ఓ మంచి అవకాశం!

నమస్కారం,

సాయి రామ్ సేవక బృందం మరొక క్రొత్త సేవా కార్యక్రమంలో బాగంగా నూతన వెబ్ సైట్, మొబైల్ ఆప్ తయారుచేస్తున్నాము.
ఈ వెబ్సైటు, ఆప్ లో మీరు సేకరించిన పుస్తకాలు లేక మీరు వ్రాసిన పుస్తకాలు ఏమైనా ఉంటే మాకు అందించగలరు. వాటిని
ఒకచోటికి చేర్చే అవకాశం గలదు. కొంచెం శ్రమతో మీ దగ్గర గల డిజిటల్ కాపీ అందిచటం వలన మన సనాతన ధర్మ గ్రంధాలు 
ఒకేచోట లబ్యం అవటం వలన భవిష్యతరాలకు జ్ఞానాన్ని అందించినవారము అవుతాము.

ఇప్పటివరకు మనం సేకరించిన 3500 గ్రంధాలను ఎంత మందికి ఉపయోగపడినదో తెలుసుకోగలరు:
1) పెన్ డ్రైవ్ సేవ:  
   ప్రత్యక్ష్యం గా 300 మందికి అందచేసాము, వీరిలో గురుకులాలు, యూనివర్సిటీలు, ఆశ్రమాలు, వ్యక్తిగతంగా ఇలా మన తెలుగు 
రాష్ట్రాలలోనే కాక, అమెరికా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్ర, దేశాలలో కూడా మన సనాతన ధర్మ 
గ్రంధాలను అందించాము, అలా ప్రతి ఒక్కరు కనీసం ఓ ఇదుగురికి తప్పనిసరిగా అందించారు, అలా 1500 మంది దగ్గర గ్రంధాలు
 ఉన్నాయి, వీరు ఒక్కొక్కరు  ఓ లైబ్రరీ లాంటి వారు అంటే ఓ వ్యక్తి దగ్గర 3500 గ్రంధాలు ఉన్నాయి అంటే అదేమి సామాన్య విషయం
 కాదు. ఇలా ఆదిశంకరాచార్యులు నలుమూలలా ఎలా ఐతే పీఠాలు ద్వారా మన ధర్మాన్ని రక్షించారో, అలా మన తెలుగు రాష్ట్రాలలో
 సాధ్యమైనంత వ్యక్తులకు ఈ గ్రంధాలను అందించి రక్షించాలి.ఏ ఒక్క వ్యక్తి వలన ఈ సేవ ఆగిపోగూడదు అనే ఉద్దేశ్యంతో ఉచితంగా
 పెన్ డ్రైవ్  ద్వారా అందిస్తున్నాము..

2) ఆండ్రాయిడ్ ఆప్ సేవ: 
  ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 18000 మంది ఈ ఆప్ వినియోగిస్తున్నారు. ఈ ఆప్ ద్వారా ఒక దేశం తో, రాష్ట్రం తో సంబంధం
  లేకుండా దేశ విదేశాలలో ఉన్నవారు కూడా అరచేతిలో ఇమిదిపోయే పరికరంలో మన ధర్మ సంబంద గ్రంధాలను చదువుతున్నారు.
  ఈ క్రింది ఇచ్చిన లింక్ లో మీరు వారు వ్రాసిన feedback,review చూస్తే తెలుస్తుంది, ఒక్కొక్కరు మన సనాతన గ్రంధాలకోసం 
  సరి అయిన చోట అన్ని గ్రంధాలు ఒకేచోట దొరకక ఎంతగా ఆరాటపడుతున్నారో, ఈ ఆప్  వలన వారు పొందే  సంతోషం మీరే చూడవచ్చు.

3) వెబ్ సైట్ సేవ:
  వెబ్ సైట్ ద్వారా ఇప్పటివరకు 35,000 మంది ఆన్లైన్ లో దేశ విదేశాల నుంచి చదువుతున్నారు. 


కావున మీరు సేకరించిన, అందించే ఓ గ్రంధం భవిష్యతరాలకు ఉపయోగపడగలదు. 
పుస్తకాలు పంపించడానికి చివరితేది: 5-ఏప్రిల్-2017


సాయి రామ్ సేవక బృందం నూతన సేవ వివరాలు త్వరలో వెల్లడించగలం.


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 

3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్:




Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి