శ్రీ స్వామి సుందర చైతన్యానంద ( ఆంగ్లము : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా , విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనలు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి , ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురాణములు ఇతిహాసములు యొక్క రహస్యార్థ సారమతి, అపర సరస్వతి , ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగా , గాయకుడుగా , బోధకుడుగా , గురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు, శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందులవారు....