Monday, May 29, 2017

swaranjali devotional music

PARAMARDHIKA PARIJATALU_పారమార్థిక పారిజాతాలు(ఆధ్యాత్మిక సులభ సాధనోపాయాలు)- స్వామి బ్రహ్మానంద బోధనలు

PARAMARDHIKA PARIJATALU.pdf: https://drive.google.com/file/d/1PQL7iokEwZ8y7dUAJjV71UtY9JCqsSco/view?usp=sharing https://docs.google.com/document/d/14mKrtgLbz8H3uN2BbSUMgl7_ovEwAiqSWLc2lHOxi1s/edit


BOOK DOWNLOAD LINK: https://drive.google.com/open?id=1Ki3dgYGSC3bRzG08AmYZ_fBQxJJjcwKB
ప్రస్తావన
జే వయాత్రలో మానవాళికి సద్గురువు అమృతవాణి, నావికునికి దిక్సూచి యంత్రం లాంటిది. వారి దివ్యోపదేశాలు సాధకులందరికీ తోడునీడలు. 'అవి భగవత్ర్పాప్తికి మార్గదర్శకాలు. తపస్సు అంటే ఏమిటి? దేవుడున్నాడా? మనస్సును నియంత్రించడం ఎలా? - దేహమే దేవాలయం, సత్సాంగత్యపు విలువలు, ఇత్యాది వివిధ జిజ్ఞాసపరమైన విషయాలకు మహనీయుల ఉపదేశాలే సరైన జవాబు కాగలవు. భగవాన్ శ్రీరామకృష్ణులకు కాళీవరప్రసాదలబ్ద మానసపుత్రుడైన స్వామి బ్రహ్మానంద ఆ మహనీయుల కోవకు చెందినవారు. | అధ్యాత్మ విద్యా విద్యానామ్' అన్నట్లు సమస్త విద్యలకు శిరోభూషణమైనది బ్రహ్మవిద్య. ఆ విద్య స్వామి బ్రహ్మానందకి ఎంతగా కరతలామలకమై భాసిల్లినదో ఆయన ఉపదేశాలే అందుకు తార్కాణాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని అవగతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి తాత్త్విక విషయాలను ఎన్నింటినో, సాధనా రహస్యాలను ఎన్నిటినో స్వామి బ్రహ్మానంద తన బోధనల ద్వారా అరటిపండు ఒలిచి చేతికందించినంత తేలికగా విశదపరిచారు. అనేక సందర్భాలలో తమ భక్తులకు, శిష్యులకు స్వామి బ్రహ్మానందులు చేసిన ఉపదేశాలు వంగభాషలో 'ధర్మప్రసంగ'మనే పుస్తక రూపంలో వెలువడింది. అది మూలరూపంలోను, అనువాద రూపంలోను ఖండఖండాంతరాల్లో వ్యాప్తిగాంచింది. స్వామి వారి దివ్యవచనాలు మహోన్నత భావాలనే పారిజాతాల సౌరభాన్ని ప్రపంచం నలువైపుల వెదజల్లి జనుల హృదయాలను గుబాళింప చేశాయి, చేస్తూన్నాయి. స్వామి ప్రభవానందచే కూర్చి, శ్రీరామకృష్ణ మఠం, చెన్నై వారిచే ప్రచురించబడిన "The Eternal Companion - Life and Teachings of Swami Brahmananda' ఈ పుస్తకానికి మూలం. ఆధ్యాత్మిక జ్ఞానపిపాసులకు ఈ పుస్తకం ఒక వరమనే చెప్పాలి. ఆస్వాదించండి, మీకే తెలుస్తుంది. - ప్రకాశకులు
పారమార్థిక పారిజాతాలు_ఆధ్యాత్మిక సులభ సాధనోపాయలు
• నాయనా! ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దుభగవంతుడు నీకు సకలం చేకూరుస్తాడు. భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగివుండు. ఆయన నామజపం చేయి. ఆయనే నీకు మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆందోళన చెందక, ఓర్పు వహించి, ఒడుపుగా ప్రయత్నించు. సాధనానుష్టానం కొనసాగించు. అప్పుడు భగవదనుగ్రహం తప్పక పొందగలవు. అమూల్యమైన కాలాన్ని అర్థంపర్థంలేని ఆలోచనలతో వ్యర్థంచేసుకోకు. మెట్ట వేదాంతాన్ని కట్టి పెట్టు. విషయవాంఛలను నీలో తలెత్తనివ్వకు;సత్పలితం అందుకొంటావు, భగవత్కృప పొందగలవు.
 ఈ శ్రద్ద జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది.శ్రద్ద కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు తప్పదు. 
భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి అంతటా, అన్నిటా సంశయాలే ఎదురవుతాయి. విశ్వాసపూరితునకు నిస్సంశయంగా అన్నీ సమాధానాలుగానే తోస్తాయి.
మీరందరూ పరిశుద్ధులై, శాంతచిత్తులై ఉండండి. ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందండి. 
పవిత్ర గ్రంథాలను పఠించడం అలవరుచుకోండి. పనికిమాలిన పుస్తకాలు చదువుతూ కాలాన్ని వృథా చేసుకోకండి. భగవంతునిపట్ల భక్తి విశ్వాసాలు ప్రేరేపించని గ్రంథాలు నిరుపయోగం. అవి పాండిత్య పటాటోపానికి మాత్రమే తగును. నాయనా! దుర్లభమైన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోవాలనే తలంపే ఉంటే, ఆత్మోన్నతిని పొందాలనుకొంటే భగవన్నామాన్ని ఆశ్రయించు. ధ్యానసాగరంలో మునిగిపో, ఉత్తినే పైపైనే తేలుతూ ఉండిపోక, అట్టడుగుదాకా రత్నాకరంలో మునిగితేగాని దాన్లోని రత్నాలు చేజిక్కవు సుమా! 'సంగరాహిత్యమే' మానవ జీవిత ఆదర్శమని చాటిచెప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ
యుగంలో అవతరించారు. శు జపధ్యానాదుల వలనా, ప్రార్థనల చేతా హృదయ
వికాసం కలుగుతుంది. దానివలన ఒక నూతన దృష్టి దివ్యదృష్టి, అంటే జ్ఞానదృష్టి జనిస్తుంది. అప్పుడు సాధకుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిష్కరించుకో గలుగుతాడు. అంతమాత్రాన లక్ష్యం
సిద్దించినట్లు భావించరాదు. బీజరూపంలో ఉన్న సూక్ష్మ అంతఃకరణానికి భగవంతుని దర్శించ గలిగినంత శక్తిలేదు. అది మానవుణ్ణి భగవంతునికి సన్నిహితుణ్ణి చేస్తుంది. అంతే. ఆ స్థితిని చేరుకొన్నప్పుడు మనిషికి ప్రపంచం యావత్తు నిస్సారంగా కానవస్తుంది. ఇక ఇప్పుడతడి మనస్సు
భగవచ్చింతనలో లగ్నమైపోతుంది . ఓ మానవ దేహంలో భగవంతుడు ఒక ప్రత్యేక స్థానాన్ని
పాదుగొలిపి విరాజిల్లుతున్నాడనే మహాతత్త్వాన్ని
మనస్సులో పదిలపరచుకోవాలి. 4 భగవంతుడు మనవాడు. సులభంగా మనకు దర్శనం
ఇస్తాడు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. దాన్లో మొదటిది భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం. ఈ రెండూ భగవత్సాక్షాత్కారాన్ని చేకూర్చేవే. భక్తుడు భగవంతుని రూపం గాంచాలని ఆరాటపడతాడు. అందుకై స్తుతిస్తాడు, నామసంకీర్తన చేస్తాడు. ఆయన దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు ఆనందంతో మురిసిపోతాడు.జ్ఞానమార్గావలంబులు ఆత్మజ్యోతిని అన్వేషిస్తారు. అంటే తనలో ఉన్న పరమాత్మను తెలుసుకో ప్రయత్నిస్తారు.
ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ఏ రీతిలోనైనా భక్తుడు, జ్ఞాని ఏకమవుతారు; గమ్యం చేరుకొంటారు. నిజానికి ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోగోరితే అతడి నిత్యవిధులు ఎలాంటివో పరిశీలించాలి. అతడి యథార్థ స్వరూపాన్ని వెల్లడించేవి నిత్యకృత్యాలే. కర్మయోగి అయినవాడు ఏ పనినైనా, చివరకు ఎంత నికృష్టమైన పనినైనా ఏవగించుకోక మనస్ఫూర్తిగా దాన్లో లీనమై చేస్తాడు. జనం మెప్పు పొందాలనే ఆకాంక్ష అతడికి ప్రేరణ కాదు. మానవ జీవిత పరమాదర్శాన్ని ఎన్నడూ మరచిపోకండి. ఆహార నిద్రాదులతోనే పశుప్రాయంగా గడపడానికి ప్రాప్తించింది కాదు ఈ మానవ జన్మ దుర్లభమైన మానవ జన్మను ప్రాప్తించుకొన్నావు కనుక ఇంద్రియ సుఖాలను తృణీకరించి భగవత్సాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి దీక్ష పూనాలి. భగవద్దర్శన ప్రయత్నంలో మృత్యువును ఎదుర్కోవలసి వచ్చినా బెదరిపోవద్దు. భక్తి, జ్ఞాన పారవశ్యం పొంది శాశ్వతమైన ఆనంద సామ్రాజ్యంలో అడుగిడే ప్రయత్నం చేయాలి.


