దీపం ఎందుకు వెలిగించాలి
హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు . అంతేకాక,శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము. ఈ దీపం ఎందుకు వెలిగించాలి? కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము. మనము జరిపించు కార్యములు సభలూ పూజలూ మొదలగు అన్నియూ విద్యుద్దీప కాంతులలో చేయుచున్నప్పుడు మరల మరో దీపం వెలిగించుట ఎందుకను సందేహము రావలెను గదా!. సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు మన వాసనలకు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్నప్పుడు అందులోని నూనె/నెయ్యి క్రమీణా తరిగిపోయి కొంతసేపు తరువాత హరించుకు పోవును. అటులనే మన లోని రాగ ద్వేషాలుకూడా హరించునని చెప్పుటయే దీని భావము. నూనె/నేతి దీపం వెలుగునప్పుడు ఆ జ్వాల ఊర్ద్వముఖముగా ఉందును గదా! అటులనే మన జ్ఞానసంపద కూడా పైపైకి పెరగవలెనను సంకేతము కూడా ఇచ్చుచున్నది. ఒక చిన్న దీపము మరికొన్ని వందల దిపములను వెలిగించగలదు. అటులనే మన జ్ఞానదీపము కూడా మరికొంత మందిని జ్ఞాన వంతులను చేయునని భావము. ఒక దీపము తో ఎన్ని దీపములు వెలిగించినను ఆ దీపము తరిగిపోదు అటులనే ఎంతమందిని విజ్ఞాన వంతులను చేసిననూ మన మేధా శక్తి తరిగిపోదు. మరియు అది మరింత ప్రజ్వరిల్లి నలు దిశలందు వెలుగులు నింపును. మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావలెనను ఆదర్శమును అందరికీ తెలియజేయుటయే ఈ దీపారాధన ప్రాముఖ్యము భావము.దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం ఓం శ్రీ పరమాత్మనే నమః ॐ దీపం జ్యోతిః పరబ్రహ్మం,దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం,సంధ్యా దీపం నమోస్తుతే ॐ దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం,దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది,దీపారాధాన అన్నిటిని సాధించిపెడుతుంది.అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం. ॐ ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది.ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు(కంటికి సంబంధించిన వ్యాధి.షుగరు వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.దీనివల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోవచ్చు.దక్షిణ భారత దేశం,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో షుగరు వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువ). ॐ నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు(cataract) రావు.ఆవునేయి,నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి(eye sight)ని మెరుగుపరుస్తాయి. ॐ అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది.మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి,మనకు మేలు చేస్తాయి.శ్లోకంలో "సర్వ తమోపహం" అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని.ఇక్కడ కూడా చూపూ కోల్పోవడం వల్ల జీవితంలో ఏర్పడే అంధకారాన్ని తొలగిస్తొంది దీపం. ॐ ఒక గది మధ్యలో ఆవునేతి దీపం వెలిగించి,హృద్రోగులు(heart patients),రక్తపోటు(B.P)తో బాధపడేవారు,ఎక్కువగా ఒత్తిడి(stress)కి లొనయ్యేవారు రోజు 1 గంట సమయం కనుక ఆ దగ్గర కూర్చుని చూస్తే కొద్దిరోజులలోనే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని,రక్తపోటు(B.P) అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. ॐ మనం చదువుకున్నాం,కాంతి(light)కి విద్యుత్-అయస్కాంత స్పెక్ట్రం(electro-magnetic spectrum) ఉంటుందని,ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత(temperature) ఆ ప్రాంతంలో ఉన్న కాంతికిరణాల రంగు(color of light rays) మీద ఆధారపడి ఉంటుందని,ఒక్కక్క రంగు కిరణానికి ఒక్కక్క ఫ్రీక్వేన్సి(frequency) ఉంటుందని.అలాగే మనం వెలిగించే దీపపు కాంతికి ఉన్న విద్యుత్-అయస్కాంత శక్తి(electro-magnetic force) ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత మీద,వాతావరణం మీద తన ప్రభావాన్ని చూపించి ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది.గాలిలో మార్పులు తీసువచ్చి,దాని ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి,నాడులను శుభ్రపరచి,వాటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి దానికున్న దోషాలను తీసివేస్తుంది.ఇది చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ(process). ॐ ఆవునేతి దీపపు కాంతికి,నువ్వుల నూనె దీపపు కాంతికి,మిగితా దీపాల కాంతికి కూడా చాలా సూక్ష్మమైన తేడా ఉంటుంది.అందువల్ల ఒక్కో దీపం ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ॐ కార్తీక దీపాలను చూసిన చెట్లు,జంతువులు,కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వెలిగించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది కదా.అందుకని దీపాలను వెలిగించండి.వెలిగించే అవకాశం లేనప్పుడు కనీసం గాలికి కొండెక్కిన/శాంతించిన దీపాలను తిరిగి వెలిగించండి.కుదిరితే కొంచెం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వెలుగుతున్న దీపపు ప్రమిదలలో పోయండి. ఓం నమః శివాయ |
Saturday, November 23, 2013
DEEPAM YENDUKU VELIGIMCHALI_ Sraju Nanda
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
No comments:
Post a Comment