సాయి రామ్ సేవక బృందం సనాతన ధర్మప్రచారం లో భాగంగా ఉచితముగా గ్రంధాలను అందించే మొబైల్ ఆప్ ను
మరింత అభివృద్ధి పరచి కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందుకు ఆర్ధిక రూపంలో సహాయం చేసిన
మీ అందరికి మేము కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. ఈ ఆప్ మన అందరిది, మన ధర్మ పరిరక్షణ కోసం
తయారుచేయబడినది. కావున ప్రతి ఒక్కరు నూతన వెర్షన్ ఆప్ ను వినియోగించగలరు అని మనవి చేసుకొంటున్నాము.
అలాగే మీ మిత్రులకి ఈ మెయిల్ ని పంపించటం ద్వారా వారికి సహాయం చేయగలరు.
ఈ ఆప్ ముఖ్య విశేషాలు:
- పూర్తిగా తెలుగు భాషలో లబ్యమయ్యే గ్రంధాలను మాత్రమే అందించటం
- 3500 e-Books ని PDF రూపంలో అందించటం
- పూర్తిగా ఉచితం
- గ్రంధాలను సులభంగా ఎంచుకొనుటకు 33 వర్గాలుగా(రామాయాణం,మహాభారతం,భాగవతం,వ్యక్తిత్వ వికాసం,జీవిత చరిత్ర.....) విభజించటం జరిగింది(category)
- Ads గాని, వ్యాపార ప్రకటనలు కాని లేవు, అలాగే రిజిస్ట్రేషన్ గాని అవసరం లేదు.
- English లో మీకు కావలసిన పుస్తకం వెదికే ఏర్పాటు కూడా ఉంది(search)
- మీకు నచ్చిన పుస్తకం దిగుమతి(డౌన్లోడ్) చేసుకొని, తర్వాత చదువుకోవచ్చు
- నచ్చిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకొని తర్వాత చదువుకోవచ్చు (favourites)
- ఇంటర్నెట్ లేకపోయినా దిగుమతి(డౌన్లోడ్) చేసుకొన్న గ్రంధం చదువుకోగలరు(offline books)
- చివర సారిగా మీరు చదివిన గ్రంధం తిరిగి సులభంగా చదువుకోగలరు(recent read)
- ఆకర్షణీయమైన 3D Sliding సౌకర్యంతో పుస్తకం లో పేజి త్రిప్పుతూ చదివే అనుభూతి పొందగలరు
నూతన సేవలు:
- 3500 గ్రంధాలలో మీరు ఎన్ని గ్రంధాలు చదివారు, ఎన్ని డౌన్లోడ్ చేసుకొన్నారో అనే రిపోర్ట్ ఒకేచోట చూడవచ్చు (My Activity)
-ఈ ఆప్ వినియోగిస్తున్న అందిరికి ఒక గ్రూప్ తయారుచేయబడినది, ఇందులో మీకు నచ్చిన గ్రంధాలు, అలాగే పుస్తకముపై అభిప్రాయాలు
ఇతరులకు తెలియచేయవచ్చు (Discuss Board)
-మన ఆప్ లో గల సమస్యలను లేక సూచనలను మీరు నేరుగా మన సేవక బృందానికి మెయిల్ చేయవచ్చు(Comment)
-మన ధర్మం గురించి మీరు ఏమైనా గ్రంధం వ్రాసి ఉంటే, లేక పాత పుస్తకాలు(pdf) మీరు సేకరించి ఉంటే వాటిని సేవక బృందానికి
పంపించటం చాలా సులువు(Submit eBook)
-సేవక బృంద ధర్మ ప్రచార కార్యక్రమాలు, నూతన విషయాలు అందరికి తెలియచేసేలా కల్పించాము(Notification)
-మీరు ఏదైనా పూర్తిగా చదివితే ఇతరులకి share చేసే నోటిఫికేషన్ కన్పించును, దానిని వినియోగించుకొని ఇతరులకి whatsapp,మెయిల్ ద్వారా తెలియచేయగలరు