దైవప్రార్ధన

దైవప్రార్ధన కరుణామూర్తియగు దేవా ! మా చిత్తము సర్వకాలసర్వావస్థలయందును నీ పాదారవిందములయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపుము, పరమదయానిధీ ! ప్రాతఃకాలమున నిద్రలేచినది మొదలు మరల పరుండు వరుండువరకును మనోవాక్కాయ ములచే మా వలన ఎవరికిని అపకారము కలుగకుండు నట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయు లాగునను సదుద్ధిని దయచేయుము. సచ్చిదానందమూర్తీ ! నిర్మలాత్మా ! మా యంతఃకరణమునందు ఎన్నడును ఏవిధమైన దుష్టసంకల్పముగాని, విషయ వాసనగాని, అజ్ఞానవృత్తిగాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము ! వేదాంతవేద్యా ! అభయస్వరూపా | మా యందు భక్తి, జ్ఞాన, వైరాగ్య బీజము లంకురించి శీఘముగ ప్రవృద్ధము లగునట్లు ఆశీర్వదింపుము ! మరియు ఈ జన్మమునందే కడతేరి నీ సాన్నిధ్యమున కేతెంచుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో సొసంగుము. దేవాI నీవు భక్తవతలుడవు! దీనుల పాలిటి కల్పవృక్షమువు ! నీవు తప్ప మాకింకెవరు దిక్కు? నిన్ను ఆశ్రయించితిమి. అసత్తునుండి సత్తునకు గొనిపామ్ము ! తమస్సు నుండి జ్యోతిలోనికి తీసికొనిపొమ్మ ! మృత్యువునుండి అమృతత్యమును పొందింప జేయుము. ఇదే మా వినతి. అనుగ్రహింపుము. నీ దరి జేర...