Tuesday, May 19, 2026
వీడియోస్
Monday, May 18, 2026
శ్రీ నారాయణ స్తోత్రమ్ - జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్యః
శ్రీ నారాయణ స్తోత్రమ్ - జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్యః
నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే ధ్రువపద ॥నారాయణ||
కరుణా పారావార వరుణాలయ గంభీర ॥నారాయణ||
నవ నీరద సంకాశ కృతకలికల్మష నాశన ॥నారాయణ||
యమునాతీర విహార ధృత కౌస్తుభమణి హార ॥నారాయణ||
పీతాంబరపరిధాన సురకళ్యాణ నిధాన ॥నారాయణ||
మంజుల గుంజాభూష మాయా మానుషవేష ॥నారాయణ||
రాధాధరమధుర రసిక రజనీకుల తిలక ॥నారాయణ||
మురళీగానవినోద వేదస్తుత భూపాద ॥నారాయణ||
వారిజ భూషా భరణ రాజీవ రుక్మిణీ రమణ ॥నారాయణ||
బర్హి నిబర్హాపీడ నటనాటక ఫణిక్రీడ ॥నారాయణ||
జలరుహ దళనిభ నేత్ర జగదారంభక సూత్ర ॥నారాయణ||
పాతక రజనీచర సంహార కరుణాలయ మా ముద్దర॥నారాయణ॥ 10॥
అఘ బక క్షయ కంసారే కేశవ కృష్ణ మురారే ॥నారాయణ॥ 11
హాటకనిభ పీతాంబర అభయం కురు మే మావర॥నారాయణ॥ 12
దశరథరాజ కుమార దానవమదసంహార ॥నారాయణ॥
గోవర్ధనగిరి రమణ గోపీ మానస హరణ ॥నారాయణ॥
సరయూతీర విహార సజ్జన ఋషి మందార ॥నారాయణ॥
విశ్వామిత్ర మఖత్రా వివిధపరా సుచరిత్రా ॥నారాయణ॥
ధ్వజ వజ్రాంకుశపాద ధరణీసుత సహమోద ॥నారాయణ॥
జనకసుతా ప్రతిపాల జయ జయ సంస్మృతిలీల ॥నారాయణ॥
దశరథ వాగ్దృతిభార దండకవన సంచార ॥నారాయణ॥
ముష్టిక చాణూర సంహార మునిమానసవిహార ॥నారాయణ॥
వాలి నిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య ॥నారాయణ॥
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర ॥నారాయణ॥॥ 22
జలనిధి బంధన ధీర రావణకంఠవిదార ॥నారాయణ॥
తాటక మర్దన రామ నటగుణ వివిధ ధనాఢ్య ॥నారాయణ॥
గౌతమపత్నీ పూజన కరుణా ఘనావలోకన ॥నారాయణ॥
సంభ్రమసీతాకా(హా)ర సాకేతపుర విహార ॥నారాయణ॥
అచలోద్ధృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర ॥నారాయణ॥
నై గమగానమనో వినోద రక్షిత సుప్రహ్లాద ॥నారాయణ॥
భారతయతివర శంకర నానామృతవచనాంతరా ॥నారాయణ॥
Sunday, May 17, 2026
ద్వాదశాక్షర మంత్ర స్తోత్రము మూలం: వేదవ్యాస మహర్షి వ్యాఖ్య: స్వామి సుందర చైతన్యానంద #తెలుగు వికీపీడియా LINK
కలియుగము ప్రబల దోషయుత మైనను దాని
నివారణము కూడా కలియుగము - నందే కలదని శుకమహర్షి భాగవతంలో పరీక్షిన్మహారాజుకు చెబుతాడు.
కలి దోషముల నన్నింటిని భగవన్నామము హరిస్తుందని ప్రవచిస్తాడు.
“ఓం నమో భగవతే వాసుదేవాయ”
ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. బుద్ధిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది.
హరిః సదా వసే తత్ర యత్ర భాగవతా
జనా:గాయని భక్తి భావేన హరేర్నామైవ
కేవలమ్ భక్తులు గుమిగూడి ఎచ్చట హరినామమును గానము చేయు చుందురో అచ్చట శ్రీహరి వసించుచుండును.
నామమున్నచోట నారాయణుడుంటాడు. నామము మనకు నామిని ప్రసాదిస్తుంది. స్వామిని ప్రసాదిస్తుంది. నారాయుణు డున్నచోట నరకముండదు. జనార్దన నామంతో జగడాలు దూరమౌతాయి. హరినామంతో హత్యలు అదృశ్యమవుతాయి. కృష్ణనామంతో తృష్ణ నశిస్తుంది. రామనామంతో కామం పలాయన మౌతుంది. భవరోగాలకు భీతి చెందకండి. భగవన్నామం భయాలను భయ పెడుతుంది.
వాతావరణ కాలుష్యం పోవాలా ?
ఇంటి చుట్టూ తులసి మొక్కలు పెంచండి. ఆంతర్య కాలుష్యం తొలగాలా ? అచ్యుతుని నామాన్ని గానం చేయండి. - ఏ కులంవా రెనా చేయవచ్చు. ఏ మతం వారైనా చేయవచ్చుకుళ్ళు సృష్టించినకులాలు కుళ్ళిపోనీ..
ముళ్ళు పరచిన మతాలు మరలిపోనీ. కులాలు మనకొద్దు. అనుకూలమే మన కులం....... మతాలు మనకొద్దు. సమ్మతమే మన మతం..........
నవ సమాజ నిర్మాణానికి నడుం కట్టండి.
కలి పురుషుని ఆగడాలకు కళ్ళెం వేయండి. మంచితనానికి మనిషి తనానికి శుభ పరిణామం ఈ సమయం. కలసి కట్టుగా నామం చేద్దాం ప్రభునామానికి నియమం లేదు....
బుధజన సేవలో
సుందర చెతన్యాశ్రమం గాంధీ జయంతి
ధవళేశ్వరం 2-10-193
.
AMMA_BOOK అమ్మ ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన .... అమృత భాండం అమ్మ .....
AMMA_BOOK
అమ్మ
ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన ....
అమృత భాండం అమ్మ .....
జీవ భాషలో కావ్యం నెరపిన ....
అమర కోశం అమ్మ ....
ఏమిచ్చినా ఋణం తీరదు అమ్మది ....
ఋణం తీర్చలేని అమ్మకి ....... LINK:
https://drive.google.com/file/d/0B6ZJh2NcOojrZjhwUzkwUE1WcUE/view?usp=sharing
అమ్మ ..ప్రేమకు మారు పేరు... మమతల సెలయేరు...
ఆత్మీయతల పెన్నిధి...వాత్సల్యామృత సన్నిధి....
ఇంతకన్నా గొప్ప దైవం ఈ ధరాతలాన మనకు కనబడుతుందా...
ధరిత్రిలోనే అత్యంత తీయనైనది... ఎన్నిసార్లు లిఖించినా, ఎన్ని వేలాసార్లు పలికినా పులకింపుకు గురిచేసేది అమ్మే... ఆ అమ్మ మీద ఒక పుష్కరం క్రితం నేను రాసిన చిరుకవిత ముఖపుస్తక మిత్రుల కోసం...
Venkat Garikapati
" అమ్మ పాట " నీవు లేవురా నేను లేనురా అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా....... కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి అదృష్టం అబ్బినతని భాగ్యమే భాగ్యమురా............నీవు లేవురా....1 ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా.... జో జో ...జోజో ..... అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....2 ఏనాడో ఒకనాటికి తనువు పండు నాటికీ ఆ అమ్మేమనచేతుల పసిపాపగ నిలిచినపుడు ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... ..........................నీవు లేవురా
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
-
Download Sundarakanda by MS RAMARAO . Album : Sundarakanda Artist : M S Ramarao https://drive.google.com/folderview?id=0B4iXwRgjcj2...
-
AYYAPPA DEVOTIONAL SONGS ayyappa devotional http://www.mediafire.com/?5xbogj52oldlw ayyappa devotional_KJY http://www.mediafire.com/?i1qwkc0...
-
ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 kirtanas folder link: http://www.mediafire.com/?sharekey=ndbcybejj6ic1 mediafire links...