PARAMARDHIKA PARIJATALU.pdf: https://drive.google.com/file/d/1PQL7iokEwZ8y7dUAJjV71UtY9JCqsSco/view?usp=sharing https://docs.google.com/document/d/14mKrtgLbz8H3uN2BbSUMgl7_ovEwAiqSWLc2lHOxi1s/edit BOOK DOWNLOAD LINK: https://drive.google.com/open?id=1Ki3dgYGSC3bRzG08AmYZ_fBQxJJjcwKB ప్రస్తావన జే వయాత్రలో మానవాళికి సద్గురువు అమృతవాణి, నావికునికి దిక్సూచి యంత్రం లాంటిది. వారి దివ్యోపదేశాలు సాధకులందరికీ తోడునీడలు. 'అవి భగవత్ర్పాప్తికి మార్గదర్శకాలు. తపస్సు అంటే ఏమిటి? దేవుడున్నాడా? మనస్సును నియంత్రించడం ఎలా? - దేహమే దేవాలయం, సత్సాంగత్యపు విలువలు, ఇత్యాది వివిధ జిజ్ఞాసపరమైన విషయాలకు మహనీయుల ఉపదేశాలే సరైన జవాబు కాగలవు. భగవాన్ శ్రీరామకృష్ణులకు కాళీవరప్రసాదలబ్ద మానసపుత్రుడైన స్వామి బ్రహ్మానంద ఆ మహనీయుల కోవకు చెందినవారు. | అధ్యాత్మ విద్యా విద్యానామ్' అన్నట్లు సమస్త విద్యలకు శిరోభూషణమైనది బ్రహ్మవిద్య. ఆ విద్య స్వామి బ్రహ్మానందకి ఎంతగా కరతలామలకమై భాసిల్లినదో ఆయన ఉపదేశాలే అందుకు తార్కాణాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని అవగతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి తాత్త్విక విషయ...