యల్ ఐ జి ఫ్లాట్లు ...ఎంతో మేలు .....

Lig-Flatsఅసలే ఫెస్టివల్‌ సీజన్‌.. సొంతిల్లు కొను క్కోవడానికి ఇంతకుమించిన తరుణం లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. అందుకే, చాలామంది భాగ్యనగరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడానికిప్పుడే ప్రణాళికల్ని రచిస్తుంటారు. ఇప్పటికే కూడబెట్టిన సొమ్ముతో పాటు గృహరుణ సాయంతో సొంతిల్లు కొనుక్కోవడానికి దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో మీరూ సొంతింట్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారా? వెరీ గుడ్‌. భాగ్యనగరంలో ఓ తొమ్మిది వందల చ.అ. ఫ్లాట్‌ కొంటే, ఇరవై ఏండ్ల తర్వాత ఎంత సంపద సృష్టించిన వారవుతారో తెలుసా? కేంద్రం అందుబాటు గృహాలకు చక్కటి ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది. ప్రైమ్‌ మినిస్టర్‌ ఆవాస్‌ యోజన స్కీము కింద ఇల్లు కొనుక్కునేవారికి దాదాపు రూ.2.50 లక్షల నగదు రాయితీని అందజేస్తున్నది. ఉదాహరణకు, ఎల్‌ఐజీ విభాగం కింద ఓ 870 చదరపు అడుగుల ఫ్లాట్‌ కోసం సుమారు రూ.37.5 లక్షలు ఖర్చు అవుతుందని అనుకుందాం. దీనిపై జీఎస్టీ ఒక శాతం చొప్పున లెక్కిస్తే.. రూ. 37,500 అవుతుంది. సాధారణ ఫ్లాట్‌ అయితే 5 శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. అంటే, ఇక్కడ నేరుగా రూ.1.50 లక్షల దాకా కొనుగోలుదారుడికి ఆదా అయినట్లే లెక్క. ఫ్లాట్‌ ధర రూ.37.50 లక్షలు అనుకుంటే, అందులో నుంచి రూ.2.50 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన స్కీము కింద ఆదా అవుతుంది. అంటే, నికరంగా ఫ్లాటు విలువ రూ.35 లక్షలు అన్నమాట. దీనిపై 20 శాతం మార్జిన్‌ మనీ లెక్కిస్తే.. ఆరంభంలో చెల్లించాల్సింది రూ.7 లక్షలు అవుతుంది. మిగతా రూ. 28 లక్షల రుణంపై సుమారు రూ.26,500 దాకా నెలసరి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇరవై ఏండ్ల వ్యవధికి దాదాపు తొమ్మిది శాతానికి అటుఇటుగా లెక్కించగా వచ్చిన నెలసరి వాయిదా ఇది. ఒకవేళ పదేండ్ల పాటు అద్దె ఇంట్లో ఉన్నట్టుగా భావిస్తే.. కేవలం కిరాయి కోసమే నెలకు రూ.14,000 చెల్లించాల్సి వస్తుంది. నెలసరి ఈఎంఐలో నుంచి రూ. 14,000 మినహాయిస్తే, రెండు పడక గదుల ఫ్లాట్‌ మీద నికరంగా చెల్లించే మొత్తం కేవలం రూ.12,500 మాత్రమేనని గుర్తుంచుకోండి. పైగా, ఐటీ రాయితీ నెలకు రూ.6,000 దాకా లభిస్తుంది. దీని బట్టి ఒక వ్యక్తి రూ.37.50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే.. నెలకు చెల్లించేది రూ.6,500 మాత్రమే. ఇదే మొత్తాన్ని ఇరవై ఏండ్లకు లెక్కిస్తే సుమారు రూ.15.60 లక్షలు అవుతుంది. హైదరాబాద్‌లో గత మూడు దశాబ్దాల నుంచి ఇండ్ల ధరలు పది శాతం చొప్పున పెరిగాయి. అంటే, ఈ రోజు రూ.37.50 లక్షలకు కొనుగోలు చేసిన ఫ్లాట్‌ విలువ.. మూడు దశాబ్దాల తర్వాత ఎంతలేదన్నా రూ.1.60 కోట్లు అవుతుంది. పైగా, 870 చదరపు అడుగుల ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే అవిభాజ్యపు వాటా కింద కనీసం 37 గజాల స్థలం చేతికొస్తుంది. దీన్ని ప్రస్తుత విలువ కనీసం రూ.18 లక్షల దాకా ఉంటుందని గుర్తుంచుకోండి.

870 చదరపు అడుగులు ఇలా..

సాధారణంగా ఎల్‌ఐజీ ఫ్లాట్ల విస్తీర్ణం ఆరు వందల చదరపు అడుగుల దాకా ఉంటుంది. అయితే, ఇది కేవలం కార్పెట్‌ ఏరియా మాత్రమే. దీనిపై యుటిలిటీ ఏరియా, బాల్కనీ, బయటి గోడలు, కామన్‌ ఏరియాలను వంటివి దాదాపు 28 శాతం లెక్కిస్తారు. అంటే, ఆరు వందల చదరపు అడుగుల ఫ్లాట్‌ కాస్త అటుఇటుగా 870 చదరపు అడుగుల దాకా వస్తుందన్నమాట

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి