సమః శత్రా చ మిత్రే చ తథా మానాపమానయోః । శీతోష్ణ సుఖదుఃభేషు సమః సఙ్గవివర్జితః || 18 || తుల్యనిన్దాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ | అనికేతః స్థిరమతి దృక్తిమాన్ మే ప్రియో సర || 19 || సమః-శత్రా-చ-మిత్రే-చ-తథా-మానాపమానయో: శీతోష్ణ-సంగవివర్ణిత అర్జునా! నా భక్తునికి శత్రువైనా, మిత్రుడైనా ఒక్కటే. మానావమానాల్ని, శీతోష్ణాలను, సుఖదుఃఖాలను అతడు సమానంగా భావిస్తాడు. అతడు అసంగుడు. నిందాస్తుతులు అతనికి సమానము. అతడు మౌని. లభించిన దానితో తృప్తి చెందేవాడు. తనకంటూ స్థావరము లేనివాడు. నిశ్చల హృదయుడు. అట్టి భక్తుడు నాకు ప్రియుడు. వ్యాఖ్య ఈ రెండూ ఏకాన్వయంగల కూట శ్లోకాలు. అందుచేత రెండిటిని కలిపి వ్యాఖ్యానిస్తున్నాను. భక్తుని దశ లక్షణాలను వివరించే ఈ శ్లోకద్వయం ద్వంద్వ పంచకముతో నిండి ఉంది. అవే శత్రుమిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఃఖదుఃఖాలు, నిందాస్తుతులు. పూర్వాధ్యాయాలలో వీటిని గూర్చి చర్చించుకొని ఉన్నప్పటికీ, సందర్భోచితంగా ఇక్కడ కూడా సంక్షిప్తంగా చెప్పుకుందాం. శత్రుమిత్రులు ప్రియమైన వాడు, ఉపకారం చేసేవాడు మిత్రుడు. అప్రియమైన వాడు, అపకారం చేసేవాడు శత్రువు. కనుక, సాధారణంగా మిత్రుడు చేరువై నపుడు మనస్సు...