NITYA PATHANA SLOKAMULU


NITYA PATHANA SLOKAMULU ఓం నమో భగవతే వాసుదేవాయ నిత్య పఠన శ్లోకములు (ఉదయం నిద్ర లేచే వేళ తన అర చేతులు చూసుకుంటూ...) 1.శ్లో: కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సర స్వతీ కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం నిద్ర లేచి భూమిపై కాలు మోపునపుడు... భూదేవికి నమస్కరిస్తూ... 2.శ్లో: సముద్రవసనే దేవీ పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమేil సూర్యోదయ సమయమున పఠించవలసిన 3.శ్లోకం: బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్సదావిష్ణుం త్రిమూర్తిం చ దివాకరం, స్నానము చేయునపుడు : ( కేశవ నారాయణ మొదలగు నామములతో ఆచమనం చేసిన తరువాత) 4.శ్లో: ఓం గంగే చ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపి వా యస్మరేత్ పుండ్రీకాక్షం స బాహ్యాంభతర శ్శుచి: పుండరీకాక్ష... పుండరీకాక్ష... పుండరీకాక్ష... గాయత్రీ మంత్రము | 5.శ్లో: ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యమ్ | భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ || భావార్థము : హేరక్షక! సచ్చిదానందస్వరూప! జగదుత్పాదకదేవ ప్రసిద్ధము, పల్వోత్కృష్టమునగు నీ విజ్ఞాన స్వరూపమున మేము నిత్యముపాసింతుము. మాకు పదుృద్ధినిచ్చి పత్కర్మము లాచరించునట్లు అనుగ్రహింపుము. 6.శ్లో: ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతవరణాన్ని శుద్దిచేస్తుంది. బుద్దిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్నితొలగి స్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది 7.శ్లో: మృత్యుంజయ మహామంత్రము ఓ త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ణనమ్, ఉర్వారుకమివ బన్ధనా స్మృత్యోర్ముక్షీయ మామృతాత్ || తా:- సుగంధ యుక్తులును, సమిస్త జీవులమ లెస్సగా పోషించువారును నగు త్రినేత్రుడైన పరమశివుని మేము ఆరాధించుచున్నాము. దోస తీగమండి దోసకాయను వేరుచేయునట్లు మోక్షప్రాప్తి కొఱకై ఆ పరమాత్మ మమ్ములమ మృత్యువునుండి విడుదల చేయుగాక ! 8.శ్లో: కలి కల్మశ నాశన మహామంతమ్ ఓమ్ హరేరామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ..... 9.శ్లో: త్వమేవ మతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వ మేవ! త్వమేవ విద్యా ద్రవిణమ్ త్వ మేవ త్వమేవ సర్వమ్ మమ దేవ దేవ!! తులసీదేవి ప్రార్థన 10.శ్లో: నమ స్తులసి సర్వజ్ఞే పురుషో త్తమ వల్లభే పాహి మాం సర్వపాపేభ్య స్సర్వసంపత్పదాయిని. 11.శ్లో: యన్మూలే సర్వతీర్థాని యన్మ ధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహం. 12.శ్లో: నమ స్తులసి కళ్యాణి నమోవిష్ణుప్రి యే శు భే నమో మోక్ష ప్రదే దేవి నమః సంపతప్రదాయకే సద్ధ్యాదీపప్రార్థన 13.శ్లో: శుభం భవతు క ల్యాణీ ఆరోగ్యం ధనసంపదం మమ శతృ వినాశాయ సాయం జ్యోతి ర్న మోస్తు తే. 13.శ్లో: దీపం జ్యోతి పరబ్రహం దీపం సర్వతమోపహం దీ పేన సాధ్యతే సర్వం సన్ష్యాదీపం నమోస్తు తే. స్తోత్రములు శ్రీ గురు ధ్యానము 15.శ్లో: గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః 15.శ్లో: ధ్యానమూలం గురోర్మూర్తి! పూజామూలం గురోర్పదం! మంత్రమూలం గురోర్వాక్యం! మోక్షమూలం గురోరక్రుప!! శ్రీ గణపతి ధ్యానము 16.శ్లో: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే!! 18.శ్లో: అగజానన పద్మార్కం గజాసన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే........ -2- శివస్తుతి : 19.శ్లో: వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 20.శ్లో: రుద్రం పశుపతిం స్తాణుం నీలకంఠముమాపతిం! నమామి శిరసా దేవం కిన్నోమృతుః కరిష్యతి!! విష్ణుస్తుతి 21.శ్లో: శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాధం. శ్రీరామస్తుతి 22.శ్లో: శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘువరాన్వయ రత్న దీపం ఆజానుబాహు మరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. శ్రీరామ. ధ్యానము 23.శ్లో: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామ చంద్రాయ వేథ సే రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమ: శ్రీకృష్ణ ధ్యాన ము 24.శ్లో: కస్తూరీ తిలకం లలాటఫలకే వక్ష స్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కం కరతలే వేణుం కరేకంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠెచ ముక్తావలీం గోపస్త్రీ, పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. 25.శ్లో: అదౌ దేవకీదేవి గర్బజననం గోపీ గృహే వర్తనం! మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్దారణమ్!! కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతా పాలనం! హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీ కృష్ణ లీలామృతమ్!! సరస్వతీస్తుతి 26.శ్లో:సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || 27.:యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా | యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా | 28.