Saturday, January 31, 2015

Vidyadhanam

విద్యాధనం
Posted On:1/30/2015 3:25:30 AM
లోకంలో భూ, గృహ, వస్తు, ధాన్య, ఆరోగ్య, వైరాగ్య, వస్ర్తాది సంపదలు ఎన్నో ఉన్నాయి. ఈ సంపదలు ఏవీ విద్యాసంపదతో సమతూగేవి కావు. ఇతర సంపదలను దానం చేయగా చేయగా అవి కరిగిపోతాయి. పయోగిస్తున్న కొద్దీ అవి అరిగిపోతూ, తరిగిపోతూ ఉంటాయి. కానీ విద్యా సంపద ఇతరులకు అందిస్తున్న కొద్దీ అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.ధనవంతుడు, ధాన్యవంతుడు తమకు సంబంధించిన ప్రాంతంలో, పరివారజనులలో మా త్రమే ఆదరాభిమానాలను పొందగలుగుతారు. విద్యావంతుడు స్వదేశమా విదేశమా అనే వ్యత్యా సం లేకుండా అంతటా పూజింపబడుతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పబడినది.
లోకంలో వారి వారి శక్తియుక్తులను, అవసరాలను అనుసరించి అందరూ ధనాన్ని, ధాన్యాన్ని ఇంకా ఇతర సంపదలను సంపాదిస్తూనే ఉంటారు. ధనధాన్యాది సంపదలను సంపాదించే శక్తి అందరికీ సహజంగానే అబ్బుతుంది. ఈ శక్తి ఒక్కటే మనిషి జీవితానికి పరమార్థ కాదు, కారాదు. వేదవేదాంగాలనో, వివిధ శాస్ర్తాలనో, పురాణేతిహాసాలనో, విస్తృతమైన లౌకిక వాజ్ఞయమునో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితునిగా విఖ్యాతిని పొందడం మాత్రం చాలా అరుదు. అందుకే వేలసంఖ్యలో ఒక్కడే పండితుడు కాగలుగుతాడు. సహస్రేషు చ పండితః అని చెప్పబడినది. సందురపాండ్యుడు అనే నీతికారుడు కూడా డబ్బు పరమార్థం కాదు, డబ్బును అందరూ సంపాదించగలుగుతారు. అందరికీ అందని, కొందరు మాత్రమే పొందునట్టి విద్యాధనాన్ని ఆర్జించుటకై కృషి చేయవలెను -
విద్వత్తే యతితవ్యం నార్థేష్వేవాదరః సదా కార్యః
అర్థః సర్వజనగతః విద్వత్తా దుర్లభా లోకే ॥
అని మనకు సుందరపాండ్యుని ఆర్యోక్తి ప్రబోధిస్తున్నది.

విద్వాంసుల వద్దకు ధనరాశులు వచ్చి చేరుతాయి. అంతేకానీ ధనవంతులు అందరూ విద్యావంతులు కాలేరు. ధనికుని వద్దనున్న ధనాన్ని దొంగలు దొంగిలించవచ్చు. అధికారులో రాజులో కొంతభాగాన్ని పన్నుల రూపంలో స్వీకరించవచ్చు. సోదరులో బంధువులో తమకు కొంత పంచి ఇవ్వమని కోరవచ్చు. కానీ ఈ విధంగా విద్యాధనాన్ని ఎవరూ స్వీకరించలేరు. పైగా సంపదలు వ్యయమౌతుంటాయి, కానీ విద్యాధనం ఉపయోగిస్తున్న కొద్దీ ఎన్నోరెట్లు వృద్ధి పొందుతుంది. అట్టి విద్యాధనాన్ని ఆర్జించేందుకు శ్రద్ధగా కృషిచేద్దాం.

Thursday, January 29, 2015

ధర్మ ప్రభోదం

ధర్మ ప్రభోదం
మార్పు మంచిదే!
Updated : 1/29/2015 1:43:05 AMViews : 46
మనిషి సంఘజీవి. మనుషులే లేని సమాజాన్ని ఊహించలేము. మానవ నైతికత మీదే జాతి మనుగడ ఆధారపడివుంది. తప్పులెంచువారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఎదుటివారిని వేలెత్తి చూపేటప్పుడు మిగతా నాలుగు వేళ్ళు తనవైపే ఉన్నాయన్న విషయాన్ని మరచి ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం? ఎంతసేపూ సమాజం మంచిగా లేదు. మనుషులు మారిపోయారు. మంచికి రోజులు కావని ఏమీ పట్టనట్టు వదిలివేస్తే సరిపోదు. 
ఆత్మసాక్షిగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది.

యతోహస్తః తతో దృష్టిర్యతో దృష్టిస్తతో మనః
యతో మనస్తతో భావోయతో భావస్తతోరసః ॥

ఎక్కడ చేయి చూపిస్తుందో అక్కడే దృష్టి పడుతుంది. దృష్టి వెళ్లిన చోటికి మనసు మళ్లుతుంది. మనసులో భావం చిగురిస్తుంది. భావమే అనుభూతిని కలిగిస్తుంది. చూపిందీ, చూసిందీ మంచి వి షయమే అయితే రసస్వాదన అనుభవించటంలో తప్పులేదు. అదే చెడును భావిస్తే రసాభాసమే కదా!
దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది. వంకరదృష్టితో చూస్తే ప్రతీది వంకరగానే కనబడుతుంది. మనలోని భావన మంచిదైతే ప్ర పంచమంతా మంచిదనంతో నిండిపోతుంది. బ్రతికే విధానం లో తప్పొప్పులు సహజం. వీలైతే సందిద్దుకుంటూ తమదైన ప్రయత్నంలో జీవించడమే కర్తవ్యం.

వ్యక్తి మారితే వ్యవస్థ దానంతటదే మారుతుంది. ఒక వ్యక్తి లో మొదలైన మార్పు కుటుంబాన్ని, వ్యవస్థనూ, దేశాన్నే మార్చివేస్తుందని శ్రీరాముని జీవితం చెప్పినట్లు మార్పు మనలోనే రావాలి.
ప్రతీ ఒక్కరూ సరైన ఆలోచన, అవగాహన, సంకల్పం, కృషి, మాట, జీవనం అలవర్చుకొని సుసమాజ నిర్మాణంలో భాగం కావాలి. సామాజిక బాధ్యత, సమానత్వ భావన, విశ్వమానవ సౌభ్రాతృత్వ సమారాధన మానవత్వంలో ఒదిగిపోవాలి. 

ఆశావహ ఆలోచనా దృక్పథం మనిషి నైజం కావాలి. విలువలు జీవన నైపుణ్యానికి మెరుగులద్దాలి. సత్యసంధత, నిజాయతీ, వినయం, సమయపాలన, బాధ్యత, మర్యాద, క్రమశిక్షణ, ధైర్యం, దయ, క్షమ, స్నేహం, కరుణ, సంతృప్తి పరిగణన, నిరాడంబరత లాంటి ఎన్నో మంచిగుణాలు మనిషిలో కొలువున్నాయి. అవసరానుగుణంగా వాటిని వినియోగిస్తూ తనదైన జీవన శైలిలో బతకగలిగితే అందమైన భావ ప్రపంచ నిర్మాణం సుసాధ్యం. అందులో ఆనంద రసానుభూతిని ఆస్వాదించే అవకాశం మనసొంతం.
- ఇట్టేడు అర్కనందనాదేవి
అప్రియభాషణం
Updated : 1/28/2015 1:28:35 AMViews : 43
మనిషికి దేవుడిచ్చిన వరం మాట. ఈ మాటల వల్లనే మనిషి తన మనసులోని భావాలను ఎదుటి వ్యక్తికి స్పష్టంగా సులభంగా తెలియజెప్పగలుగుతున్నాడు. కావలసిన సుఖసంతోషాలను పొందగలుగుతున్నాడు. సుస్థిరమైన సంపదలను ఆస్తులను అంతస్తులను తన స్వంతం చేసుకోగలుగుతున్నాడు.ఈ మాటలు ప్రియంగా, హితంగా, ఇంపుగా, సొంపుగా, ఆప్యాయంగా ఉంటేనే అనురాగాలు ఆత్మీయతలు ఏర్పడుతాయి. అట్లా కాకుండా సూటిగా, కటువుగా, పరుషంగా, అప్రియంగా మాట్లాడితే వినేవారికి కష్టం కలుగుతుంది. 

మనస్సు కలుక్కుమంటుంది. హృదయం తల్లడిల్లుతుంది. కొందరు మేం ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాము, మా మాటల్లో మనసుల్లో తెరలు పొరలు లేవు, నిక్కచ్చిగా మాట్లాడుతాము అంటారు. అయితే అట్లా మాట్లాడేవారితో ఇతరులు కూడా అదే పద్ధతిలో సమాధానం ఇస్తే వారు తట్టుకోగలుగుతారా? అంటే అది వారికి కష్టమే అనే సమాధానం మనకు వెంటనే లభిస్తుంది.

అందువల్ల ఇతరులు మనతో రంజకంగా, ఆహ్లాదజనకంగా మాట్లాడాలి అని మనం భావించే పక్షంలో, ఇతరులతో మన వాక్‌వ్యవహారం ఆనందదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉండాలి. మనం నోరు జారి అప్రియంగా మాట్లాడితే, మనం కూడా ఎదుటివారినుంచి అప్రియమైన మాటలను సమాధానంగా వినాల్సివస్తుంది అనే సత్యాన్ని గుర్తించమని సుందరపాండ్యుడు హితవు పలుకుతున్నాడు..

అప్రియముక్తాః పురుషాః ప్రయతంతే ద్విగుణం అప్రియం వక్తుమ్ 
తస్మాదవాచ్యం అప్రియం అన్యప్రియ వాక్య కామేన ॥

మనం ఇతరులతో అప్రియంగా సంభాషిస్తే వారు మనతో రెట్టింపుగా అప్రియమైన మాటలనే వినిపిస్తారు. ఇతరులనుంచి ప్రియవాక్యములనే వినాలంటే మనం ఎప్పుడు కూడా ప్రియంగా ఇతరుల చెవులకు ఇంపుగా, శుభప్రదంగానే మాట్లాడాలి అనే ఆర్యోక్తిలోని సారాన్ని గుర్తించాలి.

ఒక్కొక్కసారి మనం మాట్లాడేది సత్యమే అయినా అది ఎక్కువమందికి అప్రియాన్ని, మనస్సుకు కష్టాన్ని కలిగించేది అయితే అట్లాంటి సత్యాన్ని కూడా వెనువెంటనే సమూహంలో అందరికీ తెలిసేలా చెప్పవద్దని మన పూర్వులు పేర్కొన్నారు. న బ్రూయాత్ సత్యమప్రియం అనే సూక్తి కూడా మన పూర్వులైన పెద్దలయొక్క హితోక్తిని సమర్థిస్తున్నది. ప్రియభాషణం వల్ల అందరూ సంతోషిస్తారు. అప్రియభాషణంతో అందరూ దుఃఖిస్తారు. లోకహితమైన మాటలనే పలుకుదాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
విశ్వాసమే జీవితం
Updated : 1/27/2015 1:23:23 AMViews : 51
ప్రతీ ప్రాణికీ లోకంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది. అలాగే ప్రకృతిలోని ప్రతీ చర్యకు విలక్షణమైన కారణం ఉంటుంది. ఏది ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో ప్రతీది భగవంతుని సృజనలో నియమబద్ధంగా జరుగుతూనే ఉంటుంది.
ఇయం శివాయా నియతే రివాయతిః
కృతార్థయన్తీ జగతః ఫలైః క్రియాః!
జయశ్రియం పార్థ! ప్రథూకరోతుతే
శరత్ప్రసన్నాంబురనంబు వారిదా॥
యక్షుడు ఒకానొక సందర్భంలో అర్జునుని ఆశీర్వదిస్తూ లోకంలో కృషి ఫలితంలా, శుభకరమైన దైవం యొక్క ఫలప్రధానం శరత్తులాంటి జయలక్ష్మిని వలె నీవు పొందుతావంటాడు. అద్భుతమైన అంతరార్థం దాగున్న ఈ వాక్యాలను మన జీవితాలకు అన్వయించుకుంటే నిరాశకు తావుండదు. మనకు రావలసింది రావాల్సిన సమయంలో వచ్చితీరుతుందన్న నమ్మకం కలుగుతుంది. అది అపూర్వ విశ్వాసమై ఆగామి భవిష్యత్తుకు పునాది వేస్తుంది.భగవంతుడు అనుకూలుడే అయినా అనుకున్నదే తడువు ఫలితం రాదు. అలాగని నమ్మకాన్ని వమ్ము చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనకు అది ఉపయుక్తమో ఆ సమయానికి ఫలితం మనల్ని వచ్చి చేరుతుంది. రైతులు వర్షాకాలంలో ఎంత కష్టపడినప్పటికీ, శరత్కాలంలోనే కృషి ఫలం చేతికందుతుంది. నిర్మల, నిశ్చల నదీనదాలకు పూర్ణరూపమి చ్చే శరత్తు శుభసూచకం. అట్లాగే మానవులు తమతమ కర్తవ్యాలను ధర్మంగా, న్యాయంగా ఫలాపేక్ష లేకుండా చేసినట్లయితే తప్పక రాబోవు కాలంలో మంచి ఫలితాలు పొందగలరు.
తల్లిదండ్రులపై పిల్లలకు భవిష్యత్తంతా వారి తోడూనీడగా సాగిపోతుందనే నమ్మకం. పిల్లలపై తల్లి దండ్రులకు వారి ఆశలకు అనుగుణంగా ఎదిగి వారిని చూసుకుంటారనే విశ్వాసం పరస్పర బాంధవ్యాన్ని మానసిక సంకల్పం ఆధారంగా నిలబెట్టే ప్రమాణం కనబడుతుంది. భగవంతుడూ జీవితాన్నిచ్చాడు. జీవితానికి ఆధారాన్నిచ్చాడు. దానిని ఫలవంతం చేసే బాధ్యత ఆయనదే. అన్నింటికీ కాలం కలిసిరావాలన్న పెద్దల అనుభవం సదా మనసులో తలుచుకుంటూ మనం చే సే ప్రయత్నం చేస్తూ పోతే తప్పక సఫలమవుతాం. జీవితానికి విశ్వాసమే ఆలంబన ఆధారం.
- ఇట్టేడు అర్కనందనాదేవి
ప్రతిజ్ఞా పాలన
Updated : 1/24/2015 12:05:02 AMViews : 100
ప్రతిజ్ఞలను ఎందరో చేస్తారు. కాని చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి అవి నెరవేరే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా కృషిచేసేవారు మాత్రం కొందరే ఉంటారు. ప్రతిజ్ఞ చేసినంత తేలిక కాదు, దానిని నిలబెట్టుకోవడం. ప్రతిజ్ఞ నెరవేరేవరకు కడుపునిండా తిండి తినలేక, కంటినిండా నిద్ర పోలేక సతమతమై చివరకు ప్రతిజ్ఞ నెరవేరగానే ఆ వ్యక్తి ఎంతగా సంతోషిస్తాడో సుందరపాండ్యుని ఆర్యోక్తి తెలుపుచున్నది.

ప్రతిజ్ఞ చేసి నెరవేర్చుకున్నవాడి మనసు సముద్రం దాటిన వ్యక్తి మనసు లాగా సుఖంగా ఉంటుంది. హృదయం జ్వరం వచ్చి తగ్గినట్లుగా ఉంటుంది. శరీరం బరువు దింపుకున్నంత తేలికగా ఉంటుంది.
విగత జ్వరమివ హృదయం గాత్రం లఘుతరమివ అవసితభారమ్‌

తీర్ణార్ణవస్య చ సుఖం మనోభవత్యవసిత ప్రతిజ్ఞస్య॥
అని సుందరపాండ్యుడు ప్రతిజ్ఞాపాలనా సౌఖ్యాన్ని విశదంగా పేర్కొన్నాడు.

శ్రీరామచంద్రస్వామి తాను చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడై తనను ఆశ్రయించిన ఋషులను, మరెందరినో రక్షించినాడు. శ్రీకృష్ణపరమాత్మ తనను ఆశ్రయించిన భక్తుల రక్షణకు కట్టుబడి ఉంటానని చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడై ద్రౌపదిలెక్క రక్షణ కార్యాన్ని, పాండవులపక్షాన దౌత్యాన్ని నిర్వహించి పార్థసారథిగా తన కర్తవ్యాన్ని నిర్వహించి ధర్మాత్ములైన పాండవులకు విజయాన్ని సాధించిపెట్టాడు.

ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని చేసిన ప్రతిజ్ఞను పాలించిన భీష్ముడిలా, ద్రౌపదిని అవమానించిన దుర్యోధన దుశ్శాసనులను అంతమొందించి ద్రౌపదికి మనశ్శాంతి కలిగింపజేస్తానని భీకర ప్రతిజ్ఞలను చేసి అవి నెరవేరేవరకు కృషి చేసిన భీముడిలా, ప్రతిజ్ఞాపాలనకై కట్టుబడియుండేవారు చరిత్రలో చిరకాలం నిలుస్తారు.
సమాజంలోని అన్ని రంగాలకు చెందినవారందరూ ప్రతిజ్ఞాపాలనం చేస్తూ స్థిరమైన కీర్తి ప్రతిష్ఠలను, సంపదలను పొందాలని ఆశిద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
జ్ఞానసముపార్జన
Updated : 1/23/2015 12:24:52 AMViews : 83
పవిత్రమైన జ్ఞానంతో సమానమైనదేదీ ఈ లోకంలో లేనేలేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని భగవద్గీత మనకు ఉద్బోధిస్తున్నది.

కఠోపనిషత్తులోని ఉత్తిష్ఠత జాగ్రత! ప్రాప్య వరాన్నిబోధత మేల్కొనండి, జాగరూకులు కండి, కర్తవ్యోన్ముఖులై శ్రేష్ఠలైన గురువులను ఆశ్రయించి వారి నుంచి సదుపదేశాలను గ్రహించండి అనే సందేశాన్ని ఆచరణలో పెట్టుకుంటే జీవితానికి సార్థకత కలుగుతుంది. ఈ ఉపనిషద్వాక్యమును వివేకానందుడు తన ప్రసంగాల్లో ఉదాహరిస్తూ ఎందరెందరికో కావలసిన జ్ఞానబోధన చేసాడు.

జ్ఞానాన్ని ఆర్జించాలి అనే తపన కలవారు విద్యార్థిదశలో సుఖానుభవాన్ని కోరకూడదు అనే విషయాన్ని సుఖార్ధినః కుతో విద్యా అనే సూక్తి ఉపదేశిస్తున్నది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞాన సముపార్జన చేయాలి. క్షణ త్యాగే కుతో విద్యా అనే సూక్తి ఈ ఒక్క నిముషమే కదా అనే భావనతో విలువైన క్షణాలను ఎన్నింటినో నిర్లక్ష్యధోరణితో వృథా చేసేవారు ఎన్నటికీ ఉన్నత విద్యావంతులు కాలేరు అని ప్రబోధిస్తున్నది.
జిజ్ఞాసువులు విద్యాభ్యాస సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని దరి చేరనీయవద్దు. ఆలస్యం అనే శత్రువు ఎవరి శరీరంలో ప్రవేశిస్తే వారి ప్రగతి కుంటుపడుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులతో ఆరోగ్యకరమైన రీతిలో పోటీ పడుతూ జ్ఞానాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని స్పర్ధయా వర్ధతే విద్యా అనే సూక్తి మనకు తెలియజేస్తున్నది.

సమయాన్ని సద్వినియోగపరచుకునే వాళ్ళకు శ్రద్ధావంతులకు మాత్రమే జ్ఞానం వశమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ శ్రద్ధావంతుడే జ్ఞానమును పొంద గలుగుతాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్ అనే ప్రబోధించాడు.
పెద్దల నుంచి ఆర్జించిన శాన్త్రజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. ఆచరణలో నిలుపుకోవాలి. ఆచరణలో నిలవని జ్ఞానం నిరుపయోగమే అనే సత్యాన్ని కూడా గుర్తించాలి.

ఆచార్యుల ఉపదేశాన్ని, ప్రాచీన వాఙ్మయంలోని ప్రబోధాలను మన మనసులలో పదిలపరచుకొనుటకై అవసరమైన జ్ఞానసముపార్జనకై కృషి చేద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు
అప్రియభాషణం
Updated : 1/28/2015 1:28:35 AMViews : 44
మనిషికి దేవుడిచ్చిన వరం మాట. ఈ మాటల వల్లనే మనిషి తన మనసులోని భావాలను ఎదుటి వ్యక్తికి స్పష్టంగా సులభంగా తెలియజెప్పగలుగుతున్నాడు. కావలసిన సుఖసంతోషాలను పొందగలుగుతున్నాడు. సుస్థిరమైన సంపదలను ఆస్తులను అంతస్తులను తన స్వంతం చేసుకోగలుగుతున్నాడు.ఈ మాటలు ప్రియంగా, హితంగా, ఇంపుగా, సొంపుగా, ఆప్యాయంగా ఉంటేనే అనురాగాలు ఆత్మీయతలు ఏర్పడుతాయి. అట్లా కాకుండా సూటిగా, కటువుగా, పరుషంగా, అప్రియంగా మాట్లాడితే వినేవారికి కష్టం కలుగుతుంది. 

మనస్సు కలుక్కుమంటుంది. హృదయం తల్లడిల్లుతుంది. కొందరు మేం ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాము, మా మాటల్లో మనసుల్లో తెరలు పొరలు లేవు, నిక్కచ్చిగా మాట్లాడుతాము అంటారు. అయితే అట్లా మాట్లాడేవారితో ఇతరులు కూడా అదే పద్ధతిలో సమాధానం ఇస్తే వారు తట్టుకోగలుగుతారా? అంటే అది వారికి కష్టమే అనే సమాధానం మనకు వెంటనే లభిస్తుంది.

అందువల్ల ఇతరులు మనతో రంజకంగా, ఆహ్లాదజనకంగా మాట్లాడాలి అని మనం భావించే పక్షంలో, ఇతరులతో మన వాక్‌వ్యవహారం ఆనందదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉండాలి. మనం నోరు జారి అప్రియంగా మాట్లాడితే, మనం కూడా ఎదుటివారినుంచి అప్రియమైన మాటలను సమాధానంగా వినాల్సివస్తుంది అనే సత్యాన్ని గుర్తించమని సుందరపాండ్యుడు హితవు పలుకుతున్నాడు..

అప్రియముక్తాః పురుషాః ప్రయతంతే ద్విగుణం అప్రియం వక్తుమ్ 
తస్మాదవాచ్యం అప్రియం అన్యప్రియ వాక్య కామేన ॥

మనం ఇతరులతో అప్రియంగా సంభాషిస్తే వారు మనతో రెట్టింపుగా అప్రియమైన మాటలనే వినిపిస్తారు. ఇతరులనుంచి ప్రియవాక్యములనే వినాలంటే మనం ఎప్పుడు కూడా ప్రియంగా ఇతరుల చెవులకు ఇంపుగా, శుభప్రదంగానే మాట్లాడాలి అనే ఆర్యోక్తిలోని సారాన్ని గుర్తించాలి.

ఒక్కొక్కసారి మనం మాట్లాడేది సత్యమే అయినా అది ఎక్కువమందికి అప్రియాన్ని, మనస్సుకు కష్టాన్ని కలిగించేది అయితే అట్లాంటి సత్యాన్ని కూడా వెనువెంటనే సమూహంలో అందరికీ తెలిసేలా చెప్పవద్దని మన పూర్వులు పేర్కొన్నారు. న బ్రూయాత్ సత్యమప్రియం అనే సూక్తి కూడా మన పూర్వులైన పెద్దలయొక్క హితోక్తిని సమర్థిస్తున్నది. ప్రియభాషణం వల్ల అందరూ సంతోషిస్తారు. అప్రియభాషణంతో అందరూ దుఃఖిస్తారు. లోకహితమైన మాటలనే పలుకుదాం.
- సముద్రాల శఠగోపాచార్యులు

Tuesday, January 27, 2015

నేటి నుంచి ఉద్యాన ప్రదర్శన

నేటి నుంచి ఉద్యాన ప్రదర్శన

Updated : 1/26/2015 1:59:44 AM
Views : 128

నమస్తే తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యాన ప్రదర్శనను సోమవారం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 160స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయిదు రోజులపాటు జరిగే ఉద్యాన ప్రదర్శనకు 3 లక్షలమంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనావేస్తున్నారు.

ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎండీ మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పార్లమెంట్ కార్యదర్శి కోవ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు వీ హన్మంతరావు, ఎండీ అలీఖాన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, నాగేశ్వర్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిలు పాల్గొంటారు.

పరమగురు తపస్సిద్ధి శతవత్సర ఉత్సవాలు-2015 FEB 5,6,7,8,9.-GURUDEV'S GURU JI'S TAPAS SIDDHI CENTENARY

పరమగురు తపస్సిద్ధి శతవత్సర ఉత్సవాలు-2015 FEB 5,6,7,8,9.-GURUDEV'S GURU JI'S TAPAS SIDDHI CENTENARY
హరిఃఓమ్
ఓమ్ నమో నారాయణాయ.
పూజ్యశ్రీసద్గురు విద్యాప్రకాశానందగిరిస్వాములవారి గురుదేవులైన పూజ్యశ్రీసద్గురు మహర్షి మలయాళస్వాములవారి తపస్సిద్ధి శతవత్సర 
ఉత్సవాలు-2015 ఫిబ్రవరి 5,6,7,8,9.
చిరునామా-
శ్రీవ్యాసాశ్రమము-పోస్ట్-517621,ఏర్పేడు-వయా,చిత్తూరు-జిల్లా,ఆంధ్రప్రదేశ్,ఇండియా-08578-287528,  99 49 29 87 24
HARI OM
H.H.SWAMY VIDYA PRAKASHANANDA JI MAHARAJ'S GURUDEV 
H.H.SRI SADGURU MAHARSHI MALAYALA SWAMIJI MAHARAJ'S TAPAS SIDDHI CENTENARY CELEBRATIONS-
2015 FEB 5,6,7,8,9.
AT
-SRI VYASA ASHRAM-PO-517621,YERPEDU(EARPEDU)-VIA,CHITTOOR-DT-A.P.-INDIA.
08578-287528,  99 49 29 87 24- www.srivyasasramam.orgwww.malayalaswami.org

​​హరిఃఓమ్
ఓమ్ నమో నారాయణాయ.
భగవత్సేవలో,
బ్రహ్మచారి విజయానంద .-081 06 85 19 01
శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640
శ్రీకాళహస్తి-ఆంధ్రప్రదేశ్,-ఇండియా
HARI OM.
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI  VIJAYANANDA,
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI-(AP)-INDIA
081 06 85 19 01