కోరికలు - కోరలు Kb Narayana Sarma
Saturday, December 21, 2013
KORIKALU KORALU
KORIKALU KORALU
కోరికలు - కోరలు Kb Narayana Sarma Dec 19 04:52PM +0530
కోరికలు అంతులేని ఆనందాన్నిచ్చే శారికలే కాదు, బుసకొట్టి కాటేసే కాల సర్పాలు
కూడా. పాములు విషం కక్కుతాయి. కాటు వేస్తాయి. కానీ కోరికలు లేకుండా,
ఉంటాయా? అనునిత్యం జీవితంతో పెనవేసుకొని ఉన్నాయి కదా! అంటే జీవితానికి
కోరికలు ముఖ్యమన్న మాట. అందుకే కోరికలే అన్నిటికన్నా ప్రథమ స్థానం
ఆక్రమిస్తున్నాయి. వాంచలన్నీ చంపేసుకుని బ్రతుకును వెళ్ళదీయాల్సిన పని లేదు.
కోరికల కోరలు పీకి విషం పిండి బయట పారేయండి. వాటితో సరదాగా ఆడుకోండి. ఆశలు
ఆనందాన్నీ వాటితో పాటు ఆవేదనని కూడా ఇస్తాయి. అయితే వాటిలోని ప్రమాదకరమైన
అంశాలను పక్కన పెడితే మిగిలినదంతా సంతోషమే! మొత్తం కోరికలనే చంపేస్తే సుఖ
సంతోషాలను కూడా చంపినట్లే. కృష్ణుడు కోరికలు లేకుండా బ్రతికాడా? కోరికల
పడగలలోని గరళాన్ని కక్కించి, నిర్వీర్యం చేసి ఆ పడగలపై విలాసంగా నాట్య
విన్యాసాలు చేశాడు. ఆనందలీలగా మలచాడు.
ఏ వస్తువును పైకి విసిరినా మళ్ళీ భూమిపైనే పడినట్టుగా పదే పదే అదే ప్రాథమిక
సూత్రం, 'ప్రకృతి ద్వంద్వ స్వభావం' దగ్గరకే రావలసి వస్తోంది. సృష్టించడమే
కాదు, సంహరించడం కూడా ప్రకృతి ధర్మం. ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం రెండూ
ఉంటాయి. బయటి దొంగలే కాదు, లోపలి దొంగలు కూడా ఉన్నారు. బయటి దొంగలు నగా,
నట్రా దోచుకుంటే, లోపలి దొంగలు సుఖ సంతోషాలను అపహరిస్తారు. బయటి దొంగల పని
పట్ట గలమేమో గాని, లోపలి దొంగలను తరిమికొట్టలేం. జగన్నాధుడు శరీర సౌధాన్ని
నిర్మిస్తాడు, నిర్మూలిస్తాడు కూడా. కూల్చుతున్నాడని క్రూరుడని పిలవకండి.
అకౄర వరదుడు ఎన్నటికి కౄరుడు కానేరడు. అందమైన కొత్త భవనాన్ని
ఆవిష్కరించేందుకు పాత ఇల్లు పడగొడుతున్నాడు.
ఒకే వస్తువు సుఖాన్ని, దుఃఖాన్నిఇస్తుంది . నీరు వరదలా ముంచెత్తి భీభత్సం
చేస్తుంది. ప్రాణాలుతీస్తుంది . దప్పికతో అలమటిస్తున్న వేళ దాహార్తిని
తీరుస్తుంది. ప్రాణాలు నిలుపుతుంది.
కోరికలను పూర్తిగా తృప్తి పరచి తుడిచివేయలేం. అవి నిరంతర సౌఖ్హ్యానికి ముడి
సరుకులు. ఆకలి ఉంటేనే రుచులు ఆస్వాదిస్తాం. భోజనం తృప్తిగా తినాలి. అరిగి
మళ్ళీ ఆకలి పుట్టాలి. మరిన్ని కొత్త రుచులతో మళ్ళీ భోజనం చెయ్యాలి. కోరికలూ అంతే!
నిరంతర సుఖప్రాప్తి కోసమే, అప్పుడప్పుడు దుఃఖం కలుగుతుంటుంది. 'ఆనందాన్ని'
శాశ్వతం చేయడం కొరకు పరమేశ్వరుడు దయతో 'ఆవేదన' అనుగ్రహించాడు. దుఃఖం మాయమైతే
సుఖం కూడాకనుమరుగవుతుంది . సుఖదుఃఖాలు ఒకే జల నుండి ఊరిన రెండు నీటి ధారలు.
ఒకదానిపై ఒకటి ఆధారపడే ఈ వైరుధ్యాలే మన ఉనికికి కారణమవుతున్నాయి. మన మనుగడను
అర్థవంతం చేస్తున్నాయి. ఎడతెగకుండా ఎండ మాత్రమే కాస్తే, అంతా ఎడారిగా
మారుతుంది. ఎప్పుడూ వర్షమే కురిస్తే జల ప్రళయం సంభవిస్తుంది. వానలు అస్సలు
వద్దు, ఎండలు మాత్రమే ముద్దు అనుకుంటే రాళ్ళు రప్పలు, బీడు నేలలే మిగులుతాయి.
నిరంతర సౌఖ్యాలు జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి. మనం ప్రకృతిని సరిగ్గా అర్థం
చేసుకొం. అందుకే ఇన్ని సందేహాలు, అపార్థాలు.
సరళరేఖను ఎంత పొడవుగా గీసినా, అందులో అందమేముంటుంది! చిత్ర విచిత్ర గతుల
వక్రరేఖల్లోనే చిత్రకళ రంజిల్లుతున్నది. సెలయేటి సౌందర్యం, దాని వంపులలోనే
దాగి ఉంటుంది. నిశ్సబ్దంగా ప్రవహించే నీటి గమనంలో ఒక విధమైన స్తబ్దత చోటు
చేసుకుంటుంది. కానీ అడుగడుగునా అడ్డుపడే రాళ్ళ తాకిడితోనే గలగలల సరిగమలు
జనిస్తున్నాయి. కడలి అలలు బండరాళ్ళను ఢీకొన్నప్పుడు ఎంత కమనీయ దృశ్యం
రచింపబడుతున్నది!
సృష్టిలోని అన్ని వస్తువులూ అపార మేధస్సు నుండి ఉద్భవించాయి. కనుక ప్రతి
వస్తువూ పరిపూర్ణమైనది. లోపాలు లేనిది. ఏది ఎందుకున్నదో అర్థం చేసుకునే
శక్తి మనకు లేకపోవచ్చు. మనకు అన్యాయంగా, అధర్మంగా కనిపించేదంతా, మనం అపార్థం
చేసుకున్న భగవంతుని ప్రజ్ఞ.
కోరికలు కలగడం, అవి సంతృప్తి చెందక పోవడం రెండూ ప్రకృతి చమత్కారమే. ఇది
సృష్టి ప్రతిభా విశేషం. ప్రతి వస్తువూ, ప్రతి సంఘటనా సుఖ, దుఃఖ కారకమే.
కాబట్టి ఒక ముఖ్య మిషయం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కోరికలోని ఆనందాన్ని
మితిమీరకుండా, అదుపు తప్పకుండా అనుభవిస్తూ వాంఛలను దుఃఖ సాగరంగా మార్చేయకుండా,
ఆనందామృతాన్ని తోడుకునే ఊటభావిగా మలచుకోవాలి. తీరని కోర్కెల బరువుమూటను
వేడుకల పెన్నిధిగా, అక్షయపాత్రగా ఆవిష్కరించండి.
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
కోరికలు - కోరలు Kb Narayana Sarma
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
No comments:
Post a Comment