్ కౌన్సిల్ మెంబర్'
గాను చురుకైన పాత్ర పోషించినారు.
6. విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులకు
'అకడమిక్ ప్లానింగ్'ను సంసిద్ధ పరచినారు.
7. సాగు చేయు భూక్షేత్రముల అభివృద్ధి మరియు వవ్యవసాయ విశ్వవిద్యాలయ
విస్తరణ కార్యకలాపాల నిర్వహణను చేపట్టినారు.
8. వివిధ అంతర - వ్యవసాయ విశ్వవిద్యాలయ సెమినార్లలోను వర్క్ షాపుల్లోను
పాల్గొని అకడమిక్ ప్లానింగ్ పరిశోధనా రంగమునకు చెందిన పద్ధతులను
మెరుగు పరచుట,
గ్రామీణ వ్యవసాయాభివృద్ధి వంటి అంశము లందు
నిశితమైన తమ అభిప్రాయాలను తెలిపినారు.
*******************************************************************************************
గడ్డిపల్లిలో లిప్పు ఇరిగేషన్ యేర్పడుటకు
ప్రధాన కారణములు:
గడ్డిపల్లి గ్రామములో, లిఫ్టు ఇరిగేషన్ ఉద్యమము ప్రారంభమగుటకు 4 ప్రధాన సంఘటనలు చోటు చేసికొన్నవి.
1. శ్రీ గోపాలరెడ్డి గారి చిన్నాన్న గారు ఆయనను స్వార్ధపరుడనుట.
2. లింగాల గ్రామమునకు చెందిన శ్రీ మధుసూదన రెడ్డి గారు తమ గ్రామాల
వారందరకు లిఫ్టు ఇరిగేషన్ సౌకర్యమును కలుగు చేయుటకు ప్రయత్నించ
వలసినదిగా కోరుట.
3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఔదార్యము, 'నాగార్జున సాగరము'
ఎడమ కాలువ
నుండి లిఫ్టు ద్వారా నీరు తోడుకొని,
వ్యవసాయమునకు అనుమతించి, జీవో
విడుదల చేయుట.
4. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయములో పని చేయు ఆచార్యులందరకు
లిఫ్టు ఇరిగేషన్ విషయములలో శిక్షణ నిచ్చు - కమ్యూనిటి లిఫ్టు ఇరిగేషన్
సొసైటీలకు,
బ్యాంకుల నుండి ఋణ సదుపాయము కల్పించుటకు
అంగీకరించుట.
ఈ నాలుగు సంఘటనలు శ్రీ గోపాలరెడ్డి గారిని లిఫ్టు ఇరిగేషన్ దిశగా
నడిపించి,
ఆ కార్యసాధనకు ఊతము నిచ్చినవి. ఈ విధముగా ఆ మహత్కార్యానికి
అంకురార్పణ జరిగినది.
వివరములలోకి వెలదాం !
గడ్డిపల్లిలో లిఫ్టు ఏర్పడుటకు ప్రధాన సంఘటన:
శ్రీ గోపాలరెడ్డి గారి హైద్రాబాదులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో
ఉద్యోగం చేస్తన్నపుడు, వారమున కొకమారు గడ్డిపల్లి వచ్చెడివారు. ఒక పర్యాయము
తాను గ్రామానికి వచ్చినపడు మిత్రులను,
బంధువులందరిని కల్సికొనెడివారు.
ఎక్కువగా వారి చిన్నాన్న గారైన గంటా చిన అనంతరెడ్డి గారితో కాలక్షేపము చేయుటలో
తమ కుటుంబానికి చెందిన అనేక విషయాలను తెల్సుకొనెడివారు. వారితో మాటల
సందర్భమున ఒకమారు “గోపాలరెడ్డీ! నీవు చాలా అదృష్టవంతుడవు. పెద్ద పెద్ద
చదువులు చదివినావు.
పెద్ద ఉద్యోగము చేయుచున్నావు. నీవు మన కుటుంబమ
నకు గర్వకారణము.
నియంత చదువులు మన కుటుంబములో చదివిన
వారెవరున్నారు?
నీవే మన కులదీపకుడవు. గంటా వారి వంశకీర్తిని విస్తరింప
చేసినావు. నీవు ధన్యుడవు.
చల్లగా వర్ధిల్లు"మని దీవించి మరొక్కమాట కూడ
అనెను. "వారీ! ఎంతైనా నీవు స్వార్ధ పరుడివేరా !" మాటల సందర్భములో వారి
నోటి నుండి దొర్లినవి. అంతే కాని పనికట్టుకొని అతనిని నిందించాలని గాని,
కోపముతోగాని అనిన మాటలు కావవి. వారు ఎల్లపుడు అతి చనువుగాను హాస్యరస
భరతముగాను మాట్లాడెదరు.
తన చుట్టూ వున్న వారి నందరిని సదా నవ్విస్తుంటారు.
ఈ మాటలు గోపాలరెడ్డిలో కలకలమురేపినవి. ఇట్లించుకన్నాడబ్బా! అని ఆలోచనలో
పడిన ఆయన “ఎందుకు చిన్నాన్నా మీరావిధముగా అంటిరేమి ?" అని ప్రశ్నించాడు.
అప్పుడు “గత మూడు సంవత్సరాలుగా మన ప్రాంతములో వర్షములు లేవు, ఘోరమైన
కరువు యేర్పడి యున్నది. పంటలు లేవు. భూగర్భ జలములడుగంటినవి. బీద
బిక్కి జనము అన్నమో రామచంద్రా! యని అలమటించుచున్నారు.
దారుణమన
ఈ పరిస్థితిలో కూడా నీ బావిలో జలమున్నది. 10 ఎకరములలో పంటలు పండు
చున్నవి. పైగా నీవు పట్నంలో పెద్ద ఉద్యోగంలో నున్నావు. పైసలు కూడా పుష్కలము.
ఇన్ని విధములుగా నీ పరిస్థితి సురక్షితము.
మా బ్రతుకులకే ముప్పు యేర్పడినది.
కాదా ! నీవు ఎన్నడైనా మా గురించి ఆలోచించినావా? చదువుల్లో పెద్ద చదువు
నీది,
పైగా పట్నంలోని పెద్దలందరూ నీకెరుక. కావున మాకేదైనా దారి చూపంచ
వచ్చుకదా ! నీవు మాగురించి ఎప్పుడైనా ఆలోచించినావా?
నేనన్నది యదార్ధము
కాదా !" అని వారి చిన్నాన్న గారు యిదంతా వల్లించారు.
ఈ మాటలు మన గోపాలరెడ్డిలో ఆలోచనలను రేకెత్తించినవి. చిన్నాన్న
గారి మాటల్లో యదార్ధము లేదని కాదు. కాని ఆ పెద్దాయన ఈ విధముగా ఎప్పుడు
అనలేదు కదా ! అని వుంటే ఆలోచించేవాడను కదా ! అని తన మదిలోనే
అనుకొని,
యిప్పటికైనా మించిపోలేదు.
రైతాంగమంతా ఐక్యంగా ఒక్కమాటపై వుంటే
అందరి బ్రతుకులు బాగుపరచుకొనవచ్చననవి తన చిన్నాన్నతో అనెనె. అందుకు
వారు అదెట్లు సాధ్యపడునని ప్రశ్నించారు.
"దేశమంతటా కరువు ఏర్పడినది.
దీనిని అధిగమించుటకు ప్రభుత్వము
వారు - రైతులు సామూహికంగా లిఫ్టు ఇరిగేషన్ పద్ధతిలో నాగార్జునసారగ్ ఎడమ
కాలువ (లాల ్బహదూర్) నుండి నీరు తోడుకొని వ్యవసాయము చేసికొనుటకు మనకు
అవకాశమును కల్పించినారు.
ఆ మేరకు ఒక జీవోను విడుదల చేసినది. కలిసి
కట్టుగా ప్రయత్నించినపుడది సాధ్యము కాగలదు." అని మన శాస్త్రవేత్త తన చిన్నాన్నకు
విన్నవించెను.
సహజముగా సరళ స్వభావం,
ఉత్సాహవంతమైన నైజము గల వారి
చిన్నాన్నకు అమితానందము కల్గినది. మరొక ఆలోచన లేకుండా యిర్వురు కల్పి
ఈ బృహత్తర కార్యాన్ని సాధించుటకు నిర్ణయించుకున్నారు.
తాను పట్నంలోను,
అధికార గణంతోను సంప్రదింపులు జరుపుటకు పైరవీ చేయుటకు పూనుకొనెద
ననగా,
ఆ పెద్దాయన గ్రామ రైతులకు యీ విషయాన్ని తెలిపి,
వారినే గాక చుట్టూరా
వున్న పల్లెల లోని జనాన్ని కూడా నిద్రలేపి సమాయత్త పరచుటకు సిద్ధమైనారు.
అదే ఊపులో గ్రామ గ్రామానికి వెళ్లి రైతులకు నీటి విషయము తెలిపి,
మనం యిక
పంటలు పండించుకొనుటకు మార్గము యేర్పడినట్లు రైతాంగమునకు తెలియబరచగా
వారు వేసే అనేక ప్రశ్నలకు సరియైన సమాధానములిచ్చెను. ఎవరు చేయుదురు ఈ
పనినని వారు ప్రశ్నించినపుడు,
నేను మరియు మా అన్నకుమారుడు మేమిద్దరము
కల్పి 1 + 1 = 11 అని సమాధానము తెలిపి, అందరిని సమాయత్త పరచుపనిని
తన భుజానికెత్తుకొనెను.
ఈ విధమైన తన చిన్నాన్న ప్రయత్నము తనలో విశ్వాసమును
పెంచినది. కార్యసాధన జరుగ గలదని విశ్వాసము కుదిరినది.
తన చిన్నా గారిని
రైతులను ఆయత్తపరచుటకు తెలిపి తాను నిర్వహించాల్సిన కార్యములను సాధించు
దిశలో పట్నం వెళ్లి తన ప్రయత్నములందు మునిగిపోయెను.
లిఫ్టు ఏర్పడుటకు రెండవ సంఘటన-
శ్రీ మధుసూదన్ రెడ్డి,
లింగాల గారి ప్రోత్సాహము :
గడ్డిపల్లి గ్రామమునకు సమీపములోనే గల మరో చిన్న గ్రామము "లింగాల”.
అచటి పెద్ద రైతు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు. మన రెడ్డిగారికి అత్యంత సన్నిహితుడు,
బంధువు కూడాను. గోపాలరెడ్డి గారితో వారు కల్సినపుడు,
“నీవు వ్యవసాయ శాస్త్ర
వేత్తవు,
ఆ డిపార్టుమెంటు వారితో నీకు సంబంధాలున్నవి. నీవు యే విధముగానైనా
ప్రయత్నించి మన గ్రామాలకు లిఫ్టు ఇరిగేషన్ సౌకర్యము కల్పించాలి" అని కోరెడివారు.
వారి చిన్నాన్న గారు అనుటకు ముందు నుండే అడుగుచుండెను. ప్రయత్నించెదమని
బదులు చెప్పుటతోనే గడచిపోయేది. వీరి యిర్వురి ఆలోచన బీజప్రాయములోనే
ఆగి పోయినది:
లిఫ్టు ఏర్పడుటకు మూడవ సంఘటన-
ప్రభుత్వ అనుమతి జీవో విడుదల :
ఆనాడు మనరాష్ట్రములో యేర్పడిన కరువు పరిస్థితులకు ప్రజలు దుర్భర
స్థితులందు చిక్కుకొని తల్లడించు చుండిరి. వర్షములు లేవు. పంటలు లేవు.
పశుగ్రాసమునకు కూడా కొరత యేర్పడినది. మనుష్యులతో పాటు వారినాశ్రయించు
కొని యున్న మూగ జీవాలకు కూడా కష్టమే సంభవించినది. ఇట్టి తరి మన ప్రభుత్వము
వారు ఔదార్యముతో, నాగార్జునసాగరము యొక్క ప్రధాన కాలువ (లాల్ బహదూర్
కాలువ)కు యిరుప్రక్కన గల బీడు భూములను కమ్యూనిటి లిఫ్టు పద్ధతిలో ఇరిగేషన్
కొనసాగించుకొనుటకు అనుమతించి, జీవో విడుదల చేసినది. ప్రభుత్వము అన్ని
విధములుగా సహకరించుటకును, బ్యాంకులు కావలసిన ధనమును ఋణముగా
యిచ్చుటకు సౌకర్యము కల్పించబడినది. రైతులు సిద్ధమైతే చాలు. వీని నన్నిటిని
సమన్వయ పరచు నాయకత్వం కూడా ముఖ్యమైది.
లిఫ్టు ఏర్పడుటకు నాల్గవ సంఘటన-
వ్యవసాయ శాస్త్రవేత్తలకు బ్యాంకు అందించిన శిక్షణ :
బ్యాంకు అధికారులు తమ వాణిజ్యమును విస్తరించుట కొరకు, ప్రభుత్వము
వారు లిఫ్టు ఇరిగేషన్ సౌకర్యము కల్పించిన దృష్ట్యా,
ఒక యోజనను రూపొందించు
కొని,
వ్యవసాయశాస్త్రవేత్తకు,
అధికారులకు తాము కల్పించే ఋణసౌకర్యమునకు
విధించిన నియమములు, షరతుల వివరములను వారికి తెలియపరచి,
తగు విధముగా
రైతు కమ్యూనిటిని సిద్ధపరచుటకు శిక్షణ యిచ్చినారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయము
లోని ఆచార్యలందరకు ఈ శిక్షణ యిచ్చుట వలన, ఆ వివరములను మన రెడ్డి గారు
మొదటనే తెల్సియుండుట జరిగినది. ఆ విధముగా లిఫ్ట యేర్పాటుకై అనుకూలించినది.
ఈ విధముగా అన్ని సంఘటనలను పరిశీలించినపుడు, చిన్నాన్న గారి
'విమర్శ' నుండి లింగాల మధుసూదన్ రెడ్డి గారి ప్రోత్సాహము',
ప్రభుత్వ 'ఔదార్యము',
బ్యాంకు వారందించిన 'శిక్షణ'
- యివన్నీ మన కథానాయకుని ముందు నుండే
సంసిద్ధపరచుటకు తారసిల్లినట్లు అర్థము కాగలదు. దైవలీలను,
దైవ సంకల్పమును
ఎవరెరుగ గలరు. ఈ మహత్తరమైన కార్యసాఫల్యతకే వారుద్దేశించబడినట్లు ధృవ
పడుచున్నది. మహనీయుల వల్లనే కదా మహత్కార్యములు సిద్ధించునది
!
గడ్డిపల్లిలో గంటా అనంతరెడ్డి గారి ప్రయత్నములు :
గడ్డిపల్లి లిఫ్టు ఇరిగేషన్ పనిని మన గోపాలరెడ్డి గారు మరియు వారి చిన్నాన్న
అనంతరెడ్డి గారు భుజానికెత్తుకొని ఎవరి ప్రయత్నములో వారు నిమగ్నమైనట్లు చెప్పు
కున్నాము. వారి వారి పనులలో జరిగిన పురోభివృద్ధిని సమీక్షించి ముందేగుదాము.
ఉత్సాహవంతుడైన వారి చిన్నాన్న గారు ఊరంతా తిరిగి ప్రతిరైతును కల్పి
మనకు నాగార్జున సాగరజలము రానున్నది. అందరికి సుఖ సంతోషములు,
అతి
త్వరలో చేకూరగలవు.
మేము యిర్వురము అనగా, మా గోపాలరెడ్డి మరియు నేను
కల్సి ప్రయత్నించుచున్నాము.
గ్రామములోని రైతులందరి మధ్య ఈ విషయానికి
సంబంధించిన చర్చలు తీవ్రమైనవి. గడ్డిపల్లిలోనే కాదు పరిసర గ్రామాలందు కూడా
ఈ చర్చలు ముమ్మరమైనవి. నీరు వచ్చుట సాధ్యమా ? అసాధ్యమా ?
అని
ఎవరిడిగినా మన రెడ్డి ఏమి చెప్పకుండా తనపని తాను చేసుకపోవుచున్నాడు.
రైతుల
మధ్య నీటి సమస్య మీదనే చర్చలు జరిగినవి. రైతులందరిని పిలిచి ఈ విషయము
పై మీటింగ పెట్టుటకు ముందే గోపాలరెడ్డి గారు తన ఉద్యోగమునకు సెలవు పెట్టి
సమాచార సేకరణ కుపక్రమించెను. మొదటి పనిగా జీవో కాపీని సంపాదించి,
అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించుట,
రెండవ పనిగా వొల్టాస్ కంపెనీ వారితో,
తమకు భారీ తరహా లిఫ్టు పరికరములు అవసరమును తెల్పుట. గడ్డివల్లి మరియు
పరిసర గ్రామాలకు చెందిన 6,000 ఎకరములకు పారకమునకు తగిన ఇంజన్లను
సప్లై చేయుటకు కోరుట జరిగినది. ఆ తర్వాత ఇండియన్ హ్యూం పైపుల కంపెనీ
వారిని కల్పి వారు ఏమేరకు పైపుల నిర్మాణము చేయగలరో తెల్సుకొని మనకు
అవసరమగు సైజులను వారికి తెలియబరచుట జరిగినది.
ఆ తర్వాత అతి ప్రధానమైన
పని ఆర్థిక వసతిని సమకూర్చుట. అందుకొరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాదు
ఆఫీసుకు వెడలి జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) గారిని కల్పినారు.
వారు మన
గోపాలరెడ్డి గారికి పరిచయమున్నవారే. వారు వ్యవసాయ విశ్వవిద్యాలయములో
నున్నపుడు బ్యాంకు వారిచ్చిన శిక్షణ సమయములో పరిచయమైన వారగుట వలన
వారితో చనువు ఏర్పడినది. ఈ ప్రాజెక్టు పనిలో ముందుకు సాగవచ్చునా యని
అడుగగా పోవచ్చునని తెల్పినారు.
గోపాలరెడ్డి గారు ప్రభుత్వము నుండి జీవో కాపీని సంపాదించి వోల్టాస్
కంపెనీ వారిని, ఇండియన్ హ్యూం పైపుల కంపెనీ వారిని ఆపైన స్టేటుబ్యాంక్ ఆఫ్
హైద్రాబాద్ వారితో సంప్రదించి,
అన్ని సంస్థల నుండి అనుకూల స్పందన రాగా,
ప్రాజెక్టు పని ఆశావహంగానే అనిపించినది. అంతరంగంలో కార్యసాధన తథ్యమని
తేలిపోయినది. ఇక మిగిలిన పని జగన్మాత ఆశీస్సులు.
జగన్మాత అనుగ్రహమునకు అభ్యర్థన:
లోగా తాను ఆశ్రమంలో స్థిరపడుటకు సంకల్పించి శ్రీమాత నర్ధించెను.
గడ్డిపల్లిలోతో సంబంధము త్రెంచుకొని రావచ్చునని శ్రీమాత అనుమతించినది. కాని
అది సాధ్యపడలేదు.
మరి యిప్పుడేది నిర్ణయము ? తనకు తాను తేల్చుకోలేని స్థితి.
మరొక మారు శ్రీమాతనే అర్థించి,
దైవేచ్ఛ ననుసరించి, తనకేది సురక్షితమైన మార్గమో
తెలుపవలసినదిగా వేడుకొనెను.
అందుకు శ్రీమాత "You
work at Gaddipally"
అని వ్రాసి తన ఆశీస్సులతో పంపించినది.
మన గోపాలరెడ్డి గారు ఆ 'ఆశీస్సులను'
వట్టి మాటలుగానో లిఖింపబడిన అక్షరాలు గానో చూడక, దాని వెనక ఆధ్యాత్మిక
శక్తి,
బలము,
విజ్ఞానము,
సత్యము,
జ్ఞానము ప్రేమ యివన్ని వున్నట్లు భావించినాడు.
ఇవన్నీ ఆయనలో అజేయమైన విశ్వాసమును,
ధైర్యమును బలమును ఆయనకు
సంక్రమింప జేసినవి. కార్యసాధనలో వారికెట్టి విఘ్నములు, అవరోధములు
యిక్కట్టులు,
శతృత్వములు,
సహాయ నిరాకరణ లాంటి కష్టములు ఏర్పడవు అన్నట్టి
దృఢ నిశ్చయము కల్గినది. "శ్రీమాత ప్రసాదించిన వరములు నాకు రక్షణను కల్పించి,
మార్గదర్శనము చేయగలవను విశ్వాసము కలదు కావుననే నా సేవలను గడ్డిపల్లి
ప్రాజెక్టునకు - అనగా 6 గ్రామాలకు 6000 ఎకరాల భూమి సాగునకు వినియోగించ
దలచినాను" అని అనెను. "ఈ ప్రాజెక్టు పనిని నేను దైవకార్యముగా భావించి,
నన్ను నేను ఆ దైవము యొక్క పనిముట్టుగా భావించి,
మహనీయమైన ఈ "కృషి
యజ్ఞము” నకు నేను సర్వభావేన అంకిత మగుచున్నాను"
అని స్పష్టము చేసెను.
రైతాంగము మదిలో ఆనందోత్సాహములు నిండెను.
No comments:
Post a Comment