అందరివాడు ఆధునికుడు - KTR : RAMOJI RAO

 

Google doc link: https://docs.google.com/document/d/1M1EKjP_rf1xGiYeEUbImadgFDnFj1eaZyYGb8_4Gm_k/edit



అందరివాడు ఆధునికుడు - KTR : RAMOJI RAO 





Ramoji Rao : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్.. జులై 24న తన 45 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు, కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా లేఖ రాశారు.

ఈ లేఖలో కేటీఆర్ గురించి రాసుకొచ్చారు.. అరుదైన నాయ‌క‌త్వ ల‌క్షణాలు, అసాధార‌ణ సంభాష‌ణా నైపుణ్యం, అన్నింటికి మించిన రాజ‌కీయ చ‌తుర‌త‌తో అన‌తి కాలంలోనే ప‌రిణ‌తి గ‌ల నాయ‌కుడిగా ఎదిగి తెలంగాణ రాజ‌కీయ య‌వ‌నిక‌పై వెలుగులీనుతున్న మీకు 45వ పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఒక ఉన్న‌త‌శ్రేణి నాయ‌కుడికి కావ‌ల్సిన ల‌క్షణాల‌న్నీ మూర్తీభ‌వించిన మీ ప‌నితీరు నేను ఆది నుంచి గ‌మ‌నిస్తూనే ఉన్నాను.

మీరు సాధిస్తున్న పురోగ‌తిని చూసి గ‌ర్విస్తున్నాను.అని రామోజీరావు త‌న లేఖ‌లో పేర్కొన్నారు. తన బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలని ప్రతిబిడ్డ కోరుకుంటారు.. తెలంగాణ అభివృద్ధికి మీరు చేస్తున్న నిరంతర కృషి నాన్నగారి ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఆయనకు అమితానందాన్ని ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. మీ వంటి చైతన్యశీలుడిని పుత్రునిగా పొందిన ఆయన ధన్యులు అని పేర్కొన్నారు రామోజీరావు








Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి