పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మ సంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే || 11 || భావము : సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించడానికి ప్రతి యుగంలో నేను పుడుతూ ఉంటాను. వ్యాఖ్య పని లేకుండా ప్రపంచాని కెవ్వరూ రారు. ఈ విషయంలో భగవంతుడు కూడా విలక్షణంగా లేడు. సూర్యుడు ఉదయిస్తాడు. తెల్లవారుతుంది. ఆ తరువాత, తాను చేయవలసింది చేసి సూర్యుడు అస్తమిస్తాడు. వానొస్తుంది. భూమి తడుస్తుంది. గుంటలు నిండుతాయి. నదులు పొంగుతాయి. చెట్లు చిగురిస్తాయి. పంటలు పండుతాయి. ప్రయోజనం లేకుండా ఏ పనులు సాగవు. కాకపోతే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఎవరి బ్రతుకుల్ని వాళ్ళు చక్క బరచుకోవడానికి వస్తారు. కాని, భగవంతుని అవతారం మాత్రం అందరి బ్రతుకుల్ని చక్క చేయడానికి వస్తుంది. మర్త్యావతార స్విహ మర్త్యశిక్షణమ్ మానవ సమాజానికి శిక్షణ నిచ్చి రక్షించడానికే నిరాకారుడు నరాకారుడై అవతరిస్తాడు అన్నది. శ్రీమద్భాగవతం, రక్షణ అందరికీ కావాలి. కనుక, శిక్షణ అందరికీ అందాలి. కాకపోతే, శిక్షణా పద్ధతులు భిన్నంగా ఉంటాయి. శిక్షణను అందుకునే వారి ప్రవర్తనలలోని, ప్రవృత్తులలోని వ్యత్యాసా...