Tuesday, November 8, 2016

Health Tips

Health Tips

ఇవి మీకు తెలుసా ?
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

జామ పండ్లు ఎక్కువగా తినండి...మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి
మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండునో, లేక బలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా వాడతూ ఉంటాము.
ఇక మీదట అలా చేయ వలసిన పని లేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని బలపరచటానికి ఎక్కువగా ఉపయోగ పడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన పరిశోధనలో తెలిసింది.
ఎలాగంటే, మనం ఆరోగ్యంగా ఉండటానికి మనకు యాంటీ-ఆక్సిడెంట్స్ అతి ముఖ్యంగా కావలసి యున్నది. మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము.ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ మనలో ఉన్న కొన్ని జీవ కణాలు కూడా పాడవుతూ ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్స్ ఈ జీవ కణాలు పాడైపోకుండా కాపాడతుంది. ఇంతే కాకుండా వయసుతో పాటు మనకు ఏర్పడే డీ-జెనరేటివ్ వ్యాధులనూ, క్యాన్సర్ వ్యాధినీ మరియూ ముసలితనాన్ని(Early Aging) అరికట్టడంలో సహాయపడుతుంది. కనుక ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ మనకు చాలా అవసరమన్నమాట. అదీ ప్రక్రుతి ఆకారంలో దొరికితే చాలా మంచిది.
జామ పండులో యాంటీ-ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగానూ, పైనాపిల్ పండులో అతి తక్కువగానూ ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది.
ఇండియన్ ప్లం, మామిడి పండు, దానిమ్మ పండు, సీతాఫలం మరియూ ఆపిల్ పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉన్నదని పైనాపిల్,అరటి పండు, బొప్పాయి, పుచ్చకాయ మరియూ ద్రాక్ష పండ్లలో తక్కువగా ఉన్నదని తెలిపేరు.
ఖరీదైన పండ్లు ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాము. కానీ తక్కువ ఖరీదు గల జామ పండు ఆరోగ్యానికి అతి మంచిదని తెలిసింది. ఈ క్రింది పట్టీలో ఏ ఏ పండ్లలో ఎంత శాతం యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది.(100 గ్రాముల పండులో ఎన్ని మిల్లిగ్రాముల యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది).
జామ పండు....496.
ఇండియన్ ప్లం....330
సీతాఫలం....202
మామిడి పండు....170
దానిమ్మ పండు....135
ఆపిల్ పండు....123
ద్రాక్ష పండు... 85
బొప్పాయ పండు....50
అరటి పందు....30
ఆరెంజ్ పండు...24
పుచ్చకాయ...23
పైనాపిల్....22
కనుక ఇక మీదట మీకు పండు తినాలనిపిస్తే జామ పండుకు మొదటి చాయిస్ ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి.

ఆరోగ్య పరం గా " పుదీనా " వల్ల ఉపయోగాలు 
++++++++++++++++++++++++++++++++
1.పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి.
2.పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలకు పోగడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను ఫేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది.
3.అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది
4.స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం బహుబాగా పనిచేస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.
5.గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
6.గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలి పడితే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది.
7.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మౄఎదువుగా మారుతుంది.
8.గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్‌ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
9.పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వౄఎద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.

ప్రస్తుత జీవినములో గ్రుడ్డు (ఎగ్) ఒక బాగమైపోయింది...
డాక్టర్లు కూడా బోజనములో ఒక బోయిల్డ్ ఎగ్ సూచిస్తున్నారు రోజుకి...
కానీ అవి వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ...
మనం దుకాణము నుంచీ తెచ్చిన తరువాత వాటిని డైరెక్టుగా వండేయకూడదు...
ఎందుకంటే, ఏమో ఎవరికితెలుసు అవి ఎన్నిరోజులనుండీ నిలువ వున్నవోకధా మనం కొనే వారి దగ్గర.....
మరియు అందులో కొన్ని ముగిగిన లేక పాడైనవి కూడా వుండి వుండవచ్చును...
అవి తినడం వల్ల మనం కొత్త కొత్త వ్యాదుల బారినపడే అవకాసం కూడా వుంది..
మరెలా ఇధి కనుక్కోడం... రండి తెలుసుకుందాం...
ఒక పాత్రలో నీరు పోసి దానిలో గ్రుడ్లు వేస్తే మంచివైతే మునుగుతాయి కానిచో తేలుతాయి తేలినవి పక్కన పడేసి మునిగిన వాటిని వండుకుతినడమే....

కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించే అనాసపండు
పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్ధాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.
పొట్టను తగ్గిస్తుంది:
ఈ రోజుల్లో పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. యువతీ, యువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ అనాసపండుకి ఉంది. ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. తర్వాత రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.
ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి.
పిల్లలకు ఔషధం వంటిది:
అనాసపండు పచ్చకామెర్లను నయంచేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది మూత్ర పిండాలలోని రాళ్ళను కరిగిస్తుంది. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది. పిత్తాన్ని పోగొడుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగు పరుస్తుంది. పిల్లలచేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి.
అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.
మూత్ర పిండాల్లోని రాళ్ళను కరిగిస్తుంది:
అనాసపండు ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరుగుతుంది, నిగారింపును సంతరించుకుంటుంది. అనాసపండును తరచుగా తింటుండడం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అనాసపండు రసాన్ని రోజుకి నాలుగు సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి.
జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది:
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండడం వల్ల త్వరగా జీర్ణ శక్తి పెరుగుతుంది.

జుట్టుకు వేపాకు బెస్ట్‌
1.వేప సహజ ఔషధ గుణాల నిధి. వేపతో చర్మసంబంధమైన వాటితో పాటు జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.
2.వేపాకు చూర్ణాన్ని వారానికి ఒకసారి జుట్టుకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
3.వేపనూనెతో వారానికి రెండుసార్లు హెడ్‌ మసాజ్‌ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది.
4.జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకు పేస్ట్‌తో నెలకు రెండుసార్లు మాస్క్‌ వేసుకుంటే కురుల్లో మెరుపు వస్తుంది.
5.తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నాన బెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుంది.
గోరు వెచ్చని రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని అందులోకి మూడు టేబుల్‌ స్పూన్ల వేపనూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడతాయి.
గుప్పెడు వేపాకుల్ని బాగా ఉడికించి, పేస్ట్‌ చేసి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
ఒక బౌల్‌లో వేపాకుపే్‌స్టను తీసుకుని అందులోకి గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమంతో తలకు మాస్క్‌ వేసుకుంటే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.

గుమ్మడి గింజలు.. శృంగార సామ్రాజ్యానికి సోపానాలు
మానవ మనుగడలో అతి కీలకపాత్ర పోషించేది శృంగారం. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో అది తన ప్రాధాన్యాన్ని కోల్పోతోంది. తీరిక లేకపోవడం ఒకవైపు, డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి పలురకాల వ్యాధులు మరోవైపు శృంగారాసక్తిని చంపేస్తున్నాయి. దాంతో ఏదో మొక్కుబడిగా పిల్లల కోసమే చాలా మంది సెక్స్‌ చేస్తున్నారు. చాలామందికి నడివయసుకొచ్చేసరికి శృంగార సామర్థ్యం తగ్గుతుంది. అయితే వారు ఆ విషయమై డాక్టర్లను కలవడానికి సంకోచిస్తున్నారు. డాక్టర్ల వద్దకు వెళ్లలేకపోయినా.. కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెక్స్‌ సామర్థ్యం కొంతవరకైనా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనవి గుమ్మడికాయ గింజలు.
గుమ్మడి పిక్కలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఈ పిక్కల్లో జింక్‌ పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది మగవారిలో టెస్టొస్టిరాన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుందని రుజువైంది. యాంటీ ఆక్సిడెంట్ సెలెనియంతో పాటు విటమిన్లు ఇ, సి, డి, కె, బి నిండి ఉన్న గుమ్మడి గింజలు శృంగార సామ్రాజ్యానికి సోపానాలు. వీర్యంలో కీలకమైన శుక్రకణాల వృద్ధికి ఈ గింజలు ఎంతో ఉపకరిస్తాయి. వీటిలోని మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు మగతనాన్ని మెరుగుపరచడంలో ముందుంటాయి. శృంగార సామ్రాజ్యంలో పురుషులకు పోటీగా స్త్రీలకూ అదే స్థాయిలో గుమ్మడి గింజలు ప్రయోజనాలు అందజేస్తాయి.
సాధారణ ఆరోగ్యం విషయానికొస్తే.. మన శరీరంలో ధమనులకు దన్నుగా నిలుస్తాయి గుమ్మడి గింజలు. మూత్ర సంబంధ సమస్యల్ని నివారించడానికి శతాబ్ద కాలానికి ముందు నుంచే నాటి సంప్రదాయ వైద్యులు ఈ గింజల్ని ఉపయోగించేవారట. గుండె జబ్బుల నివారణ, కొవ్వుతో పాటుగా కిడ్నీలో రాళ్ళను కరగదీయడంలోను ఈ పిక్కల పనితీరే వేరు. ఈ గింజలను పచ్చిగా తినవచ్చు, కాస్తంత ఆలివ్ ఆయిల్‌లో వేయించుకుని కూడా తినవచ్చు.

మెంతులు – ప్రయోజనాలు
మెంతి కూర, మెంతులు : దాదాపు ఇవి లేకుండా వంటకాలు తయారుకావు.. ఏదైనా వంటకానికి మంచి రుచి రావాలంటే ఏ రూపలోనైనా, కొద్దిగా మెంతులు కలపవలసిందే! మెంతి కూర పప్పు, మెంతి పరోటా, మెంతి కూర పచ్చడి, మెంతి ఆవాకాయ…..ఒకటేమిటి! ఇలా ఎన్నో రకాల వంటకాలు. ఇంచుమించు అన్ని రకాల వంటకాల్లో మెంతులను వాడుతూ ఉంటాం. ఎందుకంటే మెంతులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఔషధ లక్షణాలు కలిగిన మెంతులను వాడటం వలన మనకు ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుని మరీ వాడుకుందాం!
అధ్యయనాల ప్రకారం, మెంతులలో ముఖ్యంగా, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటానికి సహాయపడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) ఉన్నదని తెలుస్తున్నది. మెంతులు, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజెరైడ్స్ శోషణ నిరోధించే స్టెరాయిడ్ సపోనిన్లు యొక్క గొప్ప మూలం. వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉన్నది. ఈ పొటాషియం రక్తపోటు, గుండె రేటును నియంత్రించే సోడియంను సరిగా పనిచేసేట్లుగ చూస్తుంది.
మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతులను తమ ఆహారంలో చేర్చుకోవాలి. మెంతుల్లో ఉండే సహజంగా కరిగే ఫైబర్, ‘గలాక్తోమన్నన్’ ఉండటం వలన రక్తంలో చక్కెర శోషించే రేటును తగ్గిస్తుంది. వీటిలో ఆమినో ఆమ్లం ఉండటం వలన మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అందువలన మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట వరం. వీటిని ఏ రూపంలోనైనా ఆహారంలో తీసుకోవటం మంచిది.
మెంతులలో ఫైబర్, అనామ్లజనకాలు అధికమొత్తంలో ఉన్నాయి. వీటిని తీసుకోవటంవలన విషపదార్థాలను బయటకు నెట్టివేసి, జీర్ణక్రియను సజావుగా సాగేట్లు చేస్తుంది. మెంతులతో తయారుచేసిన టీ, అజీర్ణం, కడుపునొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. మెంతుల కషాయం ఉదయంపూట తీసుకోవటం వలన మలబద్ధకం నివారింపబడుతుంది. కొద్దిగా మెంతులను పెరుగులో కలిపి తీసుకుంటే అతిసారం తగ్గుతుంది.
కొద్దిగా మెంతులను నీటిలో నానపెట్టి, తీసుకుంటే గ్యాసుతో కూడిన గుండెమంట నివారింపబడుతుంది. వీటి పైన ఉన్న జిగురుకోటు కడుపు మరియు ప్రేగులలో ఒక పూతలాగా ఏర్పడి, మనకు చిరాకు కలిగించే జీర్ణశయాంతర కణజాలం నుండి ఉపశమనం కలుగచేస్తుంది. అధికబరువు ఉన్నవారు నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరకడుపున తీసుకున్నందువలన, బరువును కోల్పోతారు. ఒక టీ స్పూన్ నిమ్మరసం మరియు తేనెతో మెంతులను కలిపి తీసుకుంటే జ్వరం, దగ్గు, గొంతునొప్పి ఉపశమిస్తాయి.
మెంతులలో ఉన్న ‘డైయోస్ జెనిన్’ పదార్ధం, శిశువులకు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది.. అందువలన బాలింతరాళ్ళు మెంతులను ఆహారంలో తీసుకోవటం మంచిది. మెంతులు గర్భిణులు ఆహారంలో పరిమితంగా, క్రమంతప్పకుండా తీసుకున్నందువలన ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచాలను ఉత్తేజపరిచి, నొప్పులను కూడా తగ్గిస్తుంది. అయితే, మెంతులను గర్భిణులు అతిగా తీసుకున్నందువలన గర్భస్రావం లేదా అపరిపక్వ జననం జరగవచ్చు. మెంతులు ఋతుక్రమంలో కలిగే కడుపునొప్పిని కూడా నివారిస్తాయి.
మెంతి ఆకులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మెంతికూరను టమాటోలతోగాని, బంగాళాదుంపలతోగాని తీసుకున్నందువలన మన శరీరానికి ఐరన్ ఎక్కువగా అందుతుంది. వీటిలో ఈస్ట్రోజెన్ వంటి లక్షణాలు ఉన్నందువలన, మెంతులు ఆడవారి వక్షోజాల పరిమాణంలో కొద్దిపెరుగుదలకు తోడ్పడతాయి. మెంతులు క్యాన్సర్ వంటి వ్యాధిని నివారించటంలో కూడా సహాయపడతాయి.
మెంతులలో విటమిన్ ‘సి’ ఉన్నది, కనుక వీటిని నానబెట్టి, పేస్ట్ లాగా చేసి, దానిని కాలిన గాయాల మీద ,ఎక్జిమా వంటి చర్మవ్యాధులకు పూయండి. ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. మెంతుల పేస్ట్ చర్మం మీద ముడుతలను తొలగించే యాంటి-ఏజింగ్ క్రీమ్ లాగా పని చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ కూడా తొలగిస్తుంది.
మెంతి ఆకులనుగాని, మెంతులనుగాని ఫేస్ ప్యాక్ లాగా వాడవచ్చు. ఈ ప్యాక్ ను 20 నిముషాలపాటు ముఖంపైన వేసి, తరువాత కడగండి. మెంతిగింజలను ఉడికించిన నీటితో ముఖాన్ని కడిగి చూడండి. ఫలితం చూసి ఆశ్చర్యపోతారు. మెంతిగింజల పేస్ట్ జుట్టుకు పట్టించండి. మీ జుట్టు మెరుస్తూ, నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. మెంతులను వేడినీటిలో ఒక రాత్రంతా నానపెట్టండి. మరుసటిరోజు ఆ నీటిని కొబ్బరినూనెతో కలిపి తల మీద మర్దన చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన జుట్టు రాలటం, చుండ్రు నివారింపబడుతుంది. మెంతుల పేస్ట్ ను కొద్ది పాలతో కలిపి ముఖానికి పట్టించండి. 15 నిముషాల తరువాత కడగండి. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ……….ఎన్నో, ఎన్నెన్నో, మెంతుల వలన ప్రయోజనాలు. ప్రయత్నించండి.

మనిషి జీవితంలో అత్యంత సుఖమైనది స్త్రీ, పురుషుల సంయోగం. నేటి ఆధునిక యుగంలో పెరిగిన పోటీతో ఉదయం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరకలు, పరుగులే. ఈ కారణంగా స్త్రీ, పురుషుల్లో సెక్స్ కోరికలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీంతో పురుషుల్లో పలువురు సెక్స్ కోరికలను పెంచుకునేందుకు మెడికల్ షాపుల్లో దొరికే మాత్రలపై ఆధారపడుతుంటారు. అయితే మనం నిత్యం తీసుకునే ఆహారంతోనే సెక్స్ వాంఛను పెంచుకోవచ్చు.భారత దేశ సాంప్రదాయ వంటకాల్లో ఉపయోగించే వస్తువులలో అతి ముఖ్యమైనవి మెంతులు. అందువలనే మన పూర్వికులు మన ఆహార పదార్థాల్లో మెంతులకు ముఖ్యత్వం ఇచ్చి ఉన్నారు. మెంతులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటూ వస్తే పురుషులకు సెక్స్ కోరికలు పెరుగుతాయి. మెంతులు పురుషుల సెక్స్ హార్మోన్‌లను రెచ్చగొట్టేందుకు సహకరిస్తాయి. మెంతుల్లో ఉన్న సపోనిన్ అనే పదార్థం పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరన్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ విషయం తాజాగా జరిపిన అధ్యయనం ద్వారా మరోసారి రుజువైంది. ఇందుకోసం పరిశోధకులు ఇటీవల 25 ఏళ్ల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సులోపు గల 60 మంది పురుషులను పరిశోధించారు. వారికి రోజుకు రెండు సార్లు వంతున మెంతులు, మెంతుల రసం ఇచ్చారు. ఆరు వారాల తర్వాత వారికి సెక్స్ కోరికలు అత్యధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో మెంతులు తినని కొందరిని పరిశోధించగా వారికి సెక్స్ కోరికలు తక్కువగానే ఉన్నట్టు తెలిసింది. దీంతో మెంతులను సెక్స్ ప్రియులకు వరప్రసాదంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఇక బయట మెడికల్ షాపుల్లో అడ్డమైన మందులను కొని, డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని వృధా చేసుకోకుండా, ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో మెంతులు చేర్చుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
పసుపుతో బ్లాక్‌హెడ్స్ మాయం..!
ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
• చెంచా దాల్చినచెక్క పొడీ, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.
• ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్‌ని రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌పై రాసి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
• గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..
ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మిల్లెట్ అనే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల యంటీ ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది.
సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్నేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి , కట్ చేసి పెట్టుకోవాలి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం , ఒక అర టీ స్పూన్ ఉప్పు , ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నిటిని మిక్సర్ లో మెత్తగా గ్రైండ్ చేయాలి. వడ పోయకుండా అలానే త్రాగాలి. ప్రతి రోజు ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళికడుపుతో తీసుకోవాలి.అరగంట ఏమీ తినకూడదు.
1) షుగర్ , కొలెస్ట్రాల్ , బీపి కంట్రోల్ లోఉంటాయి.
2) మొటిమలు , మచ్చలు , చర్మ వ్యాధులు , స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.
3) గ్యాస్ ప్రాబ్లం , కడుపునొప్పి ,పొట్ట సమస్యలు , 
అల్సర్లు ,అజీర్ణం , వాంతులు , వికారం తగ్గుతాయి.
4) నోటి అల్సర్లు , నోటి పూత , నోటి దుర్వాసన తగ్గుతుంది.
5) ఫైల్స్ , మలబద్దకం తగ్గుతుంది.
6) వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
7) కంటి చూపు మెరుగుపడుతుంది.
8) శరీరం నుండి విష పదార్ధాలను బయటికి toxins రూపంలో పంపిస్తుంది.
9) శరీరం యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
10) కాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది. స్త్రీలో ఋతుచక్ర సమస్యలు , PCOD ని పరిష్కరిస్తుంది.
ఒక్క జ్యూస్ లో ఎన్నో లాభాలు , ప్రతి రోజు ఒక మూడు రూపాయలు ఖర్చు అంతే ...

*******************************************
పొట్ట వస్తోందా..........అయితే రాకుండా చేసుకోండిలా............. 
భారతీయులకు మరీ ముఖ్యంగా దక్షిణాది వారికి 40 ఏళ్ళు దాటాయంటే పొట్ట వచ్చి పడుతుంది. వాకింగ్ , యోగా, ఎక్సర్ సైజులు చేసి నానా తంటాలు పడితే తప్ప ఆ పొట్ట కాస్తయినా తగ్గదు. ఉత్తరాది వారు గోధుమలను ఎక్కువగా వాడుతారు కాబట్టి మనతో పోల్చుకుంటే వారికి పొట్ట కాస్త తక్కువే. మనం రైస్ అధికంగా తినడం , బిర్యానీలు , స్పైసీ పదార్థాలు ఎక్కువగా తినడం ఊబకాయానికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
పొట్ట రాకుండా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. దాని కోసం పొట్ట తగ్గించుకునే ఆహార చిట్కాలను పాటించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవేమిటంటే...........,
1.మసాలాలు ఎక్కువగా దట్టించిన నాన్ వెజ్ ఆహారాన్ని తగ్గించుకోవాలి.
2.ఆమ్లెట్లకు దూరంగా ఉండండి. ఉడికించిన కోడిగుడ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
3.పచ్చి బటానీలు , పెసులు , మినుములు ఉడకబెట్టినవి తీసుకోవడం మంచిది.
4.పచ్చి కూరగాయలు కొవ్వును బాగా తగ్గిస్తాయి. క్యారెట్ , కాలీ ఫ్లవర్ , కీర దోస , పచ్చి కూరలు తీసుకోండి.
5.బార్లీ కొవ్వును బాగా కరిగిస్తుంది . బార్లీ జావ , బార్లీ నీళ్ళు ఊబకాయాన్ని దూరం చేస్తాయి.
6.గ్రీన్ టీ చక్కటి ఆరోగ్యానికి , నాజూకైన శరీరానికి ఎంతగానో పనికొస్తుంది. ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకుంటే మీ శరీరం కొవ్వుకు దూరంగా ఉంటుంది.

అధికబరువు , షుగర్ , గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు మీ రోజుని ఇలా ప్రారంభించండి
జీలకర్ర నీరు 
1) 2 గ్లాసుల నీటిని పొయ్యి మీద వేడి చేయాలి , అవి బుడగలు రావడం మొదలుపెట్టినప్పుడు , 3 స్పూన్ల జీలకర్రను వేసి , వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి.గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి , ఆ నీటిని త్రాగేయండి.
2) వెంటనే 20 మినిట్స్ వాకింగ్ చేయండి.
3) ప్రతిరోజు ఇలా చేస్తే జీలకర్రలో ఉండే గుణాలు , జీర్ణ వ్యవస్థను శుద్దిచేసి , బరువు , షుగర్ లెవెల్స్ , అసిడిటీ , హై BP నియంత్రణలో ఉంటాయి.

No comments: