KCR Mentor Jaishetty Ramanaiah Last Interview | T News https://youtu.be/mlRs_iPQRE8?si=XEV1YsnQ3tj5n_yR నమస్తే తెలంగాణ పరిశోధక శిఖరం జైశెట్టి రమణయ్య రామకిష్టయ్య సంగనభట్ల 9440595494 తెలంగాణ మేధోప్రపంచంలో ఒక ధ్రువతార చరిత్ర పరిశోధనా రంగంలో అజరామరమైన ముద్ర వేసిన మహనీయుడు, ఉద్యమ సిద్దాంత, ఆలోచనాపరుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య జీవన ప్రస్థానం అసాధారణం. 85 ఏండ్ల వయ స్సులో జగిత్యాలలోని తన స్వగృ హంలో ఆయన కన్నుమూయడం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో ఒక మహోజ్వల అధ్యాయం ముగియడమే. చరి త్రను కేవలం గతాన్వేషణగా కాకుండా, వర్తమాన చైతన్యానికి, భవిష్యత్ నిర్మాణానికి పునాదిగా భావించిన అరుదైన దార్శనికుడు ఆయన. జగిత్యాల గడ్డపై జన్మించి, ఆ ప్రాంతం నుంచి మొట్టమొదటి పీహెల్డీ పట్టా పొందిన పరిశోధకుడిగా రమణయ్య సృష్టించిన చరిత్ర అజరామరం. 'సౌత్ ఇండియా టెంపుల్స్' (దక్షిణ భారత దేవాలయాలు) అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని ఆలయాల శిల్పకళ, శాసనాలు, నిర్మాణ శైలిపై ఆయన చేసిన విశ్లేష ణలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ...