Sri Krishnashtottara Shatanamavali_Swamiji శ్రీ కృష్ణాష్టోత్తర శత నామావళి ఈ క్రింది నామములను పలుకుచూ పుష్పములను సమర్పింపవలెను. 1. ఓం శ్రీ కృష్ణాయ నమః శ్రీ కృష్ణదేవునకు నమస్కారము 2. ఓం కమలానాథాయ నమః లక్ష్మీపతికి నమస్కారము 3. ఓం వాసుదేవాయ నమః వాసుదేవునకు నమస్కారము 4. ఓం సనాతనాయ నమః శాశ్వతుడైన వానికి నమస్కారము 5. ఓం వసుదేవాత్మజాయ నమః వసుదేవుని కుమారునకు నమస్కారము 6. ఓం పుణ్యాయ నమః పుణ్య నిలయునకు నమస్కారము 7. ఓం లీలామానుష విగ్రహాయ నమః అద్భుత లీలలను ప్రదర్శించుటకై మానవా కృతిని ధరించిన వానికినమస్కారము 8. ఓం శ్రీ వత్స కౌస్తుభధరాయ నమః శ్రీవత్సమనెడి పుట్టుమచ్చనీ, కౌస్తుభ మణినీ ధరించిన వానికి నమస్కారము 9. ఓం యశోదా వత్సలాయ నమః యశోదాదేవి వాత్సల్యమునకు పాత్రుడైన వానికి నమస్కారము 10. ఓం హరయే నమః శ్రీ హరి యొక్క అవతార మూర్తికి నమస్కారము 11. ఓం చతుర్భుజాత చక్రాసి గదా శంఖాభుజాయు దాయుధాయ నమః శంఖ చక్ర గదాది ఆయుధములను ధరించిన చతుర్భుజునకు నమస్కారము 12. ఓం దేవకీ నందనాయ నమః దేవకీ పుత్రునికి నమస్కారము 13. ఓం శ్రీ శాయ నమః ఐశ్వర్యములకు నాథుడైన వానికి నమస్కారము 14. ఓం నందగోప ...