శ్లో:యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా | సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా | లక్ష్మీస్తుతి 29.వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యందాం | హస్తాభ్యా మభయప్రదాం మణిగనైర్నానావిధై ర్భూషితామ్. 30.శ్లో:లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ | దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ | 31.శ్లో:శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ | త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || దేవీ శ్లోకం 32.శ్లో:సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే | శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే || శ్రీవేంకటేశ్వర శ్లోకం 33.శ్లో:శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేஉర్థినామ్ | శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || దక్షిణామూర్తి శ్లోకం 34.శ్లో:గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ | నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || భుజించునపుడు చేయు ప్రార్థన 35.శ్లో:అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్. తా:- నేను 'వైశ్వానరుడ'ను జఠరాగ్నిగానయి ప్రాణులయొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపానవాయువులతో గూడుకొని నాలుగువిధములగు అన్నమును పచనము చేయుచున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా. 36.శ్లో:.బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః || తా:- యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది - అన్నియును బ్రహ్మస్వరూపములే యనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను జేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు. రాత్రి నిద్రించుటకు ముందు 37.శ్లో:రామంస్కందం హనూమంతం వై న తేయం వృకోదరం ళయ నే యః స్మ రేన్నిత్యం దుస్స్వప్న స్తస్య నశ్యతి. అపరాధ క్షమాపణ స్తోత్రం 38.శ్లో:అపరాధ సహస్రాణి, క్రియంతే‌உహర్నిశం మయా | దాసో‌உయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర || కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |అపరాధ క్షమాపణ స్తోత్రం విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 39.శ్లో:కాయేన వాచా మనసేంద్రియైర్వాబుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ | కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || బౌద్ధ ప్రార్థన 40.శ్లో:బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శాంతి మంత్రం 41.శ్లో:అసతోమా సద్గమయా | తమసోమా జ్యోతిర్గమయా | మృత్యోర్మా అమృతంగమయా | ఓం శాంతిః శాంతిః శాంతిః 42.శ్లో: సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః | సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ || ఓం సహ నా’వవతు | స నౌ’ భునక్తు | సహ వీర్యం’ కరవావహై | తేజస్వినావధీ’తమస్తు మా వి’ద్విషావహై” || ఓం శాంతిః శాంతిః శాంతిః’ || 43.:(పారాయణ అనంతర క్షమార్పణ పూర్వక సమర్పణము) *యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ ! తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే !! *పాపోహం పాపకర్మాహం పాపాత్ము పాప సంభవః ! త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల !! *అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ! తస్మాత్కరుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర !! *మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన ! యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే !! *యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ ! తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే !! *ఆవాహనం న జానామి న జానామి విసర్తనం! పూజా విధిం న జానామి క్షమస్వ హనుమత్రభో !! *గోప్రూణా మపి గోప్తాశ్వం గృహాణా మత్తృతం జపం ! సిద్ధిం కురుష్వ మే దేవ త్వమహం శరణం గతః !! *కాయేన వాచా మనసేంద్రి యైర్వా దధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ! కరోమిడుద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సవురదూమి ! సదాశివాయేతి సమర్పయామి !! 44.దేవాలయములో ప్రదక్షిణ చేయునపుడు యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రనశ్యంతి ప్రదక్షిణ పదేపదే ! పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః ! త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల !! అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ! తస్మాత్కరుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర !! రక్ష రక్ష జనార్ధన!! *********************************************************** విశేష మంత్రాః పంచాక్షరి – ఓం నమశ్శివాయ అష్టాక్షరి – ఓం నమో నారాయణాయ ద్వాదశాక్షరి – ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి