Sunday, March 31, 2024
Saturday, March 30, 2024
Thursday, March 28, 2024
YOGA BOOKS FULL CILLECTION
అమ్మ #లిరికల్ఆడియో_వీడియో #lyricalvideo
అమ్మ
అమ్మలోని కమ్మదనం
'అమ్మ' అనే మాటలోని కమ్మదనం గుఱించి ఎంత చెప్పినా తక్కువే!
ఆ పద ఉచ్ఛారణతోనే మన మదిలో ఉద్విగ్నత, ప్రేమ భావం ఉప్పొంగుతాయి.
ఈ ప్రపంచము లోనికి రాక పూర్వము తల్లి గర్భమే మన నివాసం. తొమ్మిది
నెలలపాటు మానవుడు తల్లి గర్భములో ప్రాణం పోసుకొని జీవించడానికి
అవసరమైన మేధ, అవయవములు పెంపొందించుకుంటాడు.
మనిషి తొలుత తల్లిలోని శరీరాంతర్భాగమై ఎదిగి అమ్మలోని కమ్మదనాన్ని
ఆస్వాదిస్తాడు. ఈ భూమిపై మనుగడ సాధించడానికి అమ్మ తన బిడ్డకు అర్హత
కలిగిస్తుంది. ఈ శరీరం ద్వారా ఇహంలోనూ, పరంలోనూ ఏది సాధించినా
మనిషికి ఆలంబన, ప్రాతిపదిక తల్లే !
తన సంతానం సమాజంలో గౌరవంగా జీవించాలనీ, పరంపరాభివృద్ధి
సాధించాలనీ అమ్మ మనసా వాచా కర్మణా అభిలషిస్తుంది. అందుకోసం ఆ
తల్లి చేసే త్యాగాలు అపారమైనవి. తనను తాను జ్వలింప జేసుకొంటూ తన
సంతానానికి వెలుగును ప్రసాదిస్తుంది.
***
కష్ట సాధ్యమయిన అమ్మ పాత్ర
అమ్మలోని అవ్యాజ ప్రేమానురాగాలు ఏ కొలబద్దకూ అందనివి. అమ్మ
పాత్ర అత్యంత కష్ట సాధ్యమైనది. ఈ పాత్ర నిర్వహించడంలో అమ్మ శారీరక
మానసిక బాధలను కూడ లెక్క చేయదు.
అటువంటి తల్లికి నేటి సమాజంలో లభిస్తున్న స్థానం దయనీయమైంది.
కుటుంబంలోని వ్యక్తుల నుండి ప్రేమానురాగాలు కరువై వృద్ధాశ్రమాల్లో జీవిస్తున్న
తల్లుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. జీవిత చరమాంకంలో
నానమ్మగానో,అమ్మమ్మగానో మనుగడ సాగించాల్సింది పోయి 'ఆయాలు'గా,
అనాధలుగా జీవిస్తున్నారు.
కన్నా! “రా!" అని లాలించి పెంచిన తల్లిని కన్నవారు -
కాశీకైనా కాటికైనా పొమ్మని సూచిస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి.
米米米
అమ్మ గర్భమే గర్భగుడి
15 దైవ జీవ భావాలకు ఆలవాలమైన అమ్మ గర్భమే శిశువు ఆవిర్భానికి
కొలువైన గర్భగుడి.
అమ్మకు అమ్మ అయి పుడితే తప్ప తీరనిది ఈ జన్మాంతర ఋణభారం.
నెల తప్పడం తల్లితనం పరీక్ష ఉత్తీర్ణతలో మొదటి మెట్టయితే... క్రమం
తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో పండంటి బిడ్డను కనటం చివరి మెట్టు.
ప్రాణానికన్నా తాను ఎక్కువగా ప్రేమించే నాధుని నిజ ప్రాణ ప్రతిబింబాన్ని
ఆ నాథుని చేతిలో పెట్టాలనే ఏ వివాహిత అయినా కోరుకుంటుంది. ఆ
ప్రయత్నంలో తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని నైజం ఆమెది.
(-ఈనాడు సంపాదకీయం, తేది 24-09-2011)
మమ్మీగా మారిన అమ్మ
***
'నమాతుః పరదేవతా'
తల్లిని మించిన దైవం లేదు. తల్లిని మించిన గురువు లేడు. తల్లిని
మించిన హితుడు లేడు. తల్లిని మించిన పరతత్వం లేదు. తల్లిని మించిన
వస్తువు లేనే లేదు. ప్రతీ జీవికీ తల్లే పరమాత్మ!
భారతీయులకు తల్లి దైవ సమానం. ప్రపంచంలో ఏ సంస్కృతీ నేర్పని,
నేర్వలేని సంస్కారం మన భారతీయులది. 'మాతృదేవోభవ' అని చెప్పిన హిందూ
ధర్మానికి, సంస్కృతికి చేతులెత్తి నమస్కరించాలి.
సనాతన ధర్మ సౌరభాలు
మాతృభూమి, మాతృభాష, మాతృసంస్కృతి అంటూ మాతృదేవత
గొప్పదనాన్ని తెలియ జెప్పింది మన కర్మభూమిలోనే, మన జన్మభూమిలోనే!
విద్యకు అధిష్ఠాన దేవత సరస్వతి! ధనానికి మూల దేవత లక్ష్మి! బలానికి
అధి దేవత పార్వతి! మంత్రానికి మూల దేవత గాయత్రి! అందరూ
మూర్తులే!
ప్రతి మనిషికీ తల్లే ప్రధమ గురువు. ప్రతిబిడ్డ మొదటి పాఠాలు తల్లి
వద్దే నేర్చుకుంటాడు. ప్రతీ శిశువు తన నోటి నుండి మొదటిసారిగా పలికే
మాట 'అమ్మ'. కాని ఈ నాటి తల్లులందరూ విదేశీ భాష మోజులో 'అమ్మా'
అని అనిపించుకోవడము చిన్నతనంలా భావిస్తున్నారు. తద్వారా తమ విలువలను
తామే పోగొట్టుకుంటున్నారు. పరదేశ సంస్కృతితో పెరిగిన పిల్లలు పెద్ద అవగానే
తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. కొన్ని దేశాలలో చనిపోయినవారి భౌతిక
కాయాన్ని భద్రపరిచేవారు. అటువంటి దానిని 'మమ్మీ' అంటారు. అంతటి
అశుభమైన పదం పిల్లల నోటంట పదే పదే పలికించుకొని మురిసిపోతున్నారు,
అశుభాన్ని ఆహ్వానించుకుంటున్నారు ఇప్పటి తల్లులు.
'అమ్మ' పదం అమృత సమానము 'మమ్మీ' పదం మృత్యు సమానము.
* * *
ప్రేమించే గొప్ప హృదయం అమ్మది.
మన ముఖం చూడక ముందే, మన గొంతు వినక ముందే,
మన గుణం తెలియక ముందే, మనని ప్రేమించే గొప్ప హృదయం-అమ్మ!
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జీవితాన్నిచ్చింది. - అమ్మ!
అనేక జన్మలెత్తుతున్న అమ్మ
శ్లో॥ న పిత్రో రధికం కించి - త్రిలోక్యాం తనయస్యహి |
గర్భధారణ పోషాభ్యాం - పితుర్మాతాగరీయసీ ॥
(-సంస్కృత కాశీఖండము)
ముల్లోకములలోనూ తల్లే అధికము. గర్భధారణ, పోషణ అనెడివి
ఉన్నతండ్రి కంటె తల్లియే అధికము. ఇది మానవులలోనే కాక సకల
జీవరాశులలోను ఉన్నది. ప్రసవమనునది స్త్రీకి పునర్జన్మయే.
కొన్ని వర్ణములలో పురుషునికి ఒక సంస్కారము చేత ద్విజన్మత్వము
కలుగును కాని స్త్రీ ఒకే జీవితములో బహు ప్రసవముల ద్వారా అనేక
జన్మలెత్తుచున్నది. కడుపుతో ఉన్న స్త్రీ గర్భమును తత్త్వవేత్తలు దేవాలయములోని
గర్భాలయమని పరిగణింతురు.
పురుషుని కంటే స్త్రీలో సహనము, సంయమనము, సాహసము,
ఔచిత్యము, కుశలత, నిశిత బుద్ధి - ఇత్యాదులు అధికముగా ఉండును.
ఎన్ని పురుష జన్మలెత్తిననూ కనీసము ఒక జన్మలో నైనను స్త్రీగా
జన్మించనిదే పరిపూర్ణత రాదని పెద్దలు చెప్పుదురు.
సాటిలేని గొప్పదనం అమ్మది
(- గాయత్రీ దివ్యశక్తి గ్రంథములోనిది)
***
సాటిలేని గొప్పదనం అమ్మది
శ్లో॥ ఉపాధ్యాయాత్ దశాచార్యః - ఆచార్యాణాం శతం పితా |
సహస్రంతు పితౄన్ - మాతా గౌరవేణాతిరిచ్యతే |Comed
తా॥ పదుగురు ఉపాధ్యాయుల కంటె ఒక ఆచార్యుడు, నూర్గురు ఆచార్యుల
కంటె ఒక తండ్రియు, వేయిమంది తండ్రుల కంటే ఒక తల్లియు గౌరవము
చేత గొప్ప అగును.
***
ఆదిశంకరాచార్యుల వారి మాతృపంచకం
ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమము స్వీకరించినప్పుడు ఆయన
తల్లి తల్లడిల్లినప్పుడు, తల్లితో 'అంత్యదశలో ఉన్నప్పుడు తనను తల్చుకోగానే
వస్తాను' అన్నారు. ఆవిధంగానే తల్లి ఆర్యాంబ కాలడిలో మరణశయ్యపై ఉండి
తనను తల్చుకోగానే వచ్చి ఉత్తరక్రియలు (అంత్యక్రియలు) నిర్వహించారు.
ఆ సందర్భంలో ఆదిశంకరాచార్యులవారు చెప్పిన ఐదు శ్లోకాలు
‘మాతృపంచకం'గా ప్రసిద్ధి చెందాయి. మనస్సులను కదిలించాయి.
1వ శ్లోకం
శ్లో॥ ముక్తామణిస్తం నయనం మమేతి - రాజేతి జీవేతి చిరం సుతత్వం |
ఇత్యుక్త వత్యా స్తవవాచి మాతః - దదామ్యహం తండులమేవ శుష్కమ్ ॥
తా॥ అమ్మా ! ‘నువ్వు నా ముత్యానివిరా ! నా రత్నానివిరా! నా కంటి వెలుగువు.
నాన్నా! నువు చిరంజీవిగా ఉండాలి' అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో
ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను
క్షమించు.
2వ శ్లోకం
శ్లో|| అంబేతి తాతేతి శివేతి తస్మిన్ - ప్రసూతికాలే యదవోచ దుచ్చెః |
కృష్ణతి గోవింద హరే ముకుందే - త్యహో జనన్యై రచితోయ మంజలిః ||
తా॥ పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను 'అమ్మా !
అయ్యా ! శివా ! కృష్ణా ! హరా! గోవిందా !' అనుకుంటూ భరించి నాకు
జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
3వ శ్లోకం
శ్లో॥ ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యా క్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః
తా॥అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యధను
(కడుపునొప్పిని) అనుభవించావో కదా!
కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య
మలినమైనా - ఒక సంవత్సర కాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా!