పారమార్థిక పారిజాతాలు(ఆధ్యాత్మిక సులభ సాధనోపాయాలు)- స్వామి బ్రహ్మానంద బోధనలు DOWNLOAD LINK: https://drive.google.com/file/d/0B5yQ3mnWznCXZ3pVSGlwV2pmejA/view?usp=sharing ....సాధకులకు ఏంతో ఉపయుక్తముగా వుంటుంది రామకృష్ణ మఠం హైదరాబాద్ లో లబిస్తుంది...

Sunday, May 28, 2017

GEYA BHAGAVDGITA _ P.SUSHEELA

VIMEO LINKS
https://vimeo.com/215615711
GEYA BHAGAVDGITA _ P.SUSHEELA
https://vimeo.com/218808572
RAMACHANDRDITADU RAGHUVEERUDU
https://vimeo.com/218809117
JAGADANANDA TARAKA

వేదాంత భేరి_JUNE 2017


వేదాంత భేరి_JUNE 2017 

 Vijayananda Swami: జూన్ వేదాంతభేరి - 2017

శ్రీ శుకబ్రహ్మాశ్రమము,sukabramhasramam,srisukabrahmashramwww.srisukabrahmashram.org Vijayananda Swami: Link june Vedanta Bheri 2017 http://www.srisukabrahmashram.org/2017/05/2017.html

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular