మన నాయకుడు ఉద్యమ ప్రతిబింబం గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయని అల్జీరియాకు చెందిన రచయిత, తత్వవేత్త, నోబెల్ గ్రహీత ఆల్బర్ట్ కామూ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్మిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొన్న సవాళ్లు, విమర్శలు, ఆరోపణలకు పై వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయేమో! ఉద్యమంలో గానీ, పాలనలో గానీ విమర్శలు ఎన్ని వచ్చినా కేసీఆర్ కుంగిపోలేదు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది' అన్న తన సంకల్పం ముందు అన్నీ పటాపంచలయ్యాయి. ఏపీ నుంచి వెళ్తున్నాను. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతాను' అని తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేముందు హైదరా బాద్ నుంచి ఢిల్లీకి వెళ్తూ కేసీఆర్ చెప్పిన మాటలు ఆయన ఆత్మవిశ్వాసానికి, దృఢచిత్తానికి తార్కాణం. కేసీఆర్ తాను ఏ కార్యక్రమం చేపట్టినా దానికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకుంటారు. దానిపై విస్తృతంగా అధ్యయనం చేస్తారు. మేధోమథనం జరుపుతారు. కార్యాచరణ ప్రకటించడా నికి ముందే పక్కా ప్రణాళిక రూపొందించుకుంటారు. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్...