ఎవరూ అలాంటి బాధను సహించలేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి
ఋణాన్ని తీర్చుకోగలడా? అమ్మా! నీకు నమస్కారం చేస్తున్నాను.
4వ శ్లోకం
శ్లో॥ గురుకుల ముప సృత్య స్వప్న కాలేతు దృష్ట్యా
యతి సముచిత వేషం ప్రారురోద త్వముచ్చైః
గురుకుల మథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః
తా॥ కలలో నేను సన్యాసి వేషంలో కనపడేసరికి బాధపడి మా గురుకులానికి
వచ్చి పెద్దగా విలపించావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ
బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.
5వ శ్లోకం
శ్లో॥ న దత్తం మాతస్తే మరణ సమయే తోయ మపివా
స్వధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధ విధినా
న జప్త్వా మాతస్తే మరణ సమయే తారక మను
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతర తులామ్
తా॥ అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణ సమయంలో
కొంచెం నీళ్ళు కూడ నేను నీ గొంతులో పోయలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి
'స్వధా' ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని
చదవలేదు. నన్ను క్షమించి నాయందు దేనితోను సమానము కాని దయ తల్లీ!
* * *
- ఆది శంకరాచార్యులు పిన్నవయస్సులోనే భవబంధాలను త్యజించి
సర్వసంగ పరిత్యాగి అయ్యారు. ఆయనను సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుని
సనాతన ధర్మ సౌరభాలు
అవతారంగా భావిస్తారు. అటువంటి ఆయన తన తల్లి మృత్తికి శోకిస్తూ
పలికిన శ్లోకాలు కన్నతల్లి స్థానాన్ని విశదపరుస్తున్నాయి.
米米米
తల్లి ఋణం తీర్చలేనిది
దేవ, ఋషి, పితృ ఋణాలు తీర్చవచ్చునేమో గాని మాతృఋణం
తీర్చలేనిది. మోక్ష మార్గాన్ని చూపే గురువు కన్నా, మోక్ష స్వరూపమైన తండ్రికన్నా,
జన్మనిచ్చిన తల్లి భూమి కన్నా విలువైనది. తల్లిని పూజించడం కంటే గొప్ప
లేదు! తల్లి ఋణం తీర్చలేనిది, తల్లి శాపం త్రిప్పలేనటువంటిది. అనుభవించక
తప్పదు. తల్లిని గౌరవించకపోయినా, హీనంగా చూసినా లేదా వృద్ధాప్యంలో
వదిలేసినా రౌరవాది నరకాలు తప్పవని శాస్త్ర కర్తలు నిర్ధారించారు.
米米米
శ్లో॥ జ్ఞాన మూలమిదం వేదమ్ భార్యా మూల మిదం గృహమ్
కృషి మూల మిదం ధ్యానమ్ ధనమూల మిదం జగత్ ॥
తా॥ వేదమే జ్ఞానానికి మూలము. గృహమునకు మూలము భార్య,
ధాన్యమునకు మూలము వ్యవసాయము. జగత్తునకు మూలము ధనము.
**********************************************************

మంచిమాట
.....
మిమ్మల్ని క్రిందికి లాగినప్పుడు వినయంగా ఉండడం గొప్పకాదు,
కానీ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు వినయంగా ఉండడమే
గొప్పు..
amma prema.pdf: https://drive.google.com/file/d/1oPF9SHRdnIsauDu3bH46kcTFNor9ix6K/view?usp=drive_link Sanatana Dharma Sourabhalu - KOMMURU UMAPRASAD.pdf: https://drive.google.com/file/d/1FiLy-lOVMWDxOhfdfKt5cfFlJh_blMUR/view?usp=drive_link
మంచిమాట
.....
మిమ్మల్ని క్రిందికి లాగినప్పుడు వినయంగా ఉండడం గొప్పకాదు,
కానీ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు వినయంగా ఉండడమే
గొప్పు..
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...