భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి? భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి? భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా? ఇందు గలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదికి జూచిన అందందే కలడు..... సర్వాంతర్యామి... ఎక్కడని వెతకగలం? అంతర్యామి... పట్టుకునే శక్తి మనకు ఉందా? భగవంతుణ్ణి మనం పట్టుకోలేం కానీ, భగవంతుడు ఉన్నాడన్నది సత్యం. మనల్ని పట్టుకు నడిపిస్తున్నడన్నది సత్యం. ఆయన మనల్ని పట్టుకునే వున్నాడు, మనల్ని పట్టుకున్న ఆయన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. ఆ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికే శోధన, సాధన... అని వాట్సప్ లో తనకి బదులిచ్చాను. వెన్వెంటనే తన నుండి ప్రశ్నల పరంపర. ఒక చేతితో సంసారమును, మరో చేతితో భగవంతున్ని పట్టుకోవాలన్న రామకృష్ణ పరమహంస మాటలపై మీ అభిప్రాయం? మనం పట్టుకోలేమనుకుంటే ఆయన ఎందుకు పట్టుకోమని చెప్పినట్లు? త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య కబీర్ తదితరులు భక్తితో పరమాత్మను పట్టుకొని పరమపదించి ముక్తి పొందలేదా? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శోధన సాధన ఎలా చేయాలి? అర్థమైంది తన మనోస్థితి. ఆ ప్రశ్నలకు నాలో కదలాడే భ...