ఉత్తిష్ఠ!#కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261

  నమస్తే తెలంగాణ

ఉత్తిష్ఠ!

కోట్ల వెంకటేశ్వరరెడ్డి

9440233261

మన నేల మీద

మళ్ళీ పల్లేరు మొలకల జాడలు

నిశ్శబ్దంగా పరచుకుంటున్న కరువు నీడలు

మరోసారి పట్నం వైపు

పల్లెల వలస చూపులు

ఆకుపచ్చ తెలంగాణ దృశ్యం

కనుమరుగయ్యే కుట్ర

సాధించుకున్న స్వేచ్ఛ వెనక

పరాయి జెండా రెపరెపలు

భ్రమలు ఒక్కొక్కటిగా మంచు తెరలై

కనుమరుగవుతున్న విషాదకాలం

శకుని మాయాజూదం

చివరి అంకానికి చేరుకున్న వికృత వేళ

జట్లు జట్లుగా దుష్టచతుష్టయం

ఏకమై కొత్త కొత్త కుట్రలకు

ఆజ్యం పోస్తున్నారు.

నీటి దొంగలకు ఇంటి దొంగల తోడు.

మాన్పుకున్న గాయాలను

గెలికి చూస్తున్నారు

యుద్ధం తప్పనప్పుడు సాధకుడు

పాంచజన్యం పూరించాల్సిందే!

మౌనం ఎంత శక్తివంతమో

చరిత్రలో ఒక పాఠమై నిలిచిపోవాలి!




 


Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs