Saturday, November 23, 2024

నమస్తే తెలంగాణ & TELANGANAM 24 NOV 2024

రేవంత్ రెడ్డి .. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి పిల్ల చేష్టలు, గారడీ మాటలు,లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్ నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుంది ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి,జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్ చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు ***************************************************************************************************************** తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ✦ తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మలేదు. ✦ ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా.. మహారాష్ట్రలో 3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారు. ✦ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలి ✦ ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలహీనమవుతుంది. ✦ దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి లేదు. ✦ 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైన సంకీర్ణశకం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ✦ ప్రాంతీయ శక్తులను, ప్రాంతీయ పార్టీ నేతలను అణిచివేసే కుట్ర చేస్తే ప్రజలు ఎలా అండగా ఉంటారో ఝార్ఖండ్ ప్రజలు చూపించారు. ✦ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓటుతో బుద్ధి చెప్తామని ఝార్ఖండ్ ఓటర్లు తేల్చిచెప్పారు. ✦ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్లకు అభినందనలు.

#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642

 

చింతన - గీతా జయంతి సందర్భంగా..గీతామృత స్నానం

'సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం అని 'గీతా మహాత్మ్యంపలుకుతున్నది. అంటే, “భగవద్గీతఅనే అమృత జలంతో స్నానం చేసేవారికి సంసారమలం నశించిపోతుంది. కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలే మనిషికి ఆరు శత్రువులువాటివల్లనే శోకమోహాలు కలుగుతాయిఫలితంగా జన్మమృత్యు పరంపర కొనసాగుతుంది. 'గీతామృత స్నానం సంసార మలాన్ని తొలగిస్తుంది'గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతేఅనికూడ 'గీతామహాత్మ్యంపలికిందిఅంటేగీతా గంగాజలాన్ని తాగేవారికి పునర్జన్మే ఉండదుశ్రీకృష్ణ భగవానుడు 'గీతా సందేశంమధ్యమధ్యలో దాని మహిమను పదేపదే చెప్పాడు'ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే'. 'అర్జునానువు నాపట్ల ఏనాడూ అసూయ లేనివాడవుకనుక పరమగుహ్యమైన జ్ఞానాన్నిఅనుభూతిని నేను నీకు చెబుతున్నాను' (భగవద్గీత: 9-1) అన్నాడుఅంటే'గీతాసందేశం అత్యంత రహస్యమైందనిఅసూయా రహితుడైన కారణంగా అర్జునునికి తాను చెబుతున్నాననిభగవంతుడు అన్నాడు. 'పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్' (భగవద్గీత: 14-1) అని మరొక చోట అన్నాడు. అంటే,  'దేనిని తెలిసికొనిమునులందరు పరమసిద్ధిని పొందారో..  సమస్తజ్ఞానంలో ఉత్తమమైనపరమోత్కృష్టమైన జ్ఞానాన్ని తిరిగి నేను చెప్పబోతున్నాను'. ఇదే గీతా మహిమ. భగవంతుడు చేసిన గానమే భగవద్గీత. 'యుద్ధంలో బంధుమిత్రులనుగురువులను వధించి పొందే విజయం తనకు వద్దనిఅర్జునుడు తీవ్ర దుఃఖితుడై కర్తవ్య విముఖతను ప్రదర్శించాడు.

అప్పుడు అతనిలో తిరిగి 'కర్తవ్య పరాయణత్వాన్నినింపడానికి శ్రీకృష్ణ భగవానుడు చేసిన గానమే 'భగవద్గీత'. అది విన్న అర్జునుడు తన మోహాన్నిదుఃఖాన్ని,సందేహాలను విడిచిపెట్టి యుద్ధం చేశాడుచివరకు సంపూర్ణ విజయం సాధించాడుఅందుకేభగవద్గీత 'విజయగీతి'గా ప్రఖ్యాతి చెందిందిఇది అర్జునుణ్ని 'అనూహ్య విజయం వైపు'కు నడిపించిందిమానవాళిని కూడా ఓటమినుండి విజయం వైపుకు నడిపించే దివ్య సందేశమే 'భగవద్గీత'. సంపూర్ణ వెలుగులు సందేహాలుసమస్యలు చుట్టుముట్టినప్పుడు మనిషి తనకంటే ఉన్నతుడైనవాడని  భావించే మరొక మనిషిని ఆశ్రయిస్తాడు  వ్యక్తి పలికే  సలహాలను పాటించే ప్రయత్నమూ చేస్తాడు

అతడు బద్ధుడై ఉంటాడుకనుకఅతని మాటలు పూర్తిగా లాభకరమవుతాయనీచెప్పలేంమనిషి సత్వరజస్తమో గుణాలతో బంధితుడైఉంటాడు. 'జన్మమృత్యు జరావ్యాధుల'నే నాలుగు కష్టాలతో బంధితుడై ఉంటాడుఆకలిదప్పులు వంటి ఆరుక్లేశాలూ అతణ్ణి కట్టిపడేస్తాయిఅన్నిటికీ మించి అతడునాలుగు దోషాల నడుమ బంధితుడై ఉంటాడుఅవి:పొరపాట్లు చేయడం (ప్రమాద), మోహానికి గురికావడం (భ్రమ), అసమగ్రమైన ఇంద్రియాలనుకలిగి ఉండటం (కరణ పాటవ), మోసప్రవృత్తిని కలిగి ఉండటం (విప్రలిప్స). ఇవి బద్ధమనిషిని పీడించేనాలుగు దోషాలుఅందుకే,అతడు పలికే మాటలుసంపూర్ణంకాలాతీతం,సార్వజనీనం కాలేవు.అయితేభగవంతుడుపూర్ణుడుగుణాతీతుడు,నాలుగు దోషాలకు అతీతుడుకాబట్టిఆయన వాక్కు  కాలాతీతందేశాతీతమై ఉంటుంది.సర్వకాల సర్వావస్థలకూ అది అన్వయమవుతుందిభగవద్వాణియైన భగవద్గీత ఈరకంగానే  'కాలాతీత సందేశంఅయింది.

'శ్రుణు మే పరమం వచఃనా ఉత్తమమైన సందేశాన్ని వినుఅని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా సందేశం మధ్యలో చెప్పాడుభగవద్వాణి మనకు జీవితంలో సంపూర్ణ వెలుగులను ప్రసాదిస్తుంది.

మూడు రహస్య జ్ఞానాలు'భగవద్గీత'లో

మూడు రహస్యాలు వున్నాయిఅవి: రహస్యంరహస్యతరం,రహస్యతమం.

' జగత్తులో తాను అవ్యక్త రూపంలో వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణ భగవానుడు'గీతాసందేశం'లోచెప్పాడుఇది రహస్యజ్ఞానం.

ప్రతి జీవి హృదయంలో తాను పరమాత్మునిరూపంలో నిలిచి ఉండి అతని జీవనగతులను నిర్దేశిస్తున్నానని,ఎవరైతే ఆ రూపాన్ని శరణు పొందు తారో వారు పరమశాంతినిపరమపదాన్నిసైతంపొందగలరనిగీతాచార్యుడు ఉద్ఘాటించాడు.

ఇది'రహస్యతరజ్ఞానంఅయితేతననే  స్మరించడంతనకుభక్తులు కావడంతనను పూజించడంనమస్కరించడమనేది 'రహస్యతమ'జ్ఞానమని శ్రీకృష్ణుడు అన్నాడు.

'సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజసమస్త ధర్మాలను త్యజించి కేవలం నన్ను శరణు పొందుఅని శ్రీకృష్ణుడు పలికిన విషయమే 'రహస్యతమజ్ఞానం.

అణువణువునా భగవత్ప్రేమ భగవంతుడు నిరాకార బ్రహ్మ రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నాడనే 'రహస్య జ్ఞానంద్వారా మనిషి పాపభీతితో జీవిస్తాడు.

నిజానికి ధర్మాచరణలోనే ఉంటాడుపుణ్యకార్యాలనే చేపడతాడు విధంగా అతని జీవితం పురోగమిస్తుందిసకల జీవుల హృదయాలలో ఉన్న పరమాత్ముని రూపజ్ఞానమే 'రహస్యతర'జ్ఞానందానిని తెలుసుకోవడం ద్వారా మనిషి జగత్తులో అభయత్వాన్ని పొందుతాడుతన కార్యాలలో నిశ్చయంగా విజయాన్ని సాధిస్తాడుసర్వదా ఉన్నత జన్మలనే పొందుతాడుబుద్ధిమంతుడు కోరుకునేవి ఇవేగాఇక సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుని గురించి సంపూర్ణంగా తెలుసుకొనిఆయనను శరణాగతి పొందడం ద్వారా మనిషి మానవజన్మను సఫలం చేసికొనిమోక్షాన్ని పొందుతాడు. భగవత్ప్రేమను తన అణువణువులోనూనింపుకొంటాడుసకల మానవాళికి శ్రేయోభిలాషి అవుతాడుతరతరాలకు మార్గదర్శకుడువుతాడుఈ 'రహస్యతమ'జ్ఞానాన్ని తెలుసుకొన్న వారికి ' రహస్యరహస్యతర జ్ఞానాల వల్ల కలిగే ప్రయోజనాలు  కూడానిశ్చయంగా కలుగుతాయి.

DR. VAISHNAVANGRI SEVAK DAS

CELL: 9821914642

అనివార్యం.. గీతా శ్రవణం!

మనిషి బతికి ఉండాలంటేశ్వాసతీసుకోవడం అనివార్యంఅది  ఇష్టముంటే చేసేదిఇష్టం లేకపోతే ఆపే పని కాదు కదాఅలాగే మానవజన్మను సఫలం చేసుకొని,ఇహపరాలలో విజయం సాధించాలంటే  భగవత్సందేశ రూపంలోని 'భగవద్గీత'ను వినిఆచరించవలసిందే వినకపోతే వినాశనం తప్పదని గీతాచార్యుడే హెచ్చరించాడు 'నువు నాపట్ల చిత్తం కలవాడవైతే నా అనుగ్రహంతో జీవితంలోని అన్ని ఆటంకాలనూ దాటుతావుకానీనా మాటలు వినకుండానేను చెప్పినట్లు చేయకుండానీ ఇష్ట ప్రకారంపనిచేస్తే.. నశిస్తావు' (భగవద్గీత: 18-58) అని శ్రీకృష్ణుడు తీవ్రంగా పలికాడుకాలాతీతమైన గీతాసందేశాన్ని  ప్రామాణిక పరంపరలో తెలుసుకొనినేర్చుకొని నిత్య జీవితంలో ఆచరించాలి గీతాసంస్కృతిని అలవరచుకోగలిగితే సర్వాభీష్టాలను పొందగలం జీవితంలోని సర్వరంగాలలోనూ విజయాలను సాధించగలం.  స్వానుభవంతో గీతాసందేశ మహిమను సమస్త ప్రపంచానికి చాటి చెప్పవచ్చుఅప్పుడు ప్రపంచ జనులంతా సుఖజీవులవుతారుసర్వేజనా సుఖినోభవంతు

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular