* గురువును పొందడం ఎలా?

* గురువును పొందడం ఎలా? " శిశ్యుడివి కావాలి. శిశ్యుడివి కావడంతోటే గురుప్రాప్తి సంభవిస్తుంది. గురువు లభించటమూ సహజమూ, సులభమూను కానీ శిష్యుడు కావటం, తనలో శిశ్వత్వాన్ని ఉత్పన్నం చేసు కోవటమూ అత్యంత కష్టం. అంతే కాదు. శిశ్వతాగుణాలు వికసించటంలో ఏళ్ళకు ఏళ్ళు గడచిపోతాయి. నీలో శిష్యత్వ గుణం పూర్తిగా వికసించిన రోజున అదే క్షణంలో గురువు లభిస్తాడు.. శిశ్యత్వగుణాలు :- శిశ్వత్వానికి ప్రథమ - అంతిమ లక్షణం ఒక్కటే - సర్వాత్మ నా గురువులో విలీనం కావటం, గురువులో విలీనమై పోయాక సొంత ఆలోచనలు, సొంత భావాలు, స్వీయ కామ, క్రోథి - లోభాది సమస్త విషయాలూ ఆరోహితమయి పోతాయి. గురువు ఆజ్ఞయే అన్నిటి కన్నా అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. దానిలో ఇతరాలోచనలకి తర్కానికి తావులేదు. గురువాజ్ఞ పాలన ఒక్కటే శిశ్యుని ఏక మాత్ర లక్ష్యం కావాలి" " నిజానికి దేనినైనా పొందటం అంత సులువేమీ కాదు. మనం ఎంతో కొంత అర్పించనంత వరకూ దేనినైనా పొందాలని మాత్రం ఎలా ఆశిస్తాం?” **పాప తాపాల బారి నుండి తప్పించు కోడానికి ఒకే ఒక ఉపాయమున్నది. అది శ్రీ కృష్ణ భగవానుని పట్ల ప్రేమ భక్తినీ అలవరచు కోవడమే. దీనివల్ల ఇంద్రియదోషాలు, అవగుణాలు అన్నీ నశించి పోతాయి, శ్రీకృష్ణుని శరణు చొచ్చిన వాని వద్ద పాపతాపాదులు, దురాచారాలు ఉండటానికి భయపడతాయి, వాటంతట అవే సమసిపోతాయి** "శ్రీకృష్ణుడు భక్త పరాధీనుడు. తన భక్తులు చేసిన ప్రతిజ్ఞలను నెరవేర జేస్తాడు”

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి