గురుపూర్ణిమ వేడుకలు - హైదరాబాద్ సుందర చైతన్యాశ్రమంలో 07-07-2025 (సోమవారం) నుండి 10-07-2025 (గురువారం) వరకు గురుపూర్ణిమ వేడుకలు

ఆత్మబంధువులారా! ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమో భగవతే వాసుదేవాయ గురుపూర్ణిమ వేడుకలు (REGD.) గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ సుందర చైతన్యాశ్రమంలో 07-07-2025 (సోమవారం) నుండి 10-07-2025 (గురువారం) వరకు గురుపూర్ణిమ వేడుకలు మరియు ‘సుందర సత్సంగ సదస్సు' నిర్వహించబడునని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాము. మనందరిపై ఉన్న అవ్యాజమైన ప్రేమతో పూజ్య గురుదేవులు ఈ కార్యక్రమం అనుగ్రహించటం మన భాగ్యం. 7-7-2025 (సోమవారం) సాయంత్రం గం॥ 5.30 ని॥లకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు జూన్ 15, 2025 (ఆదివారం) లోగా సభ్యత్వ రుసుము (రూ.750/-) చెల్లించి నమోదు చేసుకొనవలెను. సత్సంగ శాఖలు, పాల్గొనే సభ్యుల తుది జాబితా, సభ్యత్వ రుసుము జతపరచి (పాన్ నంబర్ లేదా ఆధార్ నంబరుతో సహా) జూన్ 15, 2025 లోగా ఆశ్రమానికి చేరునట్లు పంపవలసినదిగా తెలియజేస్తున్నాము. ప్రతినిధులకు ఉచిత భోజన మరియు వసతి సదుపాయము కల్పించబడును. ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బందులు లేని వారు మాత్రమే రావలసినదిగా కోరుతున్నాము. అలాగే చిన్న పిల్లలను సాధ్యమైనంత వరకు తీసుకు రాకుండా ఉంటే మంచిది. అందరము పై నియమాలను పాటించి, గురుకృపకు పాత్రులమై, భక్తి శ్రద్ధలతో గురుబోధను గ్రహించి తరించాలని ఆశిస్తున్నాము. సద్గురు పాదారవిందములకు ప్రణమిల్లుతూ ఆశ్రమ కమిటీ సుందర చైతన్యాశ్రమం CHAIRMAN H.H. SWAMI SUNDARA CHAITANYANANDA SUNDARA CHAITANYA ASHRAM, DUNDIGAL ROAD, HYDERABAD - 500043. : (08418) 255777 & 255355 email : admin@sundarachaitanyam.org

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి