Posts

Showing posts from May, 2020

వివేకానంద వాణి

Image
వివేకానంద వాణి మన దేశం యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని , పాశ్చాత్య ప్రజలకు పంచిపెట్టడానికి , భారత దేశం యొక్క వాస్తవ స్వరూపాన్ని , ప్రపంచానికి వివరించడానికి శ్రీ వివేకానంద స్వామి 1893 వ సంవత్సరంలో కన్యాకుమారి దగ్గర ధర్మదీక్ష స్వీకరించి , అమెరికా దేశానికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ చికాగో నగరంలో జరిగిన , విశ్వమత మహాసభలో పాల్గొని , అమెరికా అంతటా తిరిగి , ధర్మప్రచారం చేశారు. అది జరిగి ఈ 1993 వ సంవత్సరానికి నూరేళ్ళయ్యింది. ఆ ధర్మయాత్ర శతజయంతి సందర్భాన రాజమహేంద్రవరంలోని ' శ్రీరామకృష్ణ మఠం ' వారు ఆంధ్ర ప్రజాభ్యుదయాన్ని ఆశించి , వివేకానంద స్వామి వారి బోధనలను ఈ వివేకానంద వాణి రూపంలో , వెలువరిస్తున్నారు. సోదరులారా! నేను చెప్పబోయే ఉపదేశాలను మీరు సావధానంగా వినండి. మననం చేసుకోండి. వాటికి కార్యరూపం కల్పించి , చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టండి. పదిమందిలో ప్రచారం చేయండి. నా ఉపదేశాలు సత్ఫలితాలను ఇచ్చాయనీ , లోకమంతటికీ ఋజువు చేయవలసిన బాధ్యత మీది. ఉత్తిష్ఠత , జాగ్రత , ప్రాప్యవరాన్‌ నిబోధత! శ్రీ రామకృష్ణ పరమహంస పేరు వినని వారు   ఎవ్వరూ భారత దేశంలో వుండరు. వారి మహిమ ఖండాంతరాలకు ...