BLESSINGS RECEIVED FROM www.telugubhakti.com
పద్మనాభం దూర్వాసుల said...
మీ ప్రయత్నం చాలా బాగుంది. మరియు శ్లాఘించ తగినది.మీ ఆశయం ప్రశంసనీయం.ఇవి నా సూచనలు:1. ఇవి భక్తి గీతాలు కాబట్టి, మీరు కేటగిరీలు చేసి పోస్ట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రస్తుతమే అసంఖ్యాకంగా ఉన్న ఇవి ఇంకా పెరిగేక, ఎవరికైనా చూడటం కష్టం.2. బ్లాగు తెలుగులో ఉంటే మాలాంటి తెలుగు భాషాభిమానులకు కనువిందవుతుంది.3. తెలుగులో బ్లాగు చేసి దానిని కూడలి, జల్లెడ మొదలగు బ్లాగు సమాహారాలికి కలిపితే ఎక్కువ మందికి మీ బ్లాగు గురించి తెలుస్తుంది.4. మీరు హైదరాబాదులో ఉంటున్నారని తలుస్తాను. మీరు ప్రతి నెలా రెండవ ఆదివారం జరిగే ఈ-తెలుగు ( మరియు తెలుగు బ్లాగర్ల) సమావేశానికి వస్తే బాగుంటుందని నా సలహా.మీకు ఏదైనా వివరాలు కావాల్సి వస్తే నన్ను సంప్రదించ వచ్చు.దూర్వాసుల పద్మనాభంEmail: telugugreetings@gmail.comweb site: www.telugugreetings.fotorima.com Blog: www.telugugreetings.blogspot.com
Comments