Tuesday, March 31, 2015

Dr.Ganta Gopal Reddy_Face To Face_Interview(Video) By Yedavalli Sudarshan Reddy

Dr.Ganta Gopal Reddy
"Face To Face "
Interview(Video) By
Yedavalli Sudarshan Reddy
డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి గారితో  "ముఖాముఖి" వీడియో కార్యక్రమము నిర్వహణ  యెడవల్లి సుదర్శన్ రెడ్డి  Dr. Ganta Gopal Reddy "FACE TO FACE" video interview_09 FEB 2015 

Sunday, March 29, 2015

ttp://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు పుస్తకాలు ఒకేచో
From: SAI RAM <sairealattitudemgt@gmail.com>
Date: 2015-03-28 12:23 GMT+07:00
Subject: http://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ
సంబంద ఉచిత తెలుగు పుస్తకాలు ఒకేచోట!!
To:


ఆత్మ జ్ఞాన స్వరూపమునకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు,
సాయినాధుని కృపవల్ల భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద పుస్తకాలను ఇంటర్నెట్ లో
సేకరించి,వాటిని వివిధ వర్గాలుగా విభజించి ఉచితం గా ebooks(PDF) రూపంలో
అందించటం జరిగింది. ఈ రోజుకి గురుదేవుల అనుగ్రహంతో ఉచిత పుస్తకాలు విభాగం
పూర్తి అయినది. ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి,
జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు
చదువుకోవటంలో, లింక్ పొందటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను
సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. ఈ జ్ఞాన
యజ్ఞానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎంతో ఋణపడిఉంటాము.

ప్రతి నెల సాయి రామ్ నుంచి న్యూస్ లెటర్ సభ్యత్వం పొందటం/వైదొలగటం కోసం
sairealattitidemt@gmail.com కి మెయిల్ చేయగలరు.

--

*సాయి రామ్ సేవక బృందం*

భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు ఒకేచోట!!
సాయి రామ్ వెబ్ సైట్: http://www.sairealattitudemanagement.org
సాయి రామ్ సమాచారం: https://www.facebook.com/SaiRealAttitudeManagement
* * సర్వం శ్రీ సాయినాథ

Friday, March 27, 2015

SRI RAMA NAVAMI_2015భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 
ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫ్రీ గా భక్తి పాటలు డౌన్లోడ్ చేసికొనండి 
ఈ  pogoplug link ద్వారా files డౌన్లోడ్ easy గా డౌన్లోడ్ చేసికొనుటకు mozilla firefox browser బాగా ఉపయోగకరంగా ఉన్నది 
album  లోని files /లేక  select  చేసికొన్న files అన్నీఒకేసారి  one by one  డౌన్లోడ్  చేసికొన వచ్చును   
download link:

or

Friday, March 20, 2015

మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు-21 మార్చి 2015

హరిఃఓమ్
శుభోదయం
మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు-21 మార్చి 2015
ఓమ్ నమో నారాయణాయ.
భగవత్సేవలో,
బ్రహ్మచారి విజయానంద-8106851901
శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640
శ్రీకాళహస్తి-ఆంధ్రప్రదేశ్-ఇండియా
HARI OM.
GOOD MORNING.
HAPPY TELUGU- MANMATHA - NEW YEAR 21st MARCH 2015
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI  VIJAYANANDA,
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI-(AP)-INDIA
81 06 85 19 01
80 19 41 00 34
vijayananda111@gmail.com
7BA5CA83-0F7E-4869-8F0D-F4ADE2B4D7BAF295A049-629A-4792-9DA5-A6CB17EF4293

Thursday, March 19, 2015

విశ్వ పౌరత్వం

విశ్వ పౌరత్వం

Posted On:3/18/2015 11:49:46 PM

భావ విశుద్ధి, జ్ఞానం, ప్రజాహితవర్తనం, దయార్ద్రహృదయం, ధైర్య సాహసాలు, విశృంఖల నిశ్చల సత్యదీక్ష ప్రతీ పౌరునిలో ఉండాలన్నదే భారతీయ సిద్ధాంతం. మానవత్వం ఉట్టిపడేలా ప్రపంచం కోసం, జ్ఞానం కోసం నా ఈ జన్మ అని ప్రకటించిన గౌతమ బుద్ధుని విశ్వపౌరత్వం అవనికే ఆదర్శం.
ఏకం వినిన్యే సజుగోప సప్త, సప్తైవ తత్యాజరరక్షపంచ
ప్రాప త్రీవర్గం బుబుధే త్రీవర్గం జజ్ఞే ద్వివర్గం ప్రజాహౌ ద్వివర్గమ్ ॥
ఎదుటివారికి చెప్పే ముందు మనం దానిని అవలంబించాలనే సామాన్యధర్మాన్ని విశ్వశ్రేయస్సుకై ఉపయోగించిన బుద్ధుడు మనసును వశం చేసుకున్నాడు. ఆ ఒకటీ చాలు అనేక అద్భుతాలకూ, ఉపద్రవాలకూ హేతువు. ఏడు మలినాలను వదిలి సప్తధాతువులను రక్షించాడు. ఐదు తత్తాలనూ కాపాడినాడు. ధర్మార్థకామాలను ఆచరించాడు. శత్రుమిత్ర ఉదాసీనమనే మూడింటినీ తెలుసుకున్నాడు. నయం-అనయం అనే రెండింటిని అర్థం చేసుకొని కామక్రోధాలు రెండింటినీ వదిలివేశాడు. అజ్ఞానంధకారాన్ని పారద్రోలడానికి జ్ఞానసూర్యుడిలా ఉద్భవించిన గౌతమబుద్ధుడు లోకధర్మాన్నీ, జీవనతత్వాన్నీ, అర్థం చేసుకున్నాడు కనుకనే ప్రపంచాన్ని దుఃఖార్ణవం నుంచి దాటించాడు. సున్నితమై న, సునిశితమైన ఆలోచనలతో ధర్మవ్యవస్థను స్థిరపరిచాడు.
దుఃఖం నుంచి అన్వేషణ సాగించి జ్ఞానశోధన చేసిన బుద్ధుని ప్రస్థానం క్లిష్టపరిస్థితుల నుంచే మనిషి ఉన్నత శిఖరాలను చేరే ఆలోచనలు పుట్టుకొస్తాయనే తత్తం ధ్వనిస్తుం ది. మోహాన్ని విడిచి వాస్తవంతో లోకాన్ని పరికిస్తే మానవధర్మం అర్థమవుతుందనే ఆయన ప్రబోధం ప్రపంచశాంతిని పరిపుష్టం చేసింది. విశాలం, స్నిగ్ధం, దీప్తివంతం అయిన బుద్ధుని నల్లని కనుదోయి విశ్వం లోతుల్ని దర్శించింది.

జీవితంలోనైనా, తత్తదర్శనంలోనైనా ఒక్కో దశలో ఒక్కో మెట్టే అధిగమించి పూర్వపు వాసనలు మెల్లగా వదిలిపోతుంటే సంస్కారవంతమై జ్ఞానవిజయం సుసాధ్యమవుతుంది. వివేకం గల మనిషి అజ్ఞానంలో బతికినన్నాళ్ళు అశాంతి, అసంతృప్తి అతన్ని విడిచిపెట్టవు. జ్ఞానం అంటే సత్యం, వాస్తవం, అనంతం దానిని తెలుసుకొని మసులుకుంటే సొంత మనశ్శాంతితో పాటు ప్రపంచశాంతినీ పొందగలడు. వ్యక్తి శ్రేయస్సే విశ్వశ్రేయస్సై శోభిల్లుతుంది.

-ఇట్టేడు అర్కనందనాదేవి

తరగతి గదిని సజీవం చేసిన ఆచార్యుడు రామయ్య

తరగతి గదిని సజీవం చేసిన ఆచార్యుడు రామయ్య
Posted On:3/18/2015 11:51:58 PM
తత్వశాస్ర్తాన్ని ఎవరికీ అర్థం కాని జడ పదార్థంగా పరిచయం చేయడం కాకుండా దానిని ప్రేమించి, శ్వాసించి, బోధించిన వారు అరుదు. ప్రొఫెసర్ చిట్ల రామయ్య అటువంటి అరుదైన ఆచార్యుల్లో ఒకరు. ఆయనే కాదు వడ్డెర చండీదాస్, ప్రొఫెసర్ వీరయ్య వంటి వారు మాకు గురువులుగా ఉండడం మా భాగ్యం. చండీదాస్ నీతిశాస్త్ర బోధ న చేసేవారు.వీరయ్య షడ్దర్శనాలను బోధించేవారు. రామయ్య సారు భారతీయ తత్వశాస్ర్తాన్ని, ప్రత్యేకించి విశిష్టాద్వైతాన్ని తన ఇష్టమైన అంశంగా బోధించేవారు. తత్వాన్ని జీవితానికి అన్వయించి బోధించేవారు. వివిధ తత్వాల మధ్య ఉన్న వైరుధ్యాలను ఆయన స్వేచ్ఛగా విద్యార్థులతో చర్చించేవారు. ఎంత తత్వశాస్త్ర ఆచార్యులైనా ఆయనకు భారతీయ తత్వం గొప్పదనే ఒక భావన ఉండేది. తత్వశాస్త్ర చర్చలన్నీ.. దేవుడున్నాడా లేడా, ఆత్మలున్నాయా లేవా, భౌతిక, అధిభౌతికాల్లో ఏది ప్రథమం, ఏది మంచి ఏది చెడు ఎలా నిర్ణయించడం వంటి అంశాల చుట్టూ హోరాహోరీగా చర్చలు జరిగేవి. కమ్యూనిస్టు తత్వశాస్త్ర ప్రభావంలో యూనివర్శిటీలో ప్రవేశించిన మా కు తత్వశాస్త్ర అధ్యయ నం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆచార్య రామయ్య, చండీదాస్, వీరయ్యలు తీసుకునే తరగతులు ఎప్పుడూ ఓ పట్టాన ముగిసేవి కాదు. తదుపరి తరగతి చెప్పే ఆచార్యులు తరగతి గది బయటికి వచ్చి పచార్లు చేసి పోయేవా రు. అంటే తరగతిలో అంతగా చర్చను ప్రోత్సహించేవారు. తాత్విక జిజ్ఞాసను అంతగా ఆస్వాదించేవారు.
రామయ్యగారు ఒకరోజు ఆత్మలు, దేహాలకు అతీతంగా వాటి అస్తి త్వం గురించి బోధిస్తున్నారు. ఆత్మలు లేవని, అవి వెంటాడే భావాలు మాత్రమేనని వాదించాను. భావాలు దేహసంబంధమైనవని, ఒక మనిషికి సంబంధించిన రూపలావణ్యాలు, జ్ఞాపకాలు, భావాలు మాత్రమే అతని మరణానంతరం కొనసాగుతాయని, వాటిని మనిషి ఆత్మలుగా భావించేవారని వాదించాను. కానీ ఆత్మ సత్యం, ఆత్మనిత్యం అన్న భారతీయ తత్వమూలాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఆత్మ పరమాత్మను చేరినప్పుడు మనిషి జీవన్ముక్తుడవుతారని చెప్పేవారు. అయినా ఆయన అజమాయిషీ చేసేవారు కాదు. ఒప్పించాలని చూసేవారు కాదు. గంటలు గడచిపోయేవి. ప్రజాస్వామిక వాదిగా అభిప్రాయాలను గౌరవించేవారు. తత్వశాస్త్ర తరగతి గది సజీవంగా నడుస్తున్నందుకు ఆనందించేవారు. ఆయన పిల్లల్లో పిల్లవాడిలా, పెద్దల్లో పెద్దవాడిలా ఉండేవారు. భారతీయ తత్వపరిశోధనా మండలిలో చాలా కాలం సభ్యునిగా పనిచేశారు.
అనేక మం ది ని పరిశోధనలకు ప్రోత్సహించి డాక్టరేట్లను చేశారు. నా ఎంఫిల్‌కు కూడా ఆయనే మార్గదర్శన చేశారు. క్యాన్సరు వచ్చిన తర్వాత కూడా ఆయన ధైర్యాన్ని చెదరనివ్వలేదు. ఇరవైనాలుగేళ్ల తర్వాత మాజీ విద్యార్థుల సమావేశం జరిగితే ఆయన ఉత్సాహంగా మాతో రోజంతా గడిపారు. తలకోన కొండకోనల్లో కలిసి నడిచారు. ఏర్పేడు ఆశ్రమ స్వామీజీ వ్యాఖ్యాన సహిత భగవద్గీతను తెనిగించే పనిని పెట్టుకున్నట్టు ఆ సందర్భంగా చెప్పారు. ఆయన చివరిదాకా చదవడం, రాయడం మానలేదు. ఆయన గొప్ప ఆచార్యుడు, తాత్విక జిజ్ఞాసి. గొప్ప మనిషి. ఆయన బుధవారం బెంగుళూరులో మరణించారు. తిరుపతిలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. ఆయన విద్యార్థులపై చూపించిన ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ మరువలేనిది. ఆయనకు హృదయపూర్వక నివాళి.

"ధర్మ సందేహములు"

"ధర్మ సందేహములు" 
శ్రీ సీతారామచంద్రస్వామి మరియు ముత్యాల పరమేశ్వరి అమ్మవార్ల-ఈదుల గూడెం -మిర్యాలగూడ - విగ్రహ మహోత్సవ సందర్భమున భక్తులకు అందచేసిన పుస్తకము నుండి సేకరించిన ధర్మ సూక్ష్మములు " ఇవి ప్రతి ఒక్కరు చదువుకొని ఆచరించవలసిన అవసరం ప్రతి భక్తునికి వున్నది ...ఆచరించే ప్రయత్నం చేద్దాము ఆ భగవంతుని కృపకు పాత్రులమవవుదాం