Monday, October 1, 2018

Tvameva Maata Cha Pitaa Tvameva


Tvameva Mata Shloka Tvameva Maata Cha Pitaa Tvameva Tvameva Bandhush Cha Sakhaa Tvameva Tvameva Vidya Dravinam Tvameva Tvameva Sarvam Mama Deva Deva त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्चा सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బందుశ్ చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ .....

తల్లిదండ్రులను మరువవద్దు


తల్లిదండ్రులను మరువవద్దు అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు..... వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో .... నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారు వారు.... రాయివై వారి హృదయాలను వ్రక్కలు చెయ్యవద్దు..... కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు....... నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు ... ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు...... ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు..... నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమాన మౌతాయా?..... అంతా వ్యర్థమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు.... సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువవద్దు....... ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు..... నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు... ... అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు..... నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు..... ఆ మార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు .... డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు. తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు....... వారి పాదాల గొప్పదనం జీవితాంతం మరువవద్దు.... తల్లిదండ్రులను, శాస్త్రములను, గురుజనులను గౌరవించువాడు చిరకాలము ఆదరణీయుడు కాగలడు...

Saturday, September 22, 